Tragedy In Wedding Celebrations: 11 People Died After Accidentally Falling Into Well In Kushinagar - Sakshi
Sakshi News home page

Wedding Celebrations Tragedy: పెళ్లి వేడుకల్లో విషాదం: బావి స్లాబ్‌పై 13 మంది.. అధిక బరువు కారణంగా..

Published Thu, Feb 17 2022 7:35 AM | Last Updated on Thu, Feb 17 2022 10:56 AM

Wedding Ceremony Celebrations Flip Tragic in Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఖుషీనగర్‌ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది బావిలో పడి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివాహ కార్యక్రమానికి హాజరయిన వీరంతా బావి స్లాబ్‌పై కూర్చున్నారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా స్లాబ్‌ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్లాబ్‌పై కూర్చున్న 13 మంది బావిలో పడిపోయారు.

ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఖుషీనగర్‌ ప్రమాదంలో మరణించిన వారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ప్రధాని మోదీ సంతాపం
ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనను హృదయ విదారకంగా అభివర్ణించారు. మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవలని ప్రార్థించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement