
పోలీసులకు కొత్త సవాళ్లు
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పోలీసులపై పని ఒత్తిడి, భారం పెరుగుతున్నాయుని, వరుస బందోబస్తులతో నిర్విరావుంగా విధులు నిర్వర్తించవలసి వస్తోందని ముఖ్యవుంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమర వీరుల దినం సందర్భంగా సోమవారం జరిగిన పరేడ్‌లో ఆయన ప్రసంగించారు. గతంతో పోలిస్తే పోలీసుల విధి నిర్వహణ మరింత సంక్లిష్టమైందని, వారు కొత్త సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికులు శత్రువులను గుర్తించగలరని, పోలీసులు శత్రువును కనిపెట్టడం చాలా కష్టతరమని సీఎం చెప్పారు. సమాజాన్ని అస్థిరపరిచే శక్తులు ఇతర దేశాల నుంచి, రాష్ట్రాలనుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న తరుణంలో, పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పోలీసుల పనిభారం తగ్గిం చేందుకు గత మూడేళ్లలో 28 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మొత్తం పోలీసు ఉద్యోగాల్లో 25 శాతం ఉద్యోగాలను మూడేళ్లలోనే భర్తీ చేశావుని అన్నారు.
పోలీ సు సిబ్బంది ఆరోగ్య భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం వురింత కృషి చేస్తుందన్నారు. పోలీసు ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని విధి నిర్వహణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడేవారే పోలీసులని రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ (డీజీపీ) బీ ప్రసాద రావు అన్నారు. ఈ ఏడాదిలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు జరిపిన దాడుల్లో దేశవ్యాప్తంగా 576 మంది పోలీసులు వురణించార ని అన్నారు. ఉద్యోగంలో చేరినపుడు చేసిన ప్రమాణం మేరకు, పదవీ విరమణ వరకూ క్రమశిక్షణతో పనిచేయూలని సిబ్బందికి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు క్వార్టర్ల మరమ్మతుల కోసం అదనపు నిధులివ్వాలని డీజీపీ వుుఖ్యవుంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలీసు అమరుల దినం సందర్భంగా సోవువారం పోలీసు స్మారక చిహ్నం వద్ద గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ ప్రసాదరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మ శాంతికోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.