Ricky Bhui
-
Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం
దులీప్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇండియా-డి ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇండియా-బితో ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మ్యాచ్‌లో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.ఆరేసిన అర్షదీప్373 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-బి.. అర్షదీప్ సింగ్ (6/40), ఆదిథ్య థాకరే (4/59) ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (40 నాటౌట్), అభిమన్యు ఈశ్వరన్ (19), సూర్యకుమార్ యాదవ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.రికీ భుయ్ అజేయ శతకంరికీ భుయ్ అజేయ సెంచరీతో (119) కదం తొక్కడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (50), సంజూ శాంసన్ (45) రాణించారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, నవ్‌దీప్ సైనీ 3, మోహిత్ అవస్థి, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. ఆదుకున్న సుందర్అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో (116), వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87) రాణించడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేయగలిగింది. ఇండియా-డి బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, అర్షదీప్ 3, ఆదిథ్య ఠాకరే 2 వికెట్లు తీశారు.సంజూ మెరుపు సెంచరీ.. పడిక్కల్, భరత్, భుయ్ అర్ద సెంచరీలుతొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగగా.. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవదీప్ సైనీ 5, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: బంగ్లాతో రెండు టెస్టు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ -
రికీ భుయ్ మెరుపులు
సాక్షి, అనంతపురం: ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (87 బంతుల్లో 90 బ్యాటింగ్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా భారత్ ‘బి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘డి’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 50; 7 ఫోర్లు, ఒక సిక్సర్), సంజూ సామ్సన్ (53 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (3), శ్రీకర్ భరత్ (2) విఫలమయ్యారు. 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో భుయ్, శ్రేయస్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ వన్డే తరహాలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారత్ ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, నవ్‌దీప్ సైనీ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 210/6తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘బి’ చివరకు 76.2 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైంది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (140 బంతుల్లో 87; 7 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకున్నాడు. చివరి వరస ఆటగాళ్లతో కలిసి జట్టుకు విలువైన స్కోరు అందించాడు. భారత్ ‘డి’ బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, అర్‡్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న భారత్ ‘డి’ ఓవరాల్‌గా 311 పరుగుల ఆధిక్యంలో ఉంది. రికీ భుయ్‌తో పాటు ఆకాశ్ సేన్ గుప్తా (28 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: 349; భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: 282 భారత్ ‘డి’ రెండో ఇన్నింగ్స్: దేవదత్ పడిక్కల్ (సి) జగదీశన్ (బి) నవ్‌దీప్ సైనీ 3; శ్రీకర్ భరత్ (బి) ముకేశ్ కుమార్ 2; రికీ భుయ్ (నాటౌట్) 90; నిశాంత్ సింధు (సి అండ్ బి) నవ్‌దీప్ సైనీ 5; శ్రేయస్ అయ్యర్ (సి) మోహిత్ అవస్థి (బి) ముకేశ్ కుమార్ 50; సంజూ సామ్సన్ (సి) ప్రభుదేశాయ్ (బి) ముకేశ్ కుమార్ 45; ఆకాశ్ సేన్ గుప్తా (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం (44 ఓవర్లలో 5 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–9, 2–13, 3–18, 4–93, 5–161, బౌలింగ్: ముకేశ్ కుమార్ 13–0–80–3; నవ్‌దీప్ సైనీ 11–2–40–2; మోహిత్ అవస్థి 9–2–41–0; నితీశ్ కుమార్ రెడ్డి 3–0–19–0; రాహుల్ చాహర్ 5–0–27–0; ముషీర్ ఖాన్ 3–0–18–0. -
రికీ భుయ్ సూపర్ సెంచరీ
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-డి ఆటగాడు రికీ భుయ్ అద్బుతమైన సెంచరీ (195 బంతుల్లో 113; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఈ మ్యాచ్‌లో భుయ్ సెంచరీతో మెరిసినా ఇండియా-డికి ఓటమి తప్పలేదు. 488 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇండియా-డి 301 పరుగులకే ఆలౌటై, 186 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భుయ్‌కి జట్టులో ఏ ఒక్క ఆటగాడి నుంచి సహకారం లభించలేదు. సంజూ శాంసన్ (40), శ్రేయస్ అయ్యర్ (41), యశ్ దూబేలకు (37) మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.Ricky Bhui smashed a 4th innings century while chasing 488 in the Duleep Trophy.- Salute, Bhui...!!! 🙇♂️🫡pic.twitter.com/tLnPMvO15w— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు షమ్స్ ములానీ (89), తునశ్ కోటియన్ (53) అర్ద సెంచరీలు చేసి ఇండియా-ఏకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. ఇండియా-డి బౌలర్లలో హర్షిత రాణా 4, విధ్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్ తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే కుప్పకూలింది. ఖలీల్ అహ్మద్ (3/39), ఆకిబ్ ఖాన్ (3/41) ఇండియా-డి పతనాన్ని శాశించారు. ఇండియా-డి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ (92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.107 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రథమ్ సింగ్ (122), తిలక్ వర్మ (111 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. మయాంక్ అగర్వాల్ (56), షాశ్వత్ రావత్ (64 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.THE WINNING MOMENT FOR INDIA A.- Riyan Parag takes the final wicket, A thumping 186 runs win. 💯 pic.twitter.com/8JnlzIDtja— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2024భారీ లక్ష్య ఛేదనలో ఇండియా-డి పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం పెద్దది కావడంతో ఇండియా-డికి ఓటమి తప్పలేదు. రికీ భుయ్ వీరోచిత సెంచరీ కూడా ఇండియా-డిని కాపాడలేకపోయింది. ఇండియా-ఏ బౌలర్లలో తనుశ్ కోటియన్ 4, షమ్స్ ములానీ 3 వికెట్లు తీసి ఇండియా-డిని దెబ్బకొట్టారు. చదవండి: ఈశ్వరన్ సూపర్ సెంచరీ.. 332 పరుగులకు ఇండియా-సి ఆలౌట్ -
'అతడొక విధ్వంసకర ఆటగాడు.. మీరు అలా చేయడం కరెక్ట్ కాదు'
ఐపీఎల్-2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. గురువారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగులతో తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. కాగా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పృథ్వీ షాకు ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌కు ఢిల్లీ జట్టు మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. ఈ క్రమంలో పృథ్వీ షాను కేవలం బెంచ్‌కే పరిమితం చేయడాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తప్పుబట్టాడు. "పృథ్వీ షా అద్భుతమైన ఆటగాడు. అతడికి అంతర్జాతీయ స్ధాయిలో ఆడిన అనుభవం ఉంది. ఆటువంటి ఆటగాడిని డగౌట్లో ఎందుకు కూర్చునిబెట్టారో నాకు ఆర్ధం కావడం లేదు. గత సీజన్లో అతడు బాగా రాణించకపోవచ్చు. కానీ అతడు చాలా డేంజరస్ క్రికెటర్. కాబట్టి అతడికి అవకాశాలు ఇవ్వాలి. అంతే తప్ప డగౌట్లో కూర్చోనిబెడితే పరుగులు చేయలేడు కదా" అని మూడీ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు. కాగా గతేడాది సీజన్లో షా దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2023లో పృథ్వీ షా ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 13.25 సగటుతో కేవలం 106 పరుగులు మాత్రమే చేసాడు. అయితే అంతకుముందు సీజన్లలో మాత్రం పృథ్వీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కాగా తర్వాతి మ్యాచ్‌ల్లోనైనా పృథ్వీ షాకు ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. -
Ranji Trophy: నరాలు తెగే ఉత్కంఠ.. మనోళ్లు ఆఖరి వరకు పోరాడి..
Ranji Trophy 2023-24- Madhya Pradesh vs Andhra, Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రికీ భుయ్ బృందం.. ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడి నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. రంజీ తాజా ఎడిషన్ ఆరంభంలో కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి బ్యాటింగ్‌పై దృష్టి సారించే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. రికీ భుయ్ పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌తో పోటీకి సిద్ధమైన ఆంధ్ర.. శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. కేవీ శశికాంత్ నాలుగు, నితీశ్‌రెడ్డి మూడు వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటర్లు మాత్రం ఆంధ్రకు శుభారంభం అందించలేకపోయారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే జట్టు కుప్పకూలింది. రికీ భుయ్ 32, కరణ్ షిండే 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హనుమ విహారి 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ను ఈసారి... 107 బౌలర్లకే ఆలౌట్ చేశారు ఆంధ్ర బౌలర్లు. ఈ నేపథ్యంలో 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి 43, కరణ్ షిండే 5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టగా.. మరో 12 పరుగులను విహారి, తొమ్మిది పరుగులను కరణ్ తమ తమ స్కోర్లకు జతచేసి అవుటయ్యారు. మిగిలిన వాళ్లలో అశ్విన్ హెబ్బర్ 22 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఆఖర్లో గిరినాథ్‌రెడ్డి పట్టుదలగా నిలబడి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేయగా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 165 పరుగులకే పరిమితమైన ఆంధ్ర జట్టు.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో(Madhya Pradesh won by 4 runs Enters Semis) అడుగుపెట్టింది. ఆంధ్ర వర్సెస్ మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ స్కోర్లు: ►మధ్యప్రదేశ్- 234 & 107 ►ఆంధ్రప్రదేశ్- 172 & 165. -
సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్న ఆంధ్ర కెప్టెన్
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ రికీ భుయ్ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు శతకాలు చేసిన భుయ్.. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో సెంచరీతో (సెకెండ్ ఇన్నింగ్స్) మెరిశాడు. ఈ మ్యాచ్‌లో భుయ్ సెంచరీతో కదంతొక్కడంతో ఆంధ్ర జట్టు పటిష్ట స్థితికి చేరింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్ 271/5గా ఉంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ఆంధ్ర జట్టు 334 పరుగుల లీడ్‌లో ఉంది. భుయ్‌కు (100) జతగా షేక్ రషీద్ (42) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో భుయ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టాడు. ఆరు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. ఈ సీజన్లో భుయ్ ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో 93 సగటున నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీల సాయంతో 744 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ప్రస్తుత రంజీ సీజన్లో భుయ్ చేసిన సెంచరీలు.. బెంగాల్‌పై 175 ఆసోంపై 125 చత్తీస్‌ఘడ్‌పై 120 ఉత్తర్ప్రదేశ్పై 100 నాటౌట్ మ్యాచ్ విషయానికివస్తే.. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైంది. భుయ్ (94), శశికాంత్ (72) అర్ద సెంచరీలతో రాణించారు. యూపీ బౌలర్లలో యశ్ దయాల్, రాజ్‌పుత్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆకిబ్ ఖాన్, సౌరభ్ కుమార్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూపీ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. యూపీ ఇన్నింగ్స్‌లో ఆర్యన్ జురెల్ (60) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శశికాంత్ ఐదు వికెట్లతో చెలరేగాడు. 63 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలపుకుని ఆంధ్ర 334 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Ranji Trophy 2023-24: తొలి రోజు 'ఆంధ్ర'దే..
సాక్షి, విజయనగరం: ఉత్తరప్రదేశ్ జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నిలకడగా ఆడుతోంది. డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు సాధించింది. ఆల్‌రౌండర్ కేవీ శశికాంత్ (83 బంతుల్లో 72; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్ (90 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. శశికాంత్ అవుటయ్యాక రికీ భుయ్‌తో కలిసి కరణ్ షిండే (45 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు రికీ భుయ్, కరణ్ అభేద్యంగా 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో యశ్ దయాళ్, అంకిత్ రాజ్‌పుత్, అకీబ్ ఖాన్, సౌరభ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: పెత్తనమంతా వాళ్లదే.. మర్యాద తప్పొద్దు! ఏంటి జడ్డూ.. నాన్న గురించి ఇలాగేనా? -
హనుమ విహారి, రికీ భుయ్ శతకాలు.. ఆంధ్ర ఘన విజయం
Ranji Trophy 2023-24- Chhattisgarh vs Andhra: రంజీ ట్రోఫీ 2023-24లో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఛత్తీస్‌గఢ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 431 పరుగుల భారీ స్కోరు చేసింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్లో హనుమ విహారి(183), కెప్టెన్ రికీ భుయ్(120) సెంచరీలు చేయడంతో ఈ మేరకు పరుగులు సాధించింది. అనంతరం ఛత్తీస్‌గఢ్ 262 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించగా.. ఆంధ్రకు 169 రన్స్ ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆంధ్ర జట్టు.. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 150 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు 320 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, ఆంధ్ర బౌలర్ల విజృంభణ కారణంగా ఛత్తీస్‌గఢ్ 193 పరుగులకే కుప్పకూలింది. దీంతో 126 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా సోమవారం ముగిసిన ఈ రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లలో ప్రశాంత్ కుమార్, నితీశ్ రెడ్డి మూడేసి వికెట్లు తీయగా.. పృథ్వీరాజ్ యర్రా రెండు, గిరినాథ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ -
Ranji Trophy: హనుమ విహారి సెంచరీ
Ranji Trophy 2023-24 - Chhattisgarh vs Andhra రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును హనుమ విహారి (119 బ్యాటింగ్; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్ (120; 14 ఫోర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 231 పరుగులు జోడించారు. విహారి, కరణ్ షిండే (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక ఇరుజట్ల మధ్య శనివారం రెండో రోజు ఆట మొదలైంది. -
ముంబైతో రంజీ మ్యాచ్.. షమ్స్ ములానీ మాయాజాలం.. ఓటమి దిశగా ఆంధ్ర
ముంబై: బ్యాటర్ల వైఫల్యంతో ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో తొలి ఓటమి దిశగా సాగుతోంది. ముంబైతో జరుగుతున్న గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు ఫాలోఆన్ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఆంధ్ర జట్టు మరో 45 పరుగులు సాధించాలి. షేక్ రషీద్ (52 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (22 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 98/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 72 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. ప్రశాంత్ కుమార్ (73; 10 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై స్పిన్నర్ షమ్స్ ములానీ (6/65) ఆంధ్రను దెబ్బకొట్టాడు. 211 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా ఆంధ్ర జట్టుకు ఫాలోఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ములానీ మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి అతను 3 వికెట్లు తీశాడు. మొత్తంగా ఇప్పటికే ములానీ తన ఖాతాలో 9 వికెట్లు వేసుకున్నాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటైంది. భుపేన్ లాల్వాని (61), తనుశ్ కోటియన్ (54), మోహిత్ అవస్థి (53) అర్ధసెంచరీలతో రాణించారు. ఆంధ్ర పేసర్ నితీశ్ కుమార్ రెడ్డి ఐదు వికెట్లు తీశాడు. -
రికీ భుయ్ భారీ శతకం వృధా.. డ్రాగా ముగిసిన ఆంధ్ర-బెంగాల్ రంజీ మ్యాచ్
విశాఖ స్పోర్ట్స్: ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర క్రికెట్ జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. బెంగాల్ జట్టుతో ఇక్కడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’ చేసుకుంది. 36 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినందుకు ఆంధ్ర జట్టు ఖాతాలో మూడు పాయింట్లు చేరగా... బెంగాల్ జట్టుకు ఒక్క పాయింట్ లభించింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 339/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 165.4 ఓవర్లలో 445 పరుగులకు ఆలౌటైంది. రికీ భుయ్ (347 బంతుల్లో 175; 23 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ సాధించి ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కేలా చేశాడు. షోయబ్ మొహమ్మద్ ఖాన్ (149 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఏడో వికెట్‌కు 133 పరుగులు జోడించిన రికీ భుయ్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. బెంగాల్ బౌలర్లలో కైఫ్ మూడు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్, ఇషాన్ పోరెల్, కరణ్ లాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 36 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ జట్టు 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 82 పరుగులు సాధించింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో టీ విరామం తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించి ఆటను ముగించారు. ఆంధ్ర జట్టు తదుపరి మ్యాచ్‌ను ఈనెల 12 నుంచి వాంఖడే స్టేడియంలో ముంబై జట్టుతో ఆడుతుంది. -
రికీ భుయ్ అజేయ శతకం
విశాఖ స్పోర్ట్స్: బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి 71 పరుగుల దూరంలో నిలిచింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. రికీ భుయ్ (243 బంతుల్లో 107 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించి ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 119/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర మూడు వికెట్లు కోల్పోయి మరో 220 పరుగులు సాధించింది. కెప్టెన్ హనుమ విహారి (51; 7 ఫోర్లు)తో కలిసి రికీ భుయ్ నాలుగో వికెట్‌కు 87 పరుగులు జత చేశాడు. అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి (30; 6 ఫోర్లు)తో ఆరో వికెట్‌కు రికీ భుయ్ 71 పరుగులు జోడించాడు. ప్రస్తుతం షోయబ్ మొహమ్మద్ ఖాన్ (31 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రికీ భుయ్ ఏడో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జత చేశాడు. బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
ఆంధ్ర ఆటగాడి వీరోచిత పోరాటం.. భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టుడు
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో భాగంగా పంజాబ్‌తో నిన్న (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రికీ భుయ్ వీరోచితంగా పోరాడాడు. భారీ లక్ష్య ఛేదనలో భుయ్ అజేయ శతకంతో (52 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరిశాడు. అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. అభిషేక్ శర్మ (51 బంతుల్లో 112; 9 ఫోర్లు, 9 సిక్సర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (26 బంతుల్లో 87; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోర్ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆంధ్రప్రదేశ్.. పంజాబ్ బౌలర్లు హర్‌ప్రీత్ బ్రార్ (4-1-18-3), సిద్దార్థ్ కౌల్ (2/40), అర్షదీప్ సింగ్ (1/37), ప్రేరిత్ దత్తా (1/25) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్ (104 నాటౌట్) ఒక్కడే ఒంటిపోరాటం చేసి శతక్కొట్టగా.. అశ్విన్ హెబ్బర్ (17), త్రిపురన విజయ్ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
ఏపీఎల్ సీజన్ 2 వేలంలో విశాఖ క్రికెటర్‌కు రికార్డు ధర
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ వేలం మంగళవారం విశాఖలో జరిగింది. ఇందులో దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన విశాఖ కుర్రాడు రికీ బుయ్ రికార్డు ధర పలికాడు. రూ.8,10,000కు బెజవాడ టైగర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర. సౌత్‌జోన్ కెప్టెన్ హనుమ విహారీను రూ.6,60,000తో రాయలసీమ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఏపీలోని 6 ఫ్రాంచైజీ జట్లతో ఈ నెల 16 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా తరఫున రంజీలతో సహా అంతర్జాతీయ క్రికెట్లో పలు స్థాయిల్లో సత్తా చాటిన 567 మంది ఆటగాళ్లను వారి గ్రేడ్‌ను బట్టి వేలం నిర్వహించారు. 6 ఫ్రాంచైజీలు మొత్తంగా 120 మంది ఆటగాళ్లను జట్లకు ఎంపిక చేసుకున్నాయి. ఏసీఏ పర్యవేక్షణలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐపీఎల్ జట్ల వేలం నిర్వహించే వ్యాఖ్యాత చారుశర్మ ఈ వేలాన్ని నిర్వహించగా..కౌన్సిల్ చైర్మన్ మునీష్ సెహగల్ ప్రారంభించారు. లైనప్‌ను సరి చూసుకుంటూ ఫ్రాంచైజీలు మొత్తంగా రూ.1.8 కోట్లను వినియోగించుకున్నాయి. కాగా, గిరినాథ్‌రెడ్డిని రూ.6,10,000లకు రాయలసీమ కింగ్స్, కేఎస్ భరత్‌ను రూ.6,00,000లకు ఉత్తరాంధ్ర లయన్స్ నెలబెట్టుకున్నాయి. వైజాగ్ వారియర్స్ అశ్విన్ హెబ్బర్‌ను రూ.5,10,000కు, కోస్టల్ రైడర్స్ స్టీఫెన్, లేఖజ్‌లను రూ.4,50,000లకు నిలబెట్టుకున్నాయి. రూ.50,000 కనీస ధరతో బిడ్ ప్రారంభమైంది. -
రికీ భుయ్ సూపర్ సెంచరీ.. కొనసాగుతున్న ఆంధ్రపద్రేశ్ జోరు
Ranji Trophy 2022-23 4th Quarter Final: ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుత సీజన్లో వరస విజయాలు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆంధ్ర టీమ్.. కీలకమైన మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జోరును కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు.. రికీ భుయ్ (115 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రికీ భుయ్‌కి జతగా కరణ్ షిండే (83 నాటౌట్) రాణించాడు. ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (24), అభిషేక్ రెడ్డి (22) తమతమ ఇన్నింగ్స్‌లకు లభించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హనుమ విహారి (16) రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు గౌరవ్ యాదవ్ ఖాతాలో చేరాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళే (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. -
సౌరాష్ట్రతో రంజీ పోరు.. అర్ధ సెంచరీతో రాణించిన రికీ భుయ్
రాజ్‌కోట్: ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్ (155 బంతు ల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లో సౌరాష్ట్రతో జరుగుతు న్న మ్యాచ్‌లో తొలిరోజు ఆట నిలిచే సమయానికి ఆంధ్ర జట్టు 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ముందుగా ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (34; 6 ఫోర్లు), అభిషేక్ రెడ్డి (46; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమే ఇచ్చారు. అయితే సౌరాష్ట్ర స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా (3/80) తన వరుస ఓవర్లలో అభిషేక్, జ్ఞానేశ్వర్లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం కెప్టెన్ హనుమ విహారి (38; 7 ఫోర్లు), రికీ భుయ్ మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో విహారిని కూడా జడేజా బౌల్డ్ చేశాడు. తర్వాత కరణ్ షిండే (31; 5 ఫోర్లు) అండతో రికీ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగిసే దశలో చేతన్ సకారియా బౌలింగ్‌లో రికీ భుయ్ వెనుదిరిగాడు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే... కుల్దీప్కు చోటు! చాహల్‌కు నో చాన్స్ -
చెలరేగిన శశికాంత్.. హైదరాబాద్‌పై ఆంధ్ర భారీ విజయం
Ranji Trophy 2022-23- Andhra vs Hyderabad: రంజీ ట్రోఫీ టోర్నీ 2022- 23లో భాగంగా ఆంధ్ర జట్టు హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. హనుమ విహారి బృందం 154 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థిపై జయభేరి మోగించింది. సెంచరీతో మెరిసిన రికీ భుయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఎలైట్ గ్రూప్ బిలో భాగమైన ఆంధ్ర- హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కడు తప్ప.. అంతా సింగిల్ డిజిట్ స్కోర్లే! ఓపెనర్ అభిషేక్ రెడ్డి (81 పరుగులు( మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఆంధ్ర బ్యాటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 9 ,2, 6 ,5, 3, 4, 1, 13, 0, 1 నాటౌట్. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 5 వికెట్లతో చెలరేగగా.. రక్షణ్ రెడ్డి ఒకటి, కార్తికేయ మూడు వికెట్లు తీశారు. ఇక హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో 197 పరుగులకే ఆ జట్టు కథ ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీలతో మెరిసిన రికీ, కరణ్ ఓపెనర్ జ్ఞానేశ్వర్ 72, కెప్టెన్ హనుమ విహారి 33, రికీ భుయ్ 116, శ్రీకర్ భరత్ 89 పరుగులు సాధించగా.. కరణ్ షిండే 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, హైదరాబాద్ ఆంధ్రకు దీటుగా బదులివ్వలేక చతికిలపడింది. చెలరేగిన శశికాంత్ చందన్ సహాని అర్ధ శతకం(56) సాధించగా రోహిత్ రాయుడు 46 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆంధ్ర బౌలర్ కేవీ శశికాంత్ 5 వికెట్లు కూల్చి హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో కొడవండ్ల సుదర్శన్ మూడు, నితీశ్ రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో విజయనగరంలో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆంధ్ర 154 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆంధ్ర వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు ఆంధ్ర- 135 & 462 హైదరాబాద్- 197 & 246 చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
శతక్కొట్టిన రికీ భుయ్, కరణ్ షిండే.. విజయంపై ఆంధ్ర గురి
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కీలక విజయంపై గురి పెట్టింది. చిరకాల ప్రత్యర్థి హైదరాబాద్‌తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆ జట్టు మూడో రోజు గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకుంది. 401 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (21), ప్రజ్ఞయ్ రెడ్డి (0) అవుట్ కాగా...రోహిత్ రాయుడు (46 నాటౌట్), అలంకృత్ అగర్వాల్ (7 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు హైదరాబాద్ మరో 326 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 230/3తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. రికీ భుయ్ (150 బంతుల్లో 116; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోగా, కేఎస్ భరత్ (70 బంతుల్లో 89; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. ఆపై కరణ్ షిండే (180 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం బాదాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు. -
ఒకే రోజు 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు.. పరుగుల ప్రవాహం
VHT 2022: విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో భాగంగా నవంబర్ 21 జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. ఈ ఒక్క రోజే ఏకంగా 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీ హవాలో పై పేర్కొన్న గణాంకాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కేరళ ఆటగాడు రోహన్ కున్నుమ్మల్ (107 నాటౌట్), మధ్యప్రదేశ్ ఓపెనర్ యశ్ దూబే (195 నాటౌట్), హిమాచల్ ప్రదేశ్ ఏకాంత్ సేన్ (116), చండీఘడ్ అర్స్‌లన్ ఖాన్ (107), ఒడిశా ఆటగాడు కార్తీక్ బిశ్వాల్ (107 నాటౌట్), గుజరాత్ ఆటగాడు కథన్ పటేల్ (109), హైదరాబాద్ ఆటగాడు రోహిత్ రాయుడు (109), తమిళనాడు ఆటగాళ్లు నారాయణ్ జగదీశన్ (277), సాయ్ సుదర్శన్ (154), ఆంధ్రప్రదేశ్ రికీ భుయ్ (112 నాటౌట్), జార్ఖండ్ ఆటగాడు విక్రమ్ సింగ్ (116 నాటౌట్), బెంగాల్ ఆటగాళ్లు సుదీప్ ఘరామీ (162), అభిమన్యు ఈశ్వరన్ (122), రాజస్తాన్ ఆటగాడు ఆదిత్య గర్హ్వాల్ (149 నాటౌట్), మహారాష్ట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠి (107) సెంచరీలు బాదగా.. మరో 36 మంది హాఫ్ సెంచరీలు సాధించారు. -
Duleep Trophy: రికీ భుయ్ సెంచరీ
సేలం (తమిళనాడు): ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో దులీప్ ట్రోఫీలో నార్త్‌జోన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌత్‌జోన్ భారీస్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 324/2తో శుక్రవారం రెండో రోజు ఆటకొనసాగించిన సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 172.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 630 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హనుమ విహారి (134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు 27 పరుగులు జతచేసి నిష్క్రమించాడు. అనంతరం రికీ .. కృష్ణప్ప గౌతమ్ (48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (42; 4 ఫోర్లు, 1 సిక్స్)లతో కలిసి జట్టు స్కోరును 600 పరుగుల పైచిలుకు చేర్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. -
ఓటమితో ఆంధ్ర ముగింపు...
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 30 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింటిలో నెగ్గి మరో మూడింటిలో ఓడిన ఆంధ్ర 8 పాయింట్లతో గ్రూప్‌లో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. తొలుత హిమాచల్‌ప్రదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఆంధ్ర పేసర్ చీపురపల్లి స్టీఫెన్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఛేదనలో ఆంధ్ర 20 ఓవర్లలో 118 పరుగులు మాత్రమే చేసింది. అశ్విన్ హెబ్బార్ (43; 3 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (41; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. హిమాచల్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ ఐదు వికెట్లు... రిషి ధావన్ 3 వికెట్లు తీశారు. చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా! -
అటు తిలక్... ఇటు భుయ్
సూరత్: విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ 113 పరుగుల తేడాతో త్రిపురపై ఘన విజయం సాధించింది. హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (145 బంతుల్లో 156; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా, తన్మయ్ అగర్వాల్ (100 బంతుల్లో 86; 9 ఫోర్లు) రాణించాడు. అనంతరం త్రిపుర 42 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. సీవీ మిలింద్ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇండోర్: ఆంధ్ర 3 వికెట్లతో పటిష్టమై న విదర్భను ఓడించింది. విదర్భ 50 ఓవర్లలో 6 వికెట్లకు 331 పరుగులు చేసింది. యష్ (113 బంతుల్లో 117; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫైజ్ ఫజల్ (105 బంతుల్లో 100; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. అనంతరం ఆంధ్ర 49.2 ఓవర్లలో 7 వికె ట్లకు 332 పరుగులు సాధించింది. రికీ భుయ్ (78 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫో ర్లు, 6 సిక్స ర్లు) అజేయ శతకం బాదగా, కెప్టెన్ హనుమ విహారి (67 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. -
విజయం దిశగా ఆంధ్ర
సాక్షి, ఒంగోలు టౌన్: రికీ భుయ్ (313 బంతుల్లో 144 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు... బౌలింగ్‌లో చీపురుపల్లి స్టీఫెన్ (4/47), శశికాంత్ (2/24) హడలెత్తించడంతో... ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్ర విజయం దిశగా సాగుతోంది. 153 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 89 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 64 పరుగులు చేయాలి. ప్రస్తుతం లలిత్ యాదవ్ (23 బ్యాటింగ్; 4 ఫోర్లు), వికాస్ మిశ్రా (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు మ్యాచ్‌కు చివరి రోజు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 249/6తో బ్యాటింగ్ కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 127 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆంధ్రకు 153 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఒకదశలో 8 వికెట్లకు 250 పరుగులతో ఉన్న ఆంధ్ర జట్టుకు ఆధిక్యం 50 పరుగులు దాటుతుందో లేదో అనే అనుమానం కలిగింది. అయితే రికీ భుయ్ పట్టుదలతో ఆడి చివరి వరుస బ్యాట్స్‌మెన్ స్టీఫెన్ (60 బంతుల్లో 19; 3 ఫోర్లు)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 76 పరుగులు... విజయ్ కుమార్ (20 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్)తో కలిసి పదో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఆంధ్రకు భారీ ఆధిక్యం లభించడంలో కీలకపాత్ర పోషించాడు. -
ఆంధ్ర జట్టుకు ఆధిక్యం
సాక్షి, ఒంగోలు టౌన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (70 బ్యాటింగ్; 8 ఫోర్లు)తోపాటు కెప్టెన్ హనుమ విహారి (38; 6 ఫోర్లు), మనీశ్ (42; 7 ఫోర్లు), కరణ్ షిండే (48; 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో... ఢిల్లీతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 16/2తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో 6 వికెట్లకు 249 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర ఖాతాలో 34 పరుగుల ఆధిక్యం ఉంది. రికీ భుయ్‌కు తోడుగా గిరినాథ్ రెడ్డి (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ బౌలర్లలో నవదీప్ సైని మూడు వికెట్లు, పవన్ రెండు వికెట్లు తీశారు. -
ఆంధ్ర అదరహో
సాక్షి, విజయవాడ: ముందు బ్యాట్స్‌మెన్ వీరవిహారం... ఆ తర్వాత బౌలర్ల విజృంభణ... వెరసి టి20 చరిత్రలోనే ఆంధ్ర క్రికెట్ జట్టు అతి పెద్ద విజయం నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం స్థానిక మూలపాడు మైదానంలో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 179 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా టి20 చరిత్రలో ఇది పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక జట్టు పేరిట ఉండేది. 2007లో తొలి టి20 ప్రపంచకప్‌లో భాగంగా కెన్యాతో జొహన్నెస్‌బర్గ్‌లో సెప్టెంబరు 14న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 172 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఆ రికార్డును ఆంధ్ర జట్టు శుక్రవారం బద్దలు కొట్టింది. 38 బంతుల్లోనే రికీ సెంచరీ... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 108 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 38 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టి20ల్లో భారత్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో), రిషభ్ పంత్ (32 బంతుల్లో), రోహిత్ శర్మ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) ముందున్నారు. రికీ భుయ్తోపాటు గిరినాథ్ రెడ్డి (31 బంతుల్లో 62; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా హడలెత్తించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 10 ఓవర్లలో 150 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ హనుమ విహారి (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడాడు. నాగాలాండ్ జట్టు కెప్టెన్ రంగ్సెన్ జొనాథన్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను బరిలోకి దించినా ఆంధ్ర జోరును నిలువరించలేకపోయాడు. సూపర్ శశికాంత్... 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నాగాలాండ్ 13.1 ఓవర్లలో 65 పరుగులకు కుప్పకూలి ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్ (3/8), షేక్ ఇస్మాయిల్ (3/25), కరణ్ శర్మ (3/14) మూడేసి వికెట్లు తీశారు. ముఖ్యంగా పేస్ బౌలర్ శశికాంత్ హడలెత్తించాడు. తాను వేసిన రెండో ఓవర్లో శశికాంత్ ఐదు బంతుల తేడాలో మూడు వికెట్లు తీయడం విశేషం. నాగాలాండ్ జట్టులో జొనాథన్ (25 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్), పారస్ షెరావత్ (11 బంతుల్లో 13; 3 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు దాటలేకపోయారు.