Saurashtra Ranji Trophy
-
Ranji Trophy: సౌరాష్ట్ర దీటైన జవాబు
బెంగళూరు: కెప్టెన్ అర్పిత్ వాసవద (219 బంతుల్లో 112 బ్యాటింగ్; 15 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (245 బంతుల్లో 160; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించడంతో... కర్ణాటక జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు మరో 44 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 76/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. షెల్డన్ జాక్సన్, అర్పిత్ నాలుగో వికెట్‌కు 232 పరుగులు జోడించి సౌరాష్ట్ర జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం అర్పిత్, చిరాగ్ జానీ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కవేరప్ప రెండు వికెట్లు తీయగా, వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. బెంగాల్‌కు భారీ ఆధిక్యం ఇండోర్‌లో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో బెంగాల్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 56/2తో మూడో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ ఆకాశ్‌దీప్ (5/42) మధ్యప్రదేశ్‌ను దెబ్బ కొట్టాడు. బెంగాల్‌కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా కెప్టెన్ మనోజ్ తివారి మధ్యప్రదేశ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు సాధించింది. ప్రస్తుతం బెంగాల్ ఓవరాల్ ఆధిక్యం 327 పరుగులకు చేరుకుంది. -
రీ ఎంట్రీలో దుమ్మురేపిన జడేజా.. 8 వికెట్లతో రెచ్చిపోయిన స్టార్ ఆల్‌రౌండర్
Ranji Trophy 2022-23: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీ ఎంట్రీలో దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడ్డూ భాయ్.. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం చాటాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జడ్డూ.. రంజీల్లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. తదనుగుణంగానే సెలెక్టర్లు సైతం అతనికి రంజీల్లో ఆడేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో జడేజా వచ్చీ రాగానే బంతితో తన ప్రతాపం చూపాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి, బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించిన జడ్డూ (35 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు).. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. ఏకంగా 7 వికెట్లు తీసి తమిళనాడు వెన్నువిరిచాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చాపచుట్టేసింది. జడేజాకు జతగా మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) 3 వికెట్లతో రాణించడంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన తమిళనాడు తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. తమిళనాడు సెకెండ్ ఇన్నంగ్స్‌లో సాయ్ సుదర్శన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌరాష్ట్ర 192 పరుగులకే చాపచుట్టేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. సౌరాష్ట్ర గెలవాలంటే ఆఖరి రోజు మరో 262 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి. క్వార్టర్స్‌కు చేరాలంటే సౌరాష్ట్రకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. జడేజా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి తన జట్టును క్వార్టర్స్‌కు చేరుస్తాడేమో వేచి చూడాలి. ఏదిఏమైనా ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు జడేజా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభసూచకం -
సౌరాష్ట్రతో ఆంధ్ర సై!
సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఐదేళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్ చేరిన ఆంధ్ర ఇప్పుడు సెమీస్ బెర్తుపై కన్నేసింది. నేటి నుంచి స్థానిక సీఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకర్ భరత్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు గత రన్నరప్ సౌరాష్ట్రతో తలపడుతుంది. సెమీస్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆంధ్రకు సౌరాష్ట్రను ఎదుర్కోవడం అంత సులభం కాదు కానీ... సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో స్థానిక అనుకూలతలతో పైచేయి సాధించాలని ఆంధ్ర భావిస్తోంది. నిజానికి ఈ సీజన్ ఆరంభంలో ఆంధ్ర నిలకడగా రాణించింది. దీంతో ఎలైట్ ‘ఎ అండ్ బి’ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. అయితే లీగ్ దశ సాగేకొద్దీ ప్రతికూల ఫలితాలతో వెనుకబడింది. ఇక ముగింపుకొచ్చేసరికి వరుసగా రెండు పరాజయాలతో ఐదో స్థానానికి పడిపోయింది. టాపార్డర్‌లో జ్ఞానేశ్వర్, ప్రశాంత్‌లతోపాటు రికీ భుయ్, శ్రీకర్ భరత్‌లు రాణిస్తే ఆంధ్ర భారీస్కోరు సాధించే అవకాశముంటుంది. బౌలింగ్‌లో శశికాంత్, స్టీఫెన్, రఫీ మళ్లీ మెరిపించాలి. గత రన్నరప్ సౌరాష్ట్ర మేటి ఆల్‌రౌండ్ జట్టు. ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడింది. మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందిన సౌరాష్ట్ర నాలుగు మ్యాచ్‌ల్ని ‘డ్రా’ చేసుకుంది. -
విదర్భ 151 ఆలౌట్
సౌరాష్ట్రతో రంజీ క్వార్టర్స్ మ్యాచ్ సాక్షి, విజయనగరం: జైదేవ్ ఉనాద్కట్ (5/70) బంతితో చెలరేగడంతో... బుధవారం సౌరాష్ట్రతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు తడబడింది. బ్యాటింగ్‌లో నిలకడలేకపోవడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 50.4 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. వసీమ్ జాఫర్ (41), ఉమేశ్ యాదవ్ (25), గణేశ్ సతీష్ (21) మినహా మిగతా వారు విఫలమయ్యారు. హార్దిక్ రాథోడ్, చిరాగ్ జానీ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. జోగియాని (19 బ్యాటింగ్), పుజారా (45 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అవి భరోత్ (5) నిరాశపర్చాడు. ప్రస్తుతం సౌరాష్ట్ర ఇంకా 81 పరుగులు వెనుకబడి ఉంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్ స్కోర్లు ♦ అస్సాం తొలి ఇన్నింగ్స్: 223/8 (సయ్యద్ మొహమ్మద్ 50 నాటౌట్, దాస్ 46, అమిత్ వర్మ 42, సిద్ధార్థ్ కౌల్ 4/81, బరీందర్ శరణ్ 2/67); పంజాబ్‌తో మ్యాచ్. ♦ మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 254/4 (ఆదిత్య 65, నమన్ ఓజా 64, హర్‌ప్రీత్ సింగ్ 51 నాటౌట్, దేవేంద్ర బుండేలా 42 బ్యాటింగ్, ప్రతాప్ సింగ్ 2/55); బెంగాల్‌తో మ్యాచ్. ♦ ముంబై తొలి ఇన్నింగ్స్: 303/6 (అఖిల్ హర్‌వాడేకర్ 107, సూర్యకుమార్ యాదవ్ 75, శ్రేయస్ అయ్యర్ 45, జస్కరణ్ సింగ్ 2/57, నదీమ్ 2/96).