జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 36 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బుధవారం మూడో రోజు బరిలోకి దిగిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. జింఖానాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో జమ్మూ కాశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లో 83.4 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది.
బాండే (57), జైద్ (52) అర్ధ సెంచరీలతో రాణించగా... ఫణి (41), సమద్ (35), శర్మ (31) రాణించారు. జయసూర్య 4, మిలింద్ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 567/6 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, జమ్మూ కాశ్మీర్ 322 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌కు 3, జమ్మూ కాశ్మీర్‌కు 1 పాయింట్ దక్కింది.
హైదరాబాద్‌కు 3 పాయింట్లు
Published Thu, Dec 12 2013 12:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement