‘తెలంగాణతో పాటు విదర్భను ఏర్పాటు చేయాలి’ | Ashish Deshmukh to begin indefinite fast for Vidarbha on Dec 6 | Sakshi
Sakshi News home page

‘తెలంగాణతో పాటు విదర్భను ఏర్పాటు చేయాలి’

Published Sun, Nov 17 2013 6:18 PM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

Ashish Deshmukh to begin indefinite fast for Vidarbha on Dec 6

నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం వచ్చే నెల ఆరు నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు విదర్భ సంయుక్త కార్యాచరణ సంఘం సమన్వయకర్త, యువజన నాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ‘ఇప్పుడు కాకుంటే ఇక ఎప్పుడూ సాధించుకోలేం. తెలంగాణతోపాటు విదర్భ ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేకుంటే భవిష్యత్‌లో ఎన్నడూ మన కల సాకారమయ్యే అవకాశం లేదు’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడు కూడా అయిన ఆశిష్ అన్నారు. తెలంగాణ, విదర్భ రాష్ట్రాలను ఒకేసారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫజల్ అలీ కమిషన్ ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటు చేయాలని 1956లోనే సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

 

విదర్భకు మద్దతు కోసం సేకరించిన వేలాది వినతిపత్రాలు, లేఖలను ఎంపీ విలాస్ ముత్తెంవార్‌కు అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 21న సోనియాగాంధీ నాగపూర్‌లో పర్యటిస్తున్నప్పడు ఎంపీ వాటిని ఆమెకు అందజేస్తారని ఆశిష్ వివరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement