Sheldon Jackson
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్
సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. షెల్డన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇవాళ (జనవరి 3) ప్రకటించాడు. సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జాక్సన్ మూడు ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ,టీ20) కలిపి 11,791 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నాయి. 38 ఏళ్ల జాక్సన్ ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో తన చివరి మ్యాచ్ ఆడాడు. జాక్సన్ తన చివరి మ్యాచ్‌లో (పంజాబ్) 10 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేశాడు. జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.జాక్సన్ లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) 84 ఇన్నింగ్స్‌ల్లో 36.25 సగటున 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్‌కు టీ20 ఫార్మాట్లో కూడా మంచి రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో జాక్సన్ 80 మ్యాచ్‌లు ఆడి 1812 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.జాక్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో జాక్సన్ ఆర్సీబీ, కేకేఆర్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. జాక్సన్‌కు ఆర్సీబీ తరఫున ఆడే అవకాశం రానప్పటికీ 2017-2022 మధ్యలో కేకేఆర్‌కు తొమ్మిది మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో మహారాష్ట్రపై చేసిన సెంచరీ (136 బంతుల్లో 133 పరుగులు) జాక్సన్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. నాటి మ్యాచ్‌లో సౌరాష్ట్ర విజేతగా నిలిచి విజయ్ హజారే ట్రోఫీని సొంతం చేసుకుంది.జాక్సన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాక్సన్ ఇటీవలే వందో మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాక్సన్ 103 మ్యాచ్‌లు ఆడి 46.36 సగటున 7187 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్ వికెట్‌కీపింగ్‌లో 75 క్యాచ్‌లు పట్టి, రెండు స్టంపౌట్లు చేశాడు. జాక్సన్‌కు టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. -
నాకేమీ 75 ఏళ్లు కాదు.. ధోని, డీకే మాత్రం! వాళ్లను ఒక్కమాట కూడా అనను!
Ind Vs WI: ‘‘నేను నైరాశ్యంలో మునిగిపోయినప్పుడల్లా దినేశ్ కార్తిక్, మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేసుకుంటాను. నేను కేకేఆర్‌కు ఆడుతున్న సమయంలో కార్తిక్‌ని దగ్గరగా గమనించాను. అతడి కెరీర్ ఎలాంటి మలుపులు తిరిగిందో చూశాను. నాకు డీకే స్ఫూర్తి. కెరీర్ పరంగా నిరాశ ఎదురైనపుడు అతడే నా మోటివేషన్’’ అని సౌరాష్ట్ర వెటరన్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ ఉద్వేగానికి లోనయ్యాడు. 36 ఏళ్ల వయసులో.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతున్నాడు. దేశవాళీ మ్యాచ్‌లలో సౌరాష్ట్ర తరఫున టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నాడు. కానీ 36 ఏళ్ల జాక్సన్‌కు ఇంతవరకు ఒక్కసారి కూడా టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ ప్రతిసారి మొండిచేయే ఎదురైంది. కనీసం ఇండియా- ఏ జట్టుకు కూడా అతడిని ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలో గతేడాది ట్విటర్ వేదికగా సెలక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన షెల్డన్ జాక్సన్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలతో ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘మనకసలు అవకాశమే ఇవ్వకపోతే మనల్ని మనం ఎలా నిరూపించుకుంటాం? వాళ్లను ఒక్కమాట కూడా అనను సెలక్షన్ విధానంపై నేనెప్పుడూ ఎలాంటి కామెంట్ చేయను. నన్నెందుకు ఎంపిక చేయలేదని అడిగే హక్కు మాత్రం ఉంటుంది కదా! కానీ నేనెప్పుడూ ఏ సెలక్టర్‌ను కూడా ఎప్పుడూ సంప్రదించలేదు. నన్ను ఎందుకు బలి చేశారని అడుగలేదు. ఒకవేళ నిజంగానే నా ఆట తీరు మరీ అంత ఘోరంగా ఉంటే 90కి పైగా మ్యాచ్‌లు ఎలా ఆడి ఉంటాను. నా సగటు 50. పరిమిత ఓవర్లు, రెడ్‌బాల్ క్రికెట్లో ప్రభావం చూపగలుగుతున్నా. నిజానికి ఇన్నాళ్లుగా నాకు అండగా నిలుస్తున్న సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు చెప్పాలి. నాకు షా కుటుంబం మద్దుతు ఉంది..అందుకే ముఖ్యంగా షా(జయదేవ్ షా, నిరంజన్ షాలను ఉద్దేశించి) కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంది. వంద మ్యాచ్‌లకు నేను చేరువవుతున్నానంటే అందుకు వాళ్లే కారణం. ఏదేమైనా జట్టు ఎంపిక విషయంలో సెలక్టర్లు మనల్ని విస్మరించినప్పుడు విసుగు, కోపం, అసహనం రావడం సహజమే కదా!’’ అని షెల్డన్ జాక్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో సెలక్టర్లను ఉద్దేశించి షెల్డన్ జాక్సన్ చేసిన ట్వీట్ ‘‘గత మూడు సీజన్లలో అద్భుతంగా ఆడాను కాబట్టి జాతీయ జట్టుకు ఎంపికవ్వాలనే కల నెరవేరుతుందని ఆశించే హక్కు నాకుంటుంది. నా వయసును బట్టి కాదు.. నా ఆట తీరును బట్టి నా పేరును పరిశీలనలోకి తీసుకోండి. నువ్వు మంచి ఆటగాడివి కానీ.. ఇలాంటి మాటలు వినీ వినీ విసుగొచ్చింది. నాకు వయసైపోయిందన్న మాట వాస్తవమే. కానీ నాకిప్పుడు 35 ఏళ్లే.. 75 కాదు’’ అని జాక్సన్ 2022 ఆగష్టులో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా విమర్శనాస్త్రాలు సంధించాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా టెస్టు జట్టు ఎంపిక నేపథ్యంలో షెల్డన్ జాక్సన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ! WC 2023: వెస్టిండీస్ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే! -
