సాక్షి, హైదరాబాద్: సీవేస్ కప్ కార్పొరేట్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో సీబీఏహెచ్ కింగ్స్, మెరైన్‌ట్రాన్స్, సీవేస్ లెజెండ్స్, ప్రతాప్ హెల్త్‌కేర్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. నేటి ఆదివారం సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు టైటిల్ పోరు కూడా జరగనుంది. వారాంతాల్లో మాత్రమే జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 కార్పొరేట్ జట్లు పాల్గొన్నాయి. వీటిని మూడు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. ఇందులో ప్రతి పూల్ నుంచి తొలి స్థానంలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత పొందాయి. పూల్-ఎలో సీవేస్ ప్రైడ్, ప్రతాప్ హెల్త్‌కేర్, గణేశ్ ఫార్వర్డర్స్ జట్లు తలపడ్డాయి.
‘బి’లో సీవేస్ లెజెండ్స్, కాంకర్, హైస్సా జట్లు పోటీపడ్డాయి. ‘సి’లో ఎంఓఎల్, కస్టమ్స్, సీబీఏహెచ్ కింగ్స్ జట్లు, ‘డి’లో మెరైన్‌ట్రాన్స్, సీహెచ్‌ఏహెచ్ రాకర్స్, ఎస్‌ఆర్‌ఎల్ ట్రాన్స్‌పోర్ట్ జట్లు తలపడ్డాయి. తొలి సెమీఫైనల్లో కింగ్స్‌తో మెరైన్‌ట్రాన్స్... రెండో సెమీస్‌లో సీవేస్ లెజెండ్స్‌తో ప్రతాప్ హెల్త్ కేర్ జట్లు పోటీపడతాయి. ప్రతాప్ హెల్త్‌కేర్ జట్టు బ్యాట్స్‌మెన్ వెంకట్ రెడ్డి వరుసగా రెండు అర్ధసెంచరీలతో ఫామ్‌లో ఉన్నాడు. అతను సీవేస్ ప్రైడ్‌పై, గణేశ్ ఫార్వర్డర్స్‌పై అర్ధసెంచరీలతో రాణించాడు. సీవేస్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ కెప్టెన్ పీవీకే మోహన్ ఈ టోర్నీ విజేతలకు అందించే ట్రోఫీలను ఆవిష్కరించారు.
సెమీస్‌లో కింగ్స్, మెరైన్‌ట్రాన్స్
Published Sun, Feb 16 2014 1:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement