మధ్యప్రదేశ్, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్-1 రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి లక్ష్యానికి 93 పరుగుల దూరంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో విదర్భ గెలవాలంటే మరో నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాల్సి ఉంది. సరాన్ష్ జైన్ (16), కుమార్ కార్తికేయ (0) క్రీజ్‌లో ఉన్నారు. మరో రోజు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం రావడం గ్యారెంటీ. మరి మధ్యప్రదేశ్ 93 పరుగులు సాధించి విజయం సాధిస్తుందో లేక విదర్భ 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.
ఒకవేళ ఊహించని అద్భుతం ఏదైనా జరిగి మ్యాచ్ డ్రా అయితే మాత్రం తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా మధ్యప్రదేశ్ పైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 252 పరుగులు చేసింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకున్న విదర్భ 402 పరుగులు చేసి మధ్యప్రదేశ్ ముందు ఛాలెంజింగ్ లక్ష్యాన్ని ఉంచింది. సెమీఫైనల్-2లో తమిళనాడుపై విజయం సాధించి ముంబై జట్టు ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
రాణించిన దూబే, హర్ష్..
యశ్ దూబే (94), హర్ష్ గావ్లి (67) అర్దసెంచరీలతో రాణించడంతో మధ్యప్రదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి గెలుపు కోసం పోరాడుతుంది. విదర్భ బౌలర్లలో అక్షయ్ 3, ఆదిత్య సర్వటే 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు.
శతక్కొట్టిన యశ్ రాథోడ్..
తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే పరిమితమైన విదర్భ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని 402 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (141) అద్భుత శతకం సాధించి, విదర్భను తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చాడు. యశ్‌తో పాటు కెప్టెన్ అక్షయ్ (77), అమన్ (59) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 252 (హిమాన్షు మంత్రి 126, ఉమేశ్ యాదవ్ 3/40)
విదర్భ తొలి ఇన్నింగ్స్ 170 (కరుణ్ నాయర్ 63, ఆవేశ్ ఖాన్ 4/49)
Comments
Please login to add a commentAdd a comment