Ranji Trophy: సౌరాష్ట్ర దీటైన జవాబు
బెంగళూరు: కెప్టెన్ అర్పిత్ వాసవద (219 బంతుల్లో 112 బ్యాటింగ్; 15 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (245 బంతుల్లో 160; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించడంతో... కర్ణాటక జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు మరో 44 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 76/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. షెల్డన్ జాక్సన్, అర్పిత్ నాలుగో వికెట్‌కు 232 పరుగులు జోడించి సౌరాష్ట్ర జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం అర్పిత్, చిరాగ్ జానీ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కవేరప్ప రెండు వికెట్లు తీయగా, వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. బెంగాల్‌కు భారీ ఆధిక్యం ఇండోర్‌లో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో బెంగాల్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 56/2తో మూడో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ ఆకాశ్‌దీప్ (5/42) మధ్యప్రదేశ్‌ను దెబ్బ కొట్టాడు. బెంగాల్‌కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా కెప్టెన్ మనోజ్ తివారి మధ్యప్రదేశ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు సాధించింది. ప్రస్తుతం బెంగాల్ ఓవరాల్ ఆధిక్యం 327 పరుగులకు చేరుకుంది. -
జాక్సన్, అర్పిత్ సెంచరీలు.. కర్ణాటకకు ధీటుగా బదులిస్తున్న సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కర్ణాటక-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (249) డబుల్ సెంచరీతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా బదులిస్తుంది. షెల్డన్ జాక్సన్ (160) భారీ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ అర్పిత్ వసవద (112 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. వీరిద్దరూ శతకాలతో విరుచుకుపడటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. అర్పిత్ వసవదకు జతగా చిరగ్ జానీ (19) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (33), విశ్వరాజ్ జడేజా (22) పర్వాలేదనిపించగా.. స్నెల్ పటేల్ (0) నిరాశపరిచాడు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కావేరప్ప 2 వికెట్లు పడగొట్టగా.. వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్ డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. శ్రీనివాస్ శరత్ (66) అర్ధసెంచరీతో అలరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కే పటేల్ చెరి 3 వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక, బెంగాల్-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ 327 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 59 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలిన మధ్యప్రదేశ్.. ఈ మ్యాచ్‌లో ఓటమి దిశగా పయనిస్తుంది. -
షెల్డన్ జాక్సన్ వీరోచిత సెంచరీ.. విజయ్ హజారే ట్రోఫీ విజేత సౌరాష్ట్ర
దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. షెల్డన్ జాక్సన్(136 బంతుల్లో 133 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలబడి వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించాడు. హార్విక్ దేశాయ్ 50 పరుగులు చేశాడు. ఆఖర్లో చిరాగ్ జానీ 25 బంతుల్లో 30 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సెంచరీతో జట్టును గెలిపించిన షెల్డన్ జాక్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 2002-03 సీజన్ నుంచి విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తుండగా 2007-08 సీజన్లో సౌరాష్ట్ర తొలిసారి ఈ ట్రోపీని గెలుచుకుంది. తర్వాత 2017-18 సీజన్ లో ఫైనల్ చేరినా తుదిపోరులో కర్నాటక చేతిలో ఓడింది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన జయదేవ్ ఉనాద్కట్ సారథ్యంలోని సౌరాష్ట్ర.. అన్ని విభాగాల్లో రాణించి లక్ష్యాన్ని అందుకుంది. ఈ ట్రోఫీని గతంలో తమిళనాడు 5 సార్లు గెలుచుకోగా .. ముంబై నాలుగు సార్లు నెగ్గింది. WHAT. A. WIN! 🙌 🙌 Those celebrations! 👏 👏 The @JUnadkat-led Saurashtra beat the spirited Maharashtra side to bag the #VijayHazareTrophy title 🏆 Scorecard 👉 https://t.co/CGhKsFzC4g #Final | #SAUvMAH | @mastercardindia | @saucricket pic.twitter.com/2aPwxHkcPD — BCCI Domestic (@BCCIdomestic) December 2, 2022 చదవండి: Pak Vs Eng: పాక్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు! లిస్టులో భారత క్రికెటర్ కూడా మారడోనా, మెస్సీలను మించినోడు.. జెర్సీ నెంబర్-10 ఆ ఆటగాడిదే -
అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, యంగ్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే ఎలైట్ గ్రూఫ్ డిలో బుధవారం బరోడా, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న షెల్డన్ జాక్సన్‌తో అంబటి రాయుడు ఏదో విషయమై మాట్లాడుతున్నాడు. చూస్తుండగానే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునే దాకా వెళ్లిపోయారు. ఇంతలో అంపైర్లతో పాటు ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే వీరి గొడవకు గల కారణం మాత్రం ఏంటనేది తెలియరాలేదు. మాములుగానే అంబటి రాయుడు దూకుడు స్వభావం కలిగిన ఆటగాడు. ఇంతకముందు కూడా రాయుడు చాలా సందర్భాల్లో సహనం కోల్పోయి ఆటగాళ్లతో గొడవ పడిన దాఖలాలు ఉన్నాయి. టీమిండియాలో సరైన అవకాశాలు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన రాయుడు జూలై 2, 2019న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. టీమిండియా తరపున అంబటి రాయుడు 55 వన్డేలు ఆడి 1695 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలతో పాటు 10 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. మితేష్ పటేల్ 60, విష్ణు సోలంకి 51 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సమరత్ వ్యాస్ 52 బంతుల్లో 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మార్క్‌ను చేజార్చుకున్నాడు. pic.twitter.com/twhRAM0o2Y — cricket fan (@cricketfanvideo) October 12, 2022 చదవండి: ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం! తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు -
తండ్రైన కేకేఆర్ బ్యాటర్.. శుభాకాంక్షల వెల్లువ
సౌరాష్ట్ర వెటరన్ వికెట్ కీపర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తమకు మంగళవారం మగ బిడ్డ జన్మించినట్లు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిన్నారి కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు షెల్డన్ జాక్సన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేకేఆర్ సైతం లిటిల్ నైట్‌కు క్లబ్‌లోకి స్వాగతం అంటూ జాక్సన్‌ను విష్ చేసింది. కాగా దేశవాళీ క్రికెట్లో రాణించినప్పటికీ 35 ఏళ్ల షెల్డన్ జాక్సన్‌కు ఇంత వరకు టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో తాను నిరాశకు గురైనట్లు జాక్సన్ గతంలో పలు సందర్భాల్లో వెల్లడించాడు. ఒకానొక సమయంలో తాను ఈ విషయం గురించి ఒకరిద్దరిని అడుగగా.. తనకు వయసైపోయిందన్నారని, అందుకే బీసీసీఐ నుంచి పిలుపు రావడం లేదన్నారని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో 30 ఏళ్లు పైబడిన వారిని జట్టుకు ఎంపిక చేయడం చూశానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2011లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన షెల్డన్ జాక్సన్ 79 మ్యాచ్‌లు ఆడాడు. 5947 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 67 మ్యాచ్‌లలో 2346 పరుగులు చేశాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో 1534 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షెల్డన్ జాక్సన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే ఎవరూ లేరు! Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్! ఇంకా.. Blessed with a boy❤️😇 pic.twitter.com/Kh5zmBTy43 — Sheldon Jackson (@ShelJackson27) July 12, 2022 💜💜 https://t.co/Xr70sHk5eG — Sheldon Jackson (@ShelJackson27) July 12, 2022 -
30 ఏళ్లు దాటిన వారిని టీమిండియాకు ఎంపిక చేయరట..!
ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేసే విధానంపై భారత వెటరన్ ఆటగాడు షెల్డన్ జాక్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో భారత సెలక్లర్లు అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేయట్లేదని ఓ సెలక్షన్ అధికారి తనతో చెప్పినట్లు పేర్కొన్న జాక్సన్.. వయసును సాకుగా చూపి భారత సెలక్టర్లు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా తనను టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 30 ఏళ్లు పైబడిన వారిని టీమిండియాకు ఎంపిక చేయకూడదనే చట్టం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. ఇలా ఏదైనా ఉంటే ఇటీవల ఓ 32 ఏళ్ల ఆటగాడిని భారత జట్టుకు ఎలా ఎంపిక చేశారని నిలదీశాడు. ప్రతి ఒక్క క్రికెటర్‌కు భారత జట్టుకు ఆడాలన్నది ఓ కల అని, దాన్ని సాకారం చేసుకునేందుకే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారని అన్నాడు. సెలక్టర్ల నుంచి పిలుపు అందే వరకు తన ప్రయత్నాలను విరమించేదేలేదని చెప్పుకొచ్చాడు. కాగా, 35 ఏళ్ల జాక్సన్ గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన జాక్సన్.. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన జాక్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50కి పైగా సగటుతో సత్తా చాటుతున్నాడు. 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 19 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సాయంతో 5634 పరుగులు చేశాడు. చదవండి: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా బౌలర్ -
సింగిల్ హ్యాండ్ క్యాచ్.. సూపర్మ్యాన్లా డైవ్ చేస్తూ!
ఐపీఎల్-2022లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్‌లో.. రెండో బంతిని రూథర్‌ఫోర్డ్ లెగ్‌సైడ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్‌కు కుడివైపు నుంచి వెళ్లింది. ఈ క్రమంలో జాక్సన్ డైవ్ చేస్తూ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అద్భుతమైన క్యాచ్ అందుకున్న జాక్సన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రసంశించాడు. ఇక ఈ మ్యాచ్‌లో జాక్సన్ మూడు క్యాచ్‌లు, ఒక స్టంపౌట్ చేశాడు. అంతకుమందు సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లోను రాబిన్ ఉతప్పను మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి అందరి చేత జాక్సన్ ప్రశంసలు పొందాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ చేతిలో మూడు వికెట్ల తేడాతో కేకేఆర్ ఓటమి పాలైంది. . తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్ (25), ఉమేశ్ యాదవ్(18) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా నాలుగు, ఆకాశ్ దీప్ మూడు, హర్షల్ పటేల్ , సిరాజ్ ఒక వికెట్ సాదించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్ క్యాచ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: IPL 2022: అరె ఇషాంత్ భయ్యా.. ఇదేం కర్మ! @ShelJackson27 what a catch 👏 @msdhoni @KKRiders #whatacatch pic.twitter.com/QLbSg33ZwS — sid (@siddheshnate) March 30, 2022 -
వారెవ్వా షెల్డన్ జాక్సన్.. ఏమా మెరుపు వేగం
సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ సూపర్ స్టంపింగ్‌తో మెరిశాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత రాయుడు, ఊతప్పలు ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఐదో బంతికి రాబిన్ ఊతప్ప(28) అనూహ్యంగా స్టంప్ ఔట్ అయ్యాడు. వాస్తవానికి వరుణ్ వేసిన బంతి వైడ్‌బాల్‌గా వెళ్లింది. అయితే అప్పటికే బంతిని టచ్ చేసే క్రమంలో ఊతప్ప క్రీజును దాటి బయటకు వచ్చేశాడు. అంతే ఇది గమనించిన షెల్డన్ జాక్సన్ మెరుపు వేగంతో బెయిల్స్ ఎగురగొట్టాడు. ''వారెవ్వా జాక్సన్.. ఏమా మెరుపువేగం'' అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశాడు. రాబిన్ ఊతప్ప ఔట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: IPL 2022: రిషబ్ పంత్ గురించి పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సిగ్గుచేటు.. బయటోడికి, మనోడికి తేడా తెలియడం లేదా?
కేకేఆర్ ఆటగాడు.. సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. అదేంటి ఇంకా ఐపీఎల్ ప్రారంభం కాకముందే అలా ఎలా అని ఆశ్చర్యపోకండి. అతని పేరు మార్మోగిపోవడానికి కారణం ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన పని. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 15వ సీజన్ మరో మూడురోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ మీడియా చానెల్స్ ప్యానెల్ చర్చలు జరుపుతున్నాయి. వారి చర్చల్లో ఈసారి ఐపీఎల్ విజేతలుగా నిలిచే అవకాశం ఎవరికి ఉంది.. జట్టు బలబలాలు, ఆయా జట్ల గేమ్ స్ట్రాటజీ ఏంటనే దానిపై సీరియస్ చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్యానెల్లో కేకేఆర్ జట్టు చర్చకు వచ్చింది ఒక సీనియర్ జర్నలిస్ట్ అదే జట్టులోని షెల్డన్ జాక్సన్‌ను విదేశీ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. వాస్తవానికి షెల్డన్ జాక్సన్ పేరు విదేశీయుల పేరుకు దగ్గరగా ఉండడంతో సదరు జర్నలిస్ట్ అతను ఫారిన్ ప్లేయరేమోనని భావించాడు. షెల్డన్ జాక్సన్ గురించి మాట్లాడేటప్పుడు సదరు జర్నలిస్ట్ విదేశీ ఆటగాడిగానే సంభోదించాడు. పక్కనున్న మిగతావారు కూడా అతనికి వంత పాడారు. ఇది చూసిన అభిమానులు ఊరుకుంటారా..చర్చ జరిపిన ప్యానెల్‌ను మొత్తం ఎండగట్టారు. విదేశీ ఆటగాడికి.. మనోడికి తేడా తెలియడం లేదా.. క్రికెట్‌పై సరైన అవగాహన లేని ప్రతీఒక్కరు మీటింగ్‌లు పెడుతున్నారు.. వాస్తవం ఏంటనేది తెలసుకొని ప్యానెల్ చర్చలు నిర్వహించండి.. ఇది నిజంగా సిగ్గుచేటు.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే చివరలో అసలు విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ సహా మిగతా సభ్యులు తాము చేసిన పొరపాటును గ్రహించి క్షమాపణ చెప్పడం కొసమెరుపు. గుజరాత్‌కు చెందిన షెల్డన్ జాక్సన్ 2013లో ఆర్సీబీ తరపున తొలిసారి ఐపీఎల్లో అడుగుపెట్టాడు. కానీ ఆ జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత 2017 నుంచి షెల్డన్ జాక్సన్ కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే జరిగిన మెగావేలంలో షెల్డన్ జాక్సన్‌ను కేకేఆర్ మరోసారి కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్లో కేకేఆర్ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడి 38 పరుగులు చేశాడు. ఇక రైల్వే జట్టుకు ఆడడం ద్వారా షెల్డన్ జాక్సన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5947 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు.. 31 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 67 మ్యాచ్‌లాడి 8 సెంచరీలు.. 12 అర్థసెంచరీల సాయంతో 2346 పరుగులు చేశాడు. ఇక 62 టి20 మ్యాచ్‌ల్లో 1511 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్ @vikrantgupta73 kaise journalist hai aapke pass, unko ye bhi nahi pata ki Sheldon Jackson Indian hai Humko hi bula lete isse accha https://t.co/qbMydPLRs0 — Vedant (@vedant78_boi) March 23, 2022 Nowhere during this clip or during the entire show did I ever mention #SheldonJackson as a foreign player. My bad I didn’t realise when he got called an overseas entrant. Pls go through the entire show because I am very well aware of Sheldon’s achievements for Indian cricket. 🙏 https://t.co/W1M5WcUfLz — Rahul Rawat (@rawatrahul9) March 23, 2022 This is height of comedy! The so called cricket experts on #SportsTak are continuously calling Sheldon Jackson a foreign player. Shame! pic.twitter.com/aNTPEbh3xX — راغب रागीब (@dr_raghib) March 22, 2022 So, It's confirmed by so called cricket experts that Sheldon Jackson is a foreign player 🙂. Shame !!! — Dilip Singh Rathour (@dilipsrathour) March 23, 2022 -
Vijay Hazare Trophy: 23,1,1,1,18,14,1,0,5,0.. అందరూ చేతులెత్తేశారు.. ఒక్కడే 72!
Sheldon Jackson Super Diving Catch Video Viral: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. సూపర్డైవ్తో విదర్భ బ్యాటర్ అథర్వ టైడ్ పెవిలియన్ చేరేలా చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ-2021 మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విదర్భకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ ఫాజల్ 23 పరుగులు చేయగా.. అతడికి జోడీగా ఓపెనింగ్‌కు దిగిన అథర్వ కేవలం ఒకే ఒక్క పరుగు తీసి వెనుదిరిగాడు. మూడో ఓవర్ మూడో బంతికి జయదేవ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ పాదరసంలా కదిలి డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ఆ తర్వాత విదర్భ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు)తో రాణించడంతో 40.3 ఓవర్లలో 150 పరుగులు చేసి విదర్భ ఆలౌట్ అయింది. విదర్భ బ్యాటర్ల స్కోర్లు వరుసగా.. 23,1,1,1,18,14,72,1,0,5,0. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్కు 2, చేతన్ సకారియాకు ఒకటి, చిరాగ్ జానీకి 2, ప్రేరక్ మన్కడ్‌కు ఒకటి, డీఏ జడేజాకు రెండు, యువరాజ్ చౌడసమాకు 2 వికెట్లు దక్కాయి. సౌరాష్ట్ర బ్యాటింగ్ కొనసాగిస్తోంది. చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం! ఆ టీమిండియా బ్యాటర్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ .@ShelJackson27's superb diving catch 👌 👌 Jackson, keeping the wickets, flew towards his left & completed a stunning catch off @saucricket captain @JUnadkat to dismiss Atharva Taide. 👍 👍 #SAUvVID #VijayHazareTrophy #QF3 Watch that catch 🎥 🔽https://t.co/aqsiKMv4A8 pic.twitter.com/Z0Rah3D6P5 — BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021 -
Harbhajan Singh: 62 నాటౌట్, 70, 79 నాటౌట్.. అతడేం పాపం చేశాడు.. ఇంకేం చేస్తే
‘What Else Does He Need to Do’ – Harbhajan Singh: షెల్డన్ జాక్సన్.. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న వెటరన్ ప్లేయర్. 35 ఏళ్ల షెల్డన్.. ఎప్పటికైనా జాతీయ జట్టులో తనకు చోటు దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో త్వరలో న్యూజిలాండ్‌తో టీమిండియా సిరీస్, ఇండియా ఏ దక్షిణాఫ్రికా టూర్ నేపథ్యంలో సెలక్టర్లు తనను పరిగణనలోకి తీసుకుంటారని ఆశలు పెట్టుకున్నాడు. కానీ.. నవంబరు 9న బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు. దీంతో సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ సెలక్టర్ల తీరుపై మండిపడ్డాడు. దేశవాళీ టోర్నీలో అద్బుతంగా రాణిస్తున్నా అతడిని ఎంపిక చేయకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. అతడేం పాపం చేశాడని... ఇంకేం చేస్తే షెల్డన్ను జట్టులోకి తీసుకుంటారంటూ ధ్వజమెత్తాడు. ఈ మేరకు... ‘‘ 2019/19 రంజీ సీజన్లో 854 పరుగులు, 2019/2020లో 809 పరుగులు.. రంజీ చాంపియన్. ఈ ఏడాది కూడా అద్భుతమైన ఫామ్.. అయినా కూడా కసీం ఇండియా ఏ టీమ్‌కు కూడా సెలక్ట్ కాలేదు. పరుగులు చేయడం కాకుండా ఇంకేం చేస్తే... అతడిని పరిగణనలోకి తీసుకుంటారో భారత సెలక్టర్లు చెప్పగలరా?’’ అని ట్విటర్ వేదికగా భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. IPL కాగా భజ్జీ మాటల్లో వాస్తవం లేకపోలేదు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), హర్షల్ పటేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), అవేశ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్)లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లోనూ అద్భుతంగా రాణిస్తున్న షెల్డన్ జాక్సన్‌ను మాత్రం పక్కనపెట్టేశారు. ఇక ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో షెల్డన్ జాక్సన్.. వరుసగా 62 నాటౌట్, 70, 79 నాటౌట్ స్కోరు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. 5634 పరుగులు చేసిన షెల్డన్... పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ గత దశాబ్ద కాలంగా సౌరాష్ట్ర జట్టులో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్. చదవండి: Sheldon Jackson: అంతా గంభీర్ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని #JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?! Ranji season 2018/19 scored 854 and 2019/2020 scored 809 and also Ranji champion that year plus this year current form👇yet not getting picked even for India A team.can 🇮🇳selector tell him what else he need to do to ply for india apart from scoring runs #shame @ShelJackson27 pic.twitter.com/HcwQDwhGsZ — Harbhajan Turbanator (@harbhajan_singh) November 9, 2021 -
అంతా గంభీర్ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని
Sheldon Jackson Gets Emotional About His Journey: ‘‘పాతికేళ్ల వయస్సులో క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నా. అప్పటికి రంజీ ట్రోఫీ స్వ్యాడ్‌లో ఉన్న నేను ఐదేళ్లుగా బెంచ్‌కే పరిమితమయ్యాను. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అప్పుడు నా స్నేహితుడు మిస్టర్ షపత్ షా ఓ మాట చెప్పాడు. ‘‘ఇన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నావు. ఎంతో కష్టపడ్డావు. మరొక్క ఏడాది ఆగు. నీకు మంచి రోజులు వస్తాయి. అలా జరగకపోతే.. నా ఫ్యాక్టరీలో నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. అయితే, నువ్వు మాత్రం ఇప్పుడే ఆటను వదిలేయొద్దు సరేనా’’ అని నచ్చజెప్పాడు. తన మాటకు తలొంచాను. ఆ మరుసటి ఏడాది దేశంలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేశాను. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాను. దేశవాళీ లీగ్‌లు అన్నీ ఆడాను. ఒక్క ఏడాదిలో నాలుగు సెంచరీలు చేశాను. అందులో మూడు వరుస శతకాలు.. అప్పటి నుంచి ఆ కెరీర్ ఊపందుకుంది’’ అని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు షెల్డన్ జాక్సన్ తన క్రికెట్ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు. స్నేహితుడి మాటలు తన జీవన గమనాన్నే మార్చివేశాయని ఉద్వేగానికి లోనయ్యాడు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న షెల్డన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో క్రికెట్‌ను వదిలేద్దామనుకున్న అతడు.. అలా గనుక చేసి ఉంటే... ఇప్పుడు రోడ్డుమీద పానీపూరీ అమ్ముకునే వాడినని భావోద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్ రెండో అంచె ఆరంభం కానున్న నేపథ్యంలో షెల్డన్ జాక్సన్ కేకేఆర్‌తో సంభాషించాడు. రోడ్ల మీద పానీపూరీ అమ్ముకునేవాడిని! ‘‘ముందు చెప్పినట్లుగా నా ఫ్రెండ్ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ఆ తర్వాత విజయాలు వరించాయి. జీవితంలో ఏదో ఒకటి సాధించగలననే నమ్మకం వచ్చింది. ఒకవేళ నాకు మరో అవకాశం దక్కి ఉండకపోతే రోడ్ల మీద పానీపూరీ అమ్ముకునేవాడిని’’ అని షెల్డన్ చెప్పుకొచ్చాడు. అంతా గౌతం భయ్యా వల్లే! కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘ఢిల్లీతో రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో నేను హాఫ్ సెంచరీతో మెరిశాను. గౌతం భాయ్ దగ్గరకు వెళ్లి నేను బాగా ఆడానా భయ్యా? నా గేమ్ మీకు నచ్చిందా? అని అడిగాను. అవును.. బాగా బ్యాటింగ్ చేశావు. నిన్ను కేకేఆర్ సొంతం చేసుకుంటుంది రెడీగా ఉండు అని అన్నారు. అయితే, ఐపీఎల్ వేలంలో తొలి రౌండ్లో నన్ను ఎవరూ కొనలేదు. నిస్సత్తువ ఆవహించింది. అప్పుడే కేకేఆర్ మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది. గౌతం భాయ్ నా గురించి చెప్పారట. అందుకే నన్ను కొంటున్నారని చెప్పారు. ఆర్థికంగా, మానసికంగా నాకు ఊరట కలిగించిన రోజు అది. మా అమ్మ ముఖంలో సంతోషం చూశాను. నాకు అండగా నిలబడ్డ గౌతం భయ్యా.. అప్పుడూ.. ఇప్పుడూ నాకు ఆరాధనా భావమే ఉంటుంది’’ అని 34 ఏళ్ల షెల్డన్ జాక్సన్ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 5 వేల పరుగులు చేసిన షెల్డన్.. ఇటీవలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 బంతుల్లో 106 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక ఐపీఎల్లో భాగంగా 2017లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో క్యాష్ రిచ్‌లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన అతడు.. టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. చదవండి: IPL 2021 Phase 2: అతనొక్కడే.. ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ గెలవలేదు కాబట్టి.. IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో.. My reason to play, work hard and staying motivated ❤️. Whats yours? pic.twitter.com/lYegG2wpnM — Sheldon Jackson (@ShelJackson27) September 7, 2021 The Man on a mission 💪 𝙒𝙀 𝘼𝙍𝙀 𝙆𝙆𝙍, Out now! Watch the entire film 👉 https://t.co/nuzVHLYq78 #KKRFilms x Payments on @amazonIN #PayAmazonSe #KKR #IPL2021 @Bazmccullum pic.twitter.com/RtOVOVcYdN — KolkataKnightRiders (@KKRiders) September 14, 2021 -
'బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. నా గుండె పగిలింది'
ముంబై: జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్ ఆడనుంది. ఐపీఎల్, ఇతర దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జట్టులో చోటు కల్పించారు. రుతురాజ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా వంటి యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఇటీవలే రంజీ ట్రోపీలో దుమ్మురేపిన సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ లంకతో పర్యటనకు కచ్చితంగా ఎంపికవుతానని భావించాడు. కానీ అతని ఆశలు తలకిందులయ్యాయి. ఈ సందర్భంగా తాను ఎంపికకాకపోవడంపై స్పందించిన షెల్డన్ జాక్సన్.. '' ఎంత బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. నా గుండె పగిలింది'' అంటూ ఎమోజీ షేర్ చేశాడు. ''ఇప్పుడు నా వయసు 34 ఏళ్లు.. కానీ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాను. ఒక 22-23 ఏళ్ల కుర్రాడిలో దూకుడైన ఆటతీరు ఎలా ఉంటుందో అలా సాగుతుంది నా ఆటతీరు. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేను ఏం చేయలేను.. లేటు వయసులో జాతీయ జట్టులోకి ఎంట్రీ లేదని క్రికెట్ పుస్తకాల్లో ఎక్కడా లేదు. ఒక ఆటగాడిని ఎంపిక చేయలాంటే అతని ఆటతీరు చూడాలని నేను నమ్ముతా. వరుసగా మూడు సీజన్ల పాటు రంజీ ట్రోపీలో 800-900 పరుగులు చేశానంటే ఫిట్‌గా ఉండడమే కదా అర్థం. అతని వయస్సు 30 కంటే ఎక్కువ.. అందుకే సెలక్ట్ కాలేదు..ఈ పదం నేను చాలాసార్లు విన్నా'' అంటూ ఆవేదన చెందాడు. ఇక షెల్డన్ జాక్సన్ రంజీ ట్రోపీలో వరుసగా మూడుసార్లు 700కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 76 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 5634 పరుగులు, 60 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 2096 పరుగులు, 59 దేశవాలీ టీ20ల్లో 1240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు.. 44 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న టీమిండియా జూలై 13న తొలి వన్డే ఆడనుంది. చదవండి: కెప్టెన్‌గా గబ్బర్.. వైస్‌కెప్టెన్‌గా భువీ దంచికొట్టిన రషీద్ ఖాన్.. ఆఖరి బంతికి విజయం 💔 — Sheldon Jackson (@ShelJackson27) June 10, 2021 -
