విదర్భ 151 ఆలౌట్ | vidarba 151 all out | Sakshi
Sakshi News home page

విదర్భ 151 ఆలౌట్

Published Thu, Feb 4 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

vidarba 151 all out

సౌరాష్ట్రతో రంజీ క్వార్టర్స్ మ్యాచ్
 సాక్షి, విజయనగరం: జైదేవ్ ఉనాద్కట్ (5/70) బంతితో చెలరేగడంతో... బుధవారం సౌరాష్ట్రతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు తడబడింది. బ్యాటింగ్‌లో నిలకడలేకపోవడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 50.4 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. వసీమ్ జాఫర్ (41), ఉమేశ్ యాదవ్ (25), గణేశ్ సతీష్ (21) మినహా మిగతా వారు విఫలమయ్యారు. హార్దిక్ రాథోడ్, చిరాగ్ జానీ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. జోగియాని (19 బ్యాటింగ్), పుజారా (45 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అవి భరోత్ (5) నిరాశపర్చాడు. ప్రస్తుతం సౌరాష్ట్ర ఇంకా 81 పరుగులు వెనుకబడి ఉంది.
 
 ఇతర క్వార్టర్ ఫైనల్స్ స్కోర్లు
అస్సాం తొలి ఇన్నింగ్స్: 223/8 (సయ్యద్ మొహమ్మద్ 50 నాటౌట్, దాస్ 46, అమిత్ వర్మ 42, సిద్ధార్థ్ కౌల్ 4/81, బరీందర్ శరణ్ 2/67); పంజాబ్‌తో మ్యాచ్.
మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 254/4 (ఆదిత్య 65, నమన్ ఓజా 64, హర్‌ప్రీత్ సింగ్ 51 నాటౌట్, దేవేంద్ర బుండేలా 42 బ్యాటింగ్, ప్రతాప్ సింగ్ 2/55); బెంగాల్‌తో మ్యాచ్.
ముంబై తొలి ఇన్నింగ్స్: 303/6 (అఖిల్ హర్‌వాడేకర్ 107, సూర్యకుమార్ యాదవ్ 75, శ్రేయస్ అయ్యర్ 45, జస్కరణ్ సింగ్ 2/57, నదీమ్ 2/96).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement