ఇండోర్: ఈ రంజీ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన యువ పేసర్ రజ్నీస్ గుర్బానీ.. విదర్బ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన 24 ఏళ్ల ఈ యువ సంచలనం జట్టు తొలిసారి రంజీ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్లో 12 వికెట్లు సాధించిన గుర్బానీ.. ఢిల్లీతో జరిగిన తుది పోరులో 8 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా చూస్తే ఆరు మ్యాచ్‌లు ఆడిన గుర్బానీ 39 వికెట్లు సాధించాడు. ఫలితంగా ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా గుర్బానీ నిలిచాడు.
అయితే తన వ్యక్తిగత ప్రదర్శన కంటే కూడా జట్టు టైటిల్‌ను కైవసం చేసుకోవడంపై గుర్బానీ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ' నేను రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండాలని తరచు కలలు కనేవాణ్ని. నా డ్రీమ్ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు రంజీ టైటిల్‌ను గెలవడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. మా అత్యుత్తమ ప్రదర్శతోనే అది సాధ్యమైంది. రాబోవు మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాం' అని గుర్బానీ తెలిపాడు. నిన్న ఢిల్లీతో ముగిసిన తుది పోరులో విదర్భ 9 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment