Duleep Trophy: రికీ భుయ్‌ సెంచరీ | Duleep Trophy: Ricky Bhui made an unbeaten 103 runs | Sakshi
Sakshi News home page

Duleep Trophy: రికీ భుయ్‌ సెంచరీ

Published Sat, Sep 17 2022 4:59 AM | Last Updated on Sat, Sep 17 2022 4:59 AM

Duleep Trophy: Ricky Bhui made an unbeaten 103 runs - Sakshi

సేలం (తమిళనాడు):   ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌ (170 బంతుల్లో 103 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో దులీప్‌ ట్రోఫీలో నార్త్‌జోన్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌత్‌జోన్‌ భారీస్కోరు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 324/2తో శుక్రవారం రెండో రోజు ఆటకొనసాగించిన సౌత్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 630 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

హనుమ విహారి (134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఓవర్‌నైట్‌ స్కోరుకు 27 పరుగులు జతచేసి నిష్క్రమించాడు. అనంతరం రికీ .. కృష్ణప్ప గౌతమ్‌ (48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాద్‌ క్రికెటర్‌ టి.రవితేజ (42; 4 ఫోర్లు, 1 సిక్స్‌)లతో కలిసి జట్టు స్కోరును 600 పరుగుల పైచిలుకు చేర్చాడు.  అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్‌ ఆట నిలిచే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement