జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత సీనియర్ మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. జింఖానా మైదానంలో ఆదివారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 45 పరుగుల తేడాతో హర్యానా జట్టుపై గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. స్రవంతి నాయుడు 22 పరుగులు చేసింది. హర్యానా బౌలర్లు మాన్సి జోష్, ప్రీతి బోస్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన హర్యానా 19.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు కావ్య 3, డయానా 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో హైదరాబాద్ కు 4 పాయింట్లు దక్కాయి.
రెండో మ్యాచ్‌లో ఒడిశా జట్టు 22 పరుగులతో మహారాష్ట్రను ఓడించింది. ఏఓసీ సెంటర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన ఒడిశా 97 పరుగులకు ఆలౌటైంది. స్మిత (35), ఎంపీ మెహత (23) ఫర్వాలేదనిపించారు. మహారాష్ట్ర బౌలర్ విద్య 3 వికెట్లు చేజిక్కించుకుంది. తర్వాత బరిలోకి దిగిన మహారాష్ట్ర జట్టు 18 ఓవర్లలో 75 పరుగులకే చేతులెత్తేసింది. మందన (37) మెరుగ్గా ఆడింది. ఒడిశా బౌలర్ రోషనార ప్రవీణ 2 వికెట్లు తీసుకుంది.
హైదరాబాద్ విజయం
Published Mon, Feb 3 2014 12:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement