North zone team
-
Duleep Trophy 2022: సాయికిశోర్‌కు 7 వికెట్లు
సేలం (తమిళనాడు): ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆర్.సాయికిశోర్ (7/70) ఏడు వికెట్లతో తిప్పేయడంతో... నార్త్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 17/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 67 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), నిశాంత్ (40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 423 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన సౌత్ జోన్ జట్టు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. రోహన్ (77; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు), టి.రవితేజ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌత్ జోన్ ఓవరాల్ ఆధిక్యం 580 పరుగులకు చేరుకుంది. -
Duleep Trophy: రికీ భుయ్ సెంచరీ
సేలం (తమిళనాడు): ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో దులీప్ ట్రోఫీలో నార్త్‌జోన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌత్‌జోన్ భారీస్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 324/2తో శుక్రవారం రెండో రోజు ఆటకొనసాగించిన సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 172.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 630 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హనుమ విహారి (134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు 27 పరుగులు జతచేసి నిష్క్రమించాడు. అనంతరం రికీ .. కృష్ణప్ప గౌతమ్ (48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (42; 4 ఫోర్లు, 1 సిక్స్)లతో కలిసి జట్టు స్కోరును 600 పరుగుల పైచిలుకు చేర్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. -
‘జేకే బోస్’ విజేత నార్త్‌జోన్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎస్జేఎఫ్ఐ-జేకే బోస్ టి20 టోర్నమెంట్ టైటిల్‌ను నార్త్‌జోన్ జట్టు గెలుచుకుంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన ఆఖరిదైన మూడో రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో నార్త్ 46 పరుగుల తేడాతో సౌత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 179 పరుగులు చేసింది. అమిత్ చౌదరి (91 నాటౌట్) చెలరేగితే, సిద్ధార్థ్ శర్మ (51), ఆకాశ్ రావల్ (31 నాటౌట్) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులకే పరిమితమైంది. సతీష్ విశ్వనాథన్ (43) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఆకాశ్ రావల్, సుధీర్ ఉపాధ్యాయ, అమిత్ చౌదరి తలా రెండు వికెట్లు తీశారు. టోర్నీలో రెండు విజయాలు సాధించిన సౌత్ జట్టు చివరి మ్యాచ్‌లో ఓడిపోయినా కనీసం 150 పరుగులు చేసి ఉంటే మెరుగైన రన్‌రేట్‌తో టైటిల్ గెలిచేది. జింఖానాలో జరిగిన మరో మ్యాచ్‌లో వెస్ట్‌జోన్ 6 వికెట్ల తేడాతో ఈస్ట్‌జోన్‌ను ఓడించింది. ముందుగా ఈస్ట్‌జోన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. షేక్ ఫైజల్ అలీ (32), అబ్దుల్ అజీ (57 నాటౌట్) మెరుగ్గా ఆడారు. క్రిస్టీ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 18 ఓవర్లలో 4 వికెట్లకు 131 పరుగులు చేసి నెగ్గింది. సుభోద్ మయూర్ (36) ఫర్వాలేదనిపించాడు. వెస్ట్, ఈస్ట్‌లకు వరుసగా మూడు, నాలుగు స్థానాలు దక్కాయి. ముంబై క్లీన్‌స్వీప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ముంబై (ఎస్జేఏఎమ్) మూడు టైటిల్స్ నెగ్గి క్లీన్‌స్వీప్ చేసింది. సింగిల్స్‌లో అమోల్ కరాడ్కర్ (ముంబై) 11-5, 11-6, 6-11, 9-11, 11-7తో ఆర్. కౌశిక్ (బెంగళూరు)పై; డబుల్స్‌లో అమోల్-అశ్విన్ 11-7, 11-4, 11-9తో కీర్తివాసన్-భగవతి (తమిళనాడు)పై నెగ్గారు. టీమ్ ఈవెంట్లో ఎస్జేఏఎమ్-ఎ 2-1తో ఎస్డబ్ల్యుఏబీ-ఎపై గెలిచింది. ఫుట్‌బాల్ పెనాల్టీ కిక్స్‌లో ముంబై-ఎ 2-1తో ఒరిస్సా-ఎపై; బాస్కెట్‌బాల్ ఫ్రీ త్రోస్‌లో ఎస్డబ్యుబీ 2-1తో టీఎన్‌ఎస్‌జేఏ-ఎపై నెగ్గాయి. విజేతలకు చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ బహుమతులను అందజేశారు. -
నార్త్ జోన్ గెలుపు
జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్ జింఖానా, న్యూస్‌లైన్: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు 3 వికెట్ల తేడాతో వెస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించింది. అంబర్‌పేట మైదానంలో గురువారం మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. విద్యాసాగర్ 26, జగదీశ్వర్ రెడ్డి 22 పరుగులు చేశారు. కార్తీక్ 4, ఆనంద్ 2 వికెట్లు తీశారు. తర్వాత బరిలోకి దిగిన నార్త్ జోన్ 14 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. అనిల్ 26, అదిల్ 24 పరుగులు చేశారు. జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ బౌలర్లు జ్ఞానేశ్వర్, మల్లికార్జున్ చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. మరో మ్యాచ్‌లో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ జట్టు పరుగు తేడాతో జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ జట్టుపై గెలుపొందింది. తొలుత బరిలోకి దిగిన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. రాజారామ్ 26, రఘు 24, ప్రవీణ్‌చంద్ర 20 పరుగులు చేశారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ బౌలర్లు ర మేష్ 3, రవీందర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ 14.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.