ఫైనల్లో న్యూజిలాండ్‌ | Hosts reach T20 tri-series final despite defeat | Sakshi
Sakshi News home page

ఫైనల్లో న్యూజిలాండ్‌

Published Mon, Feb 19 2018 5:52 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Hosts reach T20 tri-series final despite defeat - Sakshi

హామిల్టన్‌: ముక్కోణపు టి20 క్రికెట్‌ టోర్నీలో న్యూజిలాండ్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు రెండు పరుగులతో ఓటమి పాలైనా... మెరుగైన రన్‌రేట్‌తో ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ తలపడనుంది. మొదట ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. మోర్గాన్‌ (46 బంతుల్లో 80; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం కివీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసి ఓడింది. గప్టిల్‌ (47 బంతుల్లో 62; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మున్రో (21 బంతుల్లో 57; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగినా ఫలితం లేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement