కెప్టెన్‌గా అంజలిశర్వాణి | Captain anjalisarvani | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా అంజలిశర్వాణి

Published Sat, Jul 23 2016 8:08 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

కెప్టెన్‌గా అంజలిశర్వాణి

కెప్టెన్‌గా అంజలిశర్వాణి

కడప స్పోర్ట్స్‌:
కడప నగరంలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన సౌత్‌జోన్‌ అంతర్‌ జిల్లాల సీనియర్‌ మహిళా క్రికెట్‌ పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారిణులను ఎంపికచేసి సౌత్‌జోన్‌ జట్టునుశనివారం ప్రకటించారు. 5 (కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం) జిల్లాల జట్ల నుంచి క్రీడాకారిణులను ఎంపికచేయగా కర్నూలు క్రీడాకారిణి అంజలి శర్వాణిని సౌత్‌జోన్‌ కెప్టెన్‌గా నియమించారు. ఎంపికైన జట్టు రాష్ట్రస్థాయిలో సత్తాచాటాలని సౌత్‌జోన్‌ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

సౌత్‌జోన్‌జట్టు : కె. అంజలిశర్వాణి (కెప్టెన్‌) కర్నూలు, డి. ప్రవళ్లిక (వైస్‌ కెప్టెన్‌) చిత్తూరు. ఎన్‌. అనూష, వి. అనూషారాణి (కర్నూలు), కె.మాధురి (నెల్లూరు), పి.పల్లవి (అనంతపురం), ఎన్‌.రోజా, వికెట్‌కీపర్‌ (కడప), జి.శరణ్య (కర్నూలు), జి.చంద్రలేఖ (కర్నూలు), ఎస్‌. నాగమణి (కడప), బి.యామిని (నెల్లూరు), ఎ.శ్రీలక్ష్మి (కడప), జి.శరణ్య (చిత్తూరు), బి. అనూష (అనంతపురం), ఎన్‌. మౌనిక(కడప), ఇ. పద్మజ (చిత్తూరు). స్టాండ్‌బై : జి. సింధుజ (నెల్లూరు), కె. ఓబులమ్మ (కడప), కె.హంస (చిత్తూరు), సీహెచ్‌ అనూష (చిత్తూరు), వి.శ్రావణి (కర్నూలు). జట్టు మేనేజర్‌ కమ్‌ కోచ్‌గా పద్మావతి వ్యవహరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement