South Zone team
-
ఓటమి దిశగా సౌత్‌జోన్
కోయంబత్తూర్: వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్ ఓటమి దిశగా సాగుతోంది. 529 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన సౌత్‌జోన్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. నేడు చివరిరోజు సౌత్‌జోన్ గెలవాలంటే మరో 375 పరుగులు చేయాలి. వెస్ట్‌జోన్ నెగ్గాలంటే మరో నాలుగు వికెట్లు తీయాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్‌జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. -
Duleep Trophy: రికీ భుయ్ సెంచరీ
సేలం (తమిళనాడు): ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో దులీప్ ట్రోఫీలో నార్త్‌జోన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌత్‌జోన్ భారీస్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 324/2తో శుక్రవారం రెండో రోజు ఆటకొనసాగించిన సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 172.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 630 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హనుమ విహారి (134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు 27 పరుగులు జతచేసి నిష్క్రమించాడు. అనంతరం రికీ .. కృష్ణప్ప గౌతమ్ (48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (42; 4 ఫోర్లు, 1 సిక్స్)లతో కలిసి జట్టు స్కోరును 600 పరుగుల పైచిలుకు చేర్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. -
ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీకి సౌత్‌జోన్ జట్టు
హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అఖిల భారత ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. ఈనెల 4 నుంచి సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో సౌత్‌జోన్‌లోని వివిధ రీజియన్ల నుంచి 29 మంది ప్రాబబుల్స్‌కు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. హైదరాబాద్ రీజినల్ స్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ (ఆర్‌ఎస్‌పీసీ) అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ ఎ.రాజగోపాల్, ఆర్‌ఎస్‌పీసీ సెక్రటరీ, పీఆర్ డీజీఎం విక్టర్ అమల్‌రాజ్ ఈ ట్రయల్స్‌ను పర్యవేక్షించారు. ట్రయల్స్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీలో పాల్గొనే 16 మంది సభ్యులతో కూడిన సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు డీఎస్ శ్రీధర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆలిండియా ఎఫ్‌సీఐ టోర్నీ చండీగఢ్‌లో ఈనెల 16 నుంచి 20 వరకు జరుగుతుంది. సౌత్‌జోన్ ఎఫ్‌సీఐ జట్టు: డి.ఎస్. శ్రీధర్ (కెప్టెన్), సుమిత్ అహ్లావత్, వై. అముల్ పాల్, కె.శ్రీకాంత్, ఎ.సెంథిల్ కుమారన్, జి.శ్రీకాంత్, ప్రవీణ్ సోనీ, ఎస్.గంగాధరన్, నవీన్ నైన్, జి.బాలకుమార్, ప్రమోద్ కుమార్, ఎస్.యోగేశ్, ఎం.ఎ.రషీద్, జె.ఆర్.శ్రీనివాస్, వెంకటేశ్ సాగర్, హెచ్.చంద్ర శేఖర్. -
కెప్టెన్‌గా అంజలిశర్వాణి
కడప స్పోర్ట్స్: కడప నగరంలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన సౌత్‌జోన్ అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారిణులను ఎంపికచేసి సౌత్‌జోన్ జట్టునుశనివారం ప్రకటించారు. 5 (కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం) జిల్లాల జట్ల నుంచి క్రీడాకారిణులను ఎంపికచేయగా కర్నూలు క్రీడాకారిణి అంజలి శర్వాణిని సౌత్‌జోన్ కెప్టెన్‌గా నియమించారు. ఎంపికైన జట్టు రాష్ట్రస్థాయిలో సత్తాచాటాలని సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సౌత్‌జోన్‌జట్టు : కె. అంజలిశర్వాణి (కెప్టెన్) కర్నూలు, డి. ప్రవళ్లిక (వైస్ కెప్టెన్) చిత్తూరు. ఎన్. అనూష, వి. అనూషారాణి (కర్నూలు), కె.మాధురి (నెల్లూరు), పి.పల్లవి (అనంతపురం), ఎన్.రోజా, వికెట్‌కీపర్ (కడప), జి.శరణ్య (కర్నూలు), జి.చంద్రలేఖ (కర్నూలు), ఎస్. నాగమణి (కడప), బి.యామిని (నెల్లూరు), ఎ.శ్రీలక్ష్మి (కడప), జి.శరణ్య (చిత్తూరు), బి. అనూష (అనంతపురం), ఎన్. మౌనిక(కడప), ఇ. పద్మజ (చిత్తూరు). స్టాండ్‌బై : జి. సింధుజ (నెల్లూరు), కె. ఓబులమ్మ (కడప), కె.హంస (చిత్తూరు), సీహెచ్ అనూష (చిత్తూరు), వి.శ్రావణి (కర్నూలు). జట్టు మేనేజర్ కమ్ కోచ్‌గా పద్మావతి వ్యవహరించనున్నారు. -
రాహుల్ అజేయ సెంచరీ
ఆధిక్యంలో సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (205 బంతుల్లో 168 బ్యాటింగ్; 18 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ శతకంతో అదరగొట్టగా... మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (97 బంతుల్లో 80; 13 ఫోర్లు; 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 308 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం 32 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓపెనర్లు రాహుల్, ఉతప్ప చెలరేగడంతో తొలి వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌తో పాటు హైదరాబాద్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (48 బంతుల్లో 38 బ్యాటింగ్; 7 ఫోర్లు) ఉన్నాడు. పంకజ్ సింగ్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అంతకుముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వినయ్, ఓజా, అపరాజిత్లకు రెండేసి వికెట్లు దక్కాయి. -
సౌత్‌జోన్‌ను గెలిపించిన రోషన్
ఎస్జేఎఫ్ఐ-జేకే బోస్ టి20 టోర్నీ సాక్షి, హైదరాబాద్: జేకే బోస్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో రోషన్ త్యాగరాజన్ (48 బంతుల్లో 61, 9 ఫోర్లు) రాణించడంతో సౌత్‌జోన్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 8 వికెట్ల తేడాతో ఈస్ట్‌జోన్‌పై ఘనవిజయం సాధించింది. భారత క్రీడా విలేకరుల సమాఖ్య (ఎస్జేఎఫ్ఐ) కన్వెన్షన్‌లో భాగంగా ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఫజల్ అలీ (47 బంతుల్లో 60, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హిరకిజ్యోతి మలాకార్ (50 బంతుల్లో 55, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ 18.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి గెలిచింది. జింఖానాలో జరిగిన మరో మ్యాచ్‌లో వెస్ట్‌జోన్ 7 వికెట్ల తేడాతో నార్త్‌జోన్‌పై నెగ్గింది. మొదట నార్త్‌జోన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. సిద్ధార్థ్ శర్మ 37 పరుగులు చేశాడు. వెస్ట్ బౌలర్లు ఎథిరామ్ అలీ 3, రిపిలే క్రిస్టీ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత వెస్ట్‌జోన్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రిపిలే క్రిస్టీ (41 బంతుల్లో 54 నాటౌట్, 8 ఫోర్లు) బ్యాటింగ్‌లోనూ రాణించాడు. -
ఆదుకున్న అపరాజిత్, పాండే
చెన్నై: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టు కోలుకుంది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో వెస్ట్‌జోన్‌తో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సరికి సౌత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (131 బంతుల్లో 93 బ్యాటింగ్; 11 ఫోర్లు), మనీశ్ పాండే (118 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు కలిసి ఇప్పటికే నాలుగో వికెట్‌కు అభేద్యంగా 161 పరుగులు జోడించారు. అంతకు ముందు టాస్ గెలిచిన సౌత్ జోన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దులీప్ ట్రోఫీలో తొలి సారి తుది జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అక్షత్ రెడ్డి (23 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముకుంద్ (4), రాహుల్ (6) కూడా తొందరగానే అవుట్ కావడంతో 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి సౌత్ జోన్ కష్టాల్లో పడింది. ఈ దశలో అపరాజిత్, పాండే జట్టును ఆదుకున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తొలి రోజు కేవలం 54 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.