ఆరోరోజుకు చేరిన 'ప్రత్యేక విదర్భ' దీక్ష | Youth leader's fast for Vidarbha statehood enters sixth day | Sakshi
Sakshi News home page

ఆరోరోజుకు చేరిన 'ప్రత్యేక విదర్భ' దీక్ష

Published Wed, Dec 11 2013 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

Youth leader's fast for Vidarbha statehood enters sixth day

నాగపూర్: ప్రత్యేక విదర్భ డిమాండ్‌తో యువ నేత ఆశిష్ దేశ్‌ముఖ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం ఆరవ రోజుకు చేరింది. అతడిని బుధవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు అనిల్ బోండే, రవి రాణా, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆష్వాద్ తదితరులు పరామర్శించి తమ మద్దతు ప్రకటించారు. వారితో పాటు మాజీ ఎంపీ బన్వర్‌లాల్ పురోహిత్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌క్యూ జామా, ఉపేంద్ర షిండే, అశోక్ ధవడ్ సైతం ఆశిష్‌ను పరామర్శించవారిలో ఉన్నారు. ప్రత్యేక విదర్భను కోరుతూ ప్రజల్లో చైతన్య కలిగించేందుకు సెప్టెంబర్ నెలలో మార్చ్ నిర్వహించి దేశ్ ముఖ్ మరో ముందడుగు వేసి డిసెంబర్ 6వ తేదీన ఆమరణ దీక్షకు పూనుకున్నారు.

 

యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక విదర్భ కోసం డిమాండ్ చేయడానికి ఇదే సరైన సమయమని ఆశిష్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement