సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద.. అంగన్‌వాడీ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొంతకాలంగా ఉత్తర్ ప్రదేశ్‌లో అంగన్‌వాడీ ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. అంగన్‌వాడీలు కొత్త విధానం అందుకున్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను దెప్పిపొడిచేలా.. సీతాపూర్‌లోని అంగన్‌వాడీ మహిళలంతా కలిసి ఆయన విగ్రహానికి వివాహం చేశారు. యోగి ఆదిత్యనాథ్ విగ్రహానికి జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్ అధ్యక్షురాలు నీతు సింగ్ పూలమాల వేసి వరించినట్లు తెలిపారు. ఈ వివాహం వల్ల రాష్ట్రంలోని నాలుగు లక్షల అంగన్‌వాడీ సోదరీమణులకు మేలు జరుగుతుందని ఆమె చెప్పారు.
యోగి అదిత్యనాథ్ బ్రహ్మచారి కావడంతో మా సమస్యలు అర్థం కావడం లేదని...అదే ఆయనకు పెళ్లయి, భార్యవుంటే మా సమస్యలు అర్థమయ్యేవనీ అంగన్‌వాడీ వర్కర్స్ అంటున్నారు. అందుకే ఇలా చేశామని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment