
VHT 2022: విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్‌లో భాగంగా నవంబర్ 21 జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. ఈ ఒక్క రోజే ఏకంగా 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీ హవాలో పై పేర్కొన్న గణాంకాలను ఎవ్వరూ పట్టించుకోలేదు.
కేరళ ఆటగాడు రోహన్ కున్నుమ్మల్ (107 నాటౌట్), మధ్యప్రదేశ్ ఓపెనర్ యశ్ దూబే (195 నాటౌట్), హిమాచల్ ప్రదేశ్ ఏకాంత్ సేన్ (116), చండీఘడ్ అర్స్‌లన్ ఖాన్ (107), ఒడిశా ఆటగాడు కార్తీక్ బిశ్వాల్ (107 నాటౌట్), గుజరాత్ ఆటగాడు కథన్ పటేల్ (109), హైదరాబాద్ ఆటగాడు రోహిత్ రాయుడు (109), తమిళనాడు ఆటగాళ్లు నారాయణ్ జగదీశన్ (277), సాయ్ సుదర్శన్ (154), ఆంధ్రప్రదేశ్ రికీ భుయ్ (112 నాటౌట్), జార్ఖండ్ ఆటగాడు విక్రమ్ సింగ్ (116 నాటౌట్), బెంగాల్ ఆటగాళ్లు సుదీప్ ఘరామీ (162), అభిమన్యు ఈశ్వరన్ (122), రాజస్తాన్ ఆటగాడు ఆదిత్య గర్హ్వాల్ (149 నాటౌట్), మహారాష్ట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠి (107) సెంచరీలు బాదగా.. మరో 36 మంది హాఫ్ సెంచరీలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment