విజయవాడ : త్యాగాలకు మారుపేరు పోలీసులు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం విజయవాడలో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల నిధికి రూ.20కోట్లు ప్రకటించారు. దేశభద్రత కోసం పోలీసులు ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
పోలీసుల సంక్షేమ బాద్యత ప్రభుత్వానిదేనని, అలాగే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని చంద్రబాబు నాయుడు అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల సంక్షేమ నిధికి రూ.15కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలో పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ రాముడు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
త్యాగాలకు మారుపేరు పోలీసులు: చంద్రబాబు
Published Wed, Oct 21 2015 10:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement