
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మృతివనం ‘సదైవ్ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రధాని మోదీ(PM MODI) నివాళులర్పించారు.
వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కేబినెట్ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

దేశం కోసం జీవితాన్ని అంకితం చేశారు: ప్రధాని మోదీ
సుసంపన్న, బలమైన భారత దేశ నిర్మాణం కోసం వాజ్‌పేయి తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రధాని బుధవారం(డిసెంబర్25) ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. వాజ్‌పేయి విజన్,మిషన్ భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించేందుకు తమకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: రాజకీయ కవి సార్వభౌముడు