భివండీ, న్యూస్‌లైన్ : బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏడాది వయస్సున్న ఓ తెలుగు బాలుడి చికిత్స నిమిత్తం అతని తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, చందుర్తి మండలం, మరిగడ్డ గ్రామానికి చెందిన కూచన గణేష్, భార్య రాజలక్ష్మీ భీవండీలో స్థిరపడ్డారు. ఏడాది వయస్సున్న వీరి కొడుకు సాయికుమార్ గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ బాలుడికి రక్త పరీక్షలు నిర్వహించగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.
దీంతో ముంబైలోని టాటా ఆసుపత్రిని ఆశ్రయించారు. డాక్టర్లు సుమారు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో వీరు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుండగా గణేశ్.. పవర్‌లూమ్ పరిశ్రమలో భీములు నింపే విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు సంవత్సారల నుంచి పరిశ్రమలు మందకొడిగా నడుస్తుండటంతో చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
ఇప్పటి వరకు సుమారు లక్ష రూపాయలకు పైగా వైద్యానికి ఖర్చు అయిందనీ ఇప్పుడు తమ వద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవని ఆ దంపతులు చెప్పారు. తమ కొడుకును బ్రతికించుకోవడానికి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సహాయం చేయదలచిన వారు, ఆంధ్రా బాంక్ అకౌంట్ నం. 161810100141696లో విరాళం ఇవ్వవచ్చని, అదేవిధంగా మొబైల్ నంబర్‌కు 9921859856 సంప్రదించాలని బాలుడి తల్లిదండ్రులు కోరారు.
మా కుమారుడిని రక్షించండి!
Published Sat, Jan 3 2015 10:05 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement