వారెవ్వా షెల్డన్‌ జాక్సన్‌.. ఏమా మెరుపు వేగం | IPL 2022: Sheldon Jackson Stunning Stump Out Robin Utappa Vs CSK Match | Sakshi
Sakshi News home page

IPL 2022: వారెవ్వా షెల్డన్‌ జాక్సన్‌.. ఏమా మెరుపు వేగం

Published Sat, Mar 26 2022 8:23 PM | Last Updated on Sat, Mar 26 2022 9:40 PM

IPL 2022: Sheldon Jackson Stunning Stump Out Robin Utappa Vs CSK Match - Sakshi

Courtesy: IPL Twitter

సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ వికెట్‌ కీపర్‌ షెల్డన్‌ జాక్సన్‌ సూపర్‌ స్టంపింగ్‌తో మెరిశాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత రాయుడు, ఊతప్పలు ఇన్నింగ్స్‌ నడిపిస్తున్నారు. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ ఐదో బంతికి రాబిన్‌ ఊతప్ప(28) అనూహ్యంగా స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. వాస్తవానికి వరుణ్‌ వేసిన బంతి వైడ్‌బాల్‌గా వెళ్లింది. అయితే అప్పటికే బంతిని టచ్‌ చేసే క్రమంలో ఊతప్ప క్రీజును దాటి బయటకు వచ్చేశాడు. అంతే ఇది గమనించిన షెల్డన్‌ జాక్సన్‌ మెరుపు వేగంతో బెయిల్స్‌ ఎగురగొట్టాడు. ''వారెవ్వా జాక్సన్‌.. ఏమా మెరుపువేగం'' అంటూ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశాడు.

రాబిన్‌ ఊతప్ప ఔట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

చదవండి: IPL 2022: రిషబ్‌ పంత్‌​ గురించి పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement