
పోలీసు అమరవీరులకు గవర్నర్ నివాళి
విజయవాడ : పోలీస్ అమరవీరులకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. విజయవాడలోని ఇందిరా స్టేడియంలో శుక్రవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు ...ఏపీ పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రాణలు సైతం లెక్కచేయకుండా పోలీసులు కష్టపడుతున్నారన్నారు. కాగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు.