
ఇండోర్: ఆధిక్యం చేతులు మారుతూ... రంజీ ట్రోఫీ తుది సమరం ఆసక్తికరంగా ప్రారంభమైంది. విదర్భతో శుక్రవారం మొదలైన ఫైనల్లో తొలి రోజు ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సీనియర్ బ్యాట్స్‌మన్ గంభీర్ (15)తో పాటు నితీశ్ రాణా (21), కెప్టెన్ రిషభ్ పంత్ (21) కూడా విఫలమవడంతో ఒక దశలో 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ షరాయ్ (256 బంతుల్లో 123 బ్యాటింగ్; 17 ఫోర్లు) అద్భుత శతకంతో ఆదుకున్నాడు.
హిమ్మత్ సింగ్ (72 బంతుల్లో 66; 2 సిక్స్‌లు, 8 ఫోర్లు) అండగా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వీరిద్దరూ అయిదో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన హిమ్మత్... గుర్బానీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మనన్ శర్మ (13)తో ధ్రువ్ ఆరో వికెట్‌కు 36 పరుగులు జత చేశాడు. విదర్భ బౌలర్లలో థాకరే, గుర్బానీ చెరో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment