అటు తిలక్‌... ఇటు భుయ్‌ | Tilak Varma, Milind star in Hyderabad big win | Sakshi
Sakshi News home page

అటు తిలక్‌... ఇటు భుయ్‌

Published Sun, Feb 21 2021 5:41 AM | Last Updated on Sun, Feb 21 2021 5:41 AM

 Tilak Varma, Milind star in Hyderabad big win - Sakshi

సూరత్‌: విజయ్‌ హజారే వన్డే టోర్నీలో  హైదరాబాద్‌ 113 పరుగుల తేడాతో త్రిపురపై ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (145 బంతుల్లో 156; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా, తన్మయ్‌ అగర్వాల్‌ (100 బంతుల్లో 86; 9 ఫోర్లు) రాణించాడు. అనంతరం త్రిపుర 42 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. సీవీ మిలింద్‌ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం.  


ఇండోర్‌: ఆంధ్ర 3 వికెట్లతో పటిష్టమై న విదర్భను ఓడించింది. విదర్భ 50 ఓవర్లలో 6 వికెట్లకు 331 పరుగులు చేసింది. యష్‌ (113 బంతుల్లో 117; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫైజ్‌ ఫజల్‌ (105 బంతుల్లో 100; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. అనంతరం ఆంధ్ర 49.2 ఓవర్లలో 7 వికె ట్లకు 332 పరుగులు సాధించింది. రికీ భుయ్‌ (78 బంతుల్లో 101 నాటౌట్‌; 6 ఫో ర్లు, 6 సిక్స ర్లు) అజేయ శతకం బాదగా, కెప్టెన్‌ హనుమ విహారి (67 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement