సౌత్‌జోన్‌ను గెలిపించిన రోషన్ | south zone team won T20 tournment | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ను గెలిపించిన రోషన్

Published Fri, Jun 6 2014 12:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

south zone team won T20 tournment

ఎస్‌జేఎఫ్‌ఐ-జేకే బోస్ టి20 టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: జేకే బోస్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో రోషన్ త్యాగరాజన్ (48 బంతుల్లో 61, 9 ఫోర్లు) రాణించడంతో సౌత్‌జోన్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 8 వికెట్ల తేడాతో ఈస్ట్‌జోన్‌పై ఘనవిజయం సాధించింది. భారత క్రీడా విలేకరుల సమాఖ్య (ఎస్‌జేఎఫ్‌ఐ) కన్వెన్షన్‌లో భాగంగా ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది.

 ఫజల్ అలీ (47 బంతుల్లో 60, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హిరకిజ్యోతి మలాకార్ (50 బంతుల్లో 55, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ 18.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి గెలిచింది. జింఖానాలో జరిగిన మరో మ్యాచ్‌లో వెస్ట్‌జోన్ 7 వికెట్ల తేడాతో నార్త్‌జోన్‌పై నెగ్గింది. మొదట నార్త్‌జోన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. సిద్ధార్థ్ శర్మ 37 పరుగులు చేశాడు. వెస్ట్ బౌలర్లు ఎథిరామ్ అలీ 3, రిపిలే క్రిస్టీ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత వెస్ట్‌జోన్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రిపిలే క్రిస్టీ (41 బంతుల్లో 54 నాటౌట్, 8 ఫోర్లు) బ్యాటింగ్‌లోనూ రాణించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement