న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్‌వార్ జిల్లాలో తలెత్తిన మత ఘర్షణల దరిమిలా నెలకొన్న పరిస్థితులపై విపక్షాలు రాజ్యసభలో సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కిష్ట్‌వార్‌లో హింసాకాండను అరికట్టడంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. కిష్ట్‌వార్, పరిసర జిల్లాల్లో ఉద్రిక్తతలను కేవలం రెం డు వర్గాల మధ్య తలెత్తిన మత ఘర్షణలుగా కొట్టిపారేయలేమని, ఇవి దేశ సమైక్యతకు, సార్వభౌమత్వానికి భంగం కలి గించేలా ఉన్నాయన్నా రు.
కిష్ట్‌వార్ వెళ్లేందుకు తనను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడా న్ని జైట్లీ తప్పుపట్టారు. ఏఐసీసీ సభ్యులు అడుగు పెట్టకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ 144 సెక్షన్ విధిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ చర్చలో మాట్లాడుతూ, కాశ్మీర్ ప్రభుత్వం హింసాకాం డను అరికట్టడంలో విఫలమైందని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డి మాండ్ చేశారు. కిష్ట్‌వార్‌లో తలెత్తినది స్థానిక శాంతిభద్రతల సమ స్య కాదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నా రు. కాగా, కాశ్మీర్ లోయలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు.
రాజ్యసభలో కిష్ట్‘వార్’
Published Tue, Aug 13 2013 1:51 AM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM
Advertisement
Advertisement