వాజ్‌పేయ్‌ 'కాశ్మీర్ కల'ను నిజం చేస్తాం! | Vajpayee's Kashmir dream will be realized, says narendra Modi | Sakshi

వాజ్‌పేయ్‌ 'కాశ్మీర్ కల'ను నిజం చేస్తాం!

Published Fri, Jul 4 2014 5:14 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

వాజ్‌పేయ్‌ 'కాశ్మీర్ కల'ను నిజం చేస్తాం! - Sakshi

వాజ్‌పేయ్‌ 'కాశ్మీర్ కల'ను నిజం చేస్తాం!

కట్రా(జమ్మూ కాశ్మీర్): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ కాశ్మీర్ కలను నిజం చేస్తామని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.  జమ్మూ కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం ఉండాలని ఆశించిన వాజ్ పేయ్ కలను నిజం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కట్రా నుంచి ఉధంపూర్ మీదుగా ఢిల్లీకి వెళ్లే కొత్త రైలును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో ర్యాలీలో పాల్గొన్న మోడీ.. వాజ్ పేయ్ కల తప్పకుండా సాకారమవుతుందన్నారు.

 

జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని ఆశించే ప్రతీ ఒక్క భారతీయుడు ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఉద్యోగం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మోడీ హామీ ఇచ్చారు. అది తమ బాధ్యతగా ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగుతామన్నారు. 'మాకు ఇక్కడ అధికారం వచ్చినా రాకపోయినా అది మా బాధ్యత అని' మోడీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement