
ఇండోర్:గత నెల్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విదర్భ వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ తొలి సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అక్షయ్ శతకం నమోదు చేశాడు. ఆదివారం టీ బ్రేక్‌కు ముందు అక్షయ్ ఫోర్ కొట్టి సెంచరీ మార్కును చేరాడు. మరొకవైపు ఏడో వికెట్‌కు ఆదిత్య సార్వేతే (79)తో కలిసి 169 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు. ఇది ఈ సీజన్‌లో విదర్భ ఏడో వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యంగా నమోదైంది. ఈ క్రమంలోనే విదర్బ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది.
రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విదర్భ.. తుది పోరులో కూడా అంచనాలు మించి రాణిస్తోంది. ఈ ఫైనల్ పోరులో విదర్బ బౌలర్ రజ్నీస్ గుర్బానీ ఆరు వికెట్లు సాధించడంతో ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment