Vidarbha
-
విదర్భ తీన్మార్...
సీజన్ ఆసాంతం నిలకడ కొనసాగించిన విదర్భ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తూ చాంపియన్‌గా ఆవతరించింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా... పరాజయమే ఎరగకుండా మూడోసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. అసమాన పోరాటంతో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నిలో ఫైనల్ చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా... దేశవాళీ టోర్నీ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు విజేతగా నిలిచింది. కేరళతో జరిగిన తుదిపోరు ‘డ్రా’గా ముగియడంతో... 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన విదర్భ జట్టుకు ట్రోఫీ దక్కింది. రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు చాంపియన్‌గా అవతరించడం ఇది మూడోసారి. 2017–18, 2018–19 సీజన్లలో వరుసగా ట్రోఫీ చేజిక్కించుకున్న విదర్భ జట్టు... మళ్లీ ఆరేళ్ల తర్వాత టైటిల్ దక్కించుకుంది. తాజా సీజన్లో ఫైనల్‌తో కలిపి మొత్తం 10 మ్యాచ్‌లాడిన విదర్భ... పరాజయం లేకుండా ట్రోఫీ కైవసం చేసుకోవడం విశేషం. సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చాంపియన్ విదర్భ జట్టుకు రూ. 5 కోట్లు... రన్నరప్ కేరళ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. సొంత మైదానంలో జరిగిన తుదిపోరులో ఓవర్‌నైట్ స్కోరు 249/4తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు... 143.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (295 బంతుల్లో 135; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు మరో 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగినా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (108 బంతుల్లో 25), దర్శన్ నల్కండే (98 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షయ్ కర్నెవర్ (70 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. ఫలితంగా విదర్భ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 37 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా విదర్భ జట్టు 412 పరుగుల ముందంజలో నిలిచింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు టీ విరామం కంటే ముందే ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన విదర్భ బ్యాటర్ దానిశ్ మాలేవర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 379; కేరళ తొలి ఇన్నింగ్స్: 342; విదర్భ రెండో ఇన్నింగ్స్: పార్థ్ రేఖడే (బి) జలజ్ సక్సేనా 1; ధ్రువ్ షోరే (సి) అజహరుద్దీన్ (బి) ని«దీశ్ 5; దానిశ్ మాలేవర్ (సి) సచిన్ బేబీ (బి) అక్షయ్ చంద్రన్ 73; కరుణ్ నాయర్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) ఆదిత్య 135; యశ్ రాథోడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య సర్వతే 24; అక్షయ్ వాడ్కర్ (బి) ఆదిత్య 25; హర్ష్ దూబే (ఎల్బీడబ్ల్యూ) అధన్ టామ్ 4; అక్షయ్ కర్నెవర్ (బి) బాసిల్ 30; దర్శన్ నల్కండే (నాటౌట్) 51; నచికేత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య 3; యశ్ ఠాకూర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (143.5 ఓవర్లలో 9 వికెట్లకు) 375. వికెట్ల పతనం: 1–5, 2–7, 3–189, 4–238, 5–259, 6–279, 7–283, 8–331, 9–346, బౌలింగ్: ని«దీశ్ 15–3–48–1; జలజ్ సక్సేనా 50–11–109–1; అధన్ టామ్ 14–0–57–1; ఆదిత్య సర్వతే 44.5–12–96–4; బాసిల్ 7–2–18–1; అక్షయ్ చంద్రన్ 13–2–33–1.వీసీఏ నజరానా రూ. 3 కోట్లు మూడోసారి రంజీ టైటిల్ నెగ్గిన తమ జట్టుకు విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. టీమ్ మొత్తానికి రూ. 3 కోట్లు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపింది. ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసి రికార్డు నెలకొలి్పన హర్ష్ దూబేకు రూ. 25 లక్షలు... నాలుగు సెంచరీలతో అదరగొట్టిన కరుణ్ నాయర్‌కు రూ. 10 లక్షలు... ఈ రంజీ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన యశ్ రాథోడ్‌కు రూ. 10 లక్షలు... హెడ్ కోచ్ ఉస్మాన్ ఘనీకి రూ. 15 లక్షలు... అసిస్టెంట్ కోచ్ అతుల్ రనాడేకు రూ. 5 లక్షలు... ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నితిన్ ఖురానాకు రూ. 5 లక్షలు... స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ యువరాజ్ సింగ్ దసోంధికి రూ. 5 లక్షలు... వీడియో ఎనలిస్ట్ అమిత్ మాణిక్‌రావుకు రూ. 5 లక్షలు ప్రకటించారు. గతేడాది మేం ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని ముందే అనుకున్నాం. ప్రతి ఒక్కరు తమ ఆటతీరును మెరుగు పర్చుకున్నారు. దాని ఫలితమే ఈ విజయం. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తొలి పది మందిలో నలుగురు విదర్భ ఆటగాళ్లు ఉన్నారు. సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన హర్ష్, అత్యధిక పరుగులు చేసిన యశ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ హోదాలో ఈసారి రంజీ ట్రోఫీ అందుకున్న క్షణాలు అద్భుతంగా అనిపించాయి. –అక్షయ్ వాడ్కర్, విదర్భ కెప్టెన్ -
కరుణ్ నాయర్ సూపర్ సెంచరీ.. రంజీ ఛాంపియన్‌గా విదర్భ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy 2024-25) ఎడిషన్ ఛాంపియన్‌గా విదర్భ (Vidarbha) అవతరించింది. కేరళతో (Kerala) జరిగిన ఫైనల్ డ్రాగా ముగిసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విదర్భ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 37 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ స్కోర్‌ను క్రాస్ చేయలేకపోవడంతో తొలి సారి రంజీ ఫైనల్‌కు చేరిన కేరళ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.VIDARBHA LIFTS THE RANJI TROPHY. 🏆- 3rd Ranji title in the last 7 years. 🔥pic.twitter.com/cKclAW94XJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2025విదర్భ రంజీల్లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. విదర్భ 2017-18, 2018-19 ఎడిషన్లలో వరుసగా రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. గత ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరిన విదర్భ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత సీజన్ ఫైనల్లో విదర్భ ముంబై చేతిలో ఓడింది.VIDARBHA HAS WON 3 RANJI TROPHY TITLES IN JUST 7 YEARS 🤯- New force of Indian Domestic Cricket. pic.twitter.com/grTjVqWxLd— Johns. (@CricCrazyJohns) March 2, 2025మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విదర్భ రెండు ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేయగా.. కేరళ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది.యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (86) సెంచరీకి చేరువలో రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా విదర్భ 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కేరళ ఇన్నింగ్స్‌లో ఆదిత్య సర్వటే (79), సచిన్ బేబి (98) సత్తా చాటగా.. అహ్మద్ ఇమ్రాన్ (37), మహ్మద్ అజాహరుద్దీన్ (34), సల్మాన్ నిజర్ (21), జలజ్ సక్సేనా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ (0), ఏడెన్ యాపిల్ టామ్ (10), నిధీశ్ (1) నిరాశపరిచారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, పార్థ్ రేఖడే, హర్ష్ దూబే తలో 3 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.సూపర్ సెంచరీతో మెరిసిన కరుణ్37 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ అయిన కరుణ్ నాయర్ ఈ ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో (135) మెరిశాడు. కరుణ్‌కు ఈ రంజీ సీజన్లో ఇది నాలుగో సెంచరీ. ఓవరాల్‌గా ఈ దేశవాలీ సీజన్లో 9వది. ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు సెంచరీలు చేశాడు.రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించిన మలేవార్తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దనిశ్ మలేవార్ (73) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ద సెంచరీతో రాణించాడు. ఐదో రోజు ఆట చివరి సెషన్లో దర్శన నల్కండే (51 నాటౌట్) కేరళ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కేరళ బౌలర్లలో ఆదిత్య సర్వటే 4 వికెట్లు తీయగా.. నిధీశ్, జలజ్, యాపిల్ టామ్, బాసిల్, అక్షయ్ చంద్రన్ తలో వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా హర్ష్ దూబేఈ రంజీ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు తీసిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబేకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీమెంట్ అవార్డు లభించింది. ఈ ప్రదర్శనతో హర్ష్ ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో హర్ష్ 7 ఐదు వికెట్ల ప్రదర్శనలు.. 3 నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన దనిశ్ మలేవార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
తొమ్మిది సెంచరీలు.. సిగ్గుతో తలదించుకోండి!.. వీడియో వైరల్
విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) మరోసారి శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఎలైట్ 2024-25 సీజన్ ఫైనల్లో భాగంగా కేరళపై సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా అతడు సెలబ్రేట్ చేసుకున్న విధానం నెటిజన్లను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భీకర ఫామ్‌లో ఉన్న ఆటగాడి పట్ల వివక్ష చూపిస్తున్న టీమిండియా సెలక్టర్లు సిగ్గుతో తలదించుకోవాలంటూ అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా దేశవాళీ క్రికెట్ తాజా ఎడిషన్‌లో ఫార్మాట్లకు అతీతంగా కరుణ్ నాయర్ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ(Vidarbha) కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం ఎనిమిది ఇన్నింగ్స్‌లోనే 779 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు శతకాలు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టులో కరుణ్ నాయర్‌కు స్థానం దక్కాలని భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడి అత్యద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు.ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న వాళ్లను జట్టులోకి తీసుకోలేమని వ్యాఖ్యానించాడు. అతడు ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుత జట్టులో చోటు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు.23వ శతకంఈ క్రమంలో నిరాశకు గురైనప్పటికీ కరుణ్ నాయర్ ఆ ప్రభావాన్ని తన ఆట మీద పడనీయలేదు. రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై శతకం(122) బాదిన అతడు.. తాజాగా ఫైనల్లోనూ సెంచరీతో మెరిశాడు. నాగ్‌పూర్ వేదికగా కేరళ జట్టుతో జరుగుతున్న తుదిపోరులో నాలుగో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 184 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి ఇది 23వ శతకం.సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!ఈ నేపథ్యంలో హెల్మెట్ తీసి బ్యాట్‌ను ఆకాశం వైపు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్న కరుణ్ నాయర్... ఆ తర్వాత బ్యాట్, హెల్మెట్‌ను కింద పెట్టేసి.. తన చేతి వేళ్లలో తొమ్మిదింటిని ఎత్తి చూపాడు. దేశీ తాజా సీజన్లో తాను తొమ్మిది సెంచరీలు సాధించానని.. ఇకనైనా టీమిండియాలో చోట ఇవ్వండి అన్నట్లుగా సెలక్టర్లకు సందేశం పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ ఇప్పటి వరకు కేవలం ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ సాయంతో 374 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో 46 రన్స్ చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. కేరళతో శనివారం నాటి ఆట ముగిసే సరికి కరుణ్ నాయర్ 280 బంతులు ఎదుర్కొని 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో రోజు ఆట పూర్తయ్యే సరికి కేరళ కంటే 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం 💯 for Karun Nair 👏A splendid knock on the big stage under pressure 💪It's his 9⃣th 1⃣0⃣0⃣ in all formats combined this season, and the celebration says it all👌🙌#RanjiTrophy | @IDFCFIRSTBank | #FinalScorecard ▶️ https://t.co/up5GVaflpp pic.twitter.com/9MvZSHKKMY— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2025 -
Ranji Trophy Final: చరిత్ర సృష్టించిన దూబే.. విదర్భకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
రంజీ క్రికెట్లో (Ranji Trohy) విదర్భ (Vidarbha) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే (Harsh Dubey) చరిత్ర సృష్టించాడు. ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు (69 వికెట్లు) తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బీహార్ బౌలర్ అషుతోష్ అమన్ పేరిట ఉండింది. అమన్ 2018-19 ఎడిషన్‌లో 68 వికెట్లు తీశాడు. ప్రస్తుత రంజీ ఎడిషన్ (2024-25) ఫైనల్లో (కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో) హర్ష్, అమన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఎడిషన్‌లో హర్ష్ 19 ఇన్నింగ్స్‌ల్లో 16 సగటున 69 వికెట్లు తీశాడు.రంజీ ట్రోఫీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..హర్ష్ దూబే (విదర్భ)- 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (2024-25)ఆషుతోష్ అమన్ (బీహార్)- 8 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు (2018-19)జయదేవ్ ఉనద్కత్ (సౌరాష్ట్ర)- 10 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు (2019-20)ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హర్ష్ సహా విదర్భ బౌలర్లు రాణించడంతో విదర్భ కేరళపై కీలకమైన తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో విదర్భ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్ నాయర్ (86) సహకరించాడు.విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్, కరుణ్ నాయర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటై, విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 37 పరుగులు వెనుకపడింది. కేరళ ఇన్నింగ్స్‌కు ఆదిత్య సర్వటే (79), కెప్టెన్ సచిన్ బేబి (98) జీవం పోశారు. వీరిద్దరూ అహ్మద్ ఇమ్రాన్ (37), సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజారుద్దీన్ (34), జలజ్ సక్సేనాతో (28) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఓ దశలో (సచిన్ క్రీజ్‌లో ఉండగా) కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేసేలా కనిపించింది. అయితే సచిన్ సెంచరీ ముందు అనవసర షాట్ ఆడి వ్యక్తిగతంగా నష్టపోవడంతో పాటు జట్టును కూడా ఇరకాటంలో పడేశాడు. సచిన్ ఔటయ్యాక కేరళ ఇన్నింగ్స్ ఒక్కసారిగా గతి తప్పింది. 18 పరుగుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది. పార్థ్ రేఖడే సచిన్ సహా జలజ్ సక్సేనా, ఏడెన్ యపిల్ టామ్ వికెట్లు తీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో హర్ష్ కూడా 3 వికెట్లు తీశాడు. కీలకమైన ఆదిత్య సర్వటే, సల్మాన్ నిజర్, ఎండీ నిధీశ్ వికెట్లు పడగొట్టాడు. నిధీశ్ వికెట్‌తో హర్ష్ ఓ సింగిల్ రంజీ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.కీలకమైన తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించి విదర్భ కేరళపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భనే విజేతగా నిలుస్తుంది. అలాగని కేరళకు దారులు మూసుకుపోలేదు. కేరళ విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసి, వారు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ జట్టు తమ తొలి రంజీ టైటిల్ కలను నెరవేర్చుకుంటుంది. ప్రస్తుతానికి కేరళపై విదర్భ ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. విదర్భ, కేరళ తమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది. విదర్భ గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో భంగపడి టైటిల్ ఆశలను చేజార్చుకుంది. ఈసారి ఆ జట్టు ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. కాగా, ఈ సీజన్లో విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది. -
అద్భుతమై ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. తృటిలో సెంచరీ మిస్
కేరళ, విదర్భ (Kerala Vs Vidarbha) జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ (Ranji Trophy Final) హోరాహోరీగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు ఇరు జట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో విదర్భ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్ నాయర్ (86) సహకరించాడు. అనంతరం బరిలోకి దిగిన కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సచిన్ బేబి (Sachin Baby) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేరళను తొలి ఇన్నింగ్స్ సాధించే దిశగా తీసుకెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 235 బంతులు ఎదుర్కొన్న సచిన్.. 10 బౌండరీల సాయంతో 98 పరుగులు చేశాడు. సచిన్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య సర్వటే (79) కేరళ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. సర్వటే.. అహ్మద్ ఇమ్రాన్ (37), సచిన్ బేబి సహకారంతో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అనంతరం సచిన్.. సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజహరుద్దీన్ (37), జలజ్ సక్సేనా (28 నాటౌట్) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.మూడో రోజు మూడో సెషన్ సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా, ఏడెన్ యాపిల్ టామ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేరళ ఇంకా 42 పరుగులు వెనుకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధిస్తే ఈ మ్యాచ్ డ్రా అయినా కేరళనే విజేతగా నిలుస్తుంది. కాబట్టి తొలి ఇన్నింగ్స్ లీడ్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి.ఇబ్బంది పెట్టిన నల్కండేఈ ఇన్నింగ్స్‌లో కేరళకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ను (0) దర్శన్ నల్కండే తెగ ఇబ్బంది పెట్టాడు. వీరిద్దరినీ నల్కండే 13 పరుగుల వ్యవధిలో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో నల్కండే ఈ రెండు వికెట్లతో పాటు మరో వికెట్ కూడా తీశాడు. సెమీఫైనల్లో సెంచరీ హీరో మహ్మద్ అజహరుద్దీన్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. విదర్భ బౌలర్లలో నల్కండేతో పాటు హర్ష్ దూబే (2), యశ్ ఠాకూర్ (1), పార్థ్ రేఖడే (1) వికెట్లు తీశారు.అంతకుముందు విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్, కరుణ్ నాయర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది. -
రంజీ ట్రోఫీ ఫైనల్.. విదర్భ భారీ స్కోర్.. పోరాడుతున్న కేరళ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్ ఫైనల్లో గతేడాది రన్నరప్ విదర్భ (Vidarbha), తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ (Kerala) తలపడుతున్నాయి. విదర్భలోని నాగ్‌పూర్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేరళ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (379) చేసింది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (86) అతనికి సహకరించాడు. దురదృష్టవశాత్తు కరుణ్ సెంచరీకి ముందు రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ (0) నిరాశపర్చగా.. ఆదిత్య సర్వటే (66 నాటౌట్), అహ్మద్ ఇమ్రాన్ (37) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసిన సర్వటే.. కెప్టెన్ సచిన్ బేబితో (7) కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 14 పరుగులకే ఇద్దరు కేరళ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపాడు. యశ్ ఠాకూర్ క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఇమ్రాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. కేరళ.. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 248 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. -
రంజీ ఫైనల్లో శతక్కొట్టిన యువ కెరటం
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్ ఫైనల్ (Ranji Final) మ్యాచ్ ఇవాళ (ఫిబ్రవరి 26) మొదలైంది. గతేడాది రన్నరప్ విదర్భ (Vidarbha).. తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళతో (Kerala) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బౌలింగ్ చేసిన కేరళకు ఆదిలోనే ఫలితం లభించింది. ఆ జట్టు బౌలర్ నిధీశ్ మ్యాచ్ రెండో బంతికే విదర్భ ఓపెనర్ పార్థ్ రేఖడేను (0) ఔట్ చేశాడు. అనంతరం నిధీశ్ ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు. 11 పరుగుల స్కోర్ వద్ద నిధీశ్ దర్శన్ నల్కండేను (1) పెవిలియన్‌కు పంపాడు. మరికొద్ది సేపటికే విదర్భ మూడో వికెట్ కోల్పోయింది. ఈసారి ఏడెన్ యాపిల్ టామ్ కేరళకు సక్సెస్ అందించాడు. టామ్.. విదర్భ స్టార్ బ్యాటర్ ధృవ్ షోరేను (16) ఔట్ చేశాడు. ఫలితంగా విదర్భ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.Danish Malewar in his last 13 innings 👏61, 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 104*(still batting)#RanjiTrophy2025pic.twitter.com/HmdjKiXaOm— CricTracker (@Cricketracker) February 26, 2025సెంచరీతో కదంతొక్కిన దనిశ్ మలేవార్ఈ దశలో 21 ఏళ్ల దనిశ్ మలేవార్ (Danish Malewar) సెంచరీతో కదంతొక్కి విదర్భను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. దనిశ్ 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. దనిశ్ తన సెంచరీ మార్కును సిక్సర్, బౌండరీతో అందుకున్నాడు. దనిశ్కు స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) సహకారం అందిస్తున్నాడు. కరుణ్ సైతం అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దనిశ్, కరుణ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 158 పరుగులు జోడించారు. 63 ఓవర్లు ముగిసే సరికి విదర్భ స్కోర్ 183/3గా ఉంది. దనిశ్ 116.. కరుణ్ 51 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.భీకర ఫామ్‌లో దనిశ్దనిశ్ ప్రస్తుత రంజీ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో దనిశ్ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 600 పైచిలుకు పరుగులు చేశాడు. ఫైనల్లో సెంచరీతో మెరిసిన దనిశ్.. క్వార్టర్ ఫైనల్, సెమీస్‌లో అర్ద సెంచరీలతో రాణించాడు. దనిశ్ ఇదే సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రతో జరిగిన అరంగ్రేటం మ్యాచ్‌లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వరుసగా 46, 42, 59, 115, 17, 13, 3, 75, 0, 79, 29, 118* పరుగులు స్కోర్ చేశాడు. -
రంజీ రారాజు ఎవరో?
నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి జరగనున్న 2024–25 రంజీ ట్రోఫీ సీజన్ ఫైనల్లో కేరళతో రెండుసార్లు చాంపియన్ విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది ఫైనల్లో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన విదర్భ జట్టు... ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పు చేజిక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి రంజీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు అద్భుతాన్ని ఆశిస్తోంది. తాజా సీజన్లో ఇరు జట్లు నిలకడైన ప్రదర్శన కనబర్చగా... అక్షయ్ వాడ్కర్ సారథ్యంలోని విదర్భ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఫైనల్ చేరే క్రమంలో విదర్భ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలుపొందిన విదర్భ... క్వార్టర్ ఫైనల్లో తమిళనాడును చిత్తు చేసింది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో జరిగిన సెమీఫైనల్లో విజృంభించిన విదర్భ... స్టార్లతో కూడిన ముంబైకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో నిరుడు ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో ఇది 90వ సీజన్ కాగా... విదర్భ జట్టుకిది నాలుగో ఫైనల్. గతంలో 2017–18, 2018–19 సీజన్లలో వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు... గతేడాది ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.అప్పటి నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో విదర్భ జట్టు నిలకడగా విజయాలు సాధిస్తోంది. ఈ సీజన్లో విజయ్ హజారే ట్రోఫీలో కూడా విదర్భ జట్టు ఫైనల్‌కు చేరింది. మరోవైపు తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించిన కేరళ సమష్టి కృషితోనే టైటిల్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. బ్యాటింగే బలంగా... తాజా సీజన్లో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసిన విదర్భ జట్టు... బ్యాటింగే ప్రధాన బలంగా ఫైనల్ బరిలోకి దిగనుంది. కెపె్టన్ అక్షయ్ వాడ్కర్, కరుణ్ నాయర్, అథర్వ తైడే, ధ్రువ్ షోరే, యశ్ రాథోడ్, దానిశ్ మాలేవర్‌తో విదర్భ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. 933 పరుగులు చేసిన యశ్ రాథోడ్ విదర్భ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. 5 సెంచరీలు, 3 అర్ధసెంచరీలతో విజృంభించిన యశ్... 58.13 సగటుతో ఈ పరుగులు రాబట్టడం విశేషం. సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో యశ్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్, కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు అతడు 48.14 సగటుతో 674 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అందులో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగుతున్న సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ 8 మ్యాచ్‌లాడి 45.85 సగటుతో 642 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉంది. దానిశ్ మాలేవర్ (557 పరుగులు), ధ్రువ్ షోరే (446 పరుగులు) కూడా రాణించారు. బ్యాటింగ్‌లో టాపార్డర్ సమష్టిగా కదంతొక్కుతుంటే... బౌలింగ్‌లో 22 ఏళ్ల హర్‡్ష దూబే సంచలన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు పడగొట్టిన హర్‡్ష... ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు అశుతోశ్ అమన్ (2018–19 సీజన్లో 68 వికెట్లు; బిహార్) పేరిట ఉంది. హర్‡్షతో పాటు దర్శన్ నల్కండే, నచికేత్ భూటె, పార్థ్ రెఖడే బౌలింగ్‌లో కీలకం కానున్నారు. ఈ బౌలింగ్ దాడిని కాచుకుంటూ పరుగులు రాబట్టాలంటే కేరళ జట్టు శక్తికి మించి పోరాడక తప్పదు. సమష్టి కృషితో... స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... సమష్టి ప్రదర్శనతోనే కేరళ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో 3 మ్యాచ్‌లు గెలిచి మరో రెండు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న సచిన్ బేబీ సారథ్యంలోని కేరళ జట్టు... రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది. అయితే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లో మాత్రం కేరళ అసాధారణ పోరాటం కనబర్చింది. జమ్మూకశ్మీర్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసిన కేరళ... సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో గట్టెక్కింది. మిడిలార్డర్ బ్యాటర్లు సల్మాన్ నిజార్, మొహమ్మద్ అజహరుద్దీన్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. నిజార్ 86.71 సగటుతో 607 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అజహరుద్దీన్ 75.12 సగటుతో 601 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 4 అర్ధశతకాలు ఉన్నాయి. క్వార్టర్స్‌లో, సెమీస్‌లో ఈ జంట అసమాన పోరాటం వల్లే కేరళ జట్టు తుదిపోరుకు అర్హత సాధించింది. గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లపై మానసికంగా పైచేయి సాధించడంలో అజహరుద్దీన్, నిజార్ది అందెవేసిన చేయి. వీరితో పాటు జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, రోహన్ కున్నుమ్మల్, అక్షయ్ చంద్రన్ కూడా కలిసికట్టుగా రాణిస్తే కేరళకు తిరుగుండదు. బౌలింగ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా తాజా సీజన్లో 38 వికెట్లు పడగొట్టాడు. ఆదిత్య సర్వతే (30 వికెట్లు) కూడా ఫామ్‌లో ఉన్నాడు. ని«దీశ్, బాసిల్ పేస్ బౌలింగ్ భారం మోయనున్నారు.విదర్భ ఫైనల్ చేరిందిలా... » ఆంధ్రపై 74 పరుగుల తేడాతో గెలుపు » పుదుచ్చేరిపై 120 పరుగుల తేడాతో విజయం » ఉత్తరాఖండ్‌పై 266 పరుగుల తేడాతో గెలుపు » హిమాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్88 పరుగులతో విజయం » గుజరాత్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » రాజస్తాన్‌పై 221 పరుగులతో గెలుపు » హైదరాబాద్‌పై 58 పరుగులతో విజయం » క్వార్టర్స్‌లో తమిళనాడుపై 198 పరుగులతో గెలుపు » సెమీస్‌లో ముంబైపై 80 పరుగులతో విజయం కేరళ ఫైనల్ చేరిందిలా... » పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం » కర్ణాటకతో మ్యాచ్ ‘డ్రా’ » బెంగాల్‌తో మ్యాచ్ ‘డ్రా’ » ఉత్తరప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 117 పరుగులతో గెలుపు » హరియాణాపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » మధ్యప్రదేశ్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » బీహార్‌పై ఇన్నింగ్స్ 169 పరుగులతో విజయం » క్వార్టర్స్‌లో జమ్ముకశ్మీర్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం » సెమీస్‌లో గుజరాత్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం -
ముంబైపై ప్రతీకారం తీర్చుకున్న విదర్భ.. వరుసగా రెండో సీజన్లో ఫైనల్లోకి ఎంట్రీ
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) చివరి అంకానికి చేరింది. ఈ సీజన్లో తొలి ఫైనల్ బెర్త్ అధికారికంగా ఖరారైంది. రెండో సెమీఫైనల్లో ముంబైని (Mumbai) ఓడించి విదర్భ (Vidarbha) వరుసగా రెండో సీజన్లో ఫైనల్‌కు చేరింది. గత సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ఈ సీజన్ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన సెమీ ఫైనల్లో ముంబైపై విదర్భ 80 పరుగుల తేడాతో గెలుపొందింది. విదర్భ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 325 పరుగులకు ఆలౌటైంది. హర్ష్ దూబే 5, యశ్ ఠాకూర్, పార్థ్ రేఖడే తలో రెండు వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ భారీ స్కోర్లు చేయలేదు.ముంబై ఓటమి ఖరారైన తర్వాత శార్దూల్ ఠాకూర్ (66) అర్ద సెంచరీ సాధించాడు. షమ్స్ ములానీ (46) సాయంతో శార్దూల్ ముంబైని గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. స్టార్ బ్యాటర్లు అజింక్య రహానే (12), శివమ్ దూబే (12), సూర్యకుమార్ యాదవ్ (23) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆకాశ్ ఆనంద్ 39 పరుగులకు ఔటయ్యాడు. యువ ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే (18), సిద్దేశ్ లాడ్ (2) నిరాశపరిచారు. ఆఖర్లో తనుశ్ కోటియన్ (26), మోహిత్ అవస్తి (26), రాయ్స్టన్ డయాస్ (23) కంటితడుపు చర్చగా బ్యాట్‌ను ఝులిపించారు.ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు.113 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. 292 పరుగులకు ఆలౌటై ముంబై ముందు కొండంత లక్షాన్ని ఉంచింది. యశ్ రాథోడ్ 151 పరుగులు చేసి విదర్భ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. యశ్‌కు కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహకరించాడు. వీరిద్దరి నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్‌లు రాకపోయుంటే విదర్భ ముంబై ముందు ఇంత భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయేది. విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ దెబ్బకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ములానీ ఆరు వికెట్లు తీశాడు. తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు. గుజరాత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ డ్రా దిశగా సాగుతున్నప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్ (2 పరుగులు) ఆధారంగా కేరళ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. రంజీల్లో కేరళ ఫైనల్‌కు చేరనుండటం ఇదే మొదటిసారి. ఈ సీజన్ ఫైనల్లో విదర్భ, కేరళ తలపడనున్నాయి. -
కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన రహానే
విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై జట్టు ఎదురీదుతుంది. 406 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే చివరి రోజు మరో 323 పరుగులు చేయాలి. చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. శివమ్ దూబే (12), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆకాశ్ ఆనంద్ (27) క్రీజ్‌లో ఉన్నారు. ఈ రంజీ సీజన్లో ముంబై ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అదే, విదర్భ ఫైనల్‌కు చేరాలంటే డ్రా చేసుకున్నా సరిపోతుంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది.కీలక ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన రహానేతప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే నిరాశపరిచాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే ఔటయ్యాడు. రహానే లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి వికెట్ కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ముంబై గెలవలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ముంబైకి ఒరిగేదేమీ లేదు. కాబట్టి చివరి రోజు ముంబై గెలుపు కోసమే ఆడాలి. ఆ జట్టు ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్‌లపై గంపెడాశలు పెట్టుకుంది. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చే సూర్యకుమార్ యాదవ్‌పై పెద్దగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. స్కై.. వేగంగా పరుగులు సాధించగలిగినా వికెట్ కాపాడుకుంటాడన్న గ్యారెంటీ లేదు. చివరి రోజు 90 ఓవర్ల ఆటకు ఆస్కారముంటుంది. దూబే, ఆకాశ్ ఆనంద్, సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే ముంబై సంచలన విజయం సాధించే అవకాశం ఉంటుంది.దూబే, ఆకాశ్ ఆనంద్, సూర్యకుమార్ తర్వాత కూడా ముంబై బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. షమ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ కూడా బ్యాటింగ్ చేయగల సమర్థులే. అయితే లక్ష్యం భారీగా ఉండటంతో వీరిపై అంచనాలు పెట్టుకోలేని పరిస్థితి ఉంది.అంతకుముందు విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేసి ముంబై ముందు కొండంత లక్షాన్ని ఉంచింది. యశ్ రాథోడ్ 151 పరుగులు చేసి విదర్భ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. యశ్‌కు కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహకరించాడు. వీరిద్దరి నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్‌లు రాకపోయుంటే విదర్భ ముంబై ముందు ఇంత భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయేది. విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ దెబ్బకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ములానీ ఆరు వికెట్లు తీశాడు. తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు.దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు. -
రంజీ సెమీ ఫైనల్.. శతక్కొట్టిన యశ్ రాథోడ్.. భారీ ఆధిక్యం దిశగా విదర్భ
ముంబైతో జరుగుతున్న రంజీ సెమీ ఫైనల్-2లో విదర్భ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 113 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం విదర్భ 340 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. యువ బ్యాటర్ యశ్ రాథోడ్ (110 నాటౌట్) ఈ సీజన్లో ఐదో సెంచరీతో కదంతొక్కి విదర్భను భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నాడు. యశ్ రాథోడ్‌కు జతగా దర్శన్ నల్కండే (4) క్రీజ్‌లో ఉన్నాడు.147/4 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ.. కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహా రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు జోడించింది. విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో అథర్వ్ తైడే 0, ధృవ్ షోరే 13, దనిశ్ మాలేవార్ 29, కరుణ్ నాయర్ 6, అక్షయ్ వాద్కర్ 52, హర్ష్ దూబే 1 పరుగు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 3, తనుశ్ కోటియన్ 2, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు. రంజీల్లో ముంబై 49వ సారి ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదంటే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో మరో ఒకటిన్నర రోజుల ఆట మిగిలి ఉంది. -
Semi Final: కష్టాల్లో ముంబై.. పట్టు బిగించిన విదర్భ
దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సెమీఫైన(Ranji Trophy Semi Final)ల్లో డిఫెండిగ్ చాంపియన్ ముంబై(Mumbai) జట్టు కష్టాల్లో పడింది. నాగ్‌పూర్ వేదికగా విదర్భ(Vidarbha)తో జరుగుతున్న పోరులో బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా... బౌలర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఆరంభంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినప్పటికీ... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారు. దీంతో కోలుకున్న విదర్భ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.యశ్ రాథోడ్ (101 బంతుల్లో 59 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (102 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అథర్వ తైడె (0), కరుణ్ నాయర్ (6), ధ్రువ్ షోరే (13), దానిశ్ (29) విఫలమవడంతో... ఒకదశలో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన మాజీ చాంపియన్ విదర్భ జట్టును యశ్ రాథోడ్, అక్షయ్ ఆదుకున్నారు. వీరిద్దరూ అజేయమైన ఐదో వికెట్‌కు 91 పరుగులు జోడించారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న విదర్భ జట్టు... ప్రస్తుతం ఓవరాల్‌గా 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 2... శార్దుల్ ఠాకూర్, తనుశ్ కొటియాన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/7తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 92 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (256 బంతుల్లో 106; 11 ఫోర్లు) విలువైన సెంచరీ చేశాడు. తనుశ్ కొటియాన్ (33; 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి సహకరించాడు. విదర్భ బౌలర్లలో పార్థ్ 4 వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 383ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (సి) అక్షయ్ (బి) నచికేత్ 106; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‡్ష దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బి) పార్థ్ 33; మోహిత్ (బి) హర్‡్ష దూబే 10; రాయ్స్టన్ డయస్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178, 8–247, 9–261, 10–270, బౌలింగ్: దర్శన్ 12–1–46–1; యశ్ ఠాకూర్ 16–0–73–2; హర్ష్ దూబే 25–3–68–2; నచికేత్ 9–2–25–1; పార్థ్ 30–9–55–4. విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 0; ధ్రువ్ షోరే (ఎల్బీడబ్ల్యూ) (బి) తనుశ్ 13; దానిశ్ (సి అండ్ బి) ములానీ 29; కరుణ్ నాయర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ములానీ 6; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 59; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 147. వికెట్ల పతనం: 1–0, 2–40, 3–52, 4–56, బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 6–2–14–1; మోహిత్ 2–0–13–0; షమ్స్ ములానీ 20–3–50–2; రాయ్స్టన్ డయస్ 7–4–11–0; తనుశ్ కొటియాన్ 14–1–33–1; శివమ్ దూబే 3–0–17–0; ఆయుశ్ 1–0–3–0.ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ కన్నుమూత ముంబై జట్టు మాజీ సారథి, మాజీ సెలెక్టర్ మిలింద్ రేగె (76) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. దేశవాళీల్లో ఆల్‌రౌండర్‌గా రాణించిన మిలింద్ కెరీర్లో 52 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1532 పరుగులు చేయడంతో పాటు 126 వికెట్లు పడగొట్టారు. 26 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురైన మిలింద్ ఆ తర్వాత తిరిగి కోలుకొని ముంబై రంజీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మిలింద్ మృతికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతాపం వ్యక్తం చేశాడు. మిలింద్ చిన్ననాటి మిత్రుడు సునీల్ గావస్కర్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సంతాపం వ్యక్తం చేశాయి. మిలింద్ మృతికి సంతాపంగా విదర్భతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ప్లేయర్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. -
Ranji Semis-2: ముంబై ఎదురీత.. రెండో రోజూ విదర్భదే ఆధిపత్యం
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీలో ముంబై మేటి చాంపియన్ జట్టు. దేశవాళీ టోర్నీలో ఏకంగా 48 సార్లు ఫైనల్ చేరి 42 సార్లు విజేతగా నిలిచిన ఈ జట్టుకు ఈసారి సెమీఫైనల్లో విదర్భ నుంచి కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయి. తొలి రోజు బ్యాటింగ్‌లో సత్తా చాటుకున్న విదర్భ... రెండో రోజు బౌలింగ్‌తో ముంబైని ముప్పుతిప్పలు పెట్టింది. ఫలితంగా డిఫెండింగ్ చాంపియన్ ఎదురీదుతోంది. ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 308/5తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ 107.5 ఓవర్లలో 383 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లలో యశ్ రాథోడ్ (54; 7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకొని వెనుదిరిగాడు. కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ (34; 4 ఫోర్లు) కాసేపు కుదురుగా ఆడాడు. హర్ష్ దూబే (18; 3 ఫోర్లు), నచికేత్ (11; 2 ఫోర్లు), దర్శన్ నల్కండే (12; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు. రెండో రోజు 3 వికెట్లు పడగొట్టిన శివమ్ దూబేకు మొత్తం 5 వికెట్లు దక్కాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (171 బంతుల్లో 67 బ్యాటింగ్; 6 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. శార్దుల్ ఠాకూర్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్), సిద్దేశ్ లాడ్ (35; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఫాలోఆన్ గండాన్ని తప్పించుకున్న ముంబై జట్టు విదర్భ స్కోరుకు ఇంకా 195 పరుగులు వెనుకబడి ఉంది. ముంబై ఒక దశలో 113/2 స్కోరు వద్ద పటిష్టంగా ఉంది. కేవలం రెండో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతున్న పార్థ్ రెఖాడే తన స్పిన్ మాయాజాలంతో ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. అనుభవజ్ఞుడైన భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత ముంబై సారథి అజింక్య రహానే (18; 4 ఫోర్లు) సహా టీమిండియా హార్డ్‌హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0)లను అసలు ఖాతానే తెరువనీయలేదు. ఒకే ఒక్క ఓవర్లో ఈ ముగ్గురినీ పార్థ్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేసిన పార్థ్ తొలి బంతికి రహానేను, మూడు, ఐదో బంతులకు సూర్య, దూబేలను బోల్తా కొట్టించాడు. ఇది చాలదన్నట్లు మరుసటి ఓవర్లోనే (42వ) హర్ష్ దూబే... షమ్స్ ములానీ (4) అవుట్ కావడంతో ముంబై 113/2 నుంచి 10 బంతుల వ్యవధిలోనే 118/6 స్కోరుతో కుదేలైంది. ఆనంద్, శార్దుల్ మెరుగ్గా ఆడటంతో ముంబై కోలుకుంది. ప్రస్తుతం ఆనంద్‌తో పాటు తనుశ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ 4; ధ్రువ్ షోరే (సి) రహానే (బి) ములానీ 74; పార్థ్ రెఖాడే (సి) సూర్యకుమార్ (బి) దూబే 23; దానిశ్ (సి) ఆనంద్ (బి) ములానీ 79; కరుణ్ నాయర్ (సి) ఆనంద్ (బి) దూబే 45; యశ్ రాథోడ్ (సి అండ్ బి) శార్దుల్ 54; అక్షయ్ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ 34; హర్‡్ష దూబే (సి) ఆనంద్ (బి) శివమ్ దూబే 18; నచికేత్ (సి) ములానీ (బి) శివమ్ దూబే 11; దర్శన్ (నాటౌట్) 12; యశ్ ఠాకూర్ (సి)అవస్థి (బి) శివమ్ దూబే 3; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (107.5 ఓవర్లలో ఆలౌట్) 383. వికెట్ల పతనం: 1–39, 2–93, 3–144, 4–222, 5–261, 6–324, 7–346, 8–364, 9–369, 10–383. బౌలింగ్: శార్దుల్ 19–0–78–1, మోహిత్ 14–2–61–0, రాయ్స్టన్ డయస్ 18–5–48–2, తనుశ్ 22–0–78–0, శివమ్ దూబే 11.5–1–49–5, షమ్స్ ములానీ 23–4–62–2. ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (బ్యాటింగ్) 67; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్ష్ దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (59 బంతుల్లో 7 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178. బౌలింగ్: దర్శన్ నల్కండే 10–1–40–1, యశ్ ఠాకూర్ 11–0–56–2, హర్‡్ష దూబే 15–1–51–1, నచికేత్ 7–1–22–0, పార్థ్ రెఖాడే 16–6–16–3. -
ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. సూర్యకుమార్ యాదవ్, శివం దూబే డకౌట్
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై స్టార్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. విదర్భతో పోరులో కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane)తో పాటు టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), శివం దూబే(Shivam Dube) చేతులెత్తేశారు. ఫలితంగా ముంబై జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్ 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రహానే సేన సెమీస్ చేరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సెమీ ఫైనల్-2లో భాగంగా విదర్భ జట్టుతో తలపడుతోంది. నాగ్‌పూర్ వేదికగా.. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభంలోనే ఓపెనర్ అథర్వ టైడే(4) వికెట్ కోల్పోయిన విదర్భను మరో ఓపెనర్ ధ్రువ్ షోరే అర్ధ శతకం(74)తో ఆదుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్పిన్ బౌలర్ పార్థ్ రేఖడే(Parth Rekhade) కూడా 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.383 పరుగులుఇక మిడిలార్డర్లో ప్రతి ఒక్కరు రాణించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగలిగింది. డానిష్ మాలేవార్(79), కరుణ్ నాయర్(45), యశ్ రాథోడ్(54) మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ 34, హర్ష్ దూబే 18, నచికేత్ భూటే 11, దర్శన్ నాల్కండే 12*, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేశారు.ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే ఐదు వికెట్లతో చెలరేగగా.. రాయ్స్టన్ దాస్, షామ్స్ ములానీ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అదే విధంగా.. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విదర్భ మొదటి ఇన్నింగ్స్ 383 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలవగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై మాత్రం కష్టాలపాలైంది.పార్థ్ రేఖడే విజృంభణఓపెనర్ ఆయుశ్ మాత్రే తొమ్మిది పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ ఆకాశ్ ఆనంద్(171 బంతుల్లో 67 నాటౌట్ ) పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. సిద్దేశ్ లాడ్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ అజింక్య రహానే 18 పరుగులకే నిష్క్రమించాడు. ఇక టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్, శివం దూబే మరీ దారుణంగా డకౌట్ అయ్యారు.ఈ ముగ్గురిని విదర్భ బౌలర్ పార్థ్ రేఖడే ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపడం విశేషం. ముంబై ఇన్నింగ్స్‌లో 41వ ఓవర్ వేసిర పార్థ్.. తొలి బంతికే రహానేను బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పార్థ్ బౌలింగ్‌లో డానిష్ మాలేవర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం శివం దూబే వికెట్‌ను కూడా పార్థ్ దక్కించుకున్నాడు. కాగా సూర్య, దూబేలకు తొలుత డాట్ బాల్ వేసిన పార్థ్ ఆ మరుసటి బంతికే వాళ్లిద్దరిని అవుట్ చేయడం విశేషం.ఇక ఆ తర్వాత కూడా విదర్భ బౌలర్ల విజృంభణ కొనసాగింది. షామ్స్ ములానీ(4)ని హర్ష్ దూబే వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. వేగంగా ఆడుతున్న శార్దూల్ ఠాకూర్(41 బంతుల్లో 37)ను యశ్ ఠాకూర్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ క్రమంలో మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ముంబై 59 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి.. విదర్భ కంటే 195 పరుగులు వెనుకబడి ఉంది. ఆకాశ్ ఆనంద్ 67, తనుశ్ కొటియాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే మూడు వికెట్లు కూల్చగా.. యశ్ ఠాకూర్‌కు రెండు, దర్శన్ నల్కండే, హర్ష్ దూబేలకు ఒక్కో వికెట్ దక్కాయి.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ Suryakumar Yadav 360° batting today pic.twitter.com/SZoVId69lE— Abhi (@79off201) February 18, 2025 -
శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు
భారత స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dube) రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో (Ranji Semi Finals) చెలరేగిపోయాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో దూబే (ముంబై) ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. తరుచూ బ్యాట్‌తో సత్తా చాటే దూబే ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగాడు. దూబే ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది.ఓవర్‌నైట్ స్కోర్ 308/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ మరో 75 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో 2 వికెట్లు తీసిన దూబే.. రెండో రోజు చెలరేగిపోయి మరో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో దూబే.. పార్థ్ రేఖడే, కీలకమైన కరుణ్ నాయర్, హర్ష్ దూబే, భూటే, యశ్ ఠాకూర్ వికెట్లు తీశాడు. ముంబై బౌలర్లలో షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో దనిశ్ మలేవార్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ (7), సిద్దేశ్ లాడ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. 4.4 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ 18/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 365 పరుగులు వెనుకపడి ఉంది.మరో సెమీఫైనల్లో గుజరాత్, కేరళ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కేరళ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. రెండో రోజు తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.మొహమ్మద్ అజహారుద్దీన్ (85), సల్మాన్ నిజర్ (28) క్రీజ్‌లో ఉన్నారు. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69) అర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, జలజ్ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్ నయనార్ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. -
Ranji Trophy Semis-2 Day 1: రాణించిన విదర్భ బ్యాటర్లు
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఘనాపాఠి జట్టయిన ముంబైకి రెండో సెమీఫైనల్లో తొలిరోజే విదర్భ బ్యాటర్లు గట్టి సవాల్ విసిరారు. ముంబై బౌలర్లు సగం (5) వికెట్లు పడగొట్టినప్పటికీ ఒకే రోజు విదర్భ 300 పైచిలుకు స్కోరు చేసింది. టాపార్డర్‌లో ధ్రువ్ షోరే (109 బంతుల్లో 74; 9 ఫోర్లు), మిడిలార్డర్లో దానిశ్ మాలేవర్ (157 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (70 బంతుల్లో 45; 6 ఫోర్లు), యశ్ రాథోడ్ (86 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) సమష్టిగా కదంతొక్కారు. టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగిన విదర్భకు మంచి ఆరంభమైతే దక్కలేదు.అథర్వ (4) వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ ధ్రువ్ షోరే, పార్థ్ రేఖడే (23; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వన్డేలాగే ఆడిన ధ్రువ్ 67 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వందకు సమీపించింది. ఈ దశలో 93 పరుగుల వద్ద పార్థ్‌ను శివమ్ దూబే అవుట్ చేశాడు. దానిష్ క్రీజులోకి రాగా... తొలి సెషన్లోనే జట్టుస్కోరు వంద దాటింది. ధ్రువ్, దానిశ్ విదర్భ ఇన్నింగ్స్‌లో మరో 50 పైచిలుకు భాగస్వామ్యాన్ని జోడించింది.జట్టు స్కోరు 144 పరుగుల వద్ద ధ్రువ్ షోరేను షమ్స్ ములానీ పెవిలియన్ చేర్చడంతో మూడో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చి కరుణ్ నాయర్, యశ్ రాథోడ్‌లు కూడా ముంబై బౌలర్లను చక్కగా ఎదుర్కోవడంతో భారీస్కోరుకు బాట పడింది. ఆట నిలిచే సమయానికి యశ్, కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరు కలిసి అబేధ్యమైన ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, షమ్స్ ములానీ చెరో 2 వికెట్లు తీశారు.స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ డయస్ 4; ధ్రువ్ షోరే (సి) రహానే (బి) ములానీ 74; పార్థ్ రేఖడే (సి) సూర్యకుమార్ (బి) దూబే 23; దానిశ్ (సి) ఆనంద్ (బి) ములానీ 79; కరుణ్ నాయర్ (సి) ఆనంద్ (బి) దూబే 45; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 47; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 13; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (88 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 308. వికెట్ల పతనం: 1–39, 2–93, 3–144, 4–222, 5–261. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 14–0–57–0, మోహిత్ 14–2–61–0, రాయ్స్టన్ డయస్ 11–2–26–1, తనుశ్ కొటియాన్ 22–0–78–0, శివమ్ దూబే 9–1–35–2, షమ్స్ ములానీ 18–3–44–2. -
మళ్లీ శతక్కొట్టిన కరుణ్ నాయర్.. ఈసారి..!
దేశవాలీ క్రికెట్లో విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో (VHT) ఆకాశమే హద్దుగా చెలరేగిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ (Ranji Trophy) అదే స్థాయిలో రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేసిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై బాధ్యతాయుతమైన సెంచరీతో (122) మెరిశాడు.ఈ మ్యాచ్‌లో కరుణ్ శతక్కొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 353 పరుగులకు ఆలౌటైంది. జట్టు కష్టాల్లో (44/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన కరుణ్.. దనిశ్ మలేవార్ (75), హర్ష్ దూబేతో (69) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో ఈ ముగ్గురూ మినహా ఎవరూ రాణించలేదు. అథర్వ తైడే 0, ధృవ్ షోరే 26, ఆధిత్య థాకరే 5, యశ్ రాథోడ్ 13, అక్షయ్ వాద్కర్ 24, భూటే 2, యశ్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ 2, అజిత్ రామ్, మొహమ్మద్ అలీ ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు మూడో రోజు తొలి సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ప్రదోశ్ రంజన్పాల్ (51), సోనూ యాదవ్ (24) క్రీజ్‌లో ఉన్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ అలీ 4, ఎన్ జగదీశన్ 22, సాయి సుదర్శన్ 7, భూపతి కుమార్ 0, విజయ్ శంకర్ 22, ఆండ్రీ సిద్దార్థ్ 65, సాయికిషోర్ 7, మొహమ్మద్ 1 పరుగు చేసి ఔటయ్యారు. విదర్భ బౌలర్లలో ఆధిత్య ఠాకరే 4 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ 2, నిచికేత్ భూటే, హర్ష్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 133 పరుగులు వెనుకపడి ఉంది.గతేడాది మొత్తం కొనసాగిన కరుణ్ హవాకరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గత సీజన్ రంజీ సీజన్లోనూ రెచ్చిపోయి ఆడాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ చెలరేగి ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఫామ్ పతాకస్థాయికి చేరింది. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్‌రేట్‌తో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేశాడు. -
చాంపియన్ కర్ణాటక
వడోదర: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన కర్ణాటక... తుది పోరులోనూ భారీ స్కోరు చేసి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఐదోసారి ఫైనల్‌కు చేరిన కర్ణాటక ఐదు సార్లూ టైటిల్ సొంతం చేసుకోవడం మరో విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో విదర్భను చిత్తుచేసింది. ఈ సీజన్లో పరుగుల వరద పారించిన విదర్భ సారథి కరుణ్ నాయర్ (31 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఆఖరి పోరులో ఎక్కువసేపు నిలవకపోవడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. రవిచంద్రన్ స్మరణ్ (92 బంతుల్లో 101; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... క్రిష్ణన్ శ్రీజిత్ (74 బంతుల్లో 78; 9 ఫోర్లు, ఒక సిక్స్), అభినవ్ మనోహర్ (42 బంతుల్లో 79; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో విజృంభించారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32; 5 ఫోర్లు), టీమిండియా ఆటగాడు దేవదత్ పడిక్కల్ (8), అనీశ్ (21) విఫలమయ్యారు. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో శ్రీజిత్‌తో కలిసి స్మరణ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ జంట నాలుగో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఇక చివర్లో అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కర్ణాటక భారీ స్కోరు చేయగలిగింది. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, నచికేత్ భూటె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విదర్భ జట్టు 48.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ధ్రువ్ షోరే (111 బంతుల్లో 110; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో పోరాడగా... హర్ష్ దూబే (30 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లోనూ సెంచరీలు చేసిన ధ్రువ్ షోరే తుది పోరులోనూ అదే జోరు కొనసాగించగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. కెపె్టన్ కరుణ్ నాయర్, యశ్ రాథోడ్ (22), యష్ కదమ్ (15); జితేశ్ శర్మ (34), శుభమ్ దూబే (8), అపూర్వ వాంఖడే (12) విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌషీక్, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాశ్ శెట్టి తలా 3 వికెట్లు పడగొట్టారు. సెంచరీతో చెలరేగిన కర్ణాటక బ్యాటర్ స్మరణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తాజా టోర్నిలో 389.5 సగటుతో 779 పరుగులు చేసి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన కరుణ్ నాయర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు లభించింది. -
కనికరం లేని కరుణ్ నాయర్.. విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ
వడోదర: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ జట్టు తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిన విదర్భ తుది పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో విదర్భ 69 పరుగుల తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశ్ రాథోడ్ (101 బంతుల్లో 116; 14 ఫోర్లు, 1 సిక్స్), ధ్రువ్ షోరే (120 బంతుల్లో 114; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 34.4 ఓవర్లలో 224 పరుగులు జోడించారు. అనంతరం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరుణ్ నాయర్ (44 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరో దూకుడైన ఇన్నింగ్స్‌తో చెలరేగగా... జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. 40 ఓవర్లు ముగిసేసరికి విదర్భ స్కోరు 254 కాగా... చివరి 10 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 126 పరుగులు సాధించింది! ముఖ్యంగా ముకేశ్ వేసిన 47వ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ కొట్టిన కరుణ్ నాయర్... రజనీశ్ గుర్బానీ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 4, 0, 6, 4, 4, 6 బాదాడు. ఒకదశలో 35 బంతుల్లో 51 వద్ద ఉన్న కరుణ్ తర్వాతి 9 బంతుల్లో 37 పరుగులు రాబట్టాడు. అనంతరం మహారాష్ట్ర కొంత పోరాడగలిగినా చివరకు ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో మహారాష్ట్ర 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. అర్షిన్ కులకర్ణి (101 బంతుల్లో 90; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకోగా... అంకిత్ బావ్నే (49 బంతుల్లో 50; 5 ఫోర్లు), నిఖిల్ నాయక్ (26 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. దర్శన్ నల్కండే, నచికేత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కర్ణాటక జట్టు ఇప్పటికే నాలుగుసార్లు విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. ఈ నాలుగు సందర్భాల్లోనూ కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఫైనల్లో ప్రత్యర్థి జట్టు విదర్భ కెప్టెన్‌గా తన పాత జట్టుపై సమరానికి సిద్ధమయ్యాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 1 అర్ధ సెంచరీతో ఏకంగా 752 పరుగులు సాధించిన నాయర్ తన టీమ్‌ను విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరం! -
మరోసారి రెచ్చిపోయిన కరుణ్ నాయర్.. ఈసారి..!
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో రికార్డు స్థాయిలో 752 సగటున 752 పరుగులు (112*, 44*, 163*, 111*, 112, 122*, 88*) చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ అర్ద సెంచరీ ఉన్నాయి. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ కేవలం ఒక్క సారి మాత్రమే ఔటయ్యాడు.పేట్రేగిపోయిన కరుణ్మహారాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరుణ్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్.ఓపెనర్ల శతకాలుఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర టాస్ గెలిచి విదర్భను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మహారాష్ట్ర ప్రత్యర్దిని బ్యాటింగ్ ఆహ్వానించి ఎంత తప్పు చేసిందో కొద్ది సేపటికే గ్రహించింది. విదర్భ ఓపెనర్లు మహారాష్ట్ర బౌలర్లను నింపాదిగా ఎదుర్కొంటూ సెంచరీలు చేశారు. దృవ్ షోరే 120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు.. యశ్ రాథోడ్ 101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 116 పరుగులు చేశారు. దృవ్, యశ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించారు. యశ్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఆదిలో నిదానంగా బ్యాటింగ్ చేశాడు.45 ఓవర్ తర్వాత కరుణ్.. జితేశ్ శర్మతో కలిసి గేర్ మార్చాడు. వీరిద్దరూ చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 97 పరుగులు పిండుకున్నారు. జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక కరుణ్ మహోగ్రరూపం దాల్చాడు. తానెదుర్కొన్న చివరి 9 బంతుల్లో కరుణ్ 4 సిక్సర్లు, 3 బౌండరీలు బాదాడు. అంతకుముందు కరుణ్ 47వ ఓవర్లోనూ చెలరేగి ఆడాడు. ముకేశ్ చౌదరీ వేసిన ఈ ఓవర్లో కరుణ్ మూడు బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు. మొత్తానికి విదర్భ బ్యాటర్ల ధాటికి మహారాష్ట్ర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముకేశ్ చౌదరీ 9 ఓవర్లు వేసి ఏకంగా 80 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు పడగొట్టాడు. సత్యజిత్ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి వికెట్ తీసుకున్నాడు. -
విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో ముంబై విదర్భపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ తైడే (66), వాంఖడే (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శుభమ్ దూబే (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.THE SIX HITTING MACHINE - SHIVAM DUBE 🥶 pic.twitter.com/Qy2uhlXKBp— Johns. (@CricCrazyJohns) December 11, 2024అనంతరం బరిలోకి దిగిన ముంబై.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. ఆఖర్లో శివమ్ దూబే (22 బంతుల్లో 37 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), సూర్యాంశ్ షేడ్గే (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృస్టించారు. MUMBAI INTO SEMIS OF SMAT...!!!Suryansh Shedge with another masterclass. 🙇♂️👌 pic.twitter.com/6FxuxENHc4— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2024ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో శివమ్ దూబే, సూర్యాంశ్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై విజయానికి షా, రహానే బీజం వేసినప్పటికీ.. మధ్యలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.సూపర్ ఫామ్‌లో రహానేఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 52, 68, 22, 95, 84 పరుగులు స్కోర్ చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రహానే కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. -
SMAT 2024: ముంబైతో క్వార్టర్ ఫైనల్.. భారీ స్కోర్ చేసిన విదర్భ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇవాళ (డిసెంబర్ 11) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్వార్టర్ ఫైనల్-3లో సౌరాష్ట్రపై మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందగా.. క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్‌పై బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆలుర్ వేదికగా ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్-4 మ్యాచ్ జరుగుతుంది. ముంబైతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విదర్భ తొలుత బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బరిలోకి దిగిన విదర్భ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అథర్వ తైడే (66), అపూర్వ్ వాంఖడే (51) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. శుభమ్ దూబే (43 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ కరుణ్ నాయర్ 26, పార్థ్ రేఖడే 1, కెప్టెన్ జితేశ్ శర్మ 11, మందార్ మహలే 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శుభమ్ దూబే, మందార్ మహలే కలిసి 24 పరుగులు పిండుకున్నారు. మొహిత్ అవస్తి వేసిన ఈ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ బౌండరీ వచ్చాయి. అంతకుముందు 19వ ఓవర్లోనూ 16 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను సూర్యాంశ్ షెడ్గే వేశాడు. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే, అథర్వ అంకోలేకర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తనుశ్ కోటియన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రాంతాలవారీగా వివరాలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి 231 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అదేవిధంగా మునుపెన్నడూలేని విధంగా బీజేపీ రాష్ట్రంలో 133 స్థానాల్లో జెండాపాతి రికార్డును సృష్టించగా, శివసేన (శిందే) 57 స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 41 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మూడు పార్టీలు కలిపి కనీసం హాఫ్ సెంచరీని కూడా దాటలేకపోయాయి. కాంగ్రెస్ 15, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం సాధించగా, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు మరో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు. ముఖ్యంగా ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా ఇలా దాదాపు అన్ని రీజియన్లలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మహాయుతి కూటమి సత్తాచాటింది . ముంబైలో... ముంబైలోని 36 స్థానాల్లో బీజేపీ, శివసేన (శిందే), 6, ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి అత్యధికంగా 22 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి 12 స్థానాలకు పరిమితమైంది. పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 15, శివసేన 6, ఎన్సీపీ (ఏపీ) ఒక స్థానాన్ని గెలుచుకోగా కాంగ్రెస్ 3, శివసేన (యూబీటీ) 9 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచి మాహీం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే పరాజయం పాలయ్యారు. అయితే వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) నుంచి బరిలో దిగి ఆదిత్య ఠాక్రే మాత్రం తన ప్రత్యర్థి మిలింద్ దేవ్‌రాపై విజయం సాధించి రెండోసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.మరఠ్వాడాలో... మరఠ్వాడాలో ఎనిమిది జిల్లాలుండగా మొత్తం 46 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 19, శివసేన (శిందే) 12, ఎన్సీపీ (ఏపీ) ఎనిమిది, మరోవైపు కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) మూడు, ఎన్సీపీ (ఎస్పీ) రెండు స్థానాలను దక్కించుకున్నాయి. విదర్భలో... విదర్భలోని 11 జిల్లాల్లో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో మహాయుతి కూటమి 47 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించగా శివసేన (శిందే) నాలుగు, ఎన్సీపీ (ఏపీ) ఆరు స్థానాల్లో గెలిచాయి. కాగా ఎంవీయే కూటమి మొత్తం 13 స్థానాల్లో గెలుపు సాధించగా, కాంగ్రెస్ తొమ్మిది, శివసేన (యూబీటీ) నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. ఉత్తర మహారాష్ట్రలో... ఉత్తర మహారాష్ట్రలో అయిదు జిల్లాలో మొత్తం 47 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇక్కడ అత్యధికంగా మహాయుతి కూటమి 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరోవైపు మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. ఇక పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 20, శివసేన (శిందే) 11, ఎన్సీపీ (ఏపీ) 11, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. చదవండి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు దిగ్గజాల ఓటమిపశ్చిమ మహారాష్ట్రలో... పశ్చిమ మహారాష్ట్రలోని అయిదు జిల్లాల్లో మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మహాయుతి కూటమి 42 స్థానాలను గెలుచుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 24, శివసేన (శిందే) ఏడు, ఎన్సీపీ (ఏపీ) 11 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ఎంవీయే కూటమి 10 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) రెండు, ఎన్సీపీ (ఎస్పీ) ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. కొంకణ్‌లో.. కొంకణ్ రీజియన్ అయిదు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల్లో మహాయుతి ఏకంగా 35 స్థానాలను కైవసం చేసుకోగా మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 16, శివసేన (శిందే), 16, ఎన్సీపీ (ఏపీ) మూడు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) ఒక్కోస్థానం గెలుచుకున్నాయి.లాడ్కీబహీణ్తో గణనీయంగా మహిళల ఓటింగ్..ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే మహాయుతి గెలుపునకు బాట వేశాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి లాడ్కీ బహీణ్ యోజన వీటన్నిటికీ తలమానికంగా నిలిచింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల నేతృత్వంలోని బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి ప్రభుత్వం ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 1500 ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్దిపొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మహిళల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని, వీరంతా మహయుతివైపు మొగ్గుచూపడం కూడా మహాయుతి విజయంలో ప్రధానపాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, రైతులకు రుణమాఫీ ఇలా అన్ని వర్గాల కోసం ఏదో ఒక పథకం అమలు చేయడం ద్వారా మహాయుతి ప్రభుత్వం అందరినీ ఆకట్టుకోగలిగిందని భావిస్తున్నారు. చెప్పవచ్చు. దీంతోనే ఈ సంక్షేమ పథకాలే మహాయుతి విజయానికి బాట వేశాయి. -
విదర్భ సీట్ల విషయంలో కుదరని సయోధ్య ..
-
సీట్ల పంపకం.. కాంగ్రెస్, శివసేన(యూబీటీ)లో విభేదాలు!
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదర్భలోని సీట్ల విషయంలో కాంగ్రెస్, మిత్రపక్షం శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. విదర్భలో శివసేన (యూబీటీ) 17 సీట్లను కోరుతోంది. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపించటం లేదు. విదర్భలో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసోంది. ఇక.. ముంబై, నాసిక్‌లలో సీట్ల విషయంలో ఇప్పటికే ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.విదర్భలో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 288 మంది సభ్యుల అసెంబ్లీలో విదర్భ 22 శాతం స్థానాలకు ప్రాతినిధ్యం విశేషం. ఇక్కడ మెజారిటీని సాధించటం అన్ని పార్టీలకు చాలా కీలకం. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విదర్భలోని 10 లోక్‌సభ స్థానాలకు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఏడింటిలో విజయం సాధించింది. కాంగ్రెస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇక.. అధికా కూటమిలోని బీజేపీ సైతం రెండు స్థానాలు గెలుచుకుంది.అయితే.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 62 సీట్లలో కనీసం 8 సీట్లను కోరుతోంది. విదర్భలో కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉందనటంలో ఎటువంటి సందేహం లేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే తమకు కూడా 4-5 మంది ఎంపీలు కూడా ఉన్నారని గుర్తు చేశారు.మరోవైపు.. మహా వికాస్ అఘాడిలో కూటమి నుంచి సేన (యూబీటీ) చీలిక సృష్టిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. గత వారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే సీట్ల పంపకానికి సహకరించడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయితే ఇరు పార్టీల మధ్య విభేదాల వార్తలను కాంగ్రెస్ ఖండించింది. బీజేపీనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించింది.మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌కు చెందిన విజయ్ వాడెట్టివార్ మాట్లాడుతూ.. ‘‘ ఎంవీఏలో 17 సీట్లపై చర్చలు ఇంకా పెండింగ్‌లో ఉంది. కొన్ని సీట్లపై మాకు థాక్రే వర్గంతో వివాదం ఉంది. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. సీట్ల పంపకం విషయంలో కూడా మూడు పార్టీలు సమయం తీసుకుంటాయి’ అని అన్నారు. ఇక.. అక్టోబర్ 22న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందని తెలుస్తోంది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.చదవండి: కుటుంబ నియంత్రణలో దక్షిణాది సక్సెస్ -
VIDAR Vs AP: నిరాశపరిచిన కేఎస్ భరత్.. ఆంధ్ర జట్టు ఓటమి
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీ సీజన్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ఆరంభించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్ ‘బి’ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.కాగా 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 79/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఒకదశలో ఒక వికెట్ నష్టానికి 177 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఓపెనర్ అభిషేక్ రెడ్డి (78; 5 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (74; 7 ఫోర్లు) 12 పరుగుల వ్యవధిలో అవుటవ్వడంతో ఆంధ్ర జట్టు పతనం మొదలైంది.శశికాంత్ కాస్త పోరాడినావీరిద్దరు పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన ఇతర బ్యాటర్లెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కెప్టెన్ రికీ భుయ్ (26; 1 ఫోర్, 1 సిక్స్), శశికాంత్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడినా... కేఎస్ భరత్ (2), అశ్విన్ హెబర్ (3) నిరాశపరిచారు. విజయ్ (0), లలిత్ మోహన్ (0), సత్యనారాయణ రాజు (0) డకౌట్ అయ్యారు.చివరి వికెట్‌గా శశికాంత్ వెనుదిరిగాడు. విదర్భ జట్టు బౌలర్లు ఆదిత్య థాకరే (4/47), హర్ష్ దూబే (4/69), అక్షయ్ వాఖరే (2/71) ఆంధ్ర జట్టు పతనాన్ని శాసించారు. ఈ గెలుపుతో విదర్భ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. ఈనెల 18 నుంచి జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ జట్టుతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి: సజ్జన్ జిందాల్‌తో గడ్కరీ
కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) నాగ్‌పూర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదర్భలో పెట్టుబడులు పెట్టవలసిన అవసరాన్ని గురించి వివరించారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లేకపోవడం వల్ల రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులు లేకపోవడాన్ని పేర్కొన్నారు.జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియాలో 35 శాతం వాటాను కలిగి ఉన్న 'సజ్జన్ జిందాల్' ఇటీవల తన నివాసాన్ని సందర్శించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని తాను చెప్పినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ వైరల్వ్యాపారాలకు ప్రభుత్వ రాయితీల సమస్యను ప్రస్తావిస్తూ, పారిశ్రామికవేత్తలు కూడా కొంత ఓపికతో ఉండాలని గడ్కరీ చెప్పారు. లడ్కీ బహిన్ యోజన కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉన్నందున.. పెట్టుబడిదారులు తమ సబ్సిడీ చెల్లింపును అందుకోవడానికి కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంటుందని అన్నారు. కాబట్టి విదర్భలోని వ్యాపారులు, తమ వ్యాపారాలను స్వతంత్రంగా చేసుకోవాలని, ప్రభుత్వాల మీదే పూర్తిగా ఆధారపడకూడదని సలహా ఇచ్చారు. -
పార్టీలకు ప్రతిష్టాత్మకంగా విదర్భ!
మహారాష్ట్రలోని విదర్భ లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత రెండు ఎన్నికల్లో విదర్భ ఓటర్లు బీజేపీ, శివసేన జంటకు తమ మద్దతు పలికారు. తూర్పు విదర్భలో బీజేపీ, పశ్చిమాన శివసేన గట్టి పట్టు సాధించాయి. అయితే 1960 నుంచి 2009 వరకు విదర్భ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనప్పుడు విదర్భ ప్రజలు ఇందిరా గాంధీకి మద్దతుగా నిలిచారు. విదర్భ అనేది తూర్పు మహారాష్ట్రలోని 11 జిల్లాలు కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో 10 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాగ్‌పూర్, రామ్‌టెక్, చంద్రాపూర్, గోండియా భండారా గడ్చిరోలి స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. రెండో దశలో ఏప్రిల్ 26న అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్ వాషిం, బుల్దానా స్థానాలకు పోలింగ్ జరగనుంది. శివసేనకు చెందిన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే, ఎన్‌సిపికి చెందిన శరద్ పవార్, కాంగ్రెస్‌కు చెందిన మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి, అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్ వర్గం) మహాకూటమి మధ్య అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉంది. హైవే మ్యాన్‌గా బిరుదు పొందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడోసారి నాగ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. నాగ్‌పూర్ సౌత్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వికాస్ ఠాక్రేను పోటీకి దింపడం ద్వారా కాంగ్రెస్.. బీజేపీకి గట్టి పోటీనిస్తుండగా, గడ్కరీ హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం విదర్భ పరిధిలోని నాగ్‌పూర్‌లో ఉంది. పొరుగున ఉన్న వార్ధా నియోజకవర్గం మహాత్మా గాంధీ జన్మస్థలం. రైతు ఆత్మహత్యలకు నెలవైన విదర్భలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన సమస్యలు ఉన్నాయి. 64 సంవత్సరాల క్రితం విదర్భ ప్రాంతం నాగ్‌పూర్ ఒప్పందం కింద మహారాష్ట్రలో విలీనమైంది. మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే విదర్భలోని మొత్తం 62 సీట్లలో, బీజెపీ 29, అవిభక్త శివసేన 4, ఎన్సీపీ 6, కాంగ్రెస్ 15 ఇతరులు 8 సీట్లు గెలుచుకున్నారు. 2014లో విదర్భలో బీజేపీ 44 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. -
‘రంజీ’ రారాజు ముంబై... ఆటగాళ్లపై కోట్లాభిషేకం
విదర్భ ఇన్నింగ్స్‌లో 135వ ఓవర్... అప్పటికే 9 వికెట్లు పడ్డాయి... కెరీర్లో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ముంబై పేసర్ ధవల్ కులకర్ణి ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లే వేశాడు... ఒక్కసారిగా ధవల్ చేతికి కెప్టెన్ రహానే బంతిని అందించాడు... మూడో బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్‌బౌల్డ్... ముంబై శిబిరంలో సంబరాలు షురూ... వెరసి దేశవాళీ క్రికెట్ దిగ్గజం ఖాతాలో మరో రంజీ ట్రోఫీ చేరింది. ముంబై జట్టు ఏకంగా 42వ సారి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టీమ్ ఖాతాలో మరో కప్ చేరగా... ధవల్ ఐదో రంజీ విజయంలో భాగంగా నిలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలికాడు. ముంబై: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని ముంబై జట్టు సొంతం చేసుకుంది. గురువారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో రెండుసార్లు చాంపియన్ విదర్భపై ఘన విజయం సాధించింది. విదర్భ చివరి రోజు వరకు పోరాడినా అసాధ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఆట కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (199 బంతుల్లో 102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా... హర్‡్ష దూబే (128 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. అక్షయ్, హర్‡్ష చాలాసేపు ముంబై బౌలర్లకు లొంగకుండా ఇబ్బంది పెట్టారు. అయితే ఎట్టకేలకు తనుష్ బౌలింగ్‌లో అక్షయ్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై గెలుపు బాట పట్టింది. మిగిలిన నాలుగు వికెట్లను 15 పరుగుల వ్యవధిలోనే తీసి ముంబై చాంపియన్‌గా అవతరించింది. సెంచరీ సాధించడంతో పాటు 2 వికెట్లు తీసిన ముషీర్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతనికి రూ. 50 వేలు ప్రైజ్‌మనీ దక్కింది. టోర్నీ మొత్తంలో 502 పరుగులు, 29 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన ముంబై ఆటగాడు తనుష్ కొటియన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. తనుష్ కు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. 1934–35 సీజన్లో తొలిసారి విజేతగా నిలిచిన ముంబై (బాంబే) జట్టు ఈ టైటిల్‌కు ముందు 2015–16 సీజన్లో చివరిసారి ట్రోఫీని అందుకుంది. ఆటగాళ్లపై కోట్లాభిషేకం... ప్రైజ్‌మనీలో ముంబై డబుల్ ధమాకా కొట్టింది. సీజన్ విజేతకు బీసీసీఐ రూ. 5 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వగా... ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెటర్లకు ప్రత్యేకంగా రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. దీంతో తాజా రంజీ విజేతకు వచ్చిన ప్రైజ్‌మనీ రెట్టింపైంది. ‘ఈ సీజన్లో మా జట్లు బాగా ఆడాయి. బీసీసీఐ నిర్వహించిన వయో విభాగాల టోర్నీలన్నింటిలోనూ ఫైనల్ చేరాయి. దీంతో ఎంసీఏ ప్రోత్సాహకంగా రూ. 5 కోట్ల బహుమతి ఇస్తోంది’ అని కార్యదర్శి అజింక్య నాయక్ తెలిపారు. -
రంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌గా ముంబై.. 42వ సారి
రంజీ ట్రోఫీ 2023-24 విజేతగా ముంబై నిలిచింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు ముంబై చిత్తు చేసింది. తద్వారా 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముంబై తమ ఖాతాలో వేసుకుంది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బ్యాటర్లలో కెప్టెన్ ఆక్షయ్ వాద్కర్(102), కరుణ్ నాయర్(74) పరుగులతో పోరాడనప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ముంబై బౌలర్లలో తనీష్ కొటియన్ 4 వికెట్లతో చెలరేగగా.. తుషార్ దేశ్ పాండే,ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ధావల్ కులకర్ణి, సామ్స్ ములానీ చెరో వికెట్ సాధించారు. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లో అదరగొట్టిన ముషీర్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అదేవిధంగా సీజన్ అసాంతం బౌలింగ్ ప్రదర్శనతో అకట్టుకున్న తనీష్ కొటియన్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం విధర్బ సైతం తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై బౌలర్ల దాటికి విదర్బ కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో కులకర్ణి, ములానీ, కొటియన్ తలా మూడు వికెట్లతో విధర్బను దెబ్బతీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విధర్బ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించలేక విధర్బ చతికిలపడింది. -
ముంబైకు టైటిల్ లాంఛనమే!
ముంబై: అత్యద్భుతం జరిగితే తప్పించి... ముంబై జట్టు 42వసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలవడం లాంఛనం కానుంది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విదర్భ జట్టు బ్యాటర్లు బుధవారం పట్టుదలతో ఆడారు. ముంబై బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు సాధించింది. విదర్భ విజయం సాధిచాలంటే మ్యాచ్ చివరిరోజు మరో 290 పరుగులు సాధించాలి. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై జట్టును విజేతగా ప్రకటిస్తారు. నాలుగో రోజు ఆటలో విదర్భ బ్యాటర్లు కరుణ్ నాయర్ (220 బంతుల్లో 74; 3 ఫోర్లు), కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ (91 బంతుల్లో 56 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అంతకుముందు అథర్వ తైడె (64 బంతుల్లో 32; 4 ఫోర్లు), ధ్రువ్ షోరే (50 బంతుల్లో 28; 4 ఫోర్లు), అమన్ మోఖాడె (78 బంతుల్లో 32; 2 ఫోర్లు) కూడా ముంబై బౌలర్లకు అంత తొందరగా వికెట్ సమరి్పంచుకోకుండా క్రీజులో సాధ్యమైనంత ఎక్కువసేపు ఉండేందుకు ప్రయత్నించారు. విదర్భ కోల్పోయిన ఐదు వికెట్లు ముంబై స్పిన్నర్లకే లభించడం గమనార్హం. -
రాణించిన రహానే, ముషీర్ ఖాన్.. టైటిల్ దిశగా ముంబై
రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై టీమ్ గెలుపు దిశగా సాగుతుంది. విదర్భతో జరుగుతున్న తుది సమరంలో ఆ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి, 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ముషీర్ ఖాన్ (51), కెప్టెన్ అజింక్య రహానే (58) అర్దసెంచరీలతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నారు. 119 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 34 పరుగులకే ఓపెనర్లు పృథ్వీ షా (11), భూపేన్ లాల్వాని (18) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ముషీర్ ఖాన్, రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును సేఫ్ జోన్లోకి చేర్చారు. వీరు మూడో వికెట్‌కు అజేయమైన 107 పరుగులు జోడించి ముంబైను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత ముంబై కెప్టెన్ రహానే ఫామ్‌లోకి వచ్చాడు. కీలకమైన ఫైనల్లో రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ అద్భుతమైన బంతితో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. లాల్వాని వికెట్ హర్ష్ దూబేకు దక్కింది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే కుప్పకూలింది. దవళ్ కులకర్ణి (3/15), షమ్స్ ములానీ (3/32), తనుశ్ కోటియన్ (3/7) విదర్భను దారుణంగా దెబ్బకొట్టారు. విదర్భ ఇన్నింగ్స్‌లో అథర్వ తైడే (23), యశ్ రాథోడ్ (27), ఆదిత్య థాకరే (19), యశ్ ఠాకూర్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. విదర్భ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆ జట్టు 224 పరుగులకే పరిమితమైంది. యశ్ ఠాకూర్ 3, హర్ష్ దూబే 3, ఉమేశ్ యాదవ్ 2, ఆదిత్య థాకరే ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ (75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబైకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో పాటు ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పటిష్టంగా ఉండటంతో ఆ జట్టునే విజయం వరించవచ్చు. ముంబై ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యపడని రీతిలో 41 రంజీ టైటిళ్లు సాధించింది. -
Ranji Trophy 2024: ముంబై 224 ఆలౌట్
ముంబై: విదర్భ జట్టుతో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పృథ్వీ షా (46; 5 ఫోర్లు), భూపేన్ లాల్వాని (37; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. భూపేన్ అవుటయ్యాక ముంబై పతనం మొదలైంది. ముంబై 111/6తో ఇబ్బందుల్లో పడిన దశలో శార్దుల్ ఠాకూర్ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. విదర్భ బౌలర్లలో హర్‡్ష దూబే, యశ్ ఠాకూర్ 3 వికెట్ల చొప్పున తీయగా... ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. -
మరోసారి రెచ్చిపోయిన శార్దూల్ ఠాకూర్
టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ రంజీల్లో చెలరేగిపోతున్నాడు. ఇటీవల తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో మెరుపు శతకం (104 బంతుల్లో 109) బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్.. ప్రస్తుతం విదర్భతో జరుగుతున్న ఫైనల్లో విధ్వంసకర అర్దసెంచరీ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. Century in the semi-final& a brilliant 75 when the team was struggling at 111-6 in finalLORD @imShard show in #RanjiTrophy2024 🔥pic.twitter.com/U1vjWvk9Ws— CricTracker (@Cricketracker) March 10, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. విదర్భ బౌలర్లు రెచ్చిపోవడంతో 224 పరుగులకే పరిమితమైంది. హర్ష్ దూబే (3/62), యశ్ ఠాకూర్ (3/54), ఉమేశ్ యాదవ్ (2/43), ఆదిత్య థకారే (1/36) ముంబై పతనాన్ని శాశించారు. ముంబై ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లాల్వాని (37) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది. ముషీర్ ఖాన్ (6), అజింక్య రహానే (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్దిక్ తామోర్ (5), షమ్స్ ములానీ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. భీకరఫామ్‌లో ఉన్న 10, 11వ ఆటగాళ్లు తనుశ్ కోటియన్ (8), తుషార్ దేశ్‌పాండే (14) ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. బ్యాటింగ్‌లో రాణించిన శార్దూల్.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భను శార్దూల్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. శార్దూల్ విదర్భ ఓపెనర్, ఇన్ ఫామ్ బ్యాటర్ దృవ్ షోరేను డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. నాలుగు ఓవర్ల అనంతరం విదర్భ స్కోర్ వికెట్ నష్టానికి నాలుగు పరుగులుగా ఉంది. -
ముంబై X విదర్భ
ప్రతిష్టాత్మక దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ఈ తుది సమరంలో 41 సార్లు చాంపియన్ ముంబై, 2 సార్లు విజేత విదర్భతో తలపడనుంది. ఉ.గం.9.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్షప్రసారం -
రసవత్తరంగా సాగుతున్న రంజీ సెమీఫైనల్
మధ్యప్రదేశ్, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్-1 రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి లక్ష్యానికి 93 పరుగుల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విదర్భ గెలవాలంటే మరో నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాల్సి ఉంది. సరాన్ష్ జైన్ (16), కుమార్ కార్తికేయ (0) క్రీజ్‌లో ఉన్నారు. మరో రోజు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం రావడం గ్యారెంటీ. మరి మధ్యప్రదేశ్ 93 పరుగులు సాధించి విజయం సాధిస్తుందో లేక విదర్భ 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. ఒకవేళ ఊహించని అద్భుతం ఏదైనా జరిగి మ్యాచ్ డ్రా అయితే మాత్రం తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా మధ్యప్రదేశ్ పైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 252 పరుగులు చేసింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకున్న విదర్భ 402 పరుగులు చేసి మధ్యప్రదేశ్ ముందు ఛాలెంజింగ్ లక్ష్యాన్ని ఉంచింది. సెమీఫైనల్-2లో తమిళనాడుపై విజయం సాధించి ముంబై జట్టు ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. రాణించిన దూబే, హర్ష్.. యశ్ దూబే (94), హర్ష్ గావ్లి (67) అర్దసెంచరీలతో రాణించడంతో మధ్యప్రదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి గెలుపు కోసం పోరాడుతుంది. విదర్భ బౌలర్లలో అక్షయ్ 3, ఆదిత్య సర్వటే 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన యశ్ రాథోడ్.. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే పరిమితమైన విదర్భ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని 402 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (141) అద్భుత శతకం సాధించి, విదర్భను తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చాడు. యశ్‌తో పాటు కెప్టెన్ అక్షయ్ (77), అమన్ (59) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 252 (హిమాన్షు మంత్రి 126, ఉమేశ్ యాదవ్ 3/40) విదర్భ తొలి ఇన్నింగ్స్ 170 (కరుణ్ నాయర్ 63, ఆవేశ్ ఖాన్ 4/49) -
యశ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్.. 261 పరుగుల ఆధిక్యంలో విదర్భ
రంజీ ట్రోఫీ 2024 తొలి సెమీఫైనల్లో విదర్భ జట్టు 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఎంపీ టీమ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (97 నాటౌట్).. కెప్టెన్ అక్షయ్ వాద్కర్‌తో (77) కలిసి బాధ్యతాయుతమై ఇన్నింగ్స్ ఆడి విదర్భకు ఆధిక్యతను అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలిన విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని మధ్యప్రదేశ్‌పై పైచేయి సాధించింది. యశ్, అక్షయ్‌తో పాటు అయన్ మోఖడే (59) అర్దసెంచరీతో రాణించగా.. దృవ్ షోరే (40), కరుణ్ నాయర్ (38) పర్వాలేదనిపించారు. యశ్‌తో పాటు ఆదిత్య సర్వటే (14) క్రీజ్‌లో ఉన్నాడు. ఎంపీ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, కేజ్రోలియా చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో మంత్రి మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. విదర్భ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, యశ్ ఠాకూర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. వాఖరే 2, సర్వటే ఓ వికెట్ దక్కించుకున్నారు. దీనికి ముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఆవేశ్ ఖాన్ (4/49), కేజ్రోలియా (2/38), వెంకటేశ్ అయ్యర్ (2/28), అనుభవ్ అగర్వాల్ (1/42), కుమార్ కార్తికేయ (1/2) విదర్భ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. విదర్భ ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (63) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కాగా, మరో సెమీఫైనల్లో తమిళనాడును మట్టికరిపించి ముంబై ఫైనల్‌కు చేరింది. -
శార్దూల్, హిమాన్షు శతకాలు.. ముంబై, మధ్యప్రదేశ్ పైచేయి
రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్స్‌లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు పైచేయి సాధించాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈ రెండు జట్లు.. తమతమ ప్రత్యర్దుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ముంబై తమిళనాడుపై.. మధ్యప్రదేశ్ విదర్భపై ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. హిమాన్షు సూపర్ సెంచరీ.. నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఈ జట్టు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. అథర్వ తైడే (2) ఔట్ కాగా.. దృవ్ షోరే (10), అక్షయ్ వాఖరే (1) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. హిమాన్షు మినహా మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. ఉమేశ్ యాదవ్ (3/40), యశ్ ఠాకూర్ (3/51), వాఖరే (2/68), సర్వటే (1/48) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. దీనికి ముందు ఆవేశ్ ఖాన్ (4/49) విజృంభించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శతక్కొట్టిన శార్దూల్.. ముంబై వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ముంబై ఆధిక్యత ప్రదర్శిస్తుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ (109) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 10, 11 స్థానాల్లో వచ్చి సెంచరీలతో (క్వార్టర్ ఫైనల్స్‌లో) సంచలనం సృష్టించిన తనుశ్ కోటీయన్ (74), తుషార్ దేశ్ పాండే (17) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ముంబై 207 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. సాయికిషోర్ ఆరేసి (6/97) ముంబైను దెబ్బకొట్టాడు. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
Ranji Trophy 2024: కర్ణాటకకు షాకిచ్చిన విదర్భ.. సెమీస్‌కు ముంబై
భారత దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీ చివరి దశకు చేరింది. ఈ సీజన్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, విదర్భ, ముంబై జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సౌరాష్ట్రను ఓడించి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్‌పై నెగ్గి మధ్యప్రదేశ్.. కర్ణాటకను చితు చేసి విదర్భ సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. బరోడాపై తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ముంబై ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. కర్ణాటకకు షాకిచ్చిన విదర్భ.. విదర్భ తొలి ఇన్నింగ్స్ 460 (అథర్వ్ తైడే 109, కావేరప్ప 4/99) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 286 (నికిన్ జోస్ 82, యశ్ ఠాకూర్ 3/48) విదర్భ రెండో ఇన్నింగ్స్ 196 (దృవ్ షోరే 57, కావేరప్ప 6/61) కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 243 (మయాంక్ అగర్వాల్ 70, హర్ష్ దూబే 4/65) 127 పరుగుల తేడాతో గెలుపొందిన విదర్భ డ్రాగా ముగిసిన బరోడా-ముంబై మ్యాచ్.. ముంబై తొలి ఇన్నింగ్స్ 384 (ముషీర్ ఖాన్ 203 నాటౌట్, భార్గవ్ భట్ 7/112) బరోడా తొలి ఇన్నింగ్స్ 348 (విక్రమ్ సోలంకి 136, షమ్స్ ములానీ 4/121) ముంబై రెండో ఇన్నింగ్స్ 569 (తుషార్ దేశ్‌పాండే 123, భార్గవ్ భట్ 7/200) బరోడా రెండో ఇన్నింగ్స్ 121/3 (ప్రియాన్షు్ మోలియా 54, తనుశ్ కోటియన్ 2/16) తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్ ఆధారంగా సెమీస్‌కు చేరిన ముంబై ఏడేళ్ల తర్వాత సెమీస్‌కు చేరిన తమిళనాడు.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 183 (హార్విక్ దేశాయ్ 83, సాయికిషోర్ 5/66) తమిళనాడు తొలి ఇన్నింగ్స్ 338 (బాబా ఇంద్రజిత్ 80, చిరాగ్ జానీ 3/22) సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్ 122 (పుజారా 46, సాయికిషోర్ 4/27) ఇన్నింగ్స్ 33 పరుగుల తేడాతో తమిళనాడు విజయం ఉత్కంఠ పోరులో నాలుగు పరుగుల తేడాతో ఓడిన ఆంధ్ర.. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 234 యశ్ దూబే 64, శశికాంత్ 4/37) ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 172 (కరణ్ షిండే 38, అనుభవ్ అగార్వల్ 3/33) మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్ 107 (హిమాన్షు మంత్రి 43, నితీశ్ రెడ్డి 4/28) ఆంధ్ర రెండో ఇన్నింగ్స్ 165 (హనుమ విహారి 55, అనుభవ్ అగర్వాల్ 6/52) 4 పరుగుల తేడాతో గెలుపొందిన మధ్య ప్రదేశ్ సెమీస్ మ్యాచ్‌లు ఇలా.. మార్చి 2-6: విదర్భ వర్సెస్ మధ్యప్రదేశ్ (1st semi final) మార్చి 2-6: ముంబై వర్సెస్ తమిళనాడు (2nd semi final) -
హైదరాబాద్ జట్టుకు మూడో విజయం
జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ఖాతాలో మూడో విజయం చేరింది. విదర్భ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ వీజేడీ పద్ధతిలో 30 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (98 బంతుల్లో 102 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించగా... ధ్రువ్ షోరే (83; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ, నితిన్‌సాయి యాదవ్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 29 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు సాధించింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. వీజేడీ పద్ధతి ఆధారంగా హైదరాబాద్ విజయసమీకరణాన్ని లెక్కించగా హైదరాబాద్ 30 పరుగులు ఎక్కువే చేసింది. దాంతో హైదరాబాద్‌ను విజేతగా ప్రకటించారు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (77 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీలు సాధించారు. హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మంగళవారం మేఘాలయ జట్టుతో ఆడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. -
రుణ పరిష్కార బాటలో విదర్భ
న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికలో ఉన్న విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్(వీఐపీఎల్) సలహాదారుగా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంపిక చేసుకుంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన వీఐపీఎల్ రుణ పరిష్కారానికి వీలుగా ఎస్బీఐ క్యాప్స్ బిడ్స్‌ను ఆహా్వనించనుంది. తద్వారా కంపెనీకిగల రూ. 2,000 కోట్ల రుణాల విక్రయం లేదా వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను చేపట్టనుంది. స్విస్ చాలెంజ్ విధానంలో రుణదాతలకు రుణాల గరిష్ట రికవరీకి ఎస్బీఐ క్యాప్స్ కృషి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెపె్టంబర్ 30లోగా రుణ పరిష్కార ప్రణాళికలను ముగించవలసి ఉంది. కాగా.. ఈ ప్రాసెస్(వీఐపీఎల్ రుణాలు, ఓటీఎస్) నిర్వహణను 2023 జూన్ 8న ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి పూర్తిచేయవలసి ఉంటుంది. అయితే రుణాలు, ఓటీఎస్‌కు సంబంధించి వీఐపీఎల్ రుణదాతలకు ఇప్పటికే మూడు సువో మోటో బిడ్స్ దాఖలుకాగా.. కంపెనీ తాజాగా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంచుకోవడం గమనార్హం! -
సీకే నాయుడు ట్రోఫీ విజేత ముంబై
అహ్మదాబాద్: బీసీసీఐ దేశవాళీ అండర్–25 టోర్నీ (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ)ను ముంబై సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై 75 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు చేయగా విదర్భ 385 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. 197 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విదర్భ 121 పరుగులకే ఆలౌటైంది. ట్రోఫీని అందుకుంటున్న ముంబై కెప్టెన్ హార్దిక్ తమోరే -
ఆఖరి ఓవర్లో అద్భుతం.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు
Darshan Nalkande Pics 4 Wkts In Four Consecutive Balls.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా శనివారం ఒక అద్భుత ఘటన జరిగింది. విదర్భ, కర్ణాటక మధ్య జరిగిన సెమీఫైనల్లో మ్యాచ్‌లో విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అందులోనూ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. చదవండి: Syed Mustaq Ali T20: ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని ఫైనల్‌కు ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన దర్శన్ నల్కండే.. తొలి బంతికి అనిరుద్ద జోషిని వెనక్కిపంపాడు. తర్వాత వరుస బంతుల్లో శరత్ బీఆర్, జగదీష్ సుచిత్‌లు పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక చివరగా నాలుగో బంతికి ఇన్ఫాం బ్యాటర్ అభినవ్ మనోహర్‌ను ఔట్ చేసి నాలుగో వికెట్ సాధించాడు. ఈ నలుగురిలో అభివన్ మనోహర్ వికెట్ పెద్దది. దీంతో దర్శన నల్కండే అద్భుత ప్రదర్శనపై ట్విటర్లో ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక చేతిలో విదర్భ పరాజయం పాలైంది. ఇక ఫైనల్ చేరిన కర్ణాటక నవంబర్ 22న తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్ స్మిత్! pic.twitter.com/hAios7nHR0 — Simran (@CowCorner9) November 20, 2021 -
ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని ఫైనల్‌కు
Karnataka Enters Final Beat Vidarbha By 4 Runs.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఓటమి నుంచి తృటిలో తప్పించుకున్న కర్ణాటక ఫైనల్లో ప్రవేశించింది. విదర్భతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 4 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన సెమీస్‌లో విదర్భ గెలుపు ముంగిట బోల్తా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కదమ్(56 బంతుల్లో 87 పరుగులు, 7 సిక్సర్లు, 4 ఫోర్లు) కదం తొక్కడం.. కెప్టెన్ మనీష్ పాండే 54 పరుగులతో సహకరించాడు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు రికార్డు స్థాయిలో 132 పరుగులు జోడించారు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ 27 మినహా మిగతావరు పూర్తిగా విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే 4, లలిత్ యాదవ్ 2, యష్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. చదవండి: Syed Mustaq Ali T20: హైదరాబాద్ ఘోర ఓటమి.. ఫైనల్లో తమిళనాడు అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ ఇన్నింగ్స్‌లో పెద్దగా స్కోర్లు నమోదు కానప్పటికి బ్యాట్స్‌మన్ తలో చెయ్యి వేశారు. అథర్వ తైడే 32, గణేష్ సతీష్ 31 పరుగులు చేశారు. కర్ణాటక బౌలింగ్‌లో కెసి కరియప్ప 2, విద్యాదర్ పాటిల్, దర్శన్ ఎంబి, జగదీష్ సుచిత్, కరుణ్ నాయర్ తలా ఒక వికెట్ తీశారు. ఫైనల్లో ప్రవేశించిన కర్ణాటక.. తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంది. ఇక 2019 సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ జరగింది. అప్పుడు తమిళనాడుపై గెలిచి కర్ణాటక ట్రోఫీని అందుకుంది. చదవండి: Shaheen Afridi: సిక్స్ కొట్టాడని కసితీరా కొట్టాడు.. క్షమాపణ ఎందుకు షాహిన్? -
Akshay Karnewar: 4–4–0–2.. అక్షయ్ కర్నేవార్ అరుదైన రికార్డు
Karnewar first player in T20 to concede zero runs after bowling full quota: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్లో విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్ చరిత్ర పుటలకెక్కే బౌలింగ్ ప్రదర్శన చేశాడు. మణిపూర్‌తో జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో అక్షయ్ 4–4–0–2తో పరుగు ఇవ్వకుండా ప్రతాపం చూపాడు. మొత్తం టి20 క్రికెట్ చరిత్రలోనే ఇది రికార్డు! దీంతో విదర్భ జట్టు 167 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. మొదట విదర్భ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత మణిపూర్ 16.3 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. చదవండి: Virat Kohli: అందరికీ థాంక్స్.. ఆరోజే గనుక వస్తే క్రికెట్ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం The Perfect T20 Spell from Akshay Karnewar, India's First Ambidextrous Bowler 4 overs, All Maiden against Manipur 4-4-0-2 for Vidarbha in #MushtaqAliT20 pic.twitter.com/xjJqSMUCR7 — HashTag Cricket ♞ (@TheYorkerBall) November 8, 2021 -
అటు తిలక్... ఇటు భుయ్
సూరత్: విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ 113 పరుగుల తేడాతో త్రిపురపై ఘన విజయం సాధించింది. హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (145 బంతుల్లో 156; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా, తన్మయ్ అగర్వాల్ (100 బంతుల్లో 86; 9 ఫోర్లు) రాణించాడు. అనంతరం త్రిపుర 42 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. సీవీ మిలింద్ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇండోర్: ఆంధ్ర 3 వికెట్లతో పటిష్టమై న విదర్భను ఓడించింది. విదర్భ 50 ఓవర్లలో 6 వికెట్లకు 331 పరుగులు చేసింది. యష్ (113 బంతుల్లో 117; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫైజ్ ఫజల్ (105 బంతుల్లో 100; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. అనంతరం ఆంధ్ర 49.2 ఓవర్లలో 7 వికె ట్లకు 332 పరుగులు సాధించింది. రికీ భుయ్ (78 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫో ర్లు, 6 సిక్స ర్లు) అజేయ శతకం బాదగా, కెప్టెన్ హనుమ విహారి (67 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. -
భరత్, రికీ భుయ్ సెంచరీలు
మూలపాడు (విజయవాడ): వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (208 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (209 బంతుల్లో 100 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలతో పోరాడారు. ఫలితంగా డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు విదర్భకు మూడు పాయింట్లు లభించగా... ఆంధ్ర జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 100/2తో చివరి రోజు గురువారం ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 103.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసి 84 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఫలితం తేలదనే కారణంతో మరో 23.2 ఓవర్లు మిగిలి ఉండగానే ఇరు జట్ల సారథులు ‘డ్రా’కు అంగీకరించారు. 130 పరుగులు వెనుకబడి... కనీసం ‘డ్రా’తో గట్టెక్కాలంటే రోజు మొత్తం బ్యాటింగ్ చేయాల్సిన చోట ఆంధ్ర అద్భుతం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 19 పరుగులు జోడించిన జ్ఞానేశ్వర్ (61) అర్ధ శతకం అనంతరం అవుట్ అయ్యాడు. ఈ సమయంలో రికీ భుయ్‌కి జత కలిసిన శ్రీకర్ భరత్ జట్టును ఆదుకున్నాడు. ఎంతో ఓపికను ప్రదర్శించిన ఈ జోడీ క్రీజులో పాతుకుపోయింది. ఇదే క్రమంలో ఇద్దరూ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 186 పరుగుల జోడించారు. చివరి రోజు 66.4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన విదర్భ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా డబుల్ సెంచరీ హీరో గణేశ్ సతీశ్ నిలిచాడు. ఆంధ్ర జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను ఒంగోలులో ఈ నెల 17 నుంచి ఢిల్లీతో ఆడుతుంది. హైదరాబాద్ ఓటమి మరోవైపు హైదరాబాద్ జట్టు రంజీ సీజన్‌ను ఓటమితో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్లతో తేడాతో ఓడింది. చివరి రోజు ఆటను 239/6తో మొదలు పెట్టిన ఆతిథ్య జట్టు 90.1 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ప్రత్యరి్థకి 187 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ 36.4 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసి గెలిచింది. ప్రియాంక్ పాంచల్ (90; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా... భార్గవ్ మెరాయ్ (69 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), ధ్రువ్ (23 నాటౌట్, , 2 ఫోర్లు) మిగతా పనిని పూర్తి చేశారు. -
ఆంధ్ర 211 ఆలౌట్
మూలపాడు (విజయవాడ): రంజీ ట్రోఫీ సీజన్లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. తొలి రోజు 74 ఓవర్లు ఆడి 211 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హనుమ విహారి (155 బంతుల్లో 83; 12 ఫోర్లు, సిక్స్) ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లు ఆడిన విదర్భ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో ఫజల్ (11 బ్యాటింగ్), సంజయ్ రఘునాథ్ (22 బ్యాటింగ్) ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టుకు ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (8), ప్రశాంత్ కుమార్ (10) శుభారంభం అందించడంలో విఫలం అయ్యారు. అనంతరం వచ్చిన రికీ భుయ్ (9) కూడా పెవిలియన్‌కు చేరడంతో ఆంధ్ర 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ విహారి, వైస్ కెప్టెన్ కేఎస్ భరత్ (53 బంతుల్లో 22; 4 ఫోర్లు) తీసుకున్నారు. వీరు నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించి జట్టు కుదురుకునేలా చేశారు. అయితే భోజన విరామం అనంతరం వీరు వెంట వెంటనే అవుటవ్వడంతో జట్టు భారీ స్కోరు సాధించడంలో విఫలం అయింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య (4/52), రజ్నీశ్ (3/72), యశ్ ఠాకూర్ (2/44) రాణించారు. గుజరాత్‌తో ఆరంభమైన మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు 233 పరుగులకు ఆలౌటైంది. సుమంత్ (189 బంతుల్లో 69 నాటౌట్; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాఫర్ అత్యధిక మ్యాచ్‌ల రికార్డు ఇదే మ్యాచ్‌లో విదర్భ ఆటగాడు వసీం జాఫర్ రంజీల్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా 253 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన 41 ఏళ్ల జాఫర్ 51.19 సగటుతో 19,147 పరుగులు చేశాడు. అందులో 57 సెంచరీలు, 88 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. -
విదర్భ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అండర్–23 పురుషుల వన్డే లీగ్ అండ్ నాకౌట్ చాంపియన్‌షిప్‌లో విదర్భ జట్టు విజేతగా నిలిచింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో విదర్భ 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించి టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ లలిత్ యాదవ్ (82 బంతుల్లో 65; 6 ఫోర్లు, 1 సిక్స్), సుమిత్ మాథుర్ (65 బంతుల్లో 52; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో జట్టు సాధారణ స్కోరును సాధించగలిగింది. విదర్భ బౌలర్లలో పీఆర్ రేఖడే 4 వికెట్లు దక్కించుకోగా... ఎన్ ఎస్ పరండే 2 వికెట్లు తీశాడు. అనంతరం విదర్భ జట్టు 48.2 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసి గెలుపొందింది. పవన్ పర్నాటే (132 బంతుల్లో 88 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. నయన్ చవాన్ (48; 4 ఫోర్లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా... అభిషేక్ వత్స్, యోగేశ్ శర్మలకు చెరో వికెట్ దక్కింది. రాణించిన లలిత్, సుమిత్ గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కున్వర్ బిధురీ (4) ఫైనల్లో రాణించలేకపోయాడు. మరో ఓపెనర్ ఆయుశ్ బదోని (15), వికాస్ దీక్షిత్ (2) కూడా త్వరగానే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లలిత్ యాదవ్... వైభవ్ కందపాల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు)తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ జంట నాలుగో వికెట్‌కు 40 పరుగుల్ని జోడించిన తర్వాత వైభవ్ ఔటయ్యాడు. కొద్దిసేపటికే లక్ష్య్ (10) పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత లలిత్‌కు జత కూడిన సుమిత్ మాథుర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. లలిత్ ఔటైనా... మిగతా బ్యాట్స్‌మెన్ తో కలిసి సుమిత్ పరుగుల్ని జోడించాడు. పవన్ అర్ధసెంచరీ సాధారణ లక్ష్యఛేదనలో విదర్భకు శుభారంభం దక్కలేదు. 25 పరుగులకే ఓపెనర్లిద్దరినీ జట్టు కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పవన్ పర్నాటే, నయన్ చవాన్ ఇద్దరూ బాధ్యతగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 103 పరుగుల్ని జోడించాక నయన్ చవాన్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ఎంఆర్ కాలే (29; 3 ఫోర్లు), దర్శన్ నల్కండే (24 నాటౌట్) అండతో పవన్ మిగతా పని పూర్తి చేశాడు. -
మళ్లీ విదర్భదే ఇరానీ కప్
గతేడాది ఇటు రంజీ ట్రోఫీ, అటు ఇరానీ కప్ గెలుచుకున్న విదర్భ జట్టు... అదే ప్రదర్శనను మరోసారి నమోదు చేసింది. తద్వారా డబుల్ ధమాకా సాధించింది. ఇరానీ కప్‌లో చివరి రోజు శనివారం లక్ష్య ఛేదనలో విదర్భ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ అందరూ రాణించారు. దీంతో... ఊరించే లక్ష్యంతో ఆ జట్టును పడేయాలనుకున్న రెస్టాఫ్ ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. నాగ్‌పూర్: ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి వీరోచిత సెంచరీలు విదర్భ జోరు ముందు వెలవెలబోయాయి. ఊరించే లక్ష్యానికి అవలీలగా చేరువైన విదర్భ మళ్లీ ఇరానీ విజేతగా నిలిచింది. వరుసగా రంజీ చాంపియన్‌షిప్ సాధించినట్లే... ఇరానీ కప్‌నూ చేజిక్కించుకుంది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఐదు రోజుల మ్యాచ్ ‘డ్రా’ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు గెలుపు వాకిట ఉన్న విదర్భతో ఇక చేసేదేమీ లేక రెస్టాఫ్ ఆటగాళ్లు చేతులు కలిపారు. కేవలం 11 పరుగుల దూరంలోనే ఉన్న విదర్భ చేతిలో ఐదు వికెట్లున్నాయి. ఇక విజయం ఖాయం కావడంతో ముందుగానే ఆటను ముగించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇరానీ కప్ విదర్భ వశమైంది. వసీమ్ జాఫర్ గాయంతో తప్పుకోవడంతో... చివరి నిమిషంలో విదర్భ తుది జట్టులోకి వచ్చిన అథర్వ తైడే (215 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్), గణేశ్ సతీశ్ (195 బంతుల్లో 87; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాచ్ ముగిసే సమయానికి విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రాహుల్ చహర్‌కు 2 వికెట్లు దక్కాయి. వీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 37/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ ఏ దశలోనూ తడబడలేదు. 18 ఏళ్ల అథర్వ తొలి సెషన్‌ను నడిపించాడు. సంజయ్ రామస్వామి (42; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత గణేశ్ సతీశ్‌తో మూడో వికెట్‌కు 30 పరుగులు జోడించాక జట్టు స్కోరు 146 పరుగుల వద్ద అథర్వ మూడో వికెట్‌గా నిష్క్రమించాడు. అనంతరం సతీశ్‌కు మోహిత్ కాలే (37; 5 ఫోర్లు) జతయ్యాడు. వీళ్లిద్దరు నాలుగో వికెట్‌కు 83 పరుగులు జోడించడంతో రెస్టాఫ్ బౌలర్లకు ఇబ్బందులు తప్పలేదు. 229 పరుగుల వద్ద కాలే నిష్క్రమించగా, 269 పరుగుల వద్ద సతీశ్‌ను విహారి ఔట్ చేశాడు. అదేస్కోరు వద్ద మ్యాచ్ ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. అక్షయ్ వాడ్కర్ (10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. -
విదర్భ మళ్లీ మెరిసింది..
నాగ్‌పూర్: గతేడాది ఇరానీకప్‌లో విజేతగా నిలిచిన విదర్భ..ఈ ఏడాది కూడా మెరిసింది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో విదర్భ వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో చాంపియన్‌గా నిలవడంతో మరోమారు రెస్టాఫ్ ఇండియాతో ఇరానీకప్‌లో విదర్భకు తలపడే అవకాశం దక్కింది. ఈ పోరులో ఆద్యంతం ఆకట్టుకున్న విదర్భ టైటిల్‌ను దక్కించుకుంది. రెస్టాఫ్ ఇండియా నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విదర్భ ఆట నిలిచే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రా అయ్యింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం ఆధారంగా విదర్భను విజేతగా ప్రకటించారు. విదర్భ తన తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా, రెస్టాఫ్ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 374/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆపై ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ ఆదిలోనే కెప్టెన్ ఫైజ్ ఫజాల్ వికెట్‌ను కోల్పోయింది. ఫజాల్ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించడంతో విదర్భ స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో సంజయ్ రఘనాథ్(42), అథర్వా తైడే(72)లు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆపై గణేశ్ సతీష్(87) హాఫ్ సెంచరీతో ఆకట్టకోగా, మోహిత్ కాలే(37) ఫర్వాలేదనిపించాడు. విదర్భ ఐదో వికెట్‌గా గణేశ్ సతీష్ వికెట్‌ను కోల్పోయిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు సంధి చేసుకున్నారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో నిలిచిన విదర్భను విజేతగా ప్రకటించారు. 2018 ఇరానీకప్‌లో కూడా తొలి ఇన్నింగ్స్ ఆధారంగానే విదర్భ టైటిల్‌ను గెలవడం విశేషం. -
విహారి మరో సెంచరీ
ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి మళ్లీ విదర్భ బౌలర్లతో ఆటాడుకున్నాడు. రెస్టాఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మరో సెంచరీ సాధించాడు. మూడు సెషన్లు నింపాదిగా ఆడిన విహారి రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుకు బాట వేశాడు. కెప్టెన్ రహానే, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నిర్మించాడు. నాగ్‌పూర్: వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ రెస్టాఫ్ ఇండియా టాపార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (300 బంతుల్లో 180 నాటౌట్; 19 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. రోజంతా ఆడి విదర్భ బౌలర్ల పాలిట సింహస్వప్నంగా మారాడు. దీంతో రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 107 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 374 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ముందు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రంజీ చాంపియన్ విదర్భ ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. సంజయ్ (17 బ్యాటింగ్), అథర్వ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఇరానీ కప్‌లో తలపడుతున్న ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. నాలుగో రోజు శుక్రవారం 102/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా తొలి సెషన్లో వికెట్ కోల్పోకుండా మరో 110 పరుగుల్ని జతచేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విహారి, కెప్టెన్ రహానే (87; 6 ఫోర్లు, 1 సిక్స్) విదర్భ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. ప్రత్యర్థి కెప్టెన్ ఫజల్ ఈ జోడీని విడగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. రెండో సెషన్లో విహారి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇద్దరు కలిసి మరో 63 పరుగులు జతచేశాక ఎట్టకేలకు జట్టు స్కోరు 275 పరుగుల వద్ద ఆదిత్య సర్వతే బౌలింగ్‌లో రహానే స్టంపౌటయ్యాడు. గత రెండేళ్ల కాలంలో 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన రహానే కు ఇదే టాప్ స్కోర్. 2017 ఆగస్టు కొలంబోలో లంకతో జరిగిన టెస్టులో అతను (132) సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడే సెంచరీకి సమీపించే స్కోరు చేశాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ (61 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రీజులోకి వచ్చాక స్కోరులో వేగం పుంజుకుంది. విహారి, అయ్యర్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన శ్రేయస్ 4 భారీ సిక్సర్లతో అలరించాడు. ఇరానీలో సెంచరీల విహారి ఇరానీ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా హనుమ విహారి ఘనత వహించాడు. ఇంతకుముందు శిఖర్ ధావన్ 2011–12 సీజన్లో ఈ ఘనత సాధించాడు. అయితే వరుసగా మూడు సెంచరీలు చేసింది మాత్రం మన తెలుగు తేజమే! గత సీజన్ మ్యాచ్‌లోనూ ఇదే విదర్భపై విహారి శతక్కొట్టాడు. వరుసగా 183, 114, 180 (నాటౌట్) స్కోర్లతో మొత్తానికి విదర్భ పాలిట కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. శుక్రవారం మూడు సెషన్ల పాటు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నాడు. సంక్షిప్త స్కోర్లు రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 330; విదర్భ తొలి ఇన్నింగ్స్: 425; రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్: 374/3 డిక్లేర్డ్ (విహారి నాటౌట్ 180; రహానే 87; శ్రేయస్ నాటౌట్ 61; ఆదిత్య సర్వతే 2/141); విదర్భ రెండో ఇన్నింగ్స్: 37/1. -
హనుమ విహారి బ్యాటింగ్ రికార్డు
నాగ్‌పూర్: ఆంధ్ర యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారి సరికొత్త బ్యాటింగ్ రికార్డు నెలకొల్పాడు. ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇరానీకప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియా తరుఫున ఆడుతున్న విహారి.. రంజీ చాంపియన్ విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన విహారి.. రెండో ఇన్నింగ్స్ళో కూడా శతకం నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో భాగంగా విహారి సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 180 పరుగులు సాధించాడు. ఫలితంగా ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. గతేడాది ఇదే విదర్భతో జరిగిన మ్యాచ్‌లో విహారి 183 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, 2011 తర్వాత ఒక ఇరానీకప్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్ కూడా విహారినే కావడం మరో విశేషం. ఆనాటి ఇరానీకప్‌లో రెస్టాఫ్ ఇండియాతో తరఫున ఆడిన శిఖర్ ధావన్.. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా ఇరానీకప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 374/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. దాంతో విదర్భకు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ 330 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 374/3 డిక్లేర్డ్ విదర్భ తొలి ఇన్నింగ్స్ 425 ఆలౌట్ -
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
-
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
నాగ్‌పూర్: క్రికెట్లో రోజురోజుకి అంపైర్ల చర్యలు, తప్పిద నిర్ణయాల పట్ల విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. అంపైర్ల తప్పిద నిర్ణయాలతో అనేక జట్లు గెలిచే మ్యాచ్‌లు ఓడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తప్పిద నిర్ణయాలతో అంపైర్లు అభాసుపాలవుతుండగా.. తాజాగా దేశవాళీ మ్యాచ్‌లో అంపైర్ సీకే నందన్ తీరు పట్ల సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియా-విదర్భ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా కెప్టెన్ ఫయాజ్ ఫజల్ అంపైర్ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని ఫజల్ ఫయాన్స్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతి బ్యాట్‌కి అందకుండా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. ఔట్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. తొలుత ఆ ఆప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ నందన్ తిరస్కరించాడు. దీంతో ఆటగాళ్లు తమతమ స్థానాలకు వెళుతుండగా నందన్ మరో ఫీల్డ్ అంపైర్ వైపు చూసి.. ఔటంటూ వేలెత్తాడు. దీంతో.. తొలుత నాటౌట్ అని నిరాశకి గురైన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు సంబరాలు మొదలెట్టగా.. నాటౌట్ అని సంతోషించిన ఫజల్ అసహనంతో కాసేపు క్రీజులోనే ఉండిపోయి అనంతరం భారంగా క్రీజు వదిలాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంపైర్ తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ అంపైర్ నిద్రపోయావా ఏంటి’ అంటూ కొందరు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ‘అంపైర్లకు కూడా ఎప్పటికప్పుడు క్లాస్‌లు, పరీక్షలు పెట్టాలి’అంటూ మరికొందరు సూచిస్తున్నారు. -
అక్షయ్ కర్నేవర్ అద్భుత శతకం
నాగపూర్: లోయరార్డర్ బ్యాట్స్‌మన్ అక్షయ్ కర్నేవర్ (133 బంతుల్లో 102; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్లో తొలి ఫస్ట్‌క్లాస్ శతకం బాదడంతో రంజీ చాంపియన్ విదర్భ... ఇరానీ కప్‌పై పట్టు బిగించింది. రెస్టాఫ్ ఇండియాతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో గురువారం ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులకు ఆలౌటైంది. దీంతో కీలకమైన 95 పరుగుల ఆధిక్యం కూడగట్టుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 245/6తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భను వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ (139 బంతుల్లో 73; 14 ఫోర్లు), కర్నేవర్ ముందుకు నడిపించారు. క్రితం రోజు స్కోరుకు 23 పరుగులు జోడించి వాడ్కర్ వెనుదిరిగాడు. అయితే, అక్షయ్ వాఖరే (20), రజనీశ్ గుర్బానీ (28 నాటౌట్) అండతో కర్నేవర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి మూడు వికెట్లకు విదర్భ 115 పరుగులు జోడించడంతో స్కోరు 400 దాటింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ జట్టు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (27), అన్మోల్ప్రీత్ సింగ్ (6) త్వరగానే వెనుదిరిగారు. ఆదిత్య సర్వతే (1/51), అక్షయ్ వాఖరే (1/13) చెరో వికెట్ తీయగా... వన్ డౌన్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (85 బంతుల్లో 40 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అజింక్య రహానే (65 బంతుల్లో 25 బ్యాటింగ్, 1 ఫోర్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా చూశారు. ప్రస్తుతం రెస్టాఫ్ ఇండియా 7 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. నాలుగో రోజు శుక్రవారం విహారి, రహానేతో పాటు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఏ మేరకు నిలుస్తారనే దానిపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
విదర్భ 245/6
నాగ్‌పూర్: రంజీ చాంపియన్ విదర్భ... ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాపై పైచేయి సాధించేందుకు పోరాడుతోంది. ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే కట్టడి చేసి, రెండో రోజు బుధవారం బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. ఓపెనర్లు కెప్టెన్ ఫైజ్ ఫజల్ (27), సంజయ్ రామస్వామి (166 బంతుల్లో 65; 9 ఫోర్లు) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించి శుభారంభం అందించినా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గణేశ్ సతీష్ (105 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... రెస్టాఫ్ ఇండియా బౌలర్లు కృష్ణప్ప గౌతమ్ (2/33), ధర్మేంద్ర జడేజా (2/66) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి విదర్భకు కళ్లెం వేశారు. కీలక సమయంలో యువ ఆటగాడు అథర్వ తైడె (15), మోహిత్ కాలె (1)లను స్వల్ప స్కోర్లకే ఔట్ చేసి దెబ్బకొట్టారు. 168 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ (96 బంతుల్లో 50 బ్యాటింగ్; 9 ఫోర్లు) అండగా నిలిచాడు. స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (18), అక్షయ్ కర్నెవర్ (15 బ్యాటింగ్) తోడుగా జట్టు స్కోరును 200 దాటించాడు. దీంతో 245/6తో విదర్భ రోజును ముగించింది. రెస్టాఫ్ ఇండియా స్కోరుకు విదర్భ మరో 85 పరుగులు వెనుకబడి ఉంది. లోయరార్డర్ బ్యాటింగ్ ప్రతిభతోనే రంజీ ట్రోఫీ గెలిచిన ఆ జట్టు... ఈసారి ఏం చేస్తుందో చూడాలి. మూడు రోజుల ఆట ఉన్నందున ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది. -
హనుమ విహారి శతకం
నాగపూర్: రంజీ ట్రోఫీ చాంపియన్ విదర్భ ఇరానీ కప్‌లో మొదటి రోజు ప్రత్యర్థి రెస్టాఫ్ ఇండియాను కట్టడి చేసింది. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో విదర్భ బౌలర్లు రాణించడంతో రెస్టాఫ్ ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు గాదె హనుమ విహారి (211 బంతుల్లో 114; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, మయాంక్ అగర్వాల్ (134 బంతుల్లో 95; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించినా... ఇతర బ్యాట్స్‌మన్ వైఫల్యంతో రెస్టాఫ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. విదర్భ స్పిన్నర్లు అక్షయ్ వాఖరే, ఆదిత్య సర్వతే చెరో 3 వికెట్లు పడగొట్టారు. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగనున్న విదర్భ భారీ స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే గాయంతో వసీం జాఫర్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం జట్టుకు సమస్యగా మారగా... మొదటి రోజు నుంచే జామ్తా మైదానంలో బంతి బాగా స్పిన్ తిరుగుతోంది. రెస్టాఫ్ జట్టులో ధర్మేంద్ర జడేజా, రాహుల్ చహర్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్టాఫ్ ఇండియా ఆరంభంలోనే అన్మోల్ ప్రీత్ (15) వికెట్ కోల్పోయింది. అయితే మయాంక్, విహారి కలిసి ధాటిగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా తొలి ఓవర్లో రెండు ఫోర్లతో దూకుడుగా ఆట మొదలు పెట్టిన మయాంక్ ఆ తర్వాత కూడా జోరు ప్రదర్శిస్తూ 75 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు ‘సున్నా’ వద్ద విహారికి అదృష్టం కలిసొచ్చింది. యష్ ఠాకూర్ బౌలింగ్‌లో విహారి కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా విదర్భ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అంపైర్ దీనిపై స్పందించలేదు. అయితే రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు తేలింది. లంచ్ సమయానికి జట్టు స్కోరు 142 పరుగులకు చేరింది. రెండో సెషన్లో విహారి చెలరేగిపోయాడు. సర్వతే ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన అతను 75 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న మయాంక్... మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మిడాఫ్‌లో గుర్బానీకి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత రెస్టాఫ్ బ్యాటింగ్ తడబడింది. ఒకరి వెంట మరొకరు వేగంగా పెవిలియన్ చేరారు. భారత వన్డే జట్టులో చోటు ఆశిస్తున్న రహానే (13) మళ్లీ విఫలం కాగా... శ్రేయస్ అయ్యర్ (19), ఇషాన్ కిషన్ (2), కృష్ణప్ప గౌతమ్ (7) నిలవలేకపోయారు. చివరకు రాహుల్ చహర్ (22) విహారికి అండగా నిలిచాడు. సర్వతే బౌలింగ్‌లో కొట్టిన ఫోర్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విహారి 16వ సెంచరీ పూర్తయింది. వీరిద్దరు స్కోరును 300 పరుగులు దాటించగా, అంకిత్ రాజ్‌పుత్ (25) ఆఖర్లో కొన్ని పరుగులు జోడించాడు. -
విదర్భ జోరు కొనసాగేనా?
నాగ్‌పూర్: ఈ సీజన్ రంజీ ట్రోఫీ విజేత, డిఫెండింగ్ చాంపియన్ విదర్భ... ఇరానీ కప్ కోసం నేటి నుంచి రెస్టాఫ్ ఇండియా జట్టుతో తలపడనుంది. ఐదు రోజుల మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాకు టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్య రహానే సారథ్యం వహిస్తాడు. ప్రపంచ కప్‌నకు పరిశీలనలో ఉన్నట్లు తేలిన నేపథ్యంలో రహానే ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్‌తో రెస్టాఫ్ ఇండియా జట్టు బలంగా ఉంది. బౌలింగ్‌లో మాత్రం అనుభవ లేమి కనిపిస్తోంది. పేసర్లు అంకిత్ రాజ్‌పుత్, తన్వీర్ ఉల్ హక్, సందీప్ వారియర్, స్పిన్నర్లు ధర్మేంద్ర జడేజా, కృష్ణప్ప గౌతమ్ ప్రత్యర్థిని ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి. ఇక సమష్టి కృషితో వరుసగా రెండోసారి రంజీ ట్రోఫీ గెలిచిన ఊపులో ఉన్న విదర్భ... గతేడాదిలాగే ఇరానీ కప్‌నూ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. గాయం కారణంగా పేసర్ ఉమేశ్ యాదవ్ దూరమైనా, అటు బ్యాటింగ్‌లో కెప్టెన్ ఫైజ్ ఫజల్, వెటరన్ వసీం జాఫర్, సంజయ్ రామస్వామి, ఇటు బౌలింగ్‌లో రజనీశ్ గుర్బానీ, స్పిన్నర్ ఆదిత్య సర్వతేలతో చాలా పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై ఆడుతుండటం కూడా విదర్భకు అనుకూలం కానుంది. ►ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
విదర్భ విజయ దర్పం
సాదాసీదా జట్టుగా గత సీజన్ బరిలో దిగి రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న విదర్భ... అదే అద్భుతాన్ని పునరావృతం చేసింది. నాలుగో ఇన్నింగ్స్ పోరాటాలతో ఫైనల్‌కు చేరిన సౌరాష్ట్రకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ట్రోఫీని మరోసారి ఒడిసిపట్టింది. తద్వారా తమ విజయ ప్రస్థానం గాలివాటం కాదని నిరూపించింది. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీని నెగ్గాలన్న సౌరాష్ట్ర కల మూడోసారి చెదిరిపోయింది. నాగ్‌పూర్: విజయంపై ఏమూలనో ఉన్న సౌరాష్ట్ర ఆశలను వమ్ము చేస్తూ... డిఫెండింగ్ చాంపియన్ విదర్భ 2018–19 సీజన్ రంజీ ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. గురువారం ఇక్కడ ముగిసిన ఫైనల్లో ఆ జట్టు 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 58/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర 127 పరుగులకు ఆలౌటైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆదిత్య సర్వతే (6/59), ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే (3/37) ప్రత్యర్థి పనిపట్టారు. మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు పడగొట్టడంతో పాటు, రెండో ఇన్నింగ్స్‌లో విలువైన 49 పరుగులు చేసిన సర్వతేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. వారిద్దరి పోరాటం కాసేపే... చేతిలో ఉన్న ఐదు వికెట్లతో గెలుపునకు 148 పరుగులు చేయాల్సిన స్థితిలో గురువారం మైదానంలో దిగిన సౌరాష్ట్ర కాసేపు ప్రతిఘటించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ విశ్వరాజ్ జడేజా (137 బంతుల్లో 52; 6 ఫోర్లు), కమలేశ్ మక్వానా (45 బంతుల్లో 17; 2 ఫోర్లు) ఆశలు రేపారు. దాదాపు 15 ఓవర్లు క్రీజులో నిలిచిన వీరు ఆరో వికెట్‌కు 33 పరుగులు జత చేశారు. కానీ, మక్వానాను ఔట్ చేసిన సర్వతే ఈ జోడీని విడగొట్టాడు. ఆ వెంటనే ప్రేరక్ మన్కడ్ (2)ను అక్షయ్ పెవిలియన్ పంపాడు. జట్టు స్కోరు 103 వద్ద విశ్వరాజ్ను సర్వతే ఎల్బీడబ్ల్యూ చేయడంతో సౌరాష్ట్ర ఓటమి ఖాయమైంది. ధర్మేంద్ర జడేజా (17), కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (7) వికెట్లను ఆరు పరుగుల తేడాతో పడగొట్టి విదర్భ జయకేతనం ఎగురవేసింది. సంక్షిప్త స్కోర్లు విదర్భ తొలి ఇన్నింగ్స్: 312 (కర్నెవార్ 73; అక్షయ్ వాద్కర్ 45; ఉనాద్కట్ 3/54, సకారియా 2/44); రెండో ఇన్నింగ్స్: 200 (సర్వతే 49, మోహిత్ కాలే 38; ధర్మేంద్ర జడేజా 6/96, మక్వానా 2/51). సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 307 (స్నెల్ పటేల్ 102, ఉనాద్కట్ 46; సర్వతే 5/98, వాఖరే 4/80) రెండో ఇన్నింగ్స్: 127 (విశ్వరాజ్ జడేజా 52; సర్వతే 6/59, వాఖరే 3/37). ►6 రంజీ ట్రోఫీని వరుసగా రెండో ఏడాది గెలుచుకున్న ఆరో జట్టుగా విదర్భ గుర్తింపు పొందింది. గతంలో ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్ ఈ ఘనత సాధించాయి. వీటిలో ముంబై ఆరు సార్లు వరుసగా రెండేసి, ఒక సారి వరుసగా మూడు టైటిల్స్ సాధించడంతో పాటు 1958–59 సీజ¯Œ నుంచి 1972–73 వరకు వరుసగా 15 సార్లు నెగ్గడం విశేషం. కర్ణాటక రెండు సార్లు వరుసగా రెండు టైటిల్స్ గెలుచుకుంది. ► 10 వసీం జాఫర్ 10వ రంజీ టైటిల్ విజయంలో భాగమయ్యాడు. ముంబై తరఫున 8 సార్లు, విదర్భ తరఫున 2 సార్లు అతను గెలిచాడు. -
మళ్లీ వారిదే రంజీ టైటిల్
నాగ్‌పూర్: రంజీట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన విదర్భ టైటిల్‌ను నిలబెట్టుకుంది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ 78 పరుగుల తేడాతో విజయం సాధించి మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. విదర్భ విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. దాంతో టైటిల్‌ను సాధించే అవకాశాన్ని కోల్పోయింది. విదర్భ బౌలర్లలో స్పిన్నర్ ఆదిత్య సర్వతే ఆరు వికెట్లతో సౌరాష్ట పతనాన్నిశాసించాడు. అతనికి జతగా అక్షయ్ వాఖరే మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్ వికెట్ తీశాడు. సౌరాష్ట్ర ఆటగాళ్లలో విశ్వరాజ్ జడేజా(52) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలబడింది. నలుగురు మాత్రమే నాలుగు అంకెల స్కోరును దాటడంతో సౌరాష్ట్రకు పరాజయం తప్పలేదు. అంతకుముందు విదర్భ తన రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసింది. దాంతో విదర్భకు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఐదు పరుగుల ఆధిక్యంతో 205 పరుగుల్ని బోర్డుపై ఉంచింది. ఆదిత్య సర్వతే (49), గణేశ్ సతీష్(35), మోహిత్ కాలే(38)లు క్లిష్ట దశలో మెరిసి జట్టు స్కోరును రెండొందలకు చేర్చారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరాష్ట్ర 55 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 58/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర మరో 69 పరుగులు చేసి మిగతా వికెట్లను చేజార్చుకోవడంతో సౌరాష్ట ఓటమి పాలైంది. -
విదర్భ... విజయం ముంగిట
సౌరాష్ట్రకు రంజీ ఫైనల్ మరో‘సారీ’ చెప్పేసింది. పరాజయానికి బాట వేసింది. విదర్భ వరుసగా విజయగర్వానికి సిద్ధమైంది. కీలకమైన పుజారాను డకౌట్ చేయడంతోనే మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకున్న విదర్భ... ప్రత్యర్థి 60 పరుగులైనా చేయకముందే సగం వికెట్లను పడగొట్టింది. నాగ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ విదర్భ రంజీ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సై అంటోంది. భారత స్టార్ చతేశ్వర్ పుజారా అందుబాటులో ఉన్న సౌరాష్ట్ర జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక విలవిల్లాడుతోంది. విదర్భ చాంపియన్‌షిప్‌కు ఐదు వికెట్ల దూరంలో ఉంటే... లోయర్ ఆర్డర్, టెయిలెండేర్లే ఉన్న సౌరాష్ట్ర ఇంకా 148 పరుగులు చేయాల్సివుంది. విదర్భను ఆదిత్య సర్వతే తన ఆల్‌రౌండ్ షోతో నిలబెట్టాడు. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌లో విఫలమైన విదర్భ బౌలింగ్‌లో జూలు విదిల్చింది. మొత్తానికి బుధవారం ఆటను ఇరు జట్ల బౌలర్లు శాసించారు. ముందుగా 55/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 92.5 ఓవర్లలో 200 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదిత్య సర్వతే (49; 5 ఫోర్లు) ఒక్కడే ప్రత్యర్థి బౌలింగ్‌కు ఎదురు నిలిచాడు. సౌరాష్ట్ర బౌలర్ ధర్మేంద్రసింగ్ జడేజా (6/96) స్పిన్ ఉచ్చులో 73 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన విదర్భను టెయిలెండర్ ఆదిత్య 200 పరుగుల దాకా లాక్కొచ్చాడు. మోహిత్ కాలే 38, గణేశ్ సతీశ్ 35 పరుగులు చేశారు. కమలేశ్ మక్వానాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్రను సర్వతే (3/13)స్పిన్‌తో కొట్టాడు. ఓపెనర్లు హర్విక్ దేశాయ్ (8), స్నెల్ పటేల్ (12)లతో పాటు పుజారా (0)ను ఖాతా తెరువకుండానే సాగనంపాడు. క్వార్టర్స్, సెమీస్‌లో జట్టును నడిపించిన పుజారా ఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఒక పరుగే చేశాడు. అర్పిత్ వాసవద (5)ను ఉమేశ్, షెల్డన్ జాక్సన్ (7)ను అక్షయ్ వఖారే పెవిలియన్ చేర్చడంతో సౌరాష్ట్ర 55 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి విశ్వరాజ్ జడేజా (23 బ్యాటింగ్, 3 ఫోర్లు), కమలేశ్ మక్వానా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
హోరాహోరీగా రంజీ ఫైనల్
నాగపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తుది సమరం ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ మూడో రోజు మంగళవారం విదర్భకు దీటుగా సమాధానమిచ్చిన సౌరాష్ట్ర చివర్లో తడబడింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో విదర్భకు 5 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 158/5తో ఆట కొనసాగించిన సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్నెల్ పటేల్ (209 బంతుల్లో 102; 15 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జట్టు లోయర్ ఆర్డర్ పట్టుదలగా ఆడటంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి చేరువగా రాగలిగింది. 7 నుంచి 11వ బ్యాట్స్‌మెన్ వరకు చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (101 బంతుల్లో 46; 4 ఫోర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (62 బంతుల్లో 21; 2 ఫోర్లు), కమలేశ్ మక్వానా (61 బంతుల్లో 27; 3 ఫోర్లు), ధర్మేంద్ర జడేజా (32 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), చేతన్ సకరియా (82 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. వీరందరూ కలిసి 145 పరుగులు చేయడం విశేషం. ముఖ్యంగా పదునైన బౌలింగ్‌తో ఉమేశ్ యాదవ్... ప్రధాన బ్యాట్స్‌మన్ స్నెల్ పటేల్‌ను ఔట్ చేసిన తర్వాత సౌరాష్ట్ర చివరి మూడు వికెట్లకు 123 పరుగులు జోడించగలిగింది. ఆఖరి వికెట్‌కు ఉనాద్కట్, మక్వానా 60 పరుగులు జత చేశారు. విదర్భ స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (5/98), అక్షయ్ వాఖరే (4/80) జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో కీలక పాత్ర పోషించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. రామస్వామి సంజయ్ (16), ఫైజ్ ఫజల్ (10) ఔట్ కాగా... గణేశ్ సతీశ్ (24 బ్యాటింగ్), వసీం జాఫర్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ధర్మేంద్ర జడేజాకే ఈ 2 వికెట్లు దక్కాయి. పిచ్‌పై పగుళ్లు ఏర్పడి అనూహ్యంగా స్పందిస్తున్న స్థితిలో నాలుగో రోజు ధర్మేంద్ర జడేజా బౌలింగ్ కీలకం కానుంది. ప్రస్తుతం 60 పరుగుల ఆధిక్యంలో ఉన్న విదర్భ గట్టిగా నిలబడి ప్రత్యర్థికి ఎంత లక్ష్యం నిర్దేశిస్తుందో చూడాలి. మరోవైపు క్వార్టర్ ఫైనల్లో యూపీపై 372 పరుగులు, సెమీస్‌లో కర్ణాటకపై 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌరాష్ట్ర...మరోసారి నాలుగో ఇన్నింగ్స్‌లో బాగా ఆడగలమనే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. -
రెండో రోజు విదర్భ జోరు
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ పడి...లేచింది. రెండో రోజు ఇటు పరుగులతో అటు వికెట్లతో పట్టుబిగించింది. సౌరాష్ట్రను కష్టాల్లో పడేసింది. స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (3/55), అక్షయ్ వఖారే (2/42) ప్రత్యర్థి టాపార్డర్‌ను తమ మాయలో పడేశారు. వఖారే ముందుగా బ్యాట్‌తో, తర్వాత బౌలింగ్‌తో విదర్భ జోరుకు ఊపిరిపోశాడు. సౌరాష్ట్ర కష్టాలు పెంచాడు. రెండో రోజు 200/7 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగుల వద్ద ఆలౌటైంది. చేతిలో ఉన్న టెయిలెండర్లతోనే ఏకంగా 112 పరుగులు జతచేసింది విదర్భ. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ అక్షయ్ కర్నేవార్ (73 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వఖారే (34; 3 ఫోర్లు) తొలి సెషనంతా మొండిగా పోరాడారు. ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. వఖారే నిష్క్రమణ తర్వాత ఉమేశ్ యాదవ్ (13), గుర్బానీ (6)ల అండతో కర్నేవార్ జట్టు స్కోరును 300 దాటించాడు. ఉనాద్కట్ 3, చేతన్ సాకరియా, కమలేశ్ మక్వానా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన సౌరాష్ట్రను స్పిన్నర్లు ఆదిత్య సర్వతే, వఖారే ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ స్నెల్ పటేల్ (87 బ్యాటింగ్; 14 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కీలక బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (1) సహా, మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (10), విశ్వరాజ్ జడేజా (18), అర్పిత్ (13), షెల్డన్ జాక్సన్ (9) ప్రత్యర్థి స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. దీంతో సౌరాష్ట్ర 131 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి స్నెల్ పటేల్‌తో పాటు ప్రేరక్ మన్కడ్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సౌరాష్ట్ర ఇంకా 154 పరుగుల వెనుకంజలో ఉంది. -
విదర్భ 200/7
నాగ్‌పూర్: సౌరాష్ట్ర బౌలర్లు తొలిరోజు ఆటను శాసించారు. రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో నిలువకుండా దెబ్బమీద దెబ్బ కొట్టారు. సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (2/26) విదర్భ టాప్ లేపాడు. కీలకమైన విదర్భ ‘రన్ మెషీన్’ వసీమ్ జాఫర్ (23; 1 ఫోర్, 1 సిక్స్)తో పాటు ఓపెనర్ సంజయ్ (2)ను ఔట్ చేశాడు. మిగతా బౌలర్లు తలా ఒక చేయి వేశారు. దీంతో ఆదివారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మొదట టాస్ నెగ్గిన విదర్భ బ్యాటింగ్ ఎంచుకుంది. సంజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ ఫయాజ్ ఫజల్ (16) శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యాడు. ఫజల్ రనౌట్ కాగా, ఉనాద్కట్ బౌలింగ్‌లో సంజయ్, జాఫర్ నిష్క్రమించడంతో విదర్భ 60 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన వారిలో మోహిత్ కాలే (35; 4 ఫోర్లు), గణేశ్ సతీశ్ (32; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు నిలబడటంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తర్వాత సౌరాష్ట్ర బౌలర్లు మూకుమ్మడిగా పట్టుబిగించడంతో విదర్భ ఇన్నింగ్స్ కకావికలమైంది. జట్టు స్కోరు 106 పరుగుల వద్ద మోహిత్ కాలేను స్పిన్నర్ కమలేశ్ మక్వానా, సతీశ్‌ను మీడియం పేసర్ ప్రేరక్ మన్కడ్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చారు. ఇది చాలదన్నట్లు క్రీజులో పాతుకుపోతున్న అక్షయ్ వాడ్కర్ (45)ను చేతన్ సాకరియా సాగనంపాడు. దీంతో 33 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి అక్షయ్ కర్నేవర్ (31 బ్యాటింగ్), అక్షయ్ వఖరే (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
రంజీ ఫైనల్లో విదర్భ
వాయనాడ్ (కేరళ): తొలిసారి రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అడుగు పెట్టి మరో అడుగు ముందుకు వెళ్లాలనుకున్న కేరళ ఆశలు ఫలించలేదు. డిఫెండింగ్ చాంపియన్ విదర్భ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రెండో రోజే మ్యాచ్‌ను ముగించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఉమేశ్ యాదవ్ (5/31) పేస్‌కు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కేరళ 91 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్, 11 పరుగుల తేడాతో విదర్భ ఘన విజయం సాధించింది. ఓపెనర్ అరుణ్ కార్తీక్ (36; 5 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎనిమిది మంది ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. ఉమేశ్‌కు తోడుగా రజనీశ్ గుర్బాని 4 వికెట్లతో చెలరేగాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 171/5తో శుక్రవారం ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటై 102 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కేరళ పేసర్ సందీప్ వారియర్‌కు 5 వికెట్లు దక్కాయి. ఆధిక్యం ఎవరికో... బెంగళూరు: కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆధిక్యం కోసం ఇరు జట్లు పోరాడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసేసరికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. స్నెల్ పటేల్ (85; 15 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... షెల్డన్ జాక్సన్ (46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పుజారా (45; 3 ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించారు. రోనిత్ మోరె 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 264/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక మరో తొమ్మిది పరుగులు జోడించి 275 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం చేతిలో 3 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర మరో 48 పరుగులు వెనుకబడి ఉంది. సీనియర్ బ్యాట్స్‌మన్ అర్పిత్ (26 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆధిక్యం ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరం. -
విదర్భపై రైల్వేస్ విజయం
సాక్షి, గుంటూరు వెస్ట్: జాతీయ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా విదర్భ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ 137 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత రైల్వేస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 220 పరుగులు చేసింది. మోనా (92; 10 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిథాలీ రాజ్ 16 పరుగులు సాధించింది. విదర్భ 38.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది. రైల్వేస్ బౌలర్లలో స్నేహ రాణా 4 వికెట్లు పడగొట్టింది. అంతకుముందు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మహిళల అకాడమీలో భారత వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన 36వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. -
విదర్భ, మరాఠ్వాడాలను కుదిపేస్తున్న భారీ వర్షాలు
సాక్షి, ముంబై : గత రెండు రోజులుగా విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 11 మంది చనిపోయారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గడచిన రెండు రోజుల్లో మరాఠ్వాడలోని నాందేడ్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 91 శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే పంటలు, విత్తనాలు, ఎరువుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక భారీ వర్షాలకు పంటలకు నష్టం జరగడంతోపాటు ఇళ్లు కూడా కూలిపోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత.. మంగళవారం భండార జిల్లాలో భారీ వర్షానికి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఇదే జిల్లాలో కోండి గ్రామంలో నాలా పొంగిపోర్లి పారడంతో దీనికి ఆనుకుని ఉన్న బస్తీ నీటిలో కొట్టుకుపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా రాత్రి నిద్రలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. భండార జిల్లాలో నాలాలు పొంగిపొర్లడంతో ఇక్కడుంటున్న వందలాది పేద కుటుంబాలను, ఎడ్లు, ఆవులు, గేదెలు, మేకలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 113 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉప్పొంగుతున్న నదులు.. నాగ్‌పూర్ జిల్లాలో వరదలు రావడంతో ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. నాగ్‌పూర్ సిటీలో వచ్చిన వరదలకు ఓ చిన్న పిల్లాడు నీటిలో పడి గల్లంతయ్యాడు. నాందేడ్‌లో వరదలకు నలుగురు గల్లంతయ్యారు. పర్భణీ జిల్లాలో గంగాఖేడ్ తాలూకాలో నాలుగు గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హింగోళి జిల్లాలో వైన్‌గంగా పొంగిపొర్లడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. నాసిక్ జిల్లాలో గోదావరి నది నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో ముందు జాగ్రత్త చర్యగా నదికి ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జల్గావ్ జిల్లాలో హత్నూర్ డ్యాంలో ఒక్కసారిగా నీటి నిల్వలు పెరిగిపోవడంతో 32 గేట్లు ఎత్తివేశారు. దీంతో తాపి నది పొంగిపొర్లుతుంది. జల్గావ్ జిల్లాలో 24 గంటల్లో 31.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి 91 శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే వివిధ పెద్ద డ్యాముల్లో 51.17 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. గడచిన రెండు రోజుల్లో అత్యధిక వర్షపాతం మరాఠ్వాడలోని నాందేడ్ జిల్లాలో నమోదైంది. ముంబైకర్లకు ఊరట.. ముంబైలో గత వారం రోజులుగా జల్లులు కురుస్తుండటంతో ముంబైకర్లకు కొంత ఊరట కలిగినట్లైంది. మొన్నటి వరకు వేసవిని తలపింపజేసినా, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడటంతో ముంబైకర్లకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. ఇక ముంబైకి నీటి సరఫరాచేసే ఆరు జలాశయాల్లో భాత్సా జలాశయం ఓవర్ ఫ్లో అయింది. దీంతో మూడు గేట్లు ఎత్తివేసి 68.67 క్యూసెక్కుల నీరు వదిలేశారు. తాన్సా, వైతర్ణ, మధ్య వైతర్ణ, మోడక్‌సాగర్ జలాశయాలు కూడా ఇదివరకే ఓవర్ ఫ్లో అయ్యాయి. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉండటంతో భాత్సా జలాశయానికి సమీపంలో ఉన్న రెండు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
చేలల్లో నీలిమ
జర్నలిస్టు, రచయిత్రి అయిన నీలిమ ఈ మధ్యే ‘విడోస్ ఆఫ్ విదర్భ’ అనే పుస్తకం రాసింది. ఆక్స్ఫర్డ్ ప్రచురణ. ఈ పుస్తకం ఇటీవలే విడుదలైంది.తెలంగాణ వ్యవసాయ పరిస్థితులు, రైతుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడితే చాలా విషయాలను పంచుకుంది. వాటిలోని విశేషాంశాలివి. 2001.. జూలై. ఫూలన్ దేవి హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె హత్యకు పాల్పడ్డ షేర్ సింగ్ రాణా లొంగిపోనున్నాడనే వార్తలు మొదలయ్యాయి. అప్పటికే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్‌లో మంచిపేరు తెచ్చుకున్న ముప్పై ఏళ్ల యంVŠ జర్నలిస్ట్ ఒక అమ్మాయి తన ప్రశ్నలతో షేర్ సింగ్ రాణాను ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అతను డెహ్రాడూన్ వైపు గాని, రూర్కీ వైపు గాని వెళ్లి ఉండొచ్చు అని పోలీసుల ఊహాగానాలు. ఆ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్స్ అన్నీ అలెర్ట్ అయ్యాయి. కానీ ఆ అమ్మాయిలో ఏదో సందేహం? అతను ఆ రెండు ప్రాంతాల వైపు కాకుండా... తనింటికి దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లోనే సరెండర్ అవుతాడని. అందుకే అతని ఇంటికి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్ మీదే దృష్టి పెట్టింది. ఆమె అనుమానం నిజమైంది. వెంటనే ఆ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ షేర్ సింగ్ రాణా ఉన్నాడు! గబగబా ప్రశ్నల పరంపర సంధించింది. పదిహేను నిమిషాలకు మిగతా మీడియాకు ఉప్పంది, అక్కడికి వచ్చి వాలింది. కానీ రాణాను మొదట పట్టుకున్న ఘనత ఆమెకే దక్కింది. ఆమె కెరీర్లో ఇలాంటివి ఎన్నో! 2జీ స్పెక్ట్రమ్, నార్కోటిక్స్ నుంచి రాజకీయ కుట్రల దాకా ఎన్నెన్నో రిపోర్టింగ్స్.. చెప్పుకుంటూ వెళితే చాలానే! ఆమే నీలిమ. ‘ది స్టేట్స్‌మన్’లో తొలి ఉద్యోగం కోట నీలిమ పుట్టింది విజయవాడలో. పెరిగింది ఢిల్లీలో. తండ్రి కేవీఎస్ రామశర్మ. ఆయనా జర్నలిస్టే. నేషనల్ హెరాల్డ్‌కి ఎడిటర్‌గా పనిచేశారు. తల్లి ఉమా శర్మ. రచయిత్రి. ప్రపంచాన్ని ఎలా చూడాలో నాన్న ద్వారా నేర్చుకుంది నీలిమ. అమ్మ వల్ల ఊహాత్మక శక్తి పెరిగింది. ఈ రెండూ తన వృత్తికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అంటుంది నీలిమ. అసలు తను జర్నలిస్ట్ అవడానికి ప్రేరణ మాత్రం తండ్రి నుంచే వచ్చింది అని చెప్తుంది. ఢిల్లీలో చదువు. అమెరికాలో పీహెచ్డీ చేసింది. జర్నలిస్ట్‌గా మొదట పెన్ను పట్టింది ‘‘ది స్టేట్స్‌మన్’’ పత్రికలో. తర్వాత ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది సండే గార్డియన్లకు పనిచేసింది. ప్రస్తుతం ది హఫింగ్టన్ పోస్ట్, డైలీ ఓ, డీఎన్ఏ, న్యూస్ 18లకు కాలమిస్ట్‌గా వ్యాసాలు రాస్తోంది. ఆమె దృష్టి అంతా పాలిటిక్స్, పాలసీస్, జెండర్, రైతుల మీదే. పత్రికల విధానాలు నచ్చలేదు! 2001–02 మధ్య.. హఠాత్తుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్టు గమనించింది నీలిమ. దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునేదాకా వెళ్లాడంటే ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు! వాళ్లకోసం విధానాలు రూపొందించే యంత్రాంగానికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసా? రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో కనీసం రైతులకన్నా తెలుసా? వీటి గురించి కదా తను రిపోర్ట్ చేయాలి. వీటిని కదా.. మీడియా బ్యానర్లు రాయాలి. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. నిజాన్ని చెప్పాలి అంటే తాను పనిచేస్తున్న పత్రికల పాలసీకి భిన్నంగా నడవాలి. అందుకే రాజీనామా చేయాలనుకుంది నీలిమ. వెంటనే నెలవారీ ఖర్చులు, ఈఎమ్ఐలు, కట్టవలసిన లోన్లు కళ్లముందు కనిపించాయి. ఉద్యోగం వదిలేసి పూర్తిగా రైతుల ఆత్మహత్యల రీసెర్చ్ మీదే ఉండాలంటే ఇంకో ఇన్కమ్ సోర్స్కావాలి. అదేంటి? ఈ సంఘర్షణతో మరో రెండేళ్లు గడిచాయి. ఉద్యోగం మాని, విదర్భకు నీలిమ పెయింటర్ కూడా. ఉపనిషత్ల సారమే ఆమె పెయింటింగ్స్ థీమ్. దేశవిదేశాల్లో ఎగ్జిబిషన్స్ పెడ్తుంది. అప్పుడనిపించింది.. ఆదాయం కోసం ఈ కళనే ఉపయోగించుకోవాలని. రైతుల ఆత్మహత్యల పరిస్థితుల మీద రీసెర్చ్‌ను ఖరారు చేసుకుంది. 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసి మహారాష్ట్రలోని విదర్భ బయలుదేరింది. అంతకుముందు మన దేశ వ్యవసాయం, పద్ధతులు, నష్టాలు వగైరా అన్నిటి మీద వచ్చిన పుస్తకాలు, శాస్త్రీయ పరిశోధనలన్నిటినీ అక్కడ చదివింది. తన పరిశోధనను సాగించింది. ఆ శోధననంతా పాఠ్యాంశంగా చెబితే ప్రజలకు పట్టదనీ గ్రహించింది. అందుకే వాటిని కథల రూపంలో, నవలల రూపంలో రాసింది. అలా రాసిన మొదటి పుస్తకం ‘‘రివర్‌స్టోన్స్’’. వ్యవసాయాన్ని, రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ పాలసీలు ఎంత నిర్లక్ష్యం చేశాయో నవలారూపంలో వివరించిన పుస్తకం అది. 2007లో అచ్చయింది. రెండో పుస్తకం ‘‘డెత్ ఆఫ్ ఎ మనీలెండర్’’ 2009లో వచ్చింది. పల్లెల్లో పేదరికాన్ని పట్టించుకోకుండా వదిలేసిన మెయిన్ జర్నలిజం మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రం ఆ పుస్తకం. 2013లో మూడో పుస్తకం ‘‘షూస్ ఆఫ్ ది డెడ్’’ని రాసింది. పొలిటికల్ బుక్‌గా అది బాగా పాపులర్ అయింది. పల్లెల్లోని యువత, నగరంలోని యువత మధ్య ఉండే వ్యత్యాసాన్ని.. దానికి కారణమైన వ్యవస్థకు నీలిమ అద్దం పట్టిందీ నవలలో. 2016లో ‘‘ది హానెస్ట్ సీసన్’’ను రాసింది. పార్లమెంట్ నాలుగు గోడల మధ్య జరిగే డీల్స్‌ను బహిర్గతం చేసిందీ పుస్తకంలో. ఆమె రాసిన ‘‘షూస్ ఆఫ్ ది డెడ్’’నవలను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్టిమారన్ సినిమాగా కూడా రూపొందించబోతున్నాడు. ఇదీ కోట నీలిమ రచయిత్రిగా మారిన తీరు. ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నీలిమ పుస్తకాలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి. కారణం తనకు తెలుగు అంత గొప్పగా రాయడం రాకపోవడమే అంటారు. ‘‘చిన్నప్పుడు మా నాన్న గారు మాకు తెలుగు నేర్పే విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఏదైనా తెలుగు పుస్తకం ఇచ్చి చదవమని చెప్పేవారు. చాలా హార్డ్‌గా ఉంది నాన్నా అంటే అవునా అంటూ ‘వేయి పడగలు’ వంటి భారీ పుస్తకాన్ని తెచ్చి ముందు పెట్టేవారు. మేం మొహం తేలేస్తే.. ‘ఇప్పుడు ముందు ఇచ్చిన పుస్తకం తేలిగ్గా అనిపిస్తుంది కదా.. చదవండి’ అనేవారు. అలా తెలుగు నేర్పే విషయంలో ఎంత పట్టుదలగా ఉండేవారో.. పుస్తకాలు చదివే విషయంలో కూడా అంతే ఇదిగా ఉండేవారు. నా ఎనిమిదో యేటనే చార్ల్స్ డికెన్స్ ‘‘ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ పుస్తకం ఇచ్చారు. అర్థంకాలేదు. మళ్లీ నాలుగేళ్లకు ఇచ్చారు చదవమని. అలా ఉంటుంది ఆయన ట్రైనింగ్. ఈ రోజు ఇలా ఉన్నామంటే అమ్మా, నాన్నే కారణం’’ అని గుర్తు చేసుకుంది నీలిమ. తెలుగు నేర్పాలని తండ్రి అంత ప్రయత్నించినా.. ఢిల్లీలో పెరగడం, వృత్తిరీత్యా ఇంగ్లిష్ భాషకే పరిమితమవడం వల్ల తెలుగు మీద పట్టు రాలేదు నీలిమకు. అందుకే తన పుస్తకాలను తెలుగులో అనువదించేందుకు.. ఇంకా చెప్పాలంటే ఇతర భారతీయ భాషల్లో అనువదించేందుకూ ప్రయత్నిస్తోంది. సమస్యలపై ‘స్టూడియో అడ్డా’ ప్రస్తుతం తెలంగాణ రైతు సమస్యలు, చేనేత కార్మికుల అవస్థలు, గల్ఫ్ వలసల గురించీ అధ్యయనం చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ‘‘తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు భయం కలిగిస్తున్నాయి. ముందు నేను తెలంగాణ పల్లెలన్నీ తిరగాలనుకుంటున్నాను’’ అంది నీలిమ. ఇంకోవైపు ‘‘స్టూడియో అడ్డా’’ అనే సంస్థనూ స్థాపించి.. సోషల్ ఫారమ్‌గా మలిచింది. ఎవరైనా ఆ సంస్థలో ఎన్రోల్ చేసుకోవచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న అన్ని అంశాలు, సమస్యలు చర్చిస్తారు. ఆర్ట్ ఎగ్జిబిషన్స్నూ ఆమె కండక్ట్ చేస్తోంది. ఇదీ కోట నీలిమ మల్టీ టాస్కింగ్. విడోస్ ఆఫ్ విదర్భ నాలుగు పుస్తకాలు రాశాక నీలిమ ఆలోచన మారింది. ఇంత రీసెర్చ్‌లో ఆమెకు విషయాలన్నీ చెప్పింది చనిపోయిన రైతుల భార్యలు, తల్లులే. బరువు, బాధ్యతలను వదిలేసి ఆత్మహత్యతో రైతులు సాంత్వన పొందితే వాటన్నిటినీ నెరవేరుస్తున్నది ఈ ఆడవాళ్లే. అప్పులు తీర్చి, పిల్లలకు చదువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసి జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటి వాళ్ల స్ట్రగుల్‌ని కదా చెప్పాలి అనుకుంది. అందుకే ‘‘విడోస్ ఆఫ్ విదర్భ’’గా పుస్తకాన్ని తెచ్చింది. ‘‘ఈ పుస్తకం రాయడానికి నాలుగేళ్లు పట్టింది. ముందు 100 కేస్‌స్టడీస్ తీసుకున్నా.. అందులోంచి 50 ఎంచుకొని అందులోంచి మళ్లీ పద్దెనిమిది తీసుకున్నా. ఆ పద్దెనిమిది మంది జీవితాలు ఒకేరకంగా లేవు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. ఎవరూ ఎక్కడా ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. ధైర్యంగా నిలబడ్డారు. వాళ్లను చూస్తే.. వాళ్ల కథలు వింటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. వాళ్లకున్నంత సెల్ఫ్ ప్రైడ్, సెల్ఫ్‌రెస్పెక్ట్ అర్బన్ విమెన్, ఈవెన్ వర్కింగ్ క్లాస్ విమెన్‌కి కూడా ఉండదనిపించింది. చాలా నార్మల్ లేడీస్.. చదువు లేదు.. బయటి ప్రపంచం తెలియదు.. ఆర్థికంగా ఎలాంటి అండలేని వాళ్లు.. అయినా వాళ్లు నిలబడ్డ తీరు.. అద్భుతం! వాళ్ల భర్తలు చేసిన పనే వాళ్లు చేసి ఉంటే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడేవి?’’ అంటూ తన పుస్తక నేపథ్యాన్ని వివరించింది నీలిమ. – సరస్వతి రమ -
పదికి పది వికెట్లు తీసిన భారత బౌలర్
హార్ట్లీపూల్: క్రికెట్లో ఒకే బౌలర్ పదికి పది వికెట్లు తీయడం చాలా కష్టం. గతంలో భారత్ తరపున అనిల్ కుంబ్లే టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్‌పై ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీశాడు. అయితే మరో భారత బౌలర్ పది పదికి వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. విదర్భ ఆటగాడు శ్రీకాంత్ వాగ్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే నార్త్ యార్క్‌షైర్-సౌత్ దుర్హామ్(ఎన్‌వైఎస్‌డీ) క్రికెట్ లీగ్‌లో భాగంగా స్టోక్స్‌స్లే క్రికెట్ క్లబ్ తరపున ఆడిన శ్రీకాంత్ వాగ్.. రెండు రోజుల క్రితం మిడిల్స్ బ్రాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్లతో చెలరేగిపోయాడు. మొత్తంగా 11.4 ఓవర్లు వేసిన వాగ్ 1 మెయిడిన్ సాయంతో 39 పరుగులిచ్చి పది వికెట్లను నేలకూల్చాడు. ఈ విషయాన్ని ఎన్‌వైఎస్‌డీ తన అధికారిక ట్వీటర్లో తెలిపింది. గతంలో ఇర్పాన్ పఠాన్ ఒక మ్యాచ్‌లో పది వికెట్లు తీసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. 2003-04 అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్పాన్ పఠాన్ తొమ్మిది వికెట్లు సాధించాడు. A scorecard to remember for @Stokesley_CC pro Shrikant Wagh pic.twitter.com/V8xWqB9zBv — Official NYSDCricket (@NYSDCricket) 30 June 2018 -
విదర్భదే ఇరానీ కప్
నాగ్‌పూర్: తొలిసారి రంజీ ట్రోఫీ సాధించిన విదర్భ జట్టు ఇరానీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాతో ఇక్కడ జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన విదర్భ ఆ తర్వాత ప్రత్యర్థిని 390 పరుగులకే ఆలౌట్ చేసి 410 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. మ్యాచ్ చివరి రోజు మరోసారి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఐదు రోజుల ఫైనల్లో ఫలితం తేలకపోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న విదర్భకు టైటిల్ ఖాయమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసిన వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు 236/6 పరుగులతో ఆదివారం ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (327 బంతుల్లో 183; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు), జయంత్ యాదవ్ (96; 14 ఫోర్లు) పోరాడటంతో ఒక దశలో 314/6తో నిలిచింది. కానీ జయంత్ అవుటయ్యాక విహారికి సహకారం అందించే వారు కరువయ్యారు. దీంతో భారీ షాట్లు ఆడిన అతను చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రత్యర్థి బౌలర్లలో గుర్బా నీ 4, ఆదిత్య సర్వతే 3, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. హనుమ విహారి భారీ శతకం రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి ఆటే హైలైట్. 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకొచ్చిన అతను తుదికంటా పోరాడాడు. సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా స్పిన్నర్ జయంత్ యాదవ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 81 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న విహారి చివరి రోజు మరో 102 పరుగులు చేసి భారీ శతకం బాదాడు. జయంత్ అవుటయ్యాక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ నదీమ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 59 పరుగులు జతచేశాడు. ఆ తర్వాత భారీ షాట్లకు దిగిన అతను సర్వతే బౌలింగ్‌లో అపూర్వ్ వాంఖడేకు చిక్కడంతో రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. సంక్షిప్త స్కోర్లు: విదర్భ తొలి ఇన్నింగ్స్: 800/7; రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 390 ఆలౌట్ (విహారి 183, జయంత్ యాదవ్ 96, రజనీశ్ గుర్బానీ 4/70); విదర్భ రెండో ఇన్నింగ్స్ 79/0 (అక్షయ్ వాడ్కర్ 50). ►27 ప్రతి ఏడాది రంజీ ట్రోఫీ విజేత, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య జరిగే ఇరానీ కప్‌ను రంజీ చాంపియన్ గెల్చుకోవడం ఇది 27వ సారి. -
విదర్భ 800/7 డిక్లేర్డ్
నాగ్‌పూర్: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతోన్న ఇరానీ కప్ మ్యాచ్‌లో విదర్భ పట్టు బిగించింది. 800/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆ జట్టు అనంతరం ప్రత్యర్థి కీలక వికెట్లు తీసి ఆధిపత్యం కొనసాగించింది. నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ప్రస్తుతం నాలుగు వికెట్లు చేతిలో ఉన్న ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 564 పరుగులు వెనుకబడి ఉంది. పేస్ బౌలర్ రజనీశ్ గుర్బానీ (4/46) ధాటికి 98 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (171 బంతుల్లో 81 బ్యాటింగ్; 10 ఫోర్లు), జయంత్ యాదవ్ (62 బ్యాటింగ్; 9 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు అభేద్యమైన ఏడో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. ఓపెనర్ పృథ్వీ షా (51; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న సమర్థ్ (0), మయాంక్ అగర్వాల్ (11)లతో పాటు కెప్టెన్ కరుణ్ నాయర్ (21), మరో ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (0), అశ్విన్ (8) విఫలమయ్యారు. అంతకుముందు 702/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ అపూర్వ్ వాంఖడే (157; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత శతకంతో భారీ స్కోరు చేయగలిగింది. -
విదర్భ 702/5
నాగ్‌పూర్: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతోన్న ఇరానీ కప్ మ్యాచ్‌లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 5 వికెట్ల నష్టానికి 702 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 588/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ (431 బంతుల్లో 286; 34 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక్క పరుగు మాత్రమే జతచేసి ట్రిపుల్ సెంచరీకి 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అపూర్వ్ వాంఖడే (99 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షయ్ వాడ్కర్ (37; 4 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 91 పరుగులు జతచేశాడు. అక్షయ్ అవుటయ్యాక మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడటంతో ఆట నిలిచిపోయింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి శతకానికి ఒక్క పరుగు దూరంలో ఉన్న అపూర్వ్తో పాటు ఆదిత్య సర్వతే (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్‌కు 2, అశ్విన్, నదీమ్ జయంత్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. మూడో రోజు అశ్విన్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం గమనార్హం. 28 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన నేపథ్యంలో నాలుగో రోజు విదర్భ ఎప్పుడు డిక్లేర్ చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో విదర్భ డిక్లేర్ చేసిన అనంతరం రెస్టాఫ్ ఇండియాను ఆలౌట్ చేయలేకపోతే... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ప్రకారం కాకుండా ఇన్నింగ్స్ రన్‌రేట్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు. -
జాఫర్ 285 బ్యాటింగ్
నాగ్‌పూర్ : ఇరానీ కప్ మ్యాచ్‌లో రెండో రోజు కూడా వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ జోరు కొనసాగింది. జాఫర్ (425 బంతుల్లో 285 బ్యాటింగ్: 34 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత డబుల్ సెంచరీతో రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో గురువారం ఆట ముగిసేసరికి విదర్భ 3 వికెట్ల నష్టానికి 588 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ గణేశ్ సతీశ్ (280 బంతుల్లో 120; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి పిచ్‌పై తొలి రోజు 2 వికెట్లు తీసిన రెస్టాఫ్ ఇండియా రెండో రోజు కూడా 90 ఓవర్ల పాటు శ్రమించినా ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగింది. ప్రస్తుతం జాఫర్‌తో పాటు అపూర్వ్ వాంఖడే (44 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 289/2తో విదర్భ రెండో రోజు ఆట ప్రారంభించింది. ఆరంభంలో రెస్టాఫ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో తొలి తొమ్మిది ఓవర్లలో ఎనిమిది పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో జాఫర్, సతీశ్ అలవోకగా పరుగులు సాధించారు. అశ్విన్ కొన్ని సార్లు వీరిద్దరిపై ఒత్తిడి పెంచగలిగినా వికెట్ మాత్రం దక్కలేదు. లంచ్ సమయానికి విదర్భ స్కోరు 407/2 కాగా...టీ విరామానికి అది 504కు చేరింది. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాఫర్ ఎనిమిదో డబుల్ సెంచరీని పూర్తి చేసుకోగా... సతీశ్ 12వ శతకం సాధించాడు. ఎట్టకేలకు మూడో సెషన్లో ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చిన బంతిని ఆడబోయి సతీశ్ వికెట్ కీపర్ భరత్‌కు క్యాచ్ ఇవ్వడంతో 289 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం 250 పరుగుల మైలురాయిని కూడా దాటిన జాఫర్ ఇరానీ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మురళీ విజయ్ (266) రికార్డును కూడా అధిగమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 40 ఏళ్ల వయసులో ఒకే ఇన్నింగ్స్‌లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ, ఆసియా క్రికెటర్ జాఫర్. -
చిత్తుగా ఓడిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: విజయ్ హజారే వన్డే టోర్నీలో వరుసగా రెండు విజయాలు సాధించి జోరు మీదున్న హైదరాబాద్‌కు మూడో మ్యాచ్‌లో ఎదురు దెబ్బ తగిలింది. గురువారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో విదర్భ 237 పరుగుల భారీ తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా విదర్భ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేయగా... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ 34.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్ (97 బంతుల్లో 103; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సాధించగా... రవి జాంగిడ్ (62 బంతుల్లో 81; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అపూర్వ్ వాంఖడే (43 బంతుల్లో 66; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్ రాయుడు (3), అక్షత్ రెడ్డి (6), సందీప్ (7), చైతన్యరెడ్డి (5) ఘోరంగా విఫలమయ్యారు. రెండు మ్యాచ్‌ల నిషేధం పూర్తయిన తర్వాత ఈ మ్యాచ్ బరిలోకి దిగిన కెప్టెన్ అంబటి రాయుడు (21) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 43 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సుమంత్ కొల్లా (30; 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడినా... రవితేజ (7), భండారి (10), మెహదీ హసన్ (0), సిరాజ్ (10)ల వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి చాలా దూరంలో హైదరాబాద్ ఆట ముగిసింది. విదర్భ బౌలర్లలో కరణ్ శర్మ మూడు, శ్రీకాంత్ వాఘ్ రెండు వికెట్లు పడగొట్టారు. -
హ్యాట్రిక్ విజయం కోసం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయం కోసం నేడు విదర్భ జట్టుతో తలపడనుంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు విదర్భ కూడా రెండు వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. సమఉజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు ఆధిపత్యం కోసం ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. గ్రూప్ ‘డి’ లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌లో సత్తా చాటుతోంది. రెండు మ్యాచ్‌ల్లో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించారు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో అక్షత్ రెడ్డి, జార్ఖండ్‌తో పోరులో రోహిత్ రాయుడు భారీ సెంచరీలతో చెలరేగారు. బావనక సందీప్, సుమంత్ కొల్లా అర్ధసెంచరీలతో ఫామ్‌లో ఉన్నారు. ఆకాశ్ భండారి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన పేసర్ సిరాజ్ కూడా తన బౌలింగ్ పదును చూపిస్తున్నాడు. మరోవైపు ఇటీవలే రంజీ ట్రోఫీని గెలిచి ఊపు మీదున్న విదర్భ జట్టులో బౌలర్లు సమష్టిగా రాణిస్తున్నారు. రంజీలో సత్తా చాటిన బౌలర్ రజనీశ్ గుర్బానీ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. ఉమేశ్ యాదవ్, యశ్ ఠాకూర్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో జితేశ్ శర్మ, గణేశ్ సతీశ్, సంజయ్ రామస్వామి, అపూర్వ్ వాంఖడే నిలకడగా ఆడుతున్నారు. వీరిని నిలువరిస్తే హైదరాబాద్‌కు హ్యాట్రిక్ విజయం దక్కుతుంది. -
అటు సౌరాష్ట్ర... ఇటు విదర్భ
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ చాంపియన్ విదర్భ విజయ్ హజారే వన్డే టోర్నీలో కూడా శుభారంభం చేసింది. సోమవారం ఏఓసీ గ్రౌండ్స్‌లో హోరాహోరీగా జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో విదర్భ 7 పరుగుల స్వల్ప తేడాతో జార్ఖండ్‌పై విజయం సాధించింది. విదర్భ 50 ఓవర్లలో సరిగ్గా 300 పరుగులకు ఆలౌట్ కాగా... జార్ఖండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులే చేయగలిగింది. జింఖానా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో సౌరాష్ట్ర 32 పరుగులతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది. ముందుగా సౌరాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేయగా, ఛత్తీస్‌గఢ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులే చేయగలిగింది. రాణించిన జితేశ్, సంజయ్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విదర్భ ఆరంభంలోనే కెప్టెన్ ఫైజ్ ఫజల్ (9) వికెట్ కోల్పోయింది. అయితే జితేశ్ శర్మ (83 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్), తొలి మ్యాచ్ ఆడుతున్న సంజయ్ రామస్వామి (86 బంతుల్లో 77; 9 ఫోర్లు) కలసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. చివర్లో అపూర్వ్ వాంఖడే (34 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. జార్ఖండ్ బౌలర్లలో రాహుల్ శుక్లా 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...అతుల్ సుర్వర్, షాబాజ్ నదీమ్, వికాస్ సింగ్ తలా 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే జార్ఖండ్ ఓపెనర్ సిద్దిఖీ (0) అవుట్ కాగా, విరాట్ సింగ్ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో సీనియర్ ఆటగాడు సౌరభ్ తివారి (77 బంతుల్లో 65; 7 ఫోర్లు) రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించిన తివారి... కుమార్ దేవబ్రత్ (76 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో నాలుగో వికెట్‌కు 72 పరుగులు జత చేశాడు. అయితే తివారిని కరణ్ శర్మ అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివర్లో వికాశ్ సింగ్ (37 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. షెల్డన్ జాక్సన్ సెంచరీ... భారత టెస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా, ఓపెనర్ షెల్డన్ జాక్సన్ భారీ భాగస్వామ్యం సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. రాబిన్ ఉతప్ప (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగిన తర్వాత జాక్సన్ (107 బంతుల్లో 106 రిటైర్డ్‌హర్ట్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), పుజారా (92 బంతుల్లో 60; 4 ఫోర్లు) కలసి రెండో వికెట్‌కు 170 పరుగులు జత చేశారు. ఆ తర్వాతి ఆటగాళ్లలో ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 23) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. పంకజ్ రావు, షానవాజ్ హుస్సేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛత్తీస్‌గఢ్ ఆటగాళ్లు కొంత పోరాటం కనబర్చినా లక్ష్యానికి జట్టు చాలా దూరంలో ఆగిపోయింది. మనోజ్ సింగ్ (74 బంతుల్లో 58; 6 ఫోర్లు), విశాల్ కుష్వా (38 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేయగా, సహ్బన్ ఖాన్ (40) ఫర్వాలేదనిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ ధర్మేంద్ర జడేజా (4/41) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. -
సంజయ్ మంజ్రేకర్‌పై నెటిజన్ల ఆగ్రహం
ముంబై : భారత మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ప్రతిష్టాత్మకమైన దేశవాళీకప్ రంజీ ట్రోఫీని విదర్భజట్టు గెలుచుకున్న నేపథ్యంలో మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారాన్ని లేపాయి. విదర్భ విజయాన్ని మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అన్ని వర్గాల వారు ప్రశంసిస్తుండగా.. ఈనేపథ్యంలో మంజ్రేకర్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. విదర్భజట్టును ప్రశంసిస్తూనే ఇద్దరి ముంబై క్రికెటర్ల వల్లే ఈ విజయం సాధ్యమైందని, వారిని ప్రస్తావించలేదని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా మంజ్రేకర్‌పై ఆగ్రహంతో విమర్శల దాడికి దిగారు. హాస్యాస్పదమైన ట్వీట్.. మిగతా ప్లేయర్లతో ముంబై ఎందుకు నెం.1 కాలేకపోయిందని ఒకరు కామెంట్ చేయగా.. దేశంలో ముంబై కంటే ఇతర ఆటగాళ్లు బాగా ఆడుతారని తెలుసుకోండని మరొకరు.. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక పోతున్నావు. ముంబై, తమిళనాడు ప్లేయర్లు విదర్భ జట్టులో ఉంటే ఏమిటని ఇంకోకరు ప్రశ్నించారు. And yes, Vidarbha, don’t mention it. You are most welcome* *Two Mumbai stalwarts in the squad.😉 — Sanjay Manjrekar (@sanjaymanjrekar) 1 January 2018 -
నా కల నిజమైంది: రజ్నీస్ గుర్బానీ
ఇండోర్: ఈ రంజీ సీజన్లో వెలుగులోకి వచ్చిన యువ పేసర్ రజ్నీస్ గుర్బానీ.. విదర్బ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన 24 ఏళ్ల ఈ యువ సంచలనం జట్టు తొలిసారి రంజీ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్లో 12 వికెట్లు సాధించిన గుర్బానీ.. ఢిల్లీతో జరిగిన తుది పోరులో 8 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా చూస్తే ఆరు మ్యాచ్‌లు ఆడిన గుర్బానీ 39 వికెట్లు సాధించాడు. ఫలితంగా ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా గుర్బానీ నిలిచాడు. అయితే తన వ్యక్తిగత ప్రదర్శన కంటే కూడా జట్టు టైటిల్‌ను కైవసం చేసుకోవడంపై గుర్బానీ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ' నేను రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండాలని తరచు కలలు కనేవాణ్ని. నా డ్రీమ్ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు రంజీ టైటిల్‌ను గెలవడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. మా అత్యుత్తమ ప్రదర్శతోనే అది సాధ్యమైంది. రాబోవు మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాం' అని గుర్బానీ తెలిపాడు. నిన్న ఢిల్లీతో ముగిసిన తుది పోరులో విదర్భ 9 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
ప్రత్యర్థి జట్టుపై గంభీర్ ప్రశంసల వర్షం
ఇండోర్: రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి టైటిల్ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విదర్భ జట్టుపై ఢిల్లీ జట్టులో సభ్యుడి గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. విదర్భ టైటిల్ సాధించిన తరువాత తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ప్రత్యర్థి జట్టును కొనియాడాడు. రంజీ టైటిల్ గెలిచిన విదర్భ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిందని ప్రశంసించాడు. 'ఆద్యంతం ఆకట్టుకుని మొదటిసారి రంజీ టైటిల్‌ను విదర్భ ఖాతాలో వేసుకుంది. వెల్డన్ విదర్భ. ఆ జట్టుకు మంచి రోజులు రానున్నాయనడానికి ఇది సంకేతం. ఈ టైటిలే కాదు.. భవిష్యత్తులో ఇంతకంటే మంచి విజయాలను విదర్భ సొంతం చేసుకుంటుంది. ఫైజ్ఫజల్ గ్యాంగ్‌కు అభినందనలు' అని గంభీర్ పేర్కొన్నాడు. అదే సమయంలో ఈ సీజన్లో తమ జట్టు ప్రదర్శన కూడా గర్వించే విధంగానే ఉందన్నాడు. రంజీ ట్రోఫీలో రన్నరప్‌గా నిలవడం ఎంతమాత్రం అవమానకరం కాదన్నాడు. తమ అత్యుత్తమ ప్రదర్శనతోనే ఫైనల్‌కు చేరామన్న గంభీర్.. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామన్నాడు. సోమవారం ముగిసిన రంజీ ట్రోఫీ ఫైనల్ పోరులో ఢిల్లీపై 9 వికెట్ల తేడాతో గెలిచిన విదర్బ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తొలిసారి ఫైనల్‌కు చేరడమే కాకుండా ఏకంగా టైటిల్‌ను సొంతం చేసుకుని అరుదైన మైలురాయిని అందుకుంది. -
అనామక జట్టు నుంచి అజేయంగా...
ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చేసే స్టార్లు లేరు...! ఒకరిద్దరు తప్ప మ్యాచ్‌ను తిప్పేసే వీరులు లేరు...! జట్టుగా, ఆటతీరుపరంగానూ పెద్దగా పేరు లేదు...! ...అయినా విదర్భ అద్భుతం చేసింది. రంజీ గెలిచింది..! సాక్షి క్రీడా విభాగం: ముంబై, మహారాష్ట్ర వంటి జట్లున్న మహారాష్ట్రలో మూడో జట్టుగా విదర్భ అనామకమైనదే. దీనికి తగ్గట్లే ఈ ప్రాంతం నుంచి టీమిండియాకు ఆడింది ఇద్దరే. మొదటివాడు పేసర్ ఉమేశ్‌యాదవ్ కాగా రెండో వ్యక్తి ప్రస్తుత విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్. ఉమేశ్ గురించి చెప్పేదేమీ లేకున్నా... ఫజల్ ప్రాతినిధ్యం వహించింది మాత్రం ఒక్క వన్డేలోనే. అదీ జింబాబ్వేతో. వీరుకాక సగటు క్రికెట్ అభిమానికి చూచాయగా తెలిసిన జట్టు సభ్యుడి పేరే లేదు. కానీ సమష్టిగా ఆడిన విదర్భ పటిష్ఠ జట్లనూ మట్టి కరిపించింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా కాదు కదా... కనీస పోటీదారుగానైనా పరిగణించని దశ నుంచి విజేతగా నిలిచింది. పునాది అక్కడే... దాదాపు పదేళ్ల నుంచి విదర్భ క్రమక్రమంగా ఎదుగుతోంది. ఇందుకు పునాది వేసింది బీసీసీఐ, ఐసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన శశాంక్ మనోహర్. ఈయన ఇక్కడివారే కావడంతో తమ ప్రధాన నగరమైన నాగ్‌పూర్‌లోని జామ్తాలో అత్యుత్తమ స్టేడియం నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 2008లో స్టేడియం నిర్మాణం తర్వాత విదర్భ జట్టులో ప్రొఫెషనలిజం మరింత పెరిగింది. జూనియర్ స్థాయి క్రికెటర్లకు మంచి అవకాశాలు వచ్చాయి. వారిలో ప్రతిభ గలవారంతా రంజీ స్థాయి వరకు దూసుకొచ్చారు. ఇది జట్టుగా విదర్భకు ఎంతో మేలు చేసింది. రాతమార్చింది వారే... చంద్రకాత్ పండిట్, వసీం జాఫర్... భారత జట్టు మాజీ ఆటగాళ్లైన ఈ ముంబైకర్లు విదర్భ తాజా ప్రదర్శనలో కీలక పాత్ర పోషించారు. ఆటగాడిగా, కోచ్‌గా ముంబై రంజీ ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించిన చంద్రకాంత్‌ను కొన్ని కారణాలతో గత సీజన్ తర్వాత ముంబై తప్పించింది. ఆ కసి నంతా అతను విదర్భను తీర్చిదిద్దడంపై చూపాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం, జట్టులో స్ఫూర్తినింపడంతో పాటు టైటిల్ గెలవాలన్న కోరికను మొదటి రోజు నుంచే నూరిపోశాడు. ఫైనల్లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాడ్కర్ అద్భుత శతకం చేయడం, తమకంటే మెరుగైన కర్ణాటకను తీవ్ర ఉత్కంఠ మధ్య సెమీఫైనల్లో ఓడించిన తీరే విదర్భ మనోస్థైర్యాన్ని చాటిచెబుతోంది. ఇక ఆటగాడు–ప్రేరకుడిగా జట్టులోకి వచ్చిన వసీం జాఫర్, అయిదు శతకాలు చేసిన కెప్టెన్ ఫజల్ కీలక సమయాల్లో రాణించి తమ అనుభవానికి సార్థకత చేకూర్చారు. గెలుపు గుర్రం గుర్బానీ... 27... క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్‌లో పేసర్ రజనీష్ గుర్బానీ తీసిన వికెట్లు. ఇదే సమయంలో జట్టులోని మిగతా బౌలర్లు తీసిన వికెట్లు 32 కావడం గమనార్హం. ముఖ్యంగా సెమీస్, ఫైనల్స్‌లో అదరగొట్టి తురుపుముక్కగా నిలిచాడు. మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ ఇతడే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కావడం విశేషం. ఈ జోరు చూస్తే 24 ఏళ్ల గుర్బానీకి ముందుముందు మంచి అవకాశాలు తలుపుతట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మేల్కొలుపు... ప్రేరణ కలిసికట్టుగా ఆడితే ఏ జట్టైనా రంజీట్రోఫీని అందుకోవచ్చని విదర్భ విజయం నిరూపించింది. ఇదే సమయంలో అన్ని వనరులూ ఉండి ముందుకెళ్లలేకపోతున్న హైదరాబాద్, ఆంధ్రవంటి జట్లకు ఈ గెలుపు ఓ పాఠమే. మరోవైపు ట్రోఫీని పదులసార్లు సొంతం చేసుకుని రంజీ రారాజుగా పేరొందిన ముంబైని సవాల్ చేసే జట్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఐదు సీజన్లలో ఒక్కసారి మాత్రమే ఆ జట్టు విజేతగా నిలవడమే ఇందుకు నిదర్శనం. -
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అక్షయ్ తొలి సెంచరీ..
ఇండోర్:గత నెల్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన విదర్భ వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ తొలి సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అక్షయ్ శతకం నమోదు చేశాడు. ఆదివారం టీ బ్రేక్‌కు ముందు అక్షయ్ ఫోర్ కొట్టి సెంచరీ మార్కును చేరాడు. మరొకవైపు ఏడో వికెట్‌కు ఆదిత్య సార్వేతే (79)తో కలిసి 169 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు. ఇది ఈ సీజన్లో విదర్భ ఏడో వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యంగా నమోదైంది. ఈ క్రమంలోనే విదర్బ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విదర్భ.. తుది పోరులో కూడా అంచనాలు మించి రాణిస్తోంది. ఈ ఫైనల్ పోరులో విదర్బ బౌలర్ రజ్నీస్ గుర్బానీ ఆరు వికెట్లు సాధించడంతో ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే కుప్పకూలింది. -
హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిపోయాడు..!
ఇండోర్: ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్బ పేసర్ రజ్నీస్ గుర్బానీ పదునైన బంతులతో చెలరేగిపోయాడు. ఇందులో హ్యాట్రిక్ వికెట్లను సాధించి పటిష్టమైన ఢిల్లీని బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ 100 ఓవర్ ఐదో బంతికి వికాశ్ మిశ్రాను అవుట్ చేసిన గుర్బానీ.. ఆ తరువాత బంతికి నవదీప్ షైనీని బోల్తా కొట్టించాడు. ఇక 102 ఓవర్ తొలి బంతికి ధ్రవ్ షోరేను అవుట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కు ఊపిరాడకుండా చేసి ఆరు వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. గుర్బానీ ఆరు వికెట్లకు జతగా ఆదిత్య థాకరే రెండు వికెట్లు సాధించగా, సిద్దేశ్ నెరాల్, అక్షయ్ వాఖారేలకు తలో వికెట్ తీశారు. రంజీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన విదర్బ.. అంచనాల మించి రాణిస్తోంది. ప్రధానంగా గుర్బానీ తన పేస్‌తో ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నాడు. అంతకముందు కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్లో గుర్బానీ 12 వికెట్లతో సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన గుర్బానీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో మెరిశాడు. దాంతో విదర్బ ఫైనల్‌కు చేరి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఒకవేళ రంజీ టైటిల్ గెలిస్తే మాత్రం ఫైనల్‌కు చేరిన మొదటిసారే టైటిల్ సాధించిన జట్టుగా అరుదైన ఘనతను విదర్బ సొంతం చేసుకుంటుంది. -
ధ్రువ్ సెంచరీ
ఇండోర్: ఆధిక్యం చేతులు మారుతూ... రంజీ ట్రోఫీ తుది సమరం ఆసక్తికరంగా ప్రారంభమైంది. విదర్భతో శుక్రవారం మొదలైన ఫైనల్లో తొలి రోజు ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సీనియర్ బ్యాట్స్‌మన్ గంభీర్ (15)తో పాటు నితీశ్ రాణా (21), కెప్టెన్ రిషభ్ పంత్ (21) కూడా విఫలమవడంతో ఒక దశలో 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ షరాయ్ (256 బంతుల్లో 123 బ్యాటింగ్; 17 ఫోర్లు) అద్భుత శతకంతో ఆదుకున్నాడు. హిమ్మత్ సింగ్ (72 బంతుల్లో 66; 2 సిక్స్‌లు, 8 ఫోర్లు) అండగా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వీరిద్దరూ అయిదో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన హిమ్మత్... గుర్బానీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మనన్ శర్మ (13)తో ధ్రువ్ ఆరో వికెట్‌కు 36 పరుగులు జత చేశాడు. విదర్భ బౌలర్లలో థాకరే, గుర్బానీ చెరో రెండు వికెట్లు తీశారు. -
వారెవ్వా విదర్భ
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్...కర్ణాటక విజయానికి మరో 87 పరుగులు కావాలి... విదర్భ తొలిసారి ఫైనల్ చేరేందుకు మరో 3 వికెట్లు తీయాలి...కర్ణాటక లోయర్ ఆర్డర్ పోరాడుతోంది...మరో వికెట్ కోల్పోయినా 78 పరుగులు వచ్చేశాయి... ఇక చేతిలో 2 వికెట్లతో చేయాల్సింది 9 పరుగులే...ఈ దశలో మ్యాచ్‌లో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది... కావాల్సినంత సమయం కర్ణాటకకు ఉండగా, విదర్భ దాదాపు మ్యాచ్ చేజార్చుకున్నట్లే అనిపించింది... అయితే ఒత్తిడిలో చిత్తయిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మిథున్ కొట్టిన తప్పుడు షాట్ విదర్భకు దారి చూపించింది. మరో 3 పరుగులకే చివరి వికెట్ కూడా తీసి ఆ జట్టు చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీశ్ గుర్బాని అద్భుత బౌలింగ్‌తో ముందుండి నడిపించగా తొలిసారి రంజీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కోల్‌కతా: తొలి రోజు నుంచి ఆధిక్యం చేతులు మారి విజయం దోబూచులాడుతూ వచ్చిన మ్యాచ్‌లో చివరకు గెలుపు విదర్భను వరించింది. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో ముగిసిన రంజీ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో విదర్భ 5 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 111/7తో ఆట కొనసాగించిన కర్ణాటక తమ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. వినయ్ కుమార్ (36), అభిమన్యు మిథున్ (33), శ్రేయస్ గోపాల్ (23 నాటౌట్) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. విదర్భ పేసర్ రజనీశ్ గుర్బాని (7/68) చివరి రోజు కూడా చెలరేగి ఆఖరి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. గురువారం కర్ణాటక ఇన్నింగ్స్ 16.1 ఓవర్లు సాగింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 12 వికెట్లు గుర్బానికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నెల 29నుంచి ఇండోర్‌లో జరిగే ఫైనల్లో ఢిల్లీతో విదర్భ తలపడుతుంది. మలుపులు, మెరుపులు... రంజీ ట్రోఫీ చరిత్రలో గొప్ప మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయే ఈ సెమీస్‌లో ఆఖరి రోజు 75 నిమిషాల పాటు సాగిన ఆటలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. చక్కటి పోరాటపటిమతో మ్యాచ్‌ను ఇక్కడి దాకా తీసుకొచ్చిన విదర్భ చివర్లో కాస్త తడబాటుకు లోనైంది. ఫలితంగా కర్ణాటక బ్యాట్స్‌మెన్ చకచకా పరుగులు సాధించారు. వరుసగా చెత్త బంతులు వేయడంతో వేగంగా పరుగులు వచ్చాయి. అయితే గుర్బాని ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వినయ్ కుమార్ అదే ఓవర్ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో విదర్భ జట్టులో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత వచ్చిన మిథున్ బౌండరీలతో ఎదురుదాడి చేశాడు. నిజానికి 1 పరుగు వద్ద సింగిల్ తీసే ప్రయత్నంలో సగం పిచ్ దాటిన మిథున్, గోపాల్ తిరస్కరించడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే కీపర్ వాడ్కర్ బంతిని సరిగా అందుకోకపోవడంతో మిథున్ బతికిపోయాడు. అతను ఉమేశ్, సర్వతే ఓవర్లలో వరుసగా రెండేసి బౌండరీలు బాదాడు. ఈ జోరులో కర్ణాటక గెలుపు ఖాయంలా అనిపించింది. కానీ అత్యుత్సాహం ప్రదర్శించిన మిథున్...గుర్బానీ బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. గాల్లో లేచిన బంతిని డీప్ పాయింట్లో సర్వతే అందుకోవడంతో కర్ణాటక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో పొరపాటు కర్ణాటక ఆట ముగించింది. అప్పటికే నిలదొక్కుకున్న, కెరీర్లో నాలుగు సెంచరీలు సాధించిన రికార్డు ఉన్న శ్రేయస్ గోపాల్ ఒక ఎండ్‌లో ఉండగా... బలహీన బ్యాట్స్‌మన్ అరవింద్ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడంతో అతనే మళ్లీ స్ట్రైక్‌కు రావాల్సి రావడం ఆ జట్టు రాతను మార్చింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే అరవింద్‌ను అవుట్ చేసిన గుర్బాని ఉద్వేగంగా కంటతడి పెట్టాడు. విదర్భ సంబరాల్లో మునిగిపోగా...కర్ణాటక తమను తాము నిందించుకోవాల్సి వచ్చింది. చివరకు వేదన... రంజీ నాకౌట్లో ఇలాంటి ఫలితాలు గతంలోనూ వచ్చాయి. 1990–91 ఫైనల్లో హర్యానా చేతిలో 2 పరుగులతో ముంబై ఓడగా...1992–93 ప్రిక్వార్టర్ ఫైనల్లో కర్ణాటక 5 పరుగులతో మధ్యప్రదేశ్ చేతిలో పరాజయంపాలైంది. 2009–10 ఫైనల్లో కర్ణాటక 6 పరుగులతో ముంబై చేతిలో ఓడింది. బరోడా, సదరన్ పంజాబ్ మధ్య 1945–46 సెమీస్ ‘టై’గా ము గియగా, టాస్‌తో బరోడాను విజేతగా తేల్చారు. -
రంజీ చరిత్రలో తొలిసారి..
కోల్‌కతా: రంజీట్రోఫీ చరిత్రలో విదర్బ తొలిసారి ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో విదర్భ ఐదు పరుగుల తేడాతో విజయం నమోదు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. విదర్బ పేసర్ రజ్నీస్ గుర్బానీ ఏడు వికెట్లతో చెలరేగడంతో కర్ణాటక స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా విదర్బ జట్టు మొదటిసారి రంజీ ఫైనల్‌కు చేరి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. కర్ణాటక తన రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 192 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. చివరి రోజు విదర్బ విజయానికి మూడు వికెట్లు మాత్రమే అవసరమయ్యాయి. ఆ మూడు వికెట్లను గుర్బానీ తన ఖాతాలో వేసుకుని జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. కర్ణాటక ఆటగాళ్లలో కరుణ్ నాయర్(30), వినయ్ కుమార్(36), అభినవ్ మిథున్(33), రవికుమార్ సమరత్(24),సీఎం గౌతమ్(24), శ్రేయస్ గోపాల్(24)లు రెండంకెల స్కోరుకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో గుర్బానీ మొత్తంగా 12 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటగా, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంచితే, మరొక సెమీ ఫైనల్లో ఢిల్లీ ఇన్నింగ్స్ 26 పరుగుల తేడాతో బెంగాల్‌పై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. డిసెంబర్ 29వ తేదీన ఇండోర్‌లో విదర్బ-ఢిల్లీ జట్ల మధ్య టైటిల్ పోరు ఆరంభం కానుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ 185 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 313 ఆలౌట్ కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 301 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 192 ఆలౌట్ -
తెలంగాణ జట్లకు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ జాతీయ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర జట్లు రాణించాయి. సరూర్‌నగర్ ఖో–ఖో స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మహిళల, పురుషుల విభాగాల్లో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. మహిళల టైటిల్‌పోరులో మహారాష్ట్ర 15–6తో కర్ణాటకపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విదర్భపై తెలంగాణ గెలుపొందింది. పురుషుల ఫైనల్లో మహారాష్ట్ర 22–5తో కొల్హాపూర్‌పై విజయం సాధించింది. ఈ కేటగిరీలో తెలంగాణ మూడోస్థానంలో, కేరళ నాలుగో స్థానంలో నిలిచాయి. టోర్నీ ముగింపు కార్యక్రమంలో ‘శాట్స్’ ఎండీ ఎ. దినకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత ఖో–ఖో సమాఖ్య కార్యదర్శి మహేందర్ సింగ్ త్యాగి, తెలంగాణ ఖో–ఖో సంఘం కార్యదర్శి వై. శ్రీనివాస రావు, రంగారెడ్డి జిల్లా ఖో–ఖో సంఘం కార్యదర్శి కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బంతి తగిలి కుప్పకూలిన క్రికెటర్
కళ్యాణి (వెస్ట్ బెంగాల్): విదర్భ-బెంగాల్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రూప్-డి మ్యాచ్ లో భాగంగా ఇక్కడ బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ లో బెంగాల్ తో జరుగుతున్న మ్యాచ్ లో విదర్భ ఆల్ రౌండర్ ఆదిత్య సర్వాతే తలకు బలంగా బంతికి తగలడంతో క్రీజ్ లో కుప్పకూలిపోయాడు. శుక్రవారం మూడో రోజు ఆటలో భాగంగా బెంగాల్ బౌలర్ ఇషాన్ పోరెల్ సంధించిన బౌన్సర్ ఒకటి ఆదిత్యా సర్వాతే తలక బలగా తాకింది. బంతిని పుల్ చేసే క్రమంలో అది కాస్తా మిస్సయ్యి హెల్మెట్ కు కుడివైపున తగిలింది. దాంతో విలవిల్లాడిన ఆదిత్యా క్రీజ్ లోనే కూలబడిపోయాడు. ఆపై వెంటనే బెంగాల్ జట్టు సభ్యుల సాయంతో గ్రౌండ్ సిబ్బంది అతన్ని మైదానంలోకి తరలించారు. ఆ క్రమంలోనే ఆదిత్యకు సకాలంలో వైద్యం అందించడంతో అతను తేరుకున్నట్లు విదర్బ జట్టు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. -
59 పరుగులకు ఆలౌట్!
కోల్‌కతా:రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టు సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. నగరంలోని ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో విదర్భను తొలి ఇన్నింగ్స్ లో 59 పరుగులకే కుప్పకూల్చింది. మహారాష్ట్ర మీడియం పేసర్ అనుపమ్ సంక్లేచా ఏడు వికెట్లతో అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 11 ఓవర్లలో 25 పరుగులిచ్చిన అనుపమ్.. ఏడు వికెట్లు సాధించి విదర్భ వెన్నువిరిచాడు. విదర్భ ఆటగాడు శ్రీవాస్తవ (19) ఒక్కడే రెండంకెల మార్కును చేరగా, మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజట్ కే పరిమితమయ్యారు. ఇది విదర్భకు రంజీల్లో ఐదో అత్యల్ప స్కోరు. అనంతరం మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో 332 పరుగులు చేసింది. నౌషద్ షేక్(127),అంకిత్ బావ్నే(111) శతకాలతో మెరిశారు. -
భారీ స్కోరు దిశగా విదర్భ
సాక్షి, హైదరాబాద్: సీకే నాయుడు అండర్-23 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో విదర్భ జట్టు భారీస్కోరు దిశగా పయనిస్తోంది. నాగ్‌పూర్ వేదికగా సోమవారం తొలి రోజు ఆటలో విదర్భ జట్టు 90 ఓవర్లలో 4 వికెట్లకు 306 పరుగులు చేసింది. ఎస్ కే నాథ్ (94) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా...కార్తీకేయ (61), ఎంఆర్. కాలే (57) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో టి. రవితేజ 3 వికెట్లు, తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ తీశాడు. -
నేను అఖండ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని!
ముంబై: విదర్భ ప్రత్యేక రాష్ట్రం అంశం మరోసారి మహారాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై మిత్రపక్షం శివసేన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను టార్గెట్‌గా చేసుకొని విమర్శల దాడి చేశారు. ప్రత్యేక విదర్భపై ఆయన వైఖరి ఏమిటో సభలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన సీఎం ఫడ్నవిస్.. తాను ఏ ఒక్క ప్రాంతానికో ముఖ్యమంత్రిని కాదని, అఖండ మహారాష్ట్రకు సీఎంనని తెలిపారు. ప్రత్యేక విదర్భ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రతిపాదన లేదని చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ అనుకూలమని, అయితే, విదర్భ ఏర్పాటును శివసేన వ్యతిరేకిస్తున్నదన్నారు. ఈ రెండు పార్టీలూ ప్రభుత్వంలో ఉండటంతో ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోలేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర విషయంలో తాను రాజీనామా చేయాలన్న ప్రతిపక్ష ఎన్సీపీ డిమాండ్‌ను కూడా ఫడ్నవిస్ తోసిపుచ్చారు. ఎన్సీపీ కోరితే కాదు ప్రజలు కోరితే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. మరోవైపు అసెంబ్లీలో ప్రత్యేక విదర్భ అనుకూల నినాదాలు చేసిన ఎమ్మెల్యేలపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ శివసేన సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం సభ్యులు కోరవచ్చునని, అందుకు రాజ్యాంగం అనుమతి ఇచ్చిందని, కాబట్టి ఈ విషయంలో సభ్యులపై చర్యలు తీసుకోబోమని సీఎం స్పష్టం చేశారు. -
కేకు కట్ చేసి... వివాదంలో చిక్కుకున్నాడు
ముంబై : మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీహరి అన్నీ తన జన్మదినం సందర్బంగా రాష్ట్ర మ్యాప్ ఆకారంలో ఉన్న కేకును కట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన 66వ జన్మదినం సందర్భంగా మంగళవారం అర్థరాత్రి విదర్భ ప్రాంతంలో బాంద్రాలోని శ్రీహరి అన్నీ తన నివాసంలో ఈ మ్యాప్ ఉన్న కేకును నాలుగు భాగాలుగా కట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అవి రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ సృష్టిస్తున్నాయి. కాగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికీ ఆయన కిందటి నెలలో రాజీనామా చేశారు. ప్రముఖ న్యాయవాదిగా పేరున్న శ్రీహరి ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే శ్రీహరి కేకు కట్ చేయడంపై పలువురు రాజకీయ ప్రముఖులు ఈ విధంగా స్పందించారు. శ్రీహరి ఈ రోజు జరుపుకున్న జన్మదిన వేడుకలు చాలా కాలం గుర్తుంటాయని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత రాధాకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్ర మ్యాప్ ఆకారంలో ఉన్న కేక్ కట్ చేయటంలో తప్పేమీ లేదన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు శ్రీహరి అన్నీ సన్నిహితుడిగా పేరుంది. -
విదర్భ 151 ఆలౌట్
సౌరాష్ట్రతో రంజీ క్వార్టర్స్ మ్యాచ్ సాక్షి, విజయనగరం: జైదేవ్ ఉనాద్కట్ (5/70) బంతితో చెలరేగడంతో... బుధవారం సౌరాష్ట్రతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు తడబడింది. బ్యాటింగ్‌లో నిలకడలేకపోవడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 50.4 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. వసీమ్ జాఫర్ (41), ఉమేశ్ యాదవ్ (25), గణేశ్ సతీష్ (21) మినహా మిగతా వారు విఫలమయ్యారు. హార్దిక్ రాథోడ్, చిరాగ్ జానీ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. జోగియాని (19 బ్యాటింగ్), పుజారా (45 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అవి భరోత్ (5) నిరాశపర్చాడు. ప్రస్తుతం సౌరాష్ట్ర ఇంకా 81 పరుగులు వెనుకబడి ఉంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్ స్కోర్లు ♦ అస్సాం తొలి ఇన్నింగ్స్: 223/8 (సయ్యద్ మొహమ్మద్ 50 నాటౌట్, దాస్ 46, అమిత్ వర్మ 42, సిద్ధార్థ్ కౌల్ 4/81, బరీందర్ శరణ్ 2/67); పంజాబ్‌తో మ్యాచ్. ♦ మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 254/4 (ఆదిత్య 65, నమన్ ఓజా 64, హర్‌ప్రీత్ సింగ్ 51 నాటౌట్, దేవేంద్ర బుండేలా 42 బ్యాటింగ్, ప్రతాప్ సింగ్ 2/55); బెంగాల్‌తో మ్యాచ్. ♦ ముంబై తొలి ఇన్నింగ్స్: 303/6 (అఖిల్ హర్‌వాడేకర్ 107, సూర్యకుమార్ యాదవ్ 75, శ్రేయస్ అయ్యర్ 45, జస్కరణ్ సింగ్ 2/57, నదీమ్ 2/96). -
నాకౌట్‌కు విదర్భ, గుజరాత్
* జార్ఖండ్, యూపీ, ముంబై కూడా... * ముస్తాక్ అలీ టి20 టోర్నీ నాగ్‌పూర్: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో గ్రూప్-ఎ నుంచి విదర్భ, గుజరాత్‌లు నాకౌట్ దశకు చేరుకున్నాయి. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచిన విదర్భ 20 పాయింట్లతో గ్రూప్‌లో టాప్‌గా నిలిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో హరియాణాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హరియాణా 20 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. మొహిత్ హుడా (24) టాప్ స్కోరర్. తర్వాత గుజరాత్ 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (20 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ దహియా (15 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగారు. గ్రూప్-డిలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన ఉత్తరప్రదేశ్ 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ముంబై మాత్రం మూడు విజయాలతో 12 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుని నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మహారాష్ట్ర కూడా 12 పాయింట్లే సాధించినా.. మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ముంబై ముందుకు వెళ్లింది. గ్రూప్-బిలో కేరళతో పాటు జార్ఖండ్ నాకౌట్ పోరుకు చేరుకుంది. ఆంధ్రకు తప్పని ఓటమి గ్రూప్-సిలో ఆంధ్ర జట్టు ఓటమితో లీగ్ దశను ముగించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో గోవా 9 వికెట్ల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 90 పరుగులు చేసింది. సిర్లా శ్రీనివాస్ (28 నాటౌట్), ప్రదీప్ (20), అజయ్ కుమార్ (19) ఓ మోస్తరుగా ఆడారు. తర్వాత గోవా 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 98 పరుగులు సాధించింది. శాగూన్ కామత్ (61 నాటౌట్), కౌతాంకర్ (34) రాణించారు. మరోవైపు గ్రూప్-ఎలో హైదరాబాద్ జట్టు నిరాశజనక ప్రదర్శనను కొనసాగించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ తమిళనాడు చేతిలో 4 వికెట్లతో ఓడింది. దీంతో లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో నెగ్గిన హైదరాబాద్ 8 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఓవరాల్‌గా జాబితాలో ఐదో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. -
87 పరుగులకే సర్దేశారు..
ఢిల్లీ:విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఆంధ్ర జట్టు మరో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. గ్రూప్-సిలో భాగంగా ఇక్కడ గురువారం విదర్భతో జరిగిన మ్యాచ్ లో ఆంధ్ర 10 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. టాస్ గెలిచిన విదర్భ తొలుత ఆంధ్రను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర కనీసం రెండంకెల స్కోరును దాటడానికి ఆపసోపాలు పడింది. కెప్టెన్ ప్రశాంత్ కుమార్(38) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా వారంతా వరుసగా క్యూకట్టడంతో ఆంధ్ర 25.3 ఓవర్లలో 87 పరుగులకే చాపచుట్టేసింది. విదర్భ బౌలర్లలో స్పిన్నర్ కరణేశ్వర్ నాలుగు వికెట్లు తీసి ఆంధ్ర వెన్నువిరచగా, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు సాధించాడు.అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విదర్భ వికెట్ నష్టపోకుండా 19.2 ఓవర్లలో 91 పరుగుల చేసి ఘన విజయాన్ని అందుకుంది. విదర్భ ఓపెనర్లు జితేష్ శర్మ(47 నాటౌట్), ఫైజ్ ఫజల్(44 నాటౌట్) జట్టుకు అద్భుతమైన గెలుపునందించారు. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన ఆంధ్ర మూడింట ఓటమి చెందగా, రెండింట మాత్రమే విజయం సాధించింది. కాగా, తాజా విజయంతో 16 పాయింట్లు సాధించిన విదర్భ గ్రూప్-సి టాపర్ గా నిలిచింది. -
చెలరేగిన ప్రజ్ఞాన్ ఓజా
కోల్ కతా: రంజీ ట్రోఫీ మ్యాచ్ లో భాగంగా బెంగాల్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సంచలన బౌలింగ్ తో చెలరేగిపోయాడు. గ్రూప్-ఏ లో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్ లో ఓజా 11 వికెట్లు తీసి కెరీర్ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసిన ఓజా.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి విదర్భ వెన్నువిరిచాడు. బెంగాల్ విసిరిన 297 పరుగల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ 91.1 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసింది. 3/0 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఆట కొనసాగించిన విదర్భ వరుస వికెట్లు కోల్పోయింది. 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విదర్భ ఆ తరువాత తేరుకోలేదు. విదర్భ ఆటగాళ్లలో గణేష్ సతీష్(96), బద్రీనాథ్(31) మినహా ఎవరూ రాణించలేదు. ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో విదర్భకు ఓటమి తప్పలేదు. దీంతో బెంగాల్ 105 పరుగుల విజయాన్ని సాధించడమే కాకుండా.. సీజన్ లో తొలి గెలుపును అందుకుంది. ఈ మ్యాచ్ ద్వారా రంజీల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకుని తొలి క్రికెటర్ గా గుర్తింపు సాధించిన విదర్భ ఆటగాడు వసీం జాఫర్ రెండు ఇన్నింగ్స్ లలో (9 పరుగులు, 3 పరుగులు) నిరాశపరిచాడు. బెంగాల్ బౌలర్లలో ఓజాకు తోడుగా ప్రతాప్ సింగ్ మూడు వికెట్లు తీసి విజయంలో దోహదపడ్డాడు. బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 334 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 164 ఆలౌట్ విదర్భ తొలి ఇన్నింగ్స్ 202 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 191 ఆలౌట్ -
విదర్భ రైతుల ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రైతు ఆత్మహత్యల అంశాన్ని స్వయంగా పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసును తాము సుమోటోగా తీసుకుందామనుకున్నామని, అంతలోనే పిటిషన్ కూడా దాఖలైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు వ్యాఖ్యానించారు. తనకు తానుగా చితిని పేర్చుకుని మరణించిన 75 ఏళ్ల రైతుకు సంబంధించిన వార్తాకథనంపై సుప్రీం ధర్మాసనం స్పందించింది. -
‘ప్రత్యేక విదర్భ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చండి’
నాగపూర్: శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక విదర్భ అంశాన్ని చేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉపాధి హామీ పథకం అమలు మంత్రి నితిన్ రావుత్ అధిష్టానానికి సూచించారు. తాను రూపొందించిన విదర్భ అభివృద్ధి మేనిఫెస్టోను పార్టీ మేనిఫెస్టో ప్రతిని మేనిఫెస్టో ప్యానల్ సభ్యుడు సుశీల్‌కుమార్ షిండేకి ఆదివారం అందజేశారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యముందన్నా రు. విదర్భ అభివృద్ధి ఎజెండాను అధిష్టానం ఆమోదించకపోయినట్టయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరిస్థితి పునరావృతమవుతుందన్నారు. మహారాష్ట్రలో అంతర్భాగంగా ఉన్నంతకాలం విదర్భ అభివృద్ధి చెందదన్నారు. -
ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం
నాగపూర్: అన్ని విధాలా వెనుకబడ్డ విదర్భ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం లేదని రాష్ట్ర ఉపాధి హామీ పథకం, నీటి సంరక్షణ శాఖ మంత్రి నితిన్ రావుత్ మంగళవారం స్పష్టీకరించారు. విదర్భ డిమాండ్‌కు రావుత్ బహిరంగంగా మద్దతు తెలపడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రి ఒకరు విదర్భకు మద్దతు తెలపడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాగపూర్‌లో మెట్రోరైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగానే విదర్భ అంశాన్ని పక్కన బెట్టడం నిరాశకు గురిచేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన ప్రకటన చేస్తారని నేను భావించాను’ అని నాగపూర్ ఇన్చార్జి మంత్రి కూడా అయిన రావుత్ అన్నారు. ప్రత్యేక విదర్భకు అనుకూలమని పేర్కొంటూ భువనేశ్వర్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ తీర్మానం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బీజేపీ నాయకులు ప్రత్యేక రాష్ట్రం గురించి హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయడంతోపాటు ఎనిమిది కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పుసాద్, అచల్పూర్, చిమూర్, అష్టి, బ్రహ్మపురి, అమేరీ, ఖామ్గావ్, కటోల్ ప్రాంతాలను జిల్లాలుగా మార్చాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే నాగపూర్‌లో భారీ ఎత్తున గొలుసు దొంగతనాలు జరుగుతుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్నిచర్యలూ తీసుకుంటామని నితిన్ రావుత్ హామీ ఇచ్చారు. -
ఊపందుకున్న ‘ గోసీఖుర్ద్ ’ పనులు
నాగపూర్: విదర్భ ప్రాంతంలో సుమారు 2.5 లక్షల హెక్టార్ల పంటభూములకు సాగునీటి సరఫరా లక్ష్యంగా ప్రారంభించిన గోసీఖుర్ద్ నీటిపారుదల ప్రాజెక్టు పనులు ఇప్పటికి ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికిగాను నాగపూర్ జిల్లా నుంచి 51 గ్రామాలు, విదర్భకు చెందిన 13 గ్రామాల ప్రజలను తరలించాల్సి వచ్చింది. బాలాఘాట్(ఎంపీ) నుంచి ప్రాణహితా నది(గడ్చిరోలీ) వరకు ప్రవహించే వైన్‌గంగా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు 1983లో ప్రతిపాదనలు వచ్చాయి. చివరకు 1988 ఏప్రిల్ 22న అప్పటి చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భండారాలో ఉన్న గోసీఖుర్ద్ గ్రామంలో అప్పటి భారత ప్రధాని రాజీవ్‌గాంధీ దీనికి శంకుస్థాపన చేశారు. దీనిద్వారా విదర్భ ప్రాంతంలోని నాగపూర్, భండారా, చంద్రపూర్ జిల్లాల్లో సుమారు 2,50,800 హెక్టార్ల భూములకు సాగునీరందించేందుకు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 36,894 హెక్టార్లకే నీరందించగలుగుతున్నారు. 26 యేళ్లపాటు నత్తనడకన సాగిన పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. వచ్చే వర్షాకాలానికల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్మాణం వల్ల నష్టపోయేవారి సంక్షేమం కోసం ఏడాది కిందట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రూ.1,199 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ మేరకు గత ఏడాది మేలో రూ.684.18 కోట్లు విడుదల చేశారు. అందులో రూ. 324.92 కోట్లను నాగపూర్, భాంద్రా జిల్లాల్లో బాధిత కుటుంబాలకు చెందిన బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే నాగపూర్ జిల్లా లో 51 గ్రామాలు, భాంద్రా జిల్లాలో 13 గ్రామాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. కాగా, జీవన్‌పూర్, సిర్సి, ఖర్దా,పంజ్రేపార్ గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలను కొత్త ప్రాంతాలకు తరలించామని డివిజనల్ కమిషనర్ అనూప్‌కుమార్ తెలిపారు. గతవారం ఆయన ప్రాజెక్టు కింది ముంపు గ్రామాల పునరావాస కేంద్రాల ప్యాకేజీపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా, మొదటి విడతలో, భాంద్రా జిల్లాలోని ఐదు గ్రామాల్లోని మూడు గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆయా గ్రామాల్లో ఉన్న 14,948 గ్రామీణ కుటుంబాల్లో 5,715 కుటుంబాలకు సురక్షితమైన ఆవాసాలను ఏర్పాటుచేసినట్లు నాగపూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్(పునరావాసం) రాజ్‌లక్ష్మి షా తెలిపారు. భండారా జిల్లా మీదుగా ప్రవహించే వైన్‌గంగా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే నాగపూర్, భండారా, చంద్రపూర్ జిల్లాల రైతులకు సాగునీటి సమస్య తీరినట్లే.. -
తొలి దశ ప్రశాంతం
సాక్షి, ముంబై: చెదురుమదురు సంఘటనలు మినహా విదర్భలోని పది లోక్‌సభ స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్ల కాల్పులు, ఈవీఎంల మొరాయింపు, స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నా పోలింగ్ సజావుగానే ముగిసింది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సుమారు 62.36 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అందిన వివరాల మేరకు...గడ్చిరోలి, అకోలా, అమరావతి, భండారా-గోండియాలో 65 శాతం, వర్ధాలో 61, రాంటెక్ 62, నాగపూర్ 59, చంద్రపూర్ 63, యావత్మల్-వాషీలో 60 శాతం, బుల్డానాలో 58.66 శాతం ఓటింగ్ నమోదైంది. భండారా-గోండియా, బుల్డానా మినహా మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో పొలింగ్ ఒకటి నుంచి పదిహేను శాతానికి పెరిగింది. 2009 ఎన్నికల్లో 49 శాతం ఓటింగ్ నమోదైన అకోలాలో ఈసారి ఏకంగా 65 శాతానికి పెరిగింది. గత ఎన్నికల్లో 43.4 శాతం ఓటింగ్ నమోదైన నాగపూర్‌లో ఈసారి సుమారు 59 శాతం పెరిగింది. ఉత్సహంగా ఓటేసిన ప్రజలు... తొలి దశలో పోటీ చేస్తున్న 201 మంది అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)లో నిక్షిప్తమైంది. మావోయిస్టుల ప్రభావమున్న ప్రాంతాల్లో ఈసారి కూడా ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ బాగానే జరిగినా, మధ్యాహ్నం భానుడి ప్రతాపానికి మందకొడిగా సాగింది. సాయంత్రం మళ్లీ పుంజుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగించారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు క్యూలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, పలు నియోజకవర్గాలలో జరిగిన సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈవీఎంల మొరాయింపు, ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతు, ఎన్నికల బహిష్కరణ తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక మంది సామాన్యులతో పాటు పలువురు ప్రముఖ వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో నిరాశతో ఓటు వెయ్యకుండా వెనుదిరిగారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు పది లోక్‌సభ నియోజకవర్గాల్లో అనేకమంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉదయం ఏడు గంటలకే నాగపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. విలాస్ ముత్తెంవార్, అంజలి దమానియాలు కూడా నాగపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవీస్, నవనీత్ కౌర్, ముఖుల్ వాస్నిక్, ప్రకాష్ అంబేద్కర్ వారివారి నియోజకవర్గాల్లో ఓటును వేశారు. నాలుగు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ... వార్ధా సేలు తాలూకాలోని నాలుగు గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. అలగావ్, పహెలానపూర్, శివణగావ్, చించోలి గ్రామాల్లో ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. గ్రామంలోని సమస్యలు ప్రతిసారి పరిష్కరిస్తామనే చెప్పి నాయకులు మోసం చేస్తున్నారని ఈ గ్రామస్తులు ఆరోపించారు. అందుకే ఈసారి ఎన్నికలను బహిష్కరించామన్నారు. అమనావతిలో మధ్యాహ్నం కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే అభిజీత్ అడ్సూల్ ఓటర్ల జాబితాలో సుమారు 46 వేల ఓటర్ల పేర్లు లేవని ఆరోపించారు. ఆయన మద్దతుదారులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గోండియాలోని రాంనగర్లో ఈవీఎం మొరాయించింది. ఓ యంత్రంలో ఏ బటన్ నొక్కినా నాలుగో నంబర్ బటన్‌పై ఉన్న మంచం గుర్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థికే ఓటు వెళుతుందని అధికారులు గుర్తించారు. మరో ఈవీఎంను ఏర్పాటుచేశారు. ప్రశాంతంగా ఉప ఎన్నిక... వాసిం జిల్లాలోని రిసోడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ జనక్ గతేడాది అక్టోబర్ 28వ తేదీన మరణించారు. దీంతో గురువారం జరిగిన ఉప ఎన్నికలో సుమారు 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. గడ్చిరోలిలో మావోయిస్టుల కాల్పులు గడ్చిరోలి, న్యూస్‌లైన్: జిల్లాలో ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎటాపల్లి తాలూకా గర్దేవాడా సమీపంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈవీఎంలను తీసుకెళుతున్న ఎన్నికల అధికారులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతగా ఉన్న పోలీసులు వెంటనే స్పందించడంతో మావోయిస్టులు పారిపోయారు. అయితే ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అహురి, ఆరమోరి, గోండియా జిల్లాలోని ఆమగావ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. నాగపూర్‌లో బ్రిటీషు రాయబారి పర్యటన నాగపూర్: నాగపూర్‌లో గురువారం జరిగిన ఓటింగ్ సరళిని బ్రిటీష్ రాయబారి సర్ జేమ్స్ డేవిడ్ బెవన్ పరిశీలించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో పొలింగ్ విధానం దగ్గరుండి చూడటం అద్భుతమైన అనుభవమని ఆయన మీడియాకు తెలిపారు. భారత్‌లో మాదిరిగానే బ్రిటన్‌లోనూ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇక్కడి ప్రజాస్వామ్య విధానాన్ని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకే వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని వివరించారు. -
నేడే పోలింగ్
సాక్షి, ముంబై: విదర్భలోని పది లోక్‌సభ నియోజకవర్గాల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇన్ని రోజులు రాజకీయ నేతల ప్రసంగాలను విన్న ఓటర్లు నేడు తమ ఓటుతో అభ్యర్థుల తలరాతలు రాసేందుకు సిద్ధమయ్యారు. 19,184 పొలింగ్ కేంద్రాల్లో 1.5 కోట్లకుపైగా ఉన్న ప్రజలు తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్ ప్రాంతాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మొహరించింది. భద్రత దృషి కోణంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి మద్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది. మిగతాప్రాంతాల్లో మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘాతోపాటు ఏదైన సంఘటన జరిగితే వెంటనే స్పందించేందుకు రెండు హెలిక్యాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచింది. అలాగే పొలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందే చేసిపెట్టింది. ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా కనీస వసతులు కల్పించడంపై దృష్టి సారించింది. ఎండలో వచ్చి ఓటువేసే వారికి పొలింగ్ కేంద్రం వద్ద మంచినీరు అందుబాటులో ఉంచింది. వృద్ధులు, వికలాంగులకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇదిలావుండగా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్న ఆందోళన వారిలో కనబడుతోంది. కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్‌తోపాటు ముఖుల్ వాస్నిక్, నితిన్ గడ్కారి, విలాస్ ముత్తెంవార్ మొదలగు దిగ్గజ నాయకులకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. విదర్భలోని 1.5 కోట్లకుపైగా ఉన్న ఓటర్లు మంగళవారం 201 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో భద్రపరచనున్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాలివే... బుల్డానా, అకోలా, అమరావతి, వర్ధా, రాంటెక్, నాగపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్, యావత్మాల్-వాషీం. ప్రముఖ అభ్యర్థులు... నితిన్ గడ్కారీ, ప్రఫుల్ పటేల్, విలాస్ ముత్తెంవార్, ముఖుల్ వాస్నిక్, అంజలి దమానియా, శివాజీరావ్ మోఘే, సంజయ్ దేవతలే, నామదేవ్ ఉసెండి, సాగర్ మోఘే, ఆనంద్ అడ్సూల్, భావనా గావ్లీ, ప్రతాప్ జాధవ్, సంజయ్ ధోత్రే, రామ్‌దాస్ తడస్, హంసరాజ్ ఆహీర్, అశోక్ నేతే, నవనీత్ కౌర్, ప్రకాష్ అంబేద్కర్ ముఖ్యమైన వివరాలు.. 10 లోకసభ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్యః 1,66,39,267 పోలింగ్ కేంద్రాల సంఖ్యః 19,184 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుః 556 ఈవీఎంల సంఖ్యః 41,661 ఎన్నికల సిబ్బంది సంఖ్యః 1,43,880 -
నేటితో విదర్భలో ప్రచారానికి తెర
సాక్షి, ముంబై: తొలి దశ ఎన్నికలు జరగనున్న విదర్భ ప్రాంతంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఏప్రిల్ పదిన జరిగే ఈ ఎన్నికల్లో 201 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1,21,75,661 మంది ఓటర్లు నేతల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 62,23,581 మంది పురుషులు, 58,52,041 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పది లోక్‌సభ స్థానాలకు పోటీచేసే 201 మంది అభ్యర్థుల్లో 90 మంది ఇండిపెండెంట్లు, 15 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. నమోదిత రాజకీయ పార్టీల నుంచి 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు స్థాన్లాల్లో కాంగ్రెస్, మూడు స్థానాల్లో ఎన్సీపీ, ఆరు స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో శివసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ వాద్ పార్టీ పది స్థానాల్లో బరిలో ఉండగా, సీపీఐ ఒకే స్థానంలో పోటీ చేస్తోంది. అయితే నాగపూర్‌లో ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ విలాస్ ముత్తెంవార్‌పై పోటీచేస్తున్న బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అలాగే భండారా, గోండియా నుంచి బరిలో ఉన్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, రాంటెక్ నుంచి కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ తమను గెలిపించాలని ప్రజలను ఎన్నికల ప్రచారంలో అభ్యర్థిస్తున్నారు. యావత్మల్-వాషీమ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న రాష్ట్ర మంత్రి శివాజీరావ్ మోఘే గెలుపు కోసం శాయశక్తులూ ఒడ్డుతున్నారు. వార్ధా, అకోలా, బుల్దానా, గడ్చిరోలి-చిమూర్, అమరావతి, చంద్రపూర్లోనే అందరూ అభ్యర్థులు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షులు కేజ్రీవాల్‌తోపాటు పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికే వివిధ బహిరంగ సభల్లో పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తారాస్థాయికి చేరిన ప్రచారం రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో విదర్భలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి తీవ్రస్థాయికి చేరింది. చివరి రోజైనా మంగళవారం ప్రముఖ నాయకుల ప్రచార సభలు లేకపోయినా, స్థానిక నాయకుల ప్రచారాలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్నాయి. విదర్భలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ కూటమి, మహాకూటమిల మధ్యనే ఉంది. ఒకటి రెండు స్థానాల్లో మాత్రం ఆప్, ఇతర పార్టీలు గట్టి పోటీ ఇవ్వనుండడంతో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ఈసారి విలాస్ ముత్తెం‘వార్’
సాక్షి, ముంబై: విదర్భలో గత లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పరువు కాపాడిన తెలుగువారైన విలాస్ ముత్తెంవార్ మళ్లీ బరిలోకి దిగారు. ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ముత్తెంవార్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రత్యర్థులుగా బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అంజలి దమనీయలు బరిలో ఉన్నారు. తెలుగువారైన ముత్తెంవార్ పూర్వీకులు అనేక ఏళ్ల క్రితం మహారాష్ట్రకు వచ్చి స్థిరపడ్డారు. దాదాపు ఆయన కుటుంబీకులకు ఆంధ్రప్రదేశ్‌తో ప్రస్తుతం అంతగా సంబంధాలు లేవు. అయినా రాష్ట్రంలో ఇప్పటికీ ముత్తెంవార్ కుటుంబీకులను తెలుగు వంశజులుకి చెందినవారుగా గుర్తిస్తారు. 35 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌లో.... విలాస్ ముత్తెంవార్ గత 35 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌లో అంకితభావమున్న నాయకునిగా కొనసాగుతున్నారు. 1949 మార్చి 22న చంద్రాపూర్ జిల్లాలో జన్మించిన విలాస్ ముత్తెంవార్ కుటుంబం నాగపూర్‌కి మకాం మార్చింది. నాగపూర్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేసిన అనంతరం రాజకీయాల్లో వచ్చారు. 1980లో తొలిసారిగా చిమూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన విలాస్ 1.38 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం ఏడుసార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1998 నుంచి ఇప్పటివరకు వరుసగా నాలుగుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన విలాస్ ముత్తెంవార్ ఐదోసారి కూడా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో ఆయన పలు కీలక పదవులు అలంకరించారు. మచ్చలేని చరిత్ర, అభివృద్ధి పనులే నా ప్రధానాస్త్రాలు... గత 35 ఏళ్లకుపైగా రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ఇంతవరకు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని విలాస్ ముత్తెంవార్ స్పష్టం చేశారు. ప్రత్యర్థులపై పరోక్షంగా నితిన్ గడ్కారీ, అంజలి దమనీయాలపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా మచ్చలేని తన చరిత్రతోపాటు తాను చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకునే ప్రజలు మళ్లీ గెలిపిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గోసెఖుర్డ్ డ్యామ్,మిహాన్ ప్రాజెక్టులు వచ్చేందుకు కృషి చేశానని తెలిపారు. గోసెఖుర్డ్ జలాశయంతో 10 లక్షల హెక్టార్ల భూమి సాగుకు వీలైందన్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సహకారంతో నాగపూర్ నడిబొడ్డున ఈ మల్టీ మోడల్ ఇంటర్ నేషనల్ ప్యాసింజర్ అండ్ కార్గో హబ్ ఎయిర్పోర్ట్ ఎట్ నాగపూర్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. తద్వారా నాగపూర్‌తోపాటు విదర్భ అభివృద్ధికి మార్గం సుగమమైందని వివరించారు. సోలార్ సిటీ ప్రాజెక్ట్‌ను బీజేపీ నిరాకరించింది కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో నాగపూర్, చండీగఢ్‌లో సోలార్ సిటీ ప్రాజెక్టు కోసం రూపొందించిన ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకించిందని విలాస్ ముత్తెంవార్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థలం అవసరమైందని, అయితే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ స్థలం ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రాజెక్ట్ ఏర్పాటు చేయలేకపోయామన్నారు. నేను ప్రజల మనిషిని... నితిన్ గడ్కారీ, అంజలి దమనియాలు జాతీయ నాయకులని, తాను మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధినని విలాస్ ముత్తెంవార్ తెలిపారు. 35 ఏళ్లుగా రాష్ట్రంతోపాటు కేంద్రంలో అనేక పదవులు అలంకరించినా ఏనాడూ నాగపూర్‌ను నిర్లక్ష్యం చేయలేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో మళ్లీ టికెట్ ఇచ్చిందన్నారు. -
ఎవరి ఆశలు వారివే..!
సాక్షి, ముంబై : విదర్భలో లోకసభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రముఖ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఏప్రిల్ 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు ఇటు పోలీసులు, అటు అధికారులు కూడా అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలి విడతన విదర్భలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. 70 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. మొత్తం 220 మంది అభ్యర్థులు ప్రస్తుతం బరిలో ఉన్నారు. ముఖ్యంగా వార్ధా లోక్‌సభ నియోజకవర్గంలో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ వెనక్కి తీసుకోకపోవడం విశేషం. ఇక అత్యధికంగా నాగపూర్ లోక్‌సభ నుంచి 54 మంది బరిలో ఉండగా అత్యల్పంగా అకోలా లోకసభ స్థానం నుంచి కేవలం అయిదుగురు పోటీ చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలైన బుల్డానాలో 17, అమరావతి 19, యావత్మాల్-వాషీం 26, వార్ధా 21, చంద్రాపూర్ 18, గడ్చిరోలి-చిమూర్ 11, భండారా-గోండియా 26, రాంటెక్‌లో 23 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.అదే విధంగా అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు (చిహ్నాలు) కూడా కేటాయింపు పూర్తయ్యింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన-బీజేపీ కూటమి, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, ఎమ్మెన్నెస్‌లతోపాటు ఇతర పార్టీల మధ్య బహుముఖ పోటీ జరగనుంది. అనేక నియోజకవర్గాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు వచ్చే ఓట్లపై ప్రధాన కూటమి అభ్యర్థుల విజయం ఆధారపడిఉంటుందని రాజకీయ పరిశీలకులు తెలుపుతున్నారు. మొదటి విడత ఎన్నికల బరిలో ప్రఫుల్ పటేల్, నితిన్ గడ్కరీ, విలాస్ ముత్తెంవార్, ముకుల్ వాస్నిక్, నవనీత్ రాణా తదితర ప్రముఖులున్నారు. -
విదర్భకు వడగళ్ల ఉరి
యవత్మాల్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లు విదర్భప్రాంత రైతుల ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఐదు రోజుల్లోనే 17 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత ఫిబ్రవరి 25 వ తేదీన రాష్ట్రంలో కురిసిన అకాలవర్షాలు, వరదలతో అతలాకుతలమైన విదర్భ ప్రాంతంలో ఇప్పటివరకు 36 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విదర్భ జన్ ఆందోళన్ సమితి అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు కిషోర్ తివారి మాట్లాడుతూపంటల నష్టంతో మనస్తాపానికి గురై గత ఐదు రోజుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన 17 మంది రైతుల గృహాలను సందర్శించి, కుటుంబాలను పరామర్శించామన్నారు. అకాల వర్షాల ముంపుతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నారు. పంటనష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.4,000 చొప్పున గత వారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించినా, వాస్తవ పరిస్థితుల్లో పూర్తి నివేదికలు ఇంకా తయారు కాలేదని ఆయన విమర్శించారు. అధికారులు సార్వత్రిక ఎన్నికల పనుల్లో బిజీగా ఉండటంతో పంటనష్టపోయిన రైతుల వివరాలను పూర్తిగా సేకరించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే రైతులకు ఈ ఆర్థికసాయం అందుతుందని స్థానిక అధికారులు చెబుతున్నారన్నారు. ఇదిలా ఉండగా అకాల వర్షాల కారణంగా 50 శాతానికిపైగా పంట నష్టపోయిన రైతులకే సర్కారు ఆర్థికసాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. వడగండ్ల వానవల్ల రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో 19 లక్షలకుపైగా హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని, రబీ గోధుమ, జొన్న, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. అలాగే మామిడి, నారింజ, ద్రాక్ష, దానిమ్మ చెట్లు నేలకూలాయి. -
ఏదీ నీ ‘పవార్’!
సాక్షి, ముంబై: ‘రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నలను ప్రకృతి విపత్తు ఆగమాగం చేసింది. ఇలాంటి వీరికి మేమున్నామనే భరోసాను కలిగించే నాయకుడే కరువయ్యారు. బ్యాంక్ రుణాలు కూడా అన్నదాతలకు సకాలంలో అందడం లేదు. వీరు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి చేజారిపోతోంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రానికి చెందిన శరద్ పవార్ సమాధానం చెప్పాల’ని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీల కూటమిని గద్దె దింపాలని వార్ధాలో గురువారం జరిగిన బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. తొలుత మరాఠీలో తన ప్రసంగాన్ని ప్రారంభించి స్థానికులను ఆకట్టుకున్న మోడీ, వడగళ్ల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి’ జై జవాన్, జై కిసాన్ అనే నినాదాన్ని అందించారు. కానీ ప్రస్తుతం మనదేశంలో జవాన్లు (సైనికులు), రైతులు సురక్షితంగా లేరన్నారు. రైతులను గిట్టుబాటు ధరలు లభించడం లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ‘రైతులకు బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేవలం ఐదు శాతం రుణాలే రైతులకు అందుతున్నాయి. మిగతా 95 శాతం రుణాలను పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు ఇస్తోంది. ఇలా వ్యవహరిస్తే రైతులు ఆత్మహత్యలు ఎలా తగ్గుతాయ’ని మోడీ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో వచ్చిన అనంతరం రైతులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని, సాగుతాగు నీటిపై ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులు రూపొందిస్తామని చెప్పారు. పత్తి రైతుల కోసం ‘ఫైవ్ ఎఫ్ ఫార్ములా’ రూపొందిస్తామన్నారు. ఈ సభలో బీజేపీ ప్రముఖ నాయకులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
విదర్భపై మావో నీడ?!
నాగపూర్: విదర్భ రీజియన్‌లో నామినేషన్ల రెండో రోజైన మంగళవారం పది స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థి అకోలా నారాయణ్ గవహంకర్, అమరావతి నుంచి రాజు మంకర్(స్వతంత్ర), చంద్రభాన్ ఖోబ్రగేడ్(స్వతంత్ర), పంకజ్ మసూర్కర్(హెచ్‌జేపీ), భండారాగోండియా నుంచి రామేశ్వర్ ఠాక్రే(ఎస్పీ), యావత్మల్వాషిమ్ నుంచి ఒక సందీప్ దోకటే(స్వతంత్ర) తమ నామినేషన్లను అందజేశారు. సాక్షి, ముంబై : లోక్‌సభ ఎన్నికల మొదటి విడతలో విదర్భలో మావోయిస్టుల ప్రభావం కన్పించే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున పోలీసులను అక్కడ మోహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. ఎన్నికలను అడ్డుకునేందుకు నక్సల్స్ పలుమార్లు ప్రయత్నించారు. ఈసారి కూడా గడ్చిరోలి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు మావోయిస్టులు ల్యాండ్మైన్లు (మందుపాతరలు) అమర్చేందుకు ఆస్కారం ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమైనట్లు సమాచారం. రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో భద్రత కారణంగా తొలివిడత ఎన్నికలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇక్కడ ఉన్న పది నియోజకవర్గాలలో గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో మావోల ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. దీంతో ఎన్నికలు నిర్వహించడం పోలీసులతో పాటు ఎన్నికల కమిషన్‌కు సవాల్‌గా మారనుందని చెప్పవచ్చు. అత్యంత సమస్యాత్మక జిల్లా... విదర్భల్లోని గడ్చిరోలి జిల్లా అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా పేర్కొంటారు. ఈ జిల్లాలో మావోల ప్రభావం అధికంగా ఉంది. ఇటీవల జరిగిన అనేక హింసాత్మక సంఘటనలు.. అదే విధంగా తరచూ జరిగే సంఘటనలు ఇటు ఎన్నికల కమిషన్‌తో పాటు ప్రభుత్వం, పోలీసులను సైతం కలవరపరుస్తున్నాయి. పునర్విభజన అనంతరం గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడ్చిరోలి జిల్లాలో మూడు, చంద్రాపూర్ జిల్లాలో రెండు, గోందియా జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 30 శాతం పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన భామరాగఢ్, ఎటాపల్లి, ధానోరా, కుర్ఖేడా, సిరోంచా, కోరచీ, అహేరీ మొదలగు తాలూకాలలో ఉన్నాయి. వీటిలో కూడా గరాపత్తి, కోస్మీ, కసన్సూర్, జారావండీ, కోఠీ, బినాగుండా, గట్టా, పెండరీ, కోటగుల్, తాడ్‌గావ్ మొదలగు గ్రామాల్లో పోలీసులు, భద్రత దళాలకు భద్రత విషయం సవాల్‌గా మారనుంది. ఈ పరిసరాల్లోని అనేక గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు కూడా సరిగాలేవు. దీన్ని ఆసరాగా తీసుకుని ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు స్థావరాలను ఏర్పాటుచేసుకుని అవసరమైనప్పుడు రోడ్లపై ల్యాండ్ మైన్లను (మందుపాతరలు) పేల్చేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికల బహిష్కరణకు మావోల యత్నం... రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ మావోయిస్టులు గడ్చిరోలి జిల్లాలో ఎన్నికలను అడ్డుకునేందుకు యత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఇంతవరకు వారినుంచి ఎలాంటి ప్రకటనలు వెలుపడకపోయినప్పటికీ గత చరిత్రను పరిశీలిస్తే పలుమార్లు పోలింగ్‌కు ముందుగా ఎన్నికలను బహిష్కరించడం, ఓట్లు వేయొద్దని గ్రామీణ ప్రజలను బెదిరించడం వంటి ఘటనలకు దిగిన సందర్భాలున్నాయి. అదేవిధంగా హత్యలు, ఎన్నికల అధికారులను అడ్డగించడం, బ్యాలెట్‌బాక్సులను ఎత్తుకెళ్లడం వంటి దుశ్చర్యలకు దిగేవారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బినాగుండాలో పోలింగ్ నిర్వహించిన అనంతరం బ్యాలెట్ బాక్సులతో తిరిగి వస్తుండగా తాత్కాలిక సూపరింటెండెంట్ శిరీష జైన్ హెలికాప్టర్‌పై మావోయిస్టులు గ్రనేడ్లతో దాడులు జరిపారు. అయితే ఆ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. 2007లో జిల్లాపరిషత్ ఎన్నికల్లో జెడ్పీ మాజీ అధ్యక్షుడు బండోపంత్ మల్లేల్వార్ ఎన్నికల ప్రచార వాహనానికి ధానోరా తాలూకాలో మావోలు నిప్పంటించారు. బినాగుండాలో ఎన్నికల కేంద్రం వద్ద పోలీసులపై దాడి చేశారు. ఇటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల అధికారులతో పాటు ప్రభుత్వం, పోలీసులు, భద్రత దళాలకు సవాలుగా మారుతోంది. -
ప్రత్యేక విదర్భకు సంపూర్ణ మద్దతు: కేజ్రీవాల్
నాగపూర్: ప్రత్యేక విదర్భకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంపూర్ణ మద్ధతును ప్రకటించారు. నగరంలోని ఛత్రపతి నగర్ స్క్వేర్‌కు శుక్రవారం ఉదయం చేరుకున్న కేజ్రీవాల్ రోడ్డు షో ప్రారంభించారు. ఆయన వెంట నాగపూర్ లోక్‌సభ అభ్యర్థి అంజలి దమనియాతో పాటు స్థానిక నాయకులు ఉన్నారు. ఓపెన్ జీపులో ఎక్కి ఆయన ప్రజలకు అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు. కొన్నిచోట్ల ప్రసంగించారు. అవినీతిని నిర్మూలించాలంటే ఆప్ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. మత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తిప్పికొట్టాలన్నారు. అంతకుముందు గురువారం రాత్రి సదర్లోని ఓ విలాసవంతమైన హోటల్లో జరిగిన పార్టీ అతిథ్యమిచ్చిన విందులో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఇందులో పాల్గొని పార్టీకి రూ.పదివేల చొప్పున విరాళం ఇచ్చిన 140 మందితో కేజ్రీవాల్ ముచ్చటించారు. ప్రత్యేక విదర్భకు ఆప్ మద్ధతు ఉంటుందని ప్రకటించారు. -
‘12 లక్షల హెక్టార్లలో పంట నష్టం’
నాగపూర్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల 12 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ముంబైలో గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పరిస్థితిపై సమీక్షించి తీసుకోవల్సిన పునరావాల్సిన చర్యల గురించి చర్చిస్తామని చెప్పారు. నాగపూర్ జిల్లా నార్కేడ్ తాలూకాలోని మోహ్‌గావ్ భటడేలో ధ్వంసమైన గోధుమ, ఆరెంజ్ తోటలను సందర్శించి రైతులను పరామర్శించారు. ఆయన వెంట రాష్ర్ట పునరావాస మంత్రి పతంగ్‌రావ్ కదమ్, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, ఆర్థిక సహాయ మంత్రి రాజేంద్ర ములాక్ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నాగపూర్ డివిజిన్లో ఆరుగురు మృతి చెందగా, 47 పశువుల మృతి చెందాయని జిల్లా యంత్రాంగ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 10,261 ఇళ్లు ధ్వంసమయ్యాని తెలిపింది. నాగపూర్ జిల్లాలో కాంప్టీ, హింగానా, సావ్నర్, కటోల్, కలమేశ్వర్, నార్కేడ్, రాంటెక్, పర్సివోని, మౌడా, భివపూర్, కుహిలలోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. చంద్రపూర్ జిల్లాలోని భండారా, పవోని, సకోలి, లకంద్పూర్, గోరేగావ్, గోండియా, వరోరాలలోనూ పంటలు, తోటలు నాశనమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలావుండగా విదర్భలోని యావత్మల్, వాషీమ్ జిల్లాలోనూ సీఎం చవాన్ పర్యటించారు. పంటనష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల ధాటికి 28 మంది మృతి గత పది రోజుల నుంచి రాష్ట్రంలో కురిసిన అకాలవర్షాల వల్ల 28 మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ అకాల వర్షాల ప్రభావం 29 జిల్లాలపై ఉందన్నారు. 18,200కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని వివరించారు. తొమ్మిది వేలకు పైగా పశువులు మృతి చెందాయని తెలిపారు. నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం నాసిక్: అకాల వర్షాలతో పాటు తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ద్రాక్ష, ఉల్లిగడ్డ, గోధుమ, దానిమ్మ తోటల నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. నిపడ్, చంద్వాడ్, దేవ్లా, సతానా, మాలేగావ్‌లో ఈ బృందం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలి పాయి. ఆ తర్వాత ధులేకు వెళుతుందన్నారు. -
విదర్భకే ‘ఓటు’
సాక్షి, ముంబై: రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక విదర్భ అంశం పెద్ద ఎత్తున తెరపైకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా విదర్భ ప్రజలు ప్రత్యేక విదర్భను కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది. ప్రత్యేక విదర్భ ఏర్పాటుపై విదర్భలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ నిర్వహిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు నాగపూర్, అమరావతితోపాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఓటింగ్‌లో ప్రత్యేక విదర్బకే అనేకమంది ఓటు వేశారు. తాజాగా చంద్రాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన ఓటింగ్‌లో 96..95 శాతం మంది ప్రత్యేక విదర్భ ఏర్పాటుచేయాలని ఓటు వేయడం విశేషం. దీన్నిబట్టి ప్రజల్లో ప్రత్యేక విదర్భ అంశం ఎంత బలంగో ఉందో అర్థమవుతోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థల మద్దతుతో సీనియర్ సిటిజ్ యూనియన్ అధ్యక్షుడు రామ్దాస్రాయిపురే నేతృత్వంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2013 అక్టోబరులో అమరావతిలో నిర్వహించిన ఓటింగ్‌లో 85 శాతం మంది,, డిసెంబరులో నాగపూర్‌లో జరిగిన ఓటింగ్‌లో 96.47 శాతం మంది ప్రజలు ప్రత్యేక విదర్భకు ఓట్ వేశారు. ఫిబ్రవరి 15న యావత్మాల్లో ఓటింగ్ నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా రామ్‌దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు ఓటింగ్ జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక విదర్భనే కోరుకుంటున్నట్టు ప్రజలు ఓటువేస్తున్నారు. చాల తక్కువ మంది సంయుక్త రాష్ట్రాన్ని కోరుకునేవారున్నారని వెళ్లడైంది. దీన్నిబట్టి రాబోయే ఎన్నికల్లో ‘ప్రత్యేక విదర్భ’ అంశం రాజకీయపార్టీలకు ఆయుధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక విదర్భ కోసం ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం చూపుతున్న చొరవ చూసి, తమకూ ప్రత్యేక విదర్భ ఇవ్వాలని విదర్భవాదులు డిమాండ్ చేస్తున్నారు. ‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో చాలా సమస్యలున్నాయి.. కొత్త రాష్ట్రంలో కొత్తగా రాజధానిని నిర్మించుకోవాలి.. అంతేకాక ఒక రాష్ట్రానికి కావాల్సిన అంశాలన్నింటినీ కొత్తగా సమకూర్చుకోవాలి.. అయితే ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేసినట్టయితే అలాంటి సమస్యలు రావడానికి ఆస్కారం లేదు. నాగపూర్‌లో మంత్రాలయంతోపాటు హైకోర్టు తదితర సదుపాయాలున్నాయి. దీంతో ప్రత్యేక విదర్భ ప్రకటించిన రోజునే ముఖ్యమంత్రితోపాటు మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేసి పాలన ప్రారంభించేందుకు ఆస్కారం ఉంది..’ అని గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విలాస్ముత్తేంవార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
విదర్భ అభివృద్ధికి మంచి రోజులు
నాగపూర్: విదర్భలో నిరంతర అభివృద్ధికి జాతీయ పర్యావరణ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఆ ప్రాంత పర్యావరణ కార్యాచరణ సమితి(వీఈజీఏ) పేర్కొంది. మార్చి 31 నాటికి అన్ని రాష్ట్రాల్లో పర్యావరణ నియంత్రణ సంస్థ కార్యాలయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రాజెక్టును మంజూరు చేసే ముందు ఆ ప్రాంతంలో పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ రాష్ట్రాల్లో ఈ శాఖల అవసరముందని జస్టిస్ ఏకే పాఠక్, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్, జస్టిస్ ఇబ్రహీం కలిఫుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలివ్వడాన్ని వీఈజీఏ కన్వీనర్ సుధీర్ పలివాల్ స్వాగతించారు. గతంలో ఆదేశించిన మాదిరిగానే నాగపూర్‌లోని పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటవీ సంరక్షణ చట్టం, 1980 కింద అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టు నెలకొల్పాలంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక నుంచి కొత్త ఆథారిటీ కింద అటవీ విధానం అమలు కానుందని ఆయన తెలిపారు. స్వయం ప్రతిపత్తిగల నియంత్రణ సంస్థ కింద కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు పనిచేయనుండటం హర్షించదగ్గ విషయమన్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు అనుమతినిచ్చే విషయంలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పదవుల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల నియామకం ఇక నుంచి సాధ్యం కాకపోవచ్చని ఆయన తెలిపారు. దీనివల్ల మంత్రిత్వ శాఖ జోక్యం తగ్గి వివిధ బోర్డులు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశముంటుందన్నారు. ‘విదర్భ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే పర్యావరణ నియంత్రణ సంస్థ ఏర్పాటు అత్యవసరం. 60 శాతం అటవీ ప్రాంతాలు ఉన్నాయి. 100కు పైగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలని ప్రతిపాదించారు. మైనింగ్, సిమెంట్ ప్లాట్ల ఏర్పాటువల్ల అటవీ ప్రాంతం అంతం అవుతుంది. కాలుష్య తీవ్రత పెరిగుతుంద’ని పలివాల్ అన్నారు. -
సభాకార్యకలాపాలను అడ్డుకున్న కాంగ్రెస్
నాగపూర్: రెండురోజులుగా ప్రతిపక్షం వ్యవహరిస్తున్న వైఖరి కారణంగా విదర్భ, మరాఠ్వాడా వంటి కీలక అంశాలు చర్చకు రాలేదని ఆరోపిస్తూ అధికారపక్ష సభ్యులు బుధవారం సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో మొత్తం నాలుగు పర్యాయాలు సభ వాయిదాపడింది. అధికార పక్ష సభ్యుల వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షం వెల్‌లోకి దూసుకుపోయింది. ఇరుపక్షాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినదించారు. నిరసనలు, ప్రతినిరసనలతో దాదాపు 40 నిమిషాల సమయం వృథా అయింది. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అసలు జరగనేలేదు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే అధికార పక్షానికి చెందిన విజయ్వడ్డెటివార్, వీరేంద్ర జగ్తాప్, బాబా సిద్ధిఖిలు విదర్భ అంశంపై నిరసనకు దిగారు. దీనిని ప్రతిపక్ష సభ్యులైన గిరీష్ మహాజన్, తారాసింగ్, యోగేష్ సాగర్, దేవేంద్ర ఫడణవిస్, నానాపటోల్, గిరీష్ బాపట్లు ఈ నిరసనను అడ్డుకున్నారు. అనంతరం పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే జల్గావ్ పాల సహకార సొసైటీ కుంభకోణంపై మాట్లాడుతూ జల్గావ్ సొసైటీని జాతీయ పాల అభివృద్ధి సంస్థకు అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఏక్నాథ్ ఖడ్సే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. ఈ సందర్భంగా ఖడ్సే రాసిన లేఖను ఆయన సభకు చదివి వినిపించారు. అంతటితో ఆగకుండా ఓ అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలంటూ బీజేపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతకాలు చేసిన ప్రతిని కూడా సభకు చూపించారు. అభియోగాలను పరిశీలించకుండానే అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇలా పేర్లను ప్రస్తావించడం ఖడ్సేకి ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. అనంతరం స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. ఈ అంశంపై చర్చించేందుకు తన కార్యాలయంలోకి రావాలంటూ ఆహ్వానించారు. తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే పరిశ్రమల మంత్రి నారాాయణ్ రాణే మాట్లాడుతూ సొసైటీ బదలాయింపు ప్రక్రియలో ఖడ్సే స్వయంగా పాలుపంచుకున్నారని, అందువల్ల ఈ అంశాన్ని లేవనెత్తే హక్కు ఆయనకు లేదన్నారు. దీంతో సభలో మరోసారి గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షానికి చెందిన కొందరు సభ్యులు పోడియంలోకి దూసుకుపోగా, మరికొందరు అక్కడే కింద బైఠాయించారు. దీంతో మరోసారి స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. అనంతరం ఉపసభాపతి వసంత్ ఫుర్కే స్పీకర్ స్థానంలో ఆశీసునులయ్యారు. సభా కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం కాగానే మంగళవారం సభలో బిల్లును సభలో ప్రవేశపెటి ్టన అనంతరం మాట్లాడేందుకు యత్నించినప్పటికీ అనుమతించకపోవడంపై ఫడణవిస్ అభ్యంతరం లేవనెత్తారు. ఇలా చేయడం సభ్యులను పక్కదారి పట్టించడమే అవుతుందన్నారు. ప్రిసైడింగ్ అధికారి తీరు సరిగా లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫడణవిస్ తప్పనిసరిగా స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. ఆ సమయంలో 15 నిమిషాలచొప్పున రెండుసార్లు సభ వాయిదా పడింది. -
ఆరోరోజుకు చేరిన 'ప్రత్యేక విదర్భ' దీక్ష
నాగపూర్: ప్రత్యేక విదర్భ డిమాండ్‌తో యువ నేత ఆశిష్ దేశ్‌ముఖ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం ఆరవ రోజుకు చేరింది. అతడిని బుధవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు అనిల్ బోండే, రవి రాణా, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆష్వాద్ తదితరులు పరామర్శించి తమ మద్దతు ప్రకటించారు. వారితో పాటు మాజీ ఎంపీ బన్వర్‌లాల్ పురోహిత్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్క్యూ జామా, ఉపేంద్ర షిండే, అశోక్ ధవడ్ సైతం ఆశిష్‌ను పరామర్శించవారిలో ఉన్నారు. ప్రత్యేక విదర్భను కోరుతూ ప్రజల్లో చైతన్య కలిగించేందుకు సెప్టెంబర్ నెలలో మార్చ్ నిర్వహించి దేశ్ ముఖ్ మరో ముందడుగు వేసి డిసెంబర్ 6వ తేదీన ఆమరణ దీక్షకు పూనుకున్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక విదర్భ కోసం డిమాండ్ చేయడానికి ఇదే సరైన సమయమని ఆశిష్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. -
రెండోరోజూ అదే వేడి
సాక్షి, ముంబై: నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా వాడివేడిగానే జరిగాయి. విదర్భ ప్రాంత సమస్యలు, రైతులకు చెల్లించే ప్రత్యేక ప్యాకేజీలపై ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి. దీంతో సభ కార్యకలాపాలు తొలుత 15 నిమిషాలు వాయిదా పడ్డాయి. ఆ తరువాత రోజంతా వాయిదా వేశారు. విధాన పరిషత్ కార్యకలాపాలు కూడా మంగళవారం పూర్తిగా వాయిదా పడ్డాయి. ఉదయం సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ విదర్భకు చెందిన వివిధ అంశాలను లేవనెత్తారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సమస్యపై తీర్మానం 97 ప్రకారం చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని విధానసభ అధ్యక్షుడు దిలీప్ వల్సే పాటిల్ తిరస్కరించారు. దీనిపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చిద్దామని ఆయన ప్రతిపాదించారు. కాని ప్రతిపక్ష నాయకులు ససేమిరా అనడంతో కొద్దిసేపు గందగోళ వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభాప్రాంగణంలో నానా హడావుడి సృష్టించారు. దీంతో సభా అధ్యక్షుడు కార్యకలాపాలను అరగంట వరకు వాయిదా వేశారు. ఆ తరువాత యథాతథంగా సమావేశాలు కొనసాగుతుండగా విపక్షాల నాయకులు మళ్లీ రెచ్చిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రతిపక్ష నాయకులు అనవసరంగా గందరగోళం సృష్టించి విదర్భ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రోజూ ఇలాగే చేస్తూ సభా కార్యకలాపాలు నిలిపివేయడంవల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు. దీంతో ప్రతిపక్షాలు శాంతియుతంగా తీర్మానం 111 ప్రకారం ప్రశ్నలు లేవనెత్తి వాటిపై చర్చించాలని ఆయన సూచించారు. అందుకు సభాధ్యక్షుడు కల్పించుకుని వారికి నచ్చజెప్పాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం తీర్మానం 97 ప్రకారమే చర్చించాలని పట్టుబట్టారు. దీంతో డిప్యూటీ స్పీకర్ వసంత్ పుర్కే సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. కాసేపటి సమావేశాలు పునఃప్రారంభంకాగా మళ్లీ అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే పరిస్థితి విధాన్ పరిషత్‌లోనూ కొనసాగింది. అధిక వర్షాల వల్ల నష్టపోయిన విదర్భ రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలనే డిమాండ్‌తో ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ నానా హంగామా సృష్టించాయి. దీంతో సభ కార్యకలాపాలు బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. -
విదర్భకు ఊపు
నాగపూర్: విదర్భను ప్రత్యేక రాష్ర్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యువనాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ శుక్రవారం నిరవధిక దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా అంతర్భాగంగా ఉన్న తెలంగాణను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఆయన ఈ దీక్షకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడైన ఆశిష్...నగరంలోని పశ్చిమ ప్రాంతంలోగల సివిల్ లైన్స్ ప్రాంతాన్ని ఆయన తన దీక్షకు వేదికగా ఎంచుకున్నారు. నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభానికి ముందు ఆశిష్... దళిత నాయకుడు, మాజీ మంత్రి సులేఖ కుంభారేతో కలసి రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్‌కు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న తన మద్దతుదారులు, విదర్భవాదులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినందువల్ల ప్రత్యేక విదర్భ సాధన కోసం ఉద్యమించాల్సిన తరుణమిదేనన్నారు. ఇదిలాఉంచితే మరోరెండు రోజుల్లో నగరంలో శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆశిష్ ... ప్రత్యేక విదర్భ సాధన కోసం నిరాహార దీక్షకు దిగడం గమనార్హం. పత్తి పంట ప్రధానంగా పండే తూర్పు మహారాష్ర్టలోని 12 జిల్లాలతోకూడిన ప్రత్యేక విదర్భ సాధన కోసం అనేక సంవత్సరాలనుంచి ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా విదర్భవాదానికి కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీలు మద్దతు పలుకుతుండగా రాష్ట్ర విభజన అంశాన్ని ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 9న విదర్భ బంద్ సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ ఉద్యమం నానాటికీ ఉధృతమవుతోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదించిన నేపథ్యంలో విదర్భవాదులు తమ లక్ష్యసాధన దిశగా వేగంగా ముందుకు కదులుతున్నారు. ఇందులోభాగంగా సోమవారం స్థానిక నాయకులు విదర్భ బంద్‌కు పిలుపునిచ్చారు. జాంబవంత్రావ్ ధోటే, బ్రిగేడియర్ సుధీర్ సావంత్‌ల నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు సోమవారం నుంచి నిరవధిక ధర్నాలు, ఆందోళనలు చేపడతారని స్థానిక నాయకుడు ప్రఫుల్ పాటిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాటిల్ మీడియాతో మాట్లాడుతూ విదర్భ ప్రాంతంలోని సాగునీటి ప్రాజె క్టులను సకాలంలో పూర్తిచేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా సుమారు 32 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. విదర్భ ప్రాంత వికాసానికి మంజూరైన రూ.1,300 కోట్లు నిధులను ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు మళ్లించిందని, స్థానికులను మోసగించిందని ఆరోపించారు. రాష్టానికి వచ్చే మొత్తం ఆదాయంలో 28 శాతం నిధులు ఈ ప్రాంతానికే దక్కాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగకాశాల్లో 25 శాతం విదర్భ యువకులకు ఇవ్వాల్సి ఉందని, అయితే కేవలం పది శాతం మాత్రమే దక్కుతున్నాయన్నారు. మౌలానా ఆజాద్ ఆర్థికాభివృద్థి మండలి నిధులు ఈ ప్రాంతానికి చెందిన ముస్లింలకు అందడం లేదన్నారు. దీంతో ఉన్నతవిద్యాభ్యాసం చేసిన ముస్లిం యువకులు ఉపాధి కోసం ఇప్పటికీ రాష్ట్ర రాజధానితోపాటు ఇతర నగరాలకు వలస వెళుతున్నారన్నారు. వలసలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టాలంటే ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని పాటిల్ స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలను దోచుకుంటున్న నాయకుల వైఖరిని వ్యతిరేకిస్తూ సంపూర్ణ విదర్భ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన వివరించారు. -
విదర్భ కోసం తెగిస్తాం
నాగపూర్: అన్ని విధాలా వెనుకబడ్డ విదర్భ రాష్ట్ర సాధన కోసం అంతిమపోరుకు సిద్ధమవుతున్నట్టు బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించింది. ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేస్తే అధికారం పూర్తిగా ఎన్సీపీ చేతికి వెళ్తుందని కాంగ్రెస్ భయపడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవీస్ మంగళవారం అన్నారు. విదర్భ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామని హచ్చరించారు. ‘తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటాలతో కాంగ్రెస్‌కు హింస అంటే తెలిసే ఉంటుంది. తెలంగాణవాదులు ఆశయసాధన కోసం కొన్నేళ్లపాటు హింసాత్మక పోరాటాలు కొనసాగించడం దురదృష్టకరం. ఇప్పుడు వారి డిమాండ్ నెరవేరబోతోంది. యూపీఏ ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రత్యేక తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతోంది’ అని ఆయన వివరించారు. బీజేపీ ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. తమ పార్టీ 1992లో భువనేశ్వర్‌లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విదర్భ ఏర్పాటుకు తీర్మానం ఆమోదించిన విషయాన్ని ఫడణవీస్ గుర్తు చేశారు. విదర్భ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ‘ఎన్నో హామీలిస్తారు కానీ పరిహారం మాత్రం చెల్లించడం లేదు. అందుకే అన్నదాతల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఫిబ్రవరిలో ‘అడ్వాంటేజ్ విదర్భ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యుత్, నీటిచార్జీలు భారీగా ఉండడం వల్ల ఏ ఒక్క కంపెనీ కూడా పరిశ్రమ స్థాపనకు ముందుకు రాలేదు’ అని ఫడణవీస్ అన్నారు. చార్జీలు తగ్గిస్తామన్న హామీ ఇప్పటికీ నిలబెట్టుకోకపోవడంతో పెట్టుబడులు రావడం లేదని పేర్కొన్నారు. పొరుగున్న ఉన్న ఛత్తీస్‌గఢ్ పరిశ్రమలకు ఎన్నో రాయితీలు ఇస్తోందని, ఈ విషయంలో పృథ్వీరాజ్ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందో అర్థం కావడం లేదని ఈ సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు. పేదల ఆరోగ్యం కోసమంటూ యూపీయే అధినేత్రి సోనియా గాంధీ చేతుల మీదుగా కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రాజీవ్‌గాంధీ జీవన్దాయీ యోజన పథకంలో ఎన్నో లోపాలున్నాయని విమర్శించారు. గతంలో ప్రభుత్వం ఆరోగ్య బీమా కోసం రూ.130 కోట్లు చెల్లించేదని, ఇప్పుడు దానిని రూ.830 కోట్లకు పెంచడం వల్ల ఇన్సూరెన్సు కంపెనీలకు మాత్రమే లాభమని విశ్లేషించారు. మరిన్ని రోగాలను ఈ బీమా పథకంలో చేర్చాలని ప్రభుత్వాన్ని తాము చాలాసార్లు కోరిన పట్టించుకోలేదని ఫడణవీస్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లాకు అంధేరీలో విలువైన స్థలాన్ని కేవలం రూ.98 వేలకు కేటాయించడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ముంబైని బంగారుబాతుగా చూస్తోందని, ఈ భూకేటాయింపును తక్షణం రద్దు చేయాలని దేవేంద్ర ఫడణవీస్ డిమాండ్ చేశారు. -
మళ్లీ కాక
నాగపూర్: శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. విదర్భవాదులంతా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరసనలకు దిగనున్నారు. ఇందులోభాగంగా యువనాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ వచ్చే నెల ఆరో తేదీనుంచి నిరాహార దీక్షకు దిగనుండగా, విదర్భ సంయుక్త కార్యాచరణ కమిటీ (వీజాక్) మాక్ ఐదు, ఆరు తేదీల్లో అసెంబ్లీ నిర్వహించనుంది. దీంతోపాటు శాసనసభ సమావేశాల ప్రారంభం కానున్న తొలిరోజే బంద్ నిర్వహించాలని స్థానిక నాయకుడు జాంబువంత్‌రావ్ ధోతే నేతృత్వంలోని ఫార్వర్డ్ బ్లాక్‌తోపాటు వివిధ పార్టీలు నిర్ణయించాయి. వచ్చే నెల 16వ తేదీన నిర్వహించే నిరసనలు, కార్యకలాపాలను ఆధారంగా చేసుకుని విదర్భకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే అంశానికి ప్రజల మద్దతు ఏస్థాయిలో ఉందనే విషయాన్ని ఆయా పార్టీలు నిర్ణయించుకుంటాయి. కాగా పట్టణంలోని సంవిధాన్ స్క్వేర్ ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాలని భావించిన ఆశిష్ దేశ్‌ముఖ్... అనుమతి కోసం పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలోని భాస్కర్ భవన్ ప్రాంతాన్ని ఆయన తన దీక్షకు వేదికగా ఎంచుకున్నారు. తాను తలపెటి నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమానికి వివిధ సంఘాలు మద్దతు పలికేందుకు సుముఖత వ్యక్తం చేశాయని ఆశిష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఇదిలాఉండగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా తెరపైకి రావాలని ప్రత్యేక విదర్భవాదులు భావిస్తున్నారు. మూడే ళ్ల క్రితం వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఇందుకోసం తీవ్ర కృషి చేశారు. ప్రత్యేక విదర్భవాదానికి బీజేపీతోపాటు కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐలకు చెందిన నాయకులు కూడా అప్పట్లో మద్దతు పలికిన సంగతి విదితమే. ఉద్యమానికి ఊపు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడైన ఆశిష్... ప్రత్యేక విదర్భకోసం ఈ ఏడాది అక్టోబర్‌లో పట్టణంలోని షాహిద్ చౌక్ నుంచి సేవాగ్రామ్‌దాకా పాదయాత్ర నిర్వహించారు. గాంధీ జయంతినాడు ఆ యాత్ర ముగిసింది. యువత సహకారంతోవచ్చే నెల ఆరో తేదీన చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షతో ఈ ఉద్యమం ఇంకా బలపడేందుకు తోడ్పడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి రెఫరెండంతో స్ఫూర్తి గతంలో అమరావతి పట్టణంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)కు అనూహ్య స్పందన లభించింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రం కావాలంటూ 85 శాతం మంది ప్రజలు ఓటేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న విదర్భవాదులు నాగపూర్లోనూ ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. జన్‌మంచ్ అనే పౌర సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వచ్చే నెల మూడో వారంలో పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సదరు సంస్థ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన శరద్‌పాటిల్, చంద్రకాంత్ వాంఖడేలు శుక్రవారం వెల్లడించారు. ఇందుకోసం ఆ రోజున పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతా ల్లో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేస్తామన్నారు. భాగస్వాములు కండి ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములు కావాలని విదర్భ వికాస్ పరిషత్ వ్యవస్థాపకుడు, ఎంపీ దత్తా మేఘే ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘తెలంగాణతో పాటు విదర్భను ఏర్పాటు చేయాలి’
నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం వచ్చే నెల ఆరు నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు విదర్భ సంయుక్త కార్యాచరణ సంఘం సమన్వయకర్త, యువజన నాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ‘ఇప్పుడు కాకుంటే ఇక ఎప్పుడూ సాధించుకోలేం. తెలంగాణతోపాటు విదర్భ ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేకుంటే భవిష్యత్‌లో ఎన్నడూ మన కల సాకారమయ్యే అవకాశం లేదు’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడు కూడా అయిన ఆశిష్ అన్నారు. తెలంగాణ, విదర్భ రాష్ట్రాలను ఒకేసారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫజల్ అలీ కమిషన్ ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటు చేయాలని 1956లోనే సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విదర్భకు మద్దతు కోసం సేకరించిన వేలాది వినతిపత్రాలు, లేఖలను ఎంపీ విలాస్ ముత్తెంవార్‌కు అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 21న సోనియాగాంధీ నాగపూర్‌లో పర్యటిస్తున్నప్పడు ఎంపీ వాటిని ఆమెకు అందజేస్తారని ఆశిష్ వివరించారు. -
విదర్భను అభివృద్ధి చేస్తాం
అమరావతి: విదర్భ, మరాఠ్వాడాలో వెనుకబాటుతనాన్ని తొలగించడానికి మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారం కోసం డాక్టర్ విజయ్ కేల్కర్ కమిటీని నియమించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేల్కర్ అందజేయబోయే నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా చర్యలు నిర్వహించి, దాని సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరాఠ్వాడా, విదర్భలో ప్రస్తుత వెనుకబాటుతనాన్ని కేల్కర్ కమిటీ మదింపు చేసి నివేదిక అందజేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వసంత్‌రావ్ నాయక్ శతజయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన, సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పైవిషయం తెలిపారు. కేల్కర్ నివేదిక నెల రోజుల్లోపు వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. అయితే చవాన్ మాట్లాడడం ప్రారంభించగానే సభలోనే ఉన్న విదర్భ ఉద్యమ కార్యకర్తలు పలువురు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వెంటనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మావల సంఘటన అధ్యక్షుడు బాలాసాహెచ్ కొరాటే విదర్భ రైతుల ఆత్మహత్యల గురించి వివరించి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించారు. విదర్భలో పారిశ్రామిక అభివృద్ధి కొరవడడంపైనా చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పారిశ్రామిక విధానంలో ఈ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. విదర్భ వ్యవసాయ అభివృద్ధికి తగిన నీటిపారుదల వ్యవస్థను నిర్మించాల్సి ఉందన్నారు. చెరకు రైతులు భారీగా నీటిని ఉపయోగించుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. కాబట్టి వాళ్లు బిందుసేద్య విధానాన్ని అనుసరించాలని కోరారు. ‘ప్రత్యేక’మైతే ఆత్మహత్యలుండవు నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో నాగపూర్ నుంచి కాంగ్రెస్ నాయకుడు అశిష్ దేశ్‌ముఖ్ ప్రారంభించిన ఐదురోజుల పాదయాత్ర బుధవారానికి సేవాగ్రామ్ ఆశ్రమానికి చేరుకోనుంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బాపు కుటీర్ ఆశ్రమం వద్ద ఇది ముగియనుంది. అశిష్ దేశ్‌ముఖ్ వెంట వేలాది మంది కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. సేవాగ్రామ్ ఆశ్రమానికి చేరుకునేందుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఈ పాదయాత్ర ఉంది. ఈ సందర్భంగా అశిష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు భారీగా తగ్గుముఖం పడతాయన్నారు. పంటలు పండక అప్పుల పాలైన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన పనిచేస్తుందన్నారు. విదర్భ ప్రాంతంలో జరిగే వేలాది ఆత్మహత్యలు మహారాష్ట్రకు అపకీర్తిని తేవడమే కాకుండా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది మనకు స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. విదర్భ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడితే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి అభివృద్ధిబాట పడుతుందన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగానికి చెందిన పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంటుందని వివరించారు. ఈ ప్రాంతం వెనుకబాటుతనం వల్ల నక్సలిజం పెరుగుతోందని, అయితే రాష్ట్ర సర్కార్ దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూపెడుతుందన్నారు. ప్రాంతీయస్థాయిలో ప్రథమ ప్రాధాన్యతగా ఈ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. విదర్భ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే సమర్థవంతంగా నక్సలిజాన్ని ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలోని 75 శాతం మంది గ్రామీణులు వ్యవసాయంపై ఆధారపడే బతుకుతున్నారని తెలిపారు. 55 లక్షల హెక్టార్ల భూమి ఉండగా 10 లక్షల హెక్టార్లలో మాత్రమే కొద్దిగా వ్యవసాయం సాగుతోంది. వర్షంపైనే ఆధారపడే రైతులు మాత్రం అన్ని విధాలా నష్టపోతున్నారని చెప్పారు. ఏటా ఒక పంటను మాత్రమే పండించగలుగుతున్నారని తెలిపారు. గత 53 ఏళ్ల నుంచి నీటిపారుదల ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు దారి మళ్లాయని ఆరోపించారు. పత్తి, నారింజ, వరి, సోయాబిన్ ప్రధాన పంటలుగా ఉన్నా వాటి వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని వాపోయారు. ఇక్కడ పంటల నాణ్యత, మార్కెటింగ్, గిడ్డంగులు అభివృద్ధిపై సర్కార్ సరిగా దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం చొరవ తీసుకుంటున్న యూపీఏ ప్రత్యే విదర్భ కోసం కూడా చర్యలు తీసుకోవాలని అశీష్ డిమాండ్ చేశారు. -
ప్రత్యేక విదర్భ కోసం పాదయాత్ర
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరుతూ శనివారమిక్కడ వేలాదిమంది యువకులు పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు రంజీత్ దేశ్‌ముఖ్ కుమారుడు ఆశీష్ దేశ్‌ముఖ్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్ర మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు సాగనుంది. ఆ రోజున గాంధీ సేవాగ్రమ్ ఆశ్రమమ్ వద్ద జరిగే కార్యక్రమంతో యాత్ర ముగియనుంది. ఇట్వారీ ప్రాంతంలోని విదర్భ చంద్రిక ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర మొదలైంది. పలువురు కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉన్నతాధికారులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్నారు. కాగా 1953లో విదర్భను మహారాష్ట్రలో విలీనం చేశారు. -
ఆజ్యం పోసిన ‘ఐక్యత రాగం’
సాక్షి, ముంబై: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలపై వేర్పాటువాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. ఆయన ప్రసంగంలో వినిపించిన ‘ఐక్యతారాగం’పై రాజకీయ విశ్లేషకులనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, అందుకు మహారాష్ట్ర నిదర్శనమంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను రాజకీయ పండితులు తప్పుబడుతున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాజుకున్న విభజన చిచ్చు సెగలు ఇప్పటికే రాష్ట్రాన్ని తాకాయి. ఇక్కడా ప్రత్యేక విదర్భ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్న తరుణంలో ఆయన ఐక్యతపై వ్యాఖ్యలు చేయడం ఆందోళనకారులను మరింత రెచ్చగొట్టడమే అవుతుందంటున్నారు. సీఎం స్థానంలో ఉన్న ఆయన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని, అయితే రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో విభజన చిచ్చు ఓవైపు రాజుకుంటుంటే మరోవైపు తమ రాష్ట్రం సమైక్యంగా ఉందని చెప్పుకోవడం ఆందోళనకారులకు ఆగ్రహం తెప్పించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రచయిత్రి శోభా డే చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఉద్యమానికి ఊపిరిపోశాయని, అనంతరం ముఖ్యమంత్రి పలు వేదికలపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆందోళనకారులను మేల్కొల్పాయని, సాధ్యమైనంతవరకు విభజన, సమైక్యమనే మాటలను ఉపయోగించకుండా ఉండడమే ప్రస్తుత పరిస్థితుల్లో మేలంటున్నారు. ఉధృతమవుతున్న ఉద్యమం... పంద్రాగస్టునాడు కూడా విదర్భ ప్రాంతంలో ప్రత్యేక గళం వినిపించింది. ఉత్సవాలనే వేదికలుగా చేసుకొని కొందరు ప్రత్యేక వాదాన్ని వినిపించగా మరికొందరు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. కాగా ముఖ్యమంత్రి ప్రసంగంలో బహిరంగంగానే సమైక్యతావాదం వినిపించడంతో ఆందోళనకారులు తమ జోరును మరింతగా పెంచారు. తాజాగా శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. ప్రతిపక్షాల సమైక్యవాదమే కాపాడుతోంది... రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన శివసేన, ఎమ్మెన్నెస్‌లు సమైక్యవాదానికే కట్టుబడడం ప్రత్యేక ఉద్యమానికి కొంత ప్రతికూలంగా మారిందంటున్నారు. ముఖ్యమంత్రి చేసిన సమైక్యవాదాన్ని తిప్పికొట్టే వేదికేది కూడా రాష్ట్రంలో లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశంగా రాజకీయ పండితులు చెబుతున్నారు. అయితే ఎన్సీపీ ఇప్పటికే ప్రత్యేక విదర్భకు మద్దతునిస్తున్నట్లు ప్రకటించగా బీజేపీ కూడా అటువైపే మొగ్గుచూపుతోంది. ఒకవేళ కాంగ్రెస్, ఎన్సీపీల మైత్రి చెదిరితే ఎన్సీపీ ఈ అంశాన్నే అస్త్రంగా మలచుకొని ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే అవకాశముందని చెబుతున్నారు. శివసేనతో బీజేపీ పొత్తులో ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ కూడా ప్రత్యేక వాదంతో దూసుకుపోయే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం ఇలా ఉన్నా ఎన్నికలు సమీపంచేసరికి రాజకీయ పార్టీల వైఖరి మారుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నడుచుకోవాల్సిన అవసరాన్ని వారు గుర్తుచేస్తున్నారు. -
గడ్చిరోలి, చంద్రపూర్‌లను తెలంగాణలో విలీనం చేయండి
గడ్చిరోలి, న్యూస్‌లైన్: ఓ వైపు ప్రత్యేక విదర్భ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో మరో కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఇవ్వని పక్షంలో గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను కొత్తగా ఏర్పాటుకానున్న తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ధర్మారావ్‌బాబా ఆత్రం డిమాండ్ చేశారు. తెలంగాణ కన్నా విదర్భ డిమాండ్ చాలా పాతదని, అయితే దీన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు. అయితే గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలన్న అత్రమ్ వ్యాఖ్యలు విదర్భతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కోసం స్వచ్చంద సంస్థలతోపాటు బీజేపీ ఓవైపు ఉద్యమం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌నాయకుడు విలాస్ ముత్తెంవార్ ప్రత్యేక విదర్భ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఎన్సీపీ కూడా మద్దతు పలికింది. అయితే ఇటీవలే బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటైతే ప్రత్యేక విదర్భ ఏర్పాటు సాధ్యమన్నారు. దీనిపై పరోక్షంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ ఏర్పాటు సాధ్యం కాకపోతే గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలన్నారు. ఇలాచేస్తే తెలంగాణాతో పాటు ఈ రెండు జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. రాష్ట్ర రాజధాని ముంబై ఈ జిల్లా నుంచి సుమారు 1,100 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీంతో రాజధానిలో బతుకుతెరువుకోసం ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే తెలంగాణలో విలీనం చేస్తే రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ మారతుందన్నారు. ఈ జిల్లాల నుంచి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ రాజధానిగా మారితే రాకపోకలకు ఇబ్బందులు ఉండవన్నారు. -
విదర్భను చేరిస్తేనే మద్దతివ్వండి
ప్రత్యేక విదర్భ ఉద్యమాన్ని ముందుకు నడిపే దిశగా ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా విదర్భ ప్రాంత ప్రజల మనోభావాలను మంగళవారం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. విదర్భ బిల్లును చేరిస్తేనే ప్రతిపాదిత ప్రత్యేక తెలంగాణ బిల్లుకు మద్దతు పలకాలని కోరారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టే బిల్లులో సవరణద్వారా తెలంగాణతోపాటు విదర్భను కూడా చేర్చాలని అధిష్టానానికి విన్నవించామన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, సుష్మాస్వరాజ్ తదితరులను కలిశామన్నారు. తమ డిమాండ్‌కు అధిష్టానం సానుకూలంగా స్పందించిందన్నారు. అధిష్టానాన్ని కలిసినవారిలో ఫడ ్నవిస్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, మాజీ ఎంపీ బన్వరిలాల్ పురోహిత్, ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్, నానాపటోల్ తదితరులున్నారు. ఇదిలాఉండగా బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేన విదర్భను రాష్ట్రం నుంచి విడదీయాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. అయితే ఫడ్నవిస్ మాత్రం ఈ వాదనను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. -
అధిష్టానాన్ని కలవనున్న రాష్ట్ర బీజేపీ నేతలు
ప్రత్యేక విదర్భ ఉద్యమాన్ని ముందుకు నడిపే దిశగా ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా విదర్భ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రతిపాదిత ప్రత్యేక తెలంగాణ బిల్లుతోపాటు దీనినికూడా చేర్చాలంటూ ఒత్తిడి తెచ్చేందుకుగాను మంగళవారం దేశరాజధానికి చేరుకుని అధిష్టానాన్ని కలవనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలోని పార్టీ అధిష్టానాన్ని మంగళవారం కలవాలని నిర్ణయించాం. ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టే బిల్లులో సవరణద్వారా తెలంగాణతోపాటు విదర్భను కూడా చేర్చాలని ఒత్తిడి చేస్తాం. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీలో ఉన్న మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, సుష్మాస్వరాజ్ తదితరులను కలుస్తాం’ అని అన్నారు. కాగా ఫడ ్నవిస్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, మాజీ ఎంపీ బన్వరిలాల్ పురోహిత్, ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్‌లు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేన విదర్భను రాష్ట్రం నుంచి విడదీయాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. అయితే ఫడ్నవిస్ మాత్రం ప్రత్యేక విదర్భ రాష్ట్ర వాదనను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. 1992లో భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు అనుగుణంగా ఓ తీర్మానం ఆమోదించింది. -
ప్రత్యేక విదర్భ కోసం జంతర్‌మంతర్‌లో వీజాక్ ఆందోళన
ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ప్రకటనతో విదర్భ ఉద్యమం మరింత ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం తక్ష ణమే ప్రత్యేక విదర్భ రాష్ట్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విదర్భ జాయింట్ యాక్షన్ కమిటీ (వీజాక్) సభ్యులు నగరంలోని జంతర్‌మంతర్‌వద్ద సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలదాకా ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో విదర్భ ఆర్థిక అభివృద్ధి మండలి (వీఈడీసీ) అధ్యక్షుడు దేవేంద్ర పరేఖ్, మాజీ మంత్రి రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడు ఆశిష్ దేశ్‌ముఖ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాయకుడు అజయ్ సంఘి, రాం నెవ్లే, అరుణ్ కేదార్, అహ్మద్ కదర్, రవికాంత్ ఖోబ్రగడే, ప్రతిభా ఖపర్దే, ట్రేడియస్ పీటర్‌తోపాటు ప్రముఖ ఆర్థికవేత్త శ్రీనివాస్ ఖండేవాలే, దీపక్ నిలావర్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం కొందరు నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతోపాటే విదర్భకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. అవకాశం లభిస్తే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌లను కలసిఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళతామన్నారు. పదాధికారులను ఎన్నుకోం వీజాక్కు పదాధికారులను ఎన్నుకోకూడదని నిర్ణయించినట్టు సభ్యులు తెలిపారు. కేవలం ఈ పదవుల కోసం గతంలో విదర్భ ఉద్యమం దెబ్బతిందని, నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయని అన్నారు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమది సమాఖ్య మాత్రమేనన్నారు. విడిపోతేనే పురోగతి మహారాష్ట్ర నుంచి విదర్భ విడిపోతేనే త్వరిగతిన అభివృద్ధి చెందుతుందని జాక్ సభ్యులు పేర్కొన్నారు. కొత్త రాష్ట్ర ఆవిర్భావం వల్ల కొత్త కొత్త పరిశ్రమలు ఆవిర ్భవిస్తాయని, దాంతోపాటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఇది నిరుద్యోగ నిర్మూలనకు దోహదం చేస్తుందన్నారు. -
ప్రత్యేక 'విదర్భ'పై జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం
ప్రత్యేక రాష్ర్టం కావాలని కోరుతూ మహారాష్ట్రలో విదర్భ వాసుల చేపట్టిన ఉద్యమం మరో ముందడుగు వేసింది. ప్రత్యేక రాష్టంపై అమరావతి జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. చికాల్దరాలో శనివారం జరిగిన జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ముందుకు ఈ తీర్మానాన్ని తీసుకువెళ్లగా, ఏకగ్రీవ ఆమోదం లభించింది. పలుచోట్ల ప్రత్యేక రాష్ట్ర సెగలు ఊపందుకున్న నేపథ్యంలో విదర్భను ప్రత్యేక రాష్ర్టంగా ప్రకటించాలంటూ వారు జిల్లా స్టాండింగ్ కమిటీకి నివేదించారు. జిల్లా పరిషత్ సభ్యుల్లో ఒకరైన అభ్యంకర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సురేఖకు విదర్భ ప్రత్యేక తీర్మానాన్నినివేదించారు. ప్రత్యేక రాష్ర్టం రాదనే భయంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. సహజ సిద్ధమైన వనరులున్న తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ నివేదికలో డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో పలుచోట్ల రాష్ట్ర డిమాండ్లు ఊపందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు విదర్భ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక కాంగ్రెస్ ఎంపీ విలాస్ ముత్తేమ్వర్ విమర్శించారు. తెలంగాణ కంటే విదర్భ సమస్య పురాతనమైందన్న విషయాన్ని షిండే మరిచారా అంటూ ప్రశ్నించారు.