బీసీసీఐని నిలదీసిన క్రికెటర్
న్యూఢిల్లీ: తానేమీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ని ప్రశ్నించడం లేదంటూనే ఉతికి ఆరేశాడు సౌరాష్ట్ర రంజీ క్రికెటర్ షెల్డాన్ జాక్సన్. గత కొన్నేళ్లుగా సౌరాష్ట్ర ఆటగాళ్లు నిలకడైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ తమ జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడ్ని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ‘ మీకు మా ఆటగాళ్లు ప్రదర్శన కనబడలేదా.. లేక చిన్న జట్టే కదా అని మాపై చిన్నచూపా. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేరాం. కానీ మా జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడ్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. కనీసం ‘ఏ’ సిరీస్‌లకు మమ్మల్ని ఎంపిక చేయడం లేదు. ఇదేనా మీరు రంజీ ట్రోఫీ ఫైనల్స్‌కు ఇచ్చే ప్రాముఖ్యత. గత ఐదేళ్ల నుంచి చిన్న రాష్ట్రాల జట్లకు ఆడుతున్న వారిని పరిగణలోకి తీసుకోవడం లేదు.. ఇప్పటికీ మమ్మల్ని అలానే చూస్తున్నారా. ఇప్పటివరకూ సితాన్షు కోటక్స్ కోచింగ్‌లో సౌరాష్ట్ర మూడు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మా జట్టులో బ్యాట్, బంతితో మెరిసే ఆటగాళ్లు ఉన్నారు. కానీ మాకు దక్కే గౌరవం దక్కడ లేదు. ఇది మిమ్మల్ని ప్రశ్నించడం కాదు.. కేవల అడుగుతున్నానంతే’ అని వరుస పెట్టి ట్వీట్ల వర్షం కురిపించాడు షెల్డాన్ జాక్సన్. సౌరాష్ట్ర తరఫున ప్రతిభ చాటుకుంటున్న క్రికెటర్లలో జాక్సన్ ఒకడు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సుమారు 50 సగటుతో దూసుకుపోతున్నాడు. స్వతహాగా వికెట్ బాట్స్మన్ అయిన జాక్సన్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్ కూడా ఆడాడు. -
ఐపీఎల్ చరిత్రలో తొమ్మిదో వాడు
కోల్ కతా: రైజింగ్ పుణే తో ఈడేన్ గార్డెన్స్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ షెల్డాన్ జాక్సన్ హిట్ వికెట్ అయి అందరిని ఆశ్ఛర్య పరిచాడు. దీంతో ఈసీజన్ లో హిట్ వికెట్ అయిన తొలి బ్యాట్స్ మన్ గా అప్రతిష్టను మూటగటుకున్నాడు. రైజింగ్ పుణే యువ బౌలర్ వాషింగ్టన్ వేసిన 4 ఓవర్లోని చివరి బంతిని వెనక్కి జరిగి డిఫెన్స్ ఆడబోయిన జాక్సన్ వికెట్లు తగలడంతో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో హిట్ వికెట్ గా వెనుదిరిగిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు హిట్ వికెట్ అయిన వారిలో యువరాజ్, డెవిడ్ వార్నర్, మిస్భా వుల్ హక్, సౌరభ్ తివారి, రవీంద్ర జడేజా, దీపక్ హుడా , ముసావరి కోటే, స్వప్నిల్ అస్నోద్కర్ లు ఉన్నారు. అయితే గత సీజన్ లో యువరాజ్ సింగ్, డెవిడ్ వార్నర్, దీపక్ హుడా లు హిట్ వికెట్ గా వెనుదిరగడం గమనార్హం. -
షెల్డాన్ జాక్సన్ వీరవిహారం
రాజ్ కోట్:దేశవాళీ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా విజయ్ హజారే వన్డే ట్రోఫీలో సౌరాష్ట్ర ఓపెనర్ షెల్డాన్ జాక్సన్ వీరవిహారం చేశాడు. గ్రూప్-డిలో భాగంగా శనివారం గోవాతో జరిగిన మ్యాచ్ లో జాక్సన్(150 నాటౌట్; 103 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో సౌరాష్ట్రకు ఘన విజయం సాధించింది. అతనికి జతగా మరో ఓపెనర్ బారోట్ (49 నాటౌట్:56 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. దీంతో సౌరాష్ట్ర 26.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఇంకా 141 బంతులు మిగిలి ఉండగానే సౌరాష్ట్ర గెలుపును సొంతం చేసుకోవడం ఈమ్యాచ్ లో విశేషం. టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా గోవాను కోరింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గోవా 47.4 ఓవర్లలో 199 పరుగులకే పరిమితమైంది. గోవా ఆటగాళ్లలో కామత్(95) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.సౌరాష్ట్ర బౌలర్లలో సనాన్ దియాకు మూడు వికెట్లు లభించగా, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి.