T20 cricket tournment
-
WPL 2024: సూపర్ స్మృతి...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. ఈ లీగ్‌లో ఆర్సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్‌కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు. మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది. కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పవర్‌ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
రీ ఎంట్రీ ఇవ్వనున్న క్రికెట్ దిగ్గజాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు మరో సారి బరిలోకి దిగి పేక్షకులకు కనువిందు చేయనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, బ్రెట్‌లీ, తిలకరత్నె దిల్షాన్, ముత్తయ్య మురళీధరన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లకు చెందిన పలువురు ప్రముఖ క్రికెటర్లు పాల్గొనున్నారు. ఈ టోర్నీ మార్చి 2 నుంచి 21 వరకు జరగనుంది. కాగా, కరోనా కారణంగా గతేడాది ఈ సిరీస్(నాలుగు మ్యాచ్‌ల అనంతరం) వాయిదా పడిన సంగతి తెలిసిందే. రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీలో ఆటగాళ్లు తమ మునుపటి ఫామ్‌ను ప్రదర్శిస్తూ పేక్షకులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నారు. లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ ఈ సిరీస్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తుండగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. -
కార్తీక్ నాయకత్వంలో తమిళనాడు తడాఖా
అహ్మదాబాద్: ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న తమిళనాడు క్రికెట్ జట్టు దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దినేశ్ కార్తీక్ నాయకత్వంలోని తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో బరోడాపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీని అజేయంగా ముగించిన తమిళనాడు 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చాంపియన్ అయ్యింది. చివరిసారి తమిళనాడు 2007లో టైటిల్ గెల్చుకుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా తమిళనాడు, బరోడా ఫైనల్ చేరగా... తుది పోరులో తమిళనాడుదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన బరోడా 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (49; ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తమిళనాడు బౌలర్ మణిమారన్ సిద్ధార్థ్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తమిళనాడు, 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది. హరి నిశాంత్ (35; 3 ఫోర్లు, సిక్స్), బాబా అపరాజిత్ (29 నాటౌట్; ఫోర్), దినేశ్ కార్తీక్ (22; 3 ఫోర్లు), షారుఖ్ ఖాన్ (18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. -
హైదరాబాద్ ఖేల్‌ఖతమ్
కోల్‌కతా: మరోసారి ఆల్‌రౌండ్ వైఫల్యంతో హైదరాబాద్ క్రికెట్ జట్టు మూల్యం చెల్లించుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నమెంట్లో హైదరాబాద్ నాకౌట్ చేరుకునే అవకాశాలకు తెరపడింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా తమిళనాడుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. సందీప్ (36 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... ఓపెనర్ ప్రజ్ఞయ్ రెడ్డి (23 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), చివర్లో తనయ్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సీవీ మిలింద్ (11 బంతుల్లో 24 నాటౌట్; 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో హైదరాబాద్ స్కోరు 150 దాటింది. అనంతరం తమిళనాడు జట్టు 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జగదీశన్ (51 బంతు ల్లో 78 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించారు. వరుసగా నాలుగో విజయం సాధించిన తమిళనాడు జట్టు ప్రస్తుతం గ్రూప్ ‘బి’లో 16 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. దాదాపుగా నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బెంగాల్ జట్టు 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒకే విజయం సాధించిన హైదరాబాద్ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు, బెంగాల్ తలపడనున్నాయి. ఒకవేళ తమిళనాడు ఓడిపోతే బెంగాల్ కూడా 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే బెంగాల్‌కంటే తమ నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటం తమిళనాడుకు కలిసొచ్చే అంశం. సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జార్ఖండ్‌తో హైదరాబాద్ తలపడుతుంది. -
7 వేదికలు... 38 జట్లు... 102 మ్యాచ్‌లు
ముంబై: ఎట్టకేలకు భారత దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి దేశంలోని ఆరు నగరాల్లో (నాకౌట్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో) దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరగనుంది. కరోనా నేపథ్య పరిస్థితుల్లో ‘బయో బబుల్’ వాతావరణంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్–2021 వేలం ఉండటం... ఈ ఏడాదే స్వదేశంలో టి20 ప్రపంచకప్ జరగనుండటంతో... ఐపీఎల్ ఫ్రాంచైజీలను, బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ మంచి అవకాశం కల్పించనుంది. ► స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఏడేళ్ల నిషేధం ఎదుర్కొని... నిషేధం గడువు పూర్తి కావడంతో భారత మాజీ బౌలర్, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ఈ టోర్నీతో దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేయనున్నాడు. కర్ణాటక జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పోటీపడనుంది. ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నా... జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సూర్యకుమార్ ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ► గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఢిల్లీ తరఫున, గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సురేశ్ రైనా ఉత్తరప్రదేశ్ తరఫున బరిలోకి దిగనున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ముంబై సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. అర్జున్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడినా ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాడు. ► గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన కర్ణాటక మూడోసారీ టైటిల్ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆంధ్ర, హైదరాబాద్ జట్లకు తమ ఉనికిని చాటుకోవడానికి ఈ టోర్నీ వేదికగా నిలువనుంది. ఆంధ్ర జట్టుకు అంబటి రాయుడు... హైదరాబాద్ జట్టుకు తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ‘డ్రా’ను పరిశీలిస్తే ఆంధ్ర, హైదరబాద్ జట్లు నాకౌట్‌కు చేరాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో అస్సాంతో హైదరాబాద్ తలపడుతుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఫార్మాట్ ఎలా ఉందంటే? మొత్తం 38 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఆరేసి జట్లతో కూడుకున్న ఐదు ఎలైట్ గ్రూప్‌లు... ఎనిమిది జట్లతో కూడిన ఒక ప్లేట్ గ్రూప్ ఉంది. జనవరి 19వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఎనిమిది జట్లు నాకౌట్ దశకు అర్హత పొందుతాయి. ఆరు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లతోపాటు ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు దక్కించుకుంటాయి. లీగ్ దశలో 95 మ్యాచ్‌లు, నాకౌట్ దశలో 7 మ్యాచ్‌లు కలిపి టోర్నీలో మొత్తం 102 మ్యాచ్‌లు జరగనున్నాయి. నాకౌట్ మ్యాచ్‌లు ఎక్కడంటే? జనవరి 26 నుంచి నాకౌట్ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని మొతెరా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తారు. జనవరి 26న రెండు క్వార్టర్ ఫైనల్స్... 27న మరో రెండు క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి. 29న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. జనవరి 31న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే? కరోనా నేపథ్యంలో ఏ వేదికలోనూ ప్రేక్షకులకు ప్రవేశం లేదు. లీగ్ దశ మ్యాచ్‌లు రోజూ మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. లీగ్ దశలో గ్రూప్ ‘ఇ’, ‘బి’ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జియో టీవీలోనూ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. దీపక్ హుడా అవుట్... బరోడా జట్టు ఆల్‌రౌండర్ దీపక్ హుడా ముస్తాక్ అలీ టి20 టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. బరోడా జట్టు కెప్టెన్ , భారత జట్టు సభ్యుడు కృనాల్ పాండ్యా గత రెండు రోజులుగా తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని... ఇతర జట్ల ఆటగాళ్ల ముందు తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ దీపక్ హుడా బరోడా క్రికెట్ సంఘానికి లేఖ రాశాడు. జట్ల వివరాలు ఎలైట్ గ్రూప్ ‘ఎ’: జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, రైల్వేస్, త్రిపుర. వేదిక: బెంగళూరు ఎలైట్ గ్రూప్ ‘బి’: హైదరాబాద్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, అస్సాం. వేదిక: కోల్‌కతా ఎలైట్ గ్రూప్ ‘సి’: గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, బరోడా, ఉత్తరాఖండ్. వేదిక: వడోదర ఎలైట్ గ్రూప్ ‘డి’: సర్వీసెస్, సౌరాష్ట్ర, విదర్భ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవా. వేదిక: ఇండోర్ ఎలైట్ గ్రూప్ ‘ఇ’: ఆంధ్ర, హరియాణా, ముంబై, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి. వేదిక: ముంబై ప్లేట్ గ్రూప్: మేఘాలయ, చండీగఢ్, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్. వేదిక: చెన్నైడిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక (ఫైల్) -
విజేత పాకిస్తాన్
హరారే: ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (46 బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో పాక్‌ను గెలిపించాడు. మొదట ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా... పాక్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు షార్ట్ (53 బంతుల్లో 76; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫించ్ (27 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం పాక్ 2 పరుగులకే ఫర్హాన్ (0), హుస్సేన్ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కెప్టెన్ సర్ఫరాజ్ (28; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 45 పరుగులు జతచేసిన ఫఖర్ ఆ తర్వాత షోయబ్ మాలిక్ (37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 107 పరుగులు జతచేశాడు. అనంతరం ఫఖర్ అవుటైనా షోయబ్ మాలిక్ మిగతా పని పూర్తిచేశాడు. -
ఫైనల్లో న్యూజిలాండ్
హామిల్టన్: ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు రెండు పరుగులతో ఓటమి పాలైనా... మెరుగైన రన్‌రేట్‌తో ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనుంది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. మోర్గాన్ (46 బంతుల్లో 80; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసి ఓడింది. గప్టిల్ (47 బంతుల్లో 62; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మున్రో (21 బంతుల్లో 57; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగినా ఫలితం లేకపోయింది. -
ఎమర్జింగ్ క్రికెట్ టోర్నీ విజేత ఈసీడీజీ
సాక్షి, హైదరాబాద్: అంతర్ రాష్ట్ర ఎమర్జింగ్ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) జట్లు విజేతలుగా నిలిచాయి. బెంగళూరులోని కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ (కేఐఓసీ)లో నిర్వహించిన సీనియర్స్, జూనియర్స్ విభాగాలు రెండింట్లోనూ ఈసీడీజీ గెలుపొందింది. ఈ టోర్నీలో ఈసీడీజీ, కేఐఓసీతోపాటు మూడో జట్టుగా బెంగళూరుకు చెందిన రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ జట్టు పాల్గొంది. శుక్రవారం జరిగిన జూనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 8 పరుగుల తేడాతో కేఐఓసీపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈసీడీజీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఫరీదుద్దీన్ (49), ఆర్యన్ కాక్ (40), ఫర్హాన్ (32)లు రాణించారు. కేఐఓసీ బౌలర్లలో ధ్రువ్ మూడు, శివం రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో కేఐఓసీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. శివం (68), ఆయుష్ (43) రాణించారు. ఈసీడీజీ బౌలర్లు ముస్తాక్, నాసర్, ఫరీద్‌లు మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక సీనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 70 పరుగుల తేడాతో కేఐఓసీపై ఘనవిజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈసీడీజీ 197 (20 ఓవర్లలో 9 వికెట్లకు) పరుగుల భారీస్కోరు సాధించగా, కేఐఓసీ జట్టు 127 (20 ఓవర్లలో 9 వికెట్లకు) పరుగులే చేయగలిగింది. -
సౌత్‌జోన్‌ను గెలిపించిన రోషన్
ఎస్జేఎఫ్ఐ-జేకే బోస్ టి20 టోర్నీ సాక్షి, హైదరాబాద్: జేకే బోస్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో రోషన్ త్యాగరాజన్ (48 బంతుల్లో 61, 9 ఫోర్లు) రాణించడంతో సౌత్‌జోన్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 8 వికెట్ల తేడాతో ఈస్ట్‌జోన్‌పై ఘనవిజయం సాధించింది. భారత క్రీడా విలేకరుల సమాఖ్య (ఎస్జేఎఫ్ఐ) కన్వెన్షన్‌లో భాగంగా ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఫజల్ అలీ (47 బంతుల్లో 60, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హిరకిజ్యోతి మలాకార్ (50 బంతుల్లో 55, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ 18.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి గెలిచింది. జింఖానాలో జరిగిన మరో మ్యాచ్‌లో వెస్ట్‌జోన్ 7 వికెట్ల తేడాతో నార్త్‌జోన్‌పై నెగ్గింది. మొదట నార్త్‌జోన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. సిద్ధార్థ్ శర్మ 37 పరుగులు చేశాడు. వెస్ట్ బౌలర్లు ఎథిరామ్ అలీ 3, రిపిలే క్రిస్టీ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత వెస్ట్‌జోన్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రిపిలే క్రిస్టీ (41 బంతుల్లో 54 నాటౌట్, 8 ఫోర్లు) బ్యాటింగ్‌లోనూ రాణించాడు. -
వెస్ట్‌పై సౌత్‌జోన్ గెలుపు
ఎస్జేఎఫ్ఐ-జేకే బోస్ టి20 క్రికెట్ సాక్షి, హైదరాబాద్: భారత స్పోర్ట్స్ జర్నలిస్టుల సమాఖ్య (ఎస్జేఎఫ్ఐ) జాతీయ కన్వెన్షన్‌లో భాగంగా బుధవారం జేకే బోస్ ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌత్‌జోన్ 10 వికెట్ల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలుపొందగా, నార్త్‌జోన్ 53 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌పై విజయం సాధించింది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, టేబుల్ టెన్నిస్‌లో అర్జున అవార్డీ మీర్ ఖాసీమ్ అలీ ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నీని లాంఛనంగా ఆరంభించారు. సౌత్, వెస్ట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 19.4 ఓవర్లలో 94 పరుగులు చేసి ఆలౌటైంది. తావుస్ రిజ్వీ 22 పరుగులు చేయగా, సౌత్ బౌలర్లలో సత్య 3 వికెట్లు పడగొట్టాడు. సుదర్శన్, భగ్లోత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సౌత్‌జోన్ 13.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 95 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ రోషన్ త్యాగరాజన్ (47 బంతుల్లో 67 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. మరో మ్యాచ్ స్కోర్లు: నార్త్‌జోన్ 163/5 (సిద్ధార్థ్ శర్మ 62, అమిత్ చౌదరి 54; అబ్దుల్ అజీజ్ 2/24), ఈస్ట్‌జోన్: 110/9 (కిరిటీ దత్త 42; ధర్మేంద్ర పాని 2/22, అమిత్ 2/24, సుధీర్ ఉపాధ్యాయ్ 2/9). -
ఎన్నికల్లో ఐపీఎల్ వేడి
ఈనెల 16న ప్రారంభం కానున్న టీ 20 క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్.. రాజకీయాలనూ వేడెక్కిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడానికి కారణం మీరంటే.. మీరంటూ కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గత సంవత్సరం ఐపీఎల్ సందర్భంగా ధర్మశాల స్టేడియంలో 9 మ్యాచ్‌లను నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆ మ్యాచ్‌లు ధర్మశాలలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆయన ఇప్పుడు హమీర్పూర్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐకి హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ అనుమతినివ్వకపోవడం వల్ల రాష్ట్రం రూ. 500 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఠాకూర్ చెబుతున్నారు. కాంగ్రెస్ మాత్రం ఠాకూర్ వల్లే ఇలా జరిగిందని విమర్శిస్తోంది. -
ఒక్క చెడ్డ రోజు...!
