Ranji Trophy semifinals
-
రసవత్తరంగా సాగుతున్న రంజీ సెమీఫైనల్
మధ్యప్రదేశ్, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్-1 రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి లక్ష్యానికి 93 పరుగుల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విదర్భ గెలవాలంటే మరో నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాల్సి ఉంది. సరాన్ష్ జైన్ (16), కుమార్ కార్తికేయ (0) క్రీజ్‌లో ఉన్నారు. మరో రోజు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం రావడం గ్యారెంటీ. మరి మధ్యప్రదేశ్ 93 పరుగులు సాధించి విజయం సాధిస్తుందో లేక విదర్భ 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. ఒకవేళ ఊహించని అద్భుతం ఏదైనా జరిగి మ్యాచ్ డ్రా అయితే మాత్రం తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా మధ్యప్రదేశ్ పైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 252 పరుగులు చేసింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకున్న విదర్భ 402 పరుగులు చేసి మధ్యప్రదేశ్ ముందు ఛాలెంజింగ్ లక్ష్యాన్ని ఉంచింది. సెమీఫైనల్-2లో తమిళనాడుపై విజయం సాధించి ముంబై జట్టు ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. రాణించిన దూబే, హర్ష్.. యశ్ దూబే (94), హర్ష్ గావ్లి (67) అర్దసెంచరీలతో రాణించడంతో మధ్యప్రదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి గెలుపు కోసం పోరాడుతుంది. విదర్భ బౌలర్లలో అక్షయ్ 3, ఆదిత్య సర్వటే 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన యశ్ రాథోడ్.. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే పరిమితమైన విదర్భ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని 402 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (141) అద్భుత శతకం సాధించి, విదర్భను తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చాడు. యశ్‌తో పాటు కెప్టెన్ అక్షయ్ (77), అమన్ (59) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 252 (హిమాన్షు మంత్రి 126, ఉమేశ్ యాదవ్ 3/40) విదర్భ తొలి ఇన్నింగ్స్ 170 (కరుణ్ నాయర్ 63, ఆవేశ్ ఖాన్ 4/49) -
Ranji Trophy: సౌరాష్ట్ర దీటైన జవాబు
బెంగళూరు: కెప్టెన్ అర్పిత్ వాసవద (219 బంతుల్లో 112 బ్యాటింగ్; 15 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (245 బంతుల్లో 160; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించడంతో... కర్ణాటక జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు మరో 44 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 76/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. షెల్డన్ జాక్సన్, అర్పిత్ నాలుగో వికెట్‌కు 232 పరుగులు జోడించి సౌరాష్ట్ర జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం అర్పిత్, చిరాగ్ జానీ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కవేరప్ప రెండు వికెట్లు తీయగా, వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. బెంగాల్‌కు భారీ ఆధిక్యం ఇండోర్‌లో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో బెంగాల్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 56/2తో మూడో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ ఆకాశ్‌దీప్ (5/42) మధ్యప్రదేశ్‌ను దెబ్బ కొట్టాడు. బెంగాల్‌కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా కెప్టెన్ మనోజ్ తివారి మధ్యప్రదేశ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు సాధించింది. ప్రస్తుతం బెంగాల్ ఓవరాల్ ఆధిక్యం 327 పరుగులకు చేరుకుంది. -
మధ్యప్రదేశ్ లక్ష్యం 571
ప్రస్తుతం 99/2 ముంబైతో రంజీ సెమీస్ కటక్: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ముంబై 571 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 2 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆదిత్య శ్రీవాస్తవ (53 బ్యాటింగ్), నమన్ ఓజా (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జలజ్ సక్సేనా (25), రజత్ పటిదార్ (4) విఫలమయ్యారు. మధ్యప్రదేశ్ గెలవాలంటే ఇంకా 472 పరుగులు చేయాలి. బుధవారం ఆటకు ఆఖరి రోజు. అంతకుముందు 285/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 125.1 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (115), ఆదిత్య తారే (109) సెంచరీలు సాధించారు. అభిషేక్ నాయర్ (73 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఈశ్వర్ పాండే, హర్‌ప్రీత్ సింగ్ చెరో 3, పునీత్ 2 వికెట్లు తీశారు.