పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డీజీపీ ప్రసాదరావు, పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, పలువురు ఉన్నత అధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. విధి నిర్వహణలో జాతి కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను ఈసందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'పోలీస్ అమరవీరుల'పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా కర్నూలు జిల్ఆ ఎమ్మిగనూరులో పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో అశువులు భాసిన వీరులకు నివాళులు అర్పించారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.ఇక అనంతపురంలో పోలీసులు కూడా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. జిల్లా ఎస్పీతో పాటు ఏఎస్సీ, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డులు రక్తదానం చేశారు.