సాక్షి, హైదరాబాద్: సీకే నాయుడు అండర్-23 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో విదర్భ జట్టు భారీస్కోరు దిశగా పయనిస్తోంది. నాగ్‌పూర్ వేదికగా సోమవారం తొలి రోజు ఆటలో విదర్భ జట్టు 90 ఓవర్లలో 4 వికెట్లకు 306 పరుగులు చేసింది.
ఎస్ కే నాథ్ (94) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా...కార్తీకేయ (61), ఎంఆర్. కాలే (57) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో టి. రవితేజ 3 వికెట్లు, తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ తీశాడు.