అర్పిత్, షెల్డన్ జాక్సన్
బెంగళూరు: కెప్టెన్ అర్పిత్ వాసవద (219 బంతుల్లో 112 బ్యాటింగ్; 15 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (245 బంతుల్లో 160; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించడంతో... కర్ణాటక జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు మరో 44 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 76/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. షెల్డన్ జాక్సన్, అర్పిత్ నాలుగో వికెట్‌కు 232 పరుగులు జోడించి సౌరాష్ట్ర జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం అర్పిత్, చిరాగ్ జానీ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కవేరప్ప రెండు వికెట్లు తీయగా, వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
బెంగాల్‌కు భారీ ఆధిక్యం
ఇండోర్‌లో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో బెంగాల్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 56/2తో మూడో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ ఆకాశ్‌దీప్ (5/42) మధ్యప్రదేశ్‌ను దెబ్బ కొట్టాడు. బెంగాల్‌కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా కెప్టెన్ మనోజ్ తివారి మధ్యప్రదేశ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు సాధించింది. ప్రస్తుతం బెంగాల్ ఓవరాల్ ఆధిక్యం 327 పరుగులకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment