
మీ త్యాగాలు మరువం
విజయనగరం క్రైం: పోలీసుల ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తున్నారని, శాంతిభద్రతల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం లో మంగళవారం పోలీసు అమవీరుల దినోత్సవం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. 1959లో చైనాతో సరిహద్దులో జరిగిన పోరు లో మృతి చెందిన వారి గుర్తుగా ఏటా అమరువీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటామన్నా రు. పోలీసు విధులు చాలా కష్టతరమైనవని, మావోయిస్టు, తీవ్రవాదులు, అసాంఘిక శక్తులను నియంత్రించడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని అన్నారు.
విధి నిర్వహణలో భాగంగా కె.ఎస్.ఉమేష్‌చంద్రలాంటి అంకిత భావంతో పనిచేసే ఉన్నతాధికారులను సైతం పోలీసుశాఖ పోగొట్టుకుందని తెలిపారు. 2013-14లో 642 మంది, రాష్ట్రంలో ముగ్గు రు పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారన్నా రు. జిల్లా అదనపు ఎస్పీ ఎ.వి.రమణ మాట్లాడుతూ అమరులైన పోలీసులు భౌతికంగా మనకు దూరమైనా వారి త్యాగాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని తెలి పారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చిన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యతని అన్నారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్, అదనపు ఎస్పీ ఎ.వి.రమణ పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు ఉం చి నివాళులు అర్పిం చారు.
అమరులైన చిరంజీవరావు, శ్రీరాములు, సూర్యనారాయణ, ఇస్మాయిల్, సత్యనారాయణ కు టుంబ సభ్యులను కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పి.టి.సి ఇన్‌చార్జి ప్రిన్సిపల్ వి.సత్తిరాజు, డి.టి.సి.డీఎస్పీ సి.హెచ్.వి.ప్రసాద్, విజ యనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, సి.ఐలు కె.రామారావు, ఎ.రవికుమార్, ఎస్బీ సి.ఐలు లీలారావు, కృష్ణారావు, ఆర్.ఐలు అప్పారావు, నాగేశ్వరరావు, రా మకృష్ణారావు, సీసీఎస్ సీఐలు వాసుదేవ్, పోలీసు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వి.ఆర్.సింహాచలం హాజరయ్యారు.