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి,వెనకటికి ఎవడో సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు కాలువలో పడ్డాడని సామెత. ప్రతి టోర్నీలోనూ ఎన్ని విజయాలు సాధించిన జట్టుకైనా ఏదో ఒక దశలో ఒక చెడు రోజు ఉంటుంది. దురదృష్టం ఏంటంటే భారత్‌కు అది ఫైనల్ అయింది. టి20 ప్రపంచకప్ మొదటి నుంచి అన్ని లీగ్ మ్యాచ్‌లు, సెమీస్‌లో చెలరేగి ఆడిన భారత్... కీలకమైన ఫైనల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. రెండో ఓవర్లోనే రహానే వికెట్ కోల్పోవడంతో టి20లకు అవసరమైన మెరుపు ఆరంభం దొరకలేదు. దీనికితోడు రోహిత్, కోహ్లి ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఆడారు. చేతిలో వికెట్లు ఉంటే చివరి ఓవర్లలో భారీగా పరుగులు చేయొచ్చు. గతంలో ఈ వ్యూహం భారత్‌కు బాగా పనికొచ్చింది. కానీ ఫైనల్లో యువరాజ్ పుణ్యమాని తేలిపోయాం. ఇక బౌలర్లను పెద్దగా తప్పు పట్టడానికి కూడా లేదు. లక్ష్యం చిన్నదే కావడంతో వాళ్లు కూడా ఒత్తిడిలోకి వెళ్లారు. ముఖ్యంగా అశ్విన్ మీద బాగా ఒత్తిడి పెంచారు. అలాగే ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా ధోని తొలిసారి విఫలమయ్యాడు. శభాష్ విరాట్... భారత్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ కోహ్లి తన క్లాస్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. చక్కగా ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆఖరి ఐదు ఓవర్లలో హిట్టింగ్‌కు కావలసిన రంగం సిద్ధం చేశాడు. ఒక దశలో కోహ్లి సెంచరీ కూడా చేయొచ్చనిపించింది. కానీ యువీ, ధోని కలిసి కోహ్లికి కనీసం సరిగా స్ట్రయికింగ్ కూడా ఇవ్వలేకపోయారు. ఓవరాల్‌గా టోర్నీలో భారత ప్రదర్శన పేలవంగా ఏమీ లేదు. ఒక్క ఫైనల్‌ను మినహాయిస్తే చాంపియన్ తరహా ఆటతీరునే ప్రదర్శించింది. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిపించిన ధోని... ఈసారి మాత్రం విఫలమయ్యాడు. అయితే ఏమాత్రం అంచనాలు లేకుండా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు చేరడం ద్వారా కాస్త గౌరవంగానే స్వదేశానికి బయల్దేరుతోంది. -
సెమీస్‌లో కింగ్స్, మెరైన్‌ట్రాన్స్
సాక్షి, హైదరాబాద్: సీవేస్ కప్ కార్పొరేట్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో సీబీఏహెచ్ కింగ్స్, మెరైన్‌ట్రాన్స్, సీవేస్ లెజెండ్స్, ప్రతాప్ హెల్త్‌కేర్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. నేటి ఆదివారం సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు టైటిల్ పోరు కూడా జరగనుంది. వారాంతాల్లో మాత్రమే జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 కార్పొరేట్ జట్లు పాల్గొన్నాయి. వీటిని మూడు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. ఇందులో ప్రతి పూల్ నుంచి తొలి స్థానంలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత పొందాయి. పూల్-ఎలో సీవేస్ ప్రైడ్, ప్రతాప్ హెల్త్‌కేర్, గణేశ్ ఫార్వర్డర్స్ జట్లు తలపడ్డాయి. ‘బి’లో సీవేస్ లెజెండ్స్, కాంకర్, హైస్సా జట్లు పోటీపడ్డాయి. ‘సి’లో ఎంఓఎల్, కస్టమ్స్, సీబీఏహెచ్ కింగ్స్ జట్లు, ‘డి’లో మెరైన్‌ట్రాన్స్, సీహెచ్ఏహెచ్ రాకర్స్, ఎస్ఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ జట్లు తలపడ్డాయి. తొలి సెమీఫైనల్లో కింగ్స్‌తో మెరైన్‌ట్రాన్స్... రెండో సెమీస్‌లో సీవేస్ లెజెండ్స్‌తో ప్రతాప్ హెల్త్ కేర్ జట్లు పోటీపడతాయి. ప్రతాప్ హెల్త్‌కేర్ జట్టు బ్యాట్స్‌మెన్ వెంకట్ రెడ్డి వరుసగా రెండు అర్ధసెంచరీలతో ఫామ్‌లో ఉన్నాడు. అతను సీవేస్ ప్రైడ్‌పై, గణేశ్ ఫార్వర్డర్స్పై అర్ధసెంచరీలతో రాణించాడు. సీవేస్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ కెప్టెన్ పీవీకే మోహన్ ఈ టోర్నీ విజేతలకు అందించే ట్రోఫీలను ఆవిష్కరించారు. -
హైదరాబాద్ విజయం
జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత సీనియర్ మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. జింఖానా మైదానంలో ఆదివారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 45 పరుగుల తేడాతో హర్యానా జట్టుపై గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. స్రవంతి నాయుడు 22 పరుగులు చేసింది. హర్యానా బౌలర్లు మాన్సి జోష్, ప్రీతి బోస్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన హర్యానా 19.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు కావ్య 3, డయానా 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో హైదరాబాద్ కు 4 పాయింట్లు దక్కాయి. రెండో మ్యాచ్‌లో ఒడిశా జట్టు 22 పరుగులతో మహారాష్ట్రను ఓడించింది. ఏఓసీ సెంటర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన ఒడిశా 97 పరుగులకు ఆలౌటైంది. స్మిత (35), ఎంపీ మెహత (23) ఫర్వాలేదనిపించారు. మహారాష్ట్ర బౌలర్ విద్య 3 వికెట్లు చేజిక్కించుకుంది. తర్వాత బరిలోకి దిగిన మహారాష్ట్ర జట్టు 18 ఓవర్లలో 75 పరుగులకే చేతులెత్తేసింది. మందన (37) మెరుగ్గా ఆడింది. ఒడిశా బౌలర్ రోషనార ప్రవీణ 2 వికెట్లు తీసుకుంది.