
లక్నో: జాతీయ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్నపుడు ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారులకు నష్టపరిహారాన్ని రెండింతలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
విధుల్లో ఉన్నపుడు ప్రాణాలు కోల్పోయే పోలీసు అధికారులకు నష్టపరిహారాన్ని రూ. 20 నుంచి 40 లక్షలకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పోలీసు శాఖకు సంబంధించిన అవార్డుల సంఖ్యను 200 నుంచి 950కి పెంచుతామని ఆయన హామీయిచ్చారు. రాష్ట్రంలో శాంత్రిభద్రతలను మెరుగుపరచాలని, అందుకు పోలీసు శాఖ మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
UP govt has decided to double ex-gratia amount for Police officials martyred on duty: CM Yogi Adityanath at Police Commemoration Day Parade pic.twitter.com/9ts50ztECe
— ANI UP (@ANINewsUP) 21 October 2017
Comments
Please login to add a commentAdd a comment