వెంకటాచలం, న్యూస్‌లైన్ : కలి కాలంలో మానవత్వం, అనుబంధా లు, రక్త సంబంధా లు సన్నగిల్లుతున్నా యి. కడుపున పుట్టిన బిడ్డలకు వృద్ధాప్యంలోని కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులకు రక్తసంబంధీకులు భారమవుతున్నారు. వృద్ధాప్యమనో.. అ నారోగ్యమనో.. వదిలించుకుంటున్నారు. మం డలంలోని గొలగమూడి, కసుమూరు వంటి యాత్ర స్థలాల్లో వెలుగు చూస్తున్న కొన్ని సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. కసుమూరు దర్గాకు నాలుగు రోజుల క్రితం ఒక కుటుంబం వచ్చింది.
వారి వెంట దాదాపు మృత్యువు అంచున ఉన్న 25 ఏళ్ల యువతి కూడా ఉంది. అయితే ఆ కుటుంబం దర్గా వద్ద తమతో తీసుకు వచ్చిన యువతిని వదిలి వెళ్లిపోయింది. ఆమె శారీరక స్థితిని బట్టి క్షయ వ్యాధిగ్రస్తురాలై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రెండు రోజులుగా పడుతున్న వర్షానికి తోడు చలిగాలులు కూడా వీస్తుండటంతో కనీసం ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో ఉన్న ఆ యువతి పడుతున్న నరక యాతన చూసిన స్థానికులు చలించిపోయారు.
దీంతో బుధవారం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే యువతి మాత్రం తన కుటుంబ సభ్యులు వస్తేనే ఆసుపత్రికి వస్తానని తెగేసి చెప్పింది. దీంతో గత్యంతరం లేని అంబులెన్స్ సిబ్బంది వెనుదిరిగి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడకు వచ్చి ట్రయినీ ఎస్సై నాగరాజు యువతి వద్ద ఉన్న ఫోను నంబర్లకు ప్రయత్నించగా కోవూరు మండలంలోని ఇనమడుగు గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. ఆమె కనీసం తన పేరు, ఊరు కూడా చెప్పలేని స్థితిలో ఉందని, వెంటనే వచ్చి ఆసుపత్రిలో చేర్పించాలని ఎస్సై ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. కుటుంబ సభ్యులు సాయంత్రానికి రాకుంటే అంబులెన్స్‌కు ఫోను చేసి ఆసుపత్రికి పంపాలని ఆయన స్థానికులకు సూచించారు.
అనారోగ్యమని వదిలించుకున్నారు..
Published Thu, Oct 24 2013 4:01 AM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM
Advertisement
Advertisement