robin utappa
-
ఐపీఎల్ చరిత్రలో ఊతప్ప-శివమ్ దూబే జోడి అరుదైన ఫీట్
ఐపీఎల్ 2022లో ఆర్సీబీ, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఇవన్నీ సీఎస్కే పేరిట నమోదు కావడం విశేషం. తొలి నాలుగు మ్యాచ్‌లు పరాజయం పాలయ్యామన్న బాధేమో తెలియదు కానీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం సీఎస్కే తన విశ్వరూపం ప్రదర్శించింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇందులో తొలి 10 ఓవర్లలో సీఎస్కే స్కోరు 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే. ఆరంభంలో నిధానంగా సాగినప్పటికి.. రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే జోడి కలిసిన తర్వాత విధ్వంసం షురూ అయింది. ఆ విధ్వంసం ఎంతలా అంటే.. తొలి 10 ఓవర్లలో 60 పరుగులు చేసిన సీఎస్కే ఆ తర్వాతి 10 ఓవర్లలో 155 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎస్కే రికార్డులు పరిశీలిస్తే.. ►ఊతప్ప- శివమ్ దూబే జంట సరికొత్త రికార్డు నెలకొల్పింది. సీఎస్కే తరపున ఊతప్ప- శివమ్ దూబే జోడి సాధించిన 165 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యుత్తమం. తొలి స్థానంలో షేన్ వాట్సన్-డుప్లెసిస్ జోడి ( 2020లో పంజాబ్ కింగ్స్‌పై, 181* పరుగులు) ఉండగా.. మురళీ విజయ్- మైక్ హస్సీ జోడి(2011లో ఆర్సీబీపై 159 పరుగులు) మూడో స్థానంలో ఉంది. ►ఇక 11-20 ఓవర్ల మధ్యలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సీఎస్కే మూడో స్థానంలో ఉంది. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్కే 11-20 ఓవర్ల మధ్యలో 156 పరుగులు చేసింది. తొలి స్థానంలో ఆర్సీబీ(గుజరాత్ లయన్స్‌పై) 2016లో 172 పరుగులు, పంజాబ్ కింగ్స్( సీఎస్కేపై) 2014లో 162 పరుగులతో రెండో స్థానంలో ఉంది. చదవండి: Shivam Dube: 11 ఏళ్ల రికార్డు సమం చేసిన శివమ్ దూబే Innings Break! A sensational 165-run partnership between Uthappa (88) and Dube (95*) guides #CSK to a total of 216/4 on the board.#RCB chase coming up shortly. Stay tuned!#TATAIPL pic.twitter.com/uOr7P60zVa — IndianPremierLeague (@IPL) April 12, 2022 -
వారెవ్వా షెల్డన్ జాక్సన్.. ఏమా మెరుపు వేగం
సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ సూపర్ స్టంపింగ్‌తో మెరిశాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత రాయుడు, ఊతప్పలు ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఐదో బంతికి రాబిన్ ఊతప్ప(28) అనూహ్యంగా స్టంప్ ఔట్ అయ్యాడు. వాస్తవానికి వరుణ్ వేసిన బంతి వైడ్‌బాల్‌గా వెళ్లింది. అయితే అప్పటికే బంతిని టచ్ చేసే క్రమంలో ఊతప్ప క్రీజును దాటి బయటకు వచ్చేశాడు. అంతే ఇది గమనించిన షెల్డన్ జాక్సన్ మెరుపు వేగంతో బెయిల్స్ ఎగురగొట్టాడు. ''వారెవ్వా జాక్సన్.. ఏమా మెరుపువేగం'' అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశాడు. రాబిన్ ఊతప్ప ఔట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: IPL 2022: రిషబ్ పంత్ గురించి పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
పశువుల వేలం కంటే దారుణంగా ఉంది.. ఐపీఎల్ వేలంపై సీఎస్కే ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Robin Uthappa: ఐపీఎల్ వేలం గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం జరిగే తీరు అస్సలు బాగోలేదని, అది చూసినప్పుడు సంతలో పశువుల వేలాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతుంటే.. ఏదో వస్తువు కోసం పోటీ పడుతున్న దారుణమైన ఫీలింగ్ కలుగుతుందని, వేలం సమయంలో ఆటగాళ్లు కూడా మనుషులేనన్న విషయాన్ని ఫ్రాంచైజీలు మరిచిపోయి ప్రవర్తిస్తాయని వాపోయాడు. వేలంలో‘అమ్ముడుపోని ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరని, అది వర్ణించలేని బాధ కలిగిస్తుందని అన్నాడు. ఆటగాళ్ల కోసం వేలం భారత్‌లో మాత్రమే జరుగుతుందని, మున్ముందు ఈ ప్రక్రియకు స్వస్థి పలికితే బాగుంటుందని, అందరికీ మేలు జరిగేలా ముసాయిదా విధానం అమలులోకి వస్తే చాలా గౌరవప్రదంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్ల బేస్ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో కూడా అతను ఇదే జట్టుకే ఆడాడు. సీఎస్కే లాంటి జట్టుకు ఆడాలన్నది తన కోరిక అని, అందు కోసం తాను, తన కొడుకు దేవుడిని ప్రార్ధిస్తున్నామని ఐపీఎల్ 2022 వేలానికి ముందు ఓ ఇంటర్వ్యూలో ఉతప్ప పేర్కొన్నాడు. రాబిన్ ఉతప్ప 2006 నుంచి 2015 మధ్యకాలంలో భారత్ తరఫున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్ -
'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో'
ముంబై: టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనిలో కోపం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఏ విషయమైనా సరే తన కూల్ కెప్టెన్సీతో అక్కడి పరిస్థితినే మార్చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ సహా ఐపీఎల్‌లోనూ ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. మరి అలాంటి ధోని టీమిండియా వివాదాస్పద బౌలర్ ఎస్. శ్రీశాంత్‌కి ఒక సందర్భంలో వార్నింగ్ ఇచ్చాడంటూ మరో భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత ఇది చోటు చేసుకుందని తెలిపాడు. స్టాండప్ కమేడియన్ సౌరభ్ పంత్ యూట్యూబ్ చానెల్‌కు ఊతప్ప ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోని, శ్రీశాంత్‌ల మధ్య జరిగిన ఘటనను ప్రస్తావించాడు. ''టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో హైదరాబాద్ వేదికగా ఓ టీ20 మ్యాచ్ ఆడుతున్నాం. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ఆండ్రూ సైమండ్స్ లేదా హస్సీనా అనేది నాకు సరిగా గుర్తు లేదు. కానీ.. శ్రీశాంత్ విసిరిన బంతిని అతనికే డైరెక్ట్‌గా హిట్ చేశాడు. వెంటనే బంతిని అందుకున్న శ్రీశాంత్ బెయిల్స్‌ని ఎగరగొట్టి.. హౌ ఈజ్ దట్..? హౌ ఈజ్ దట్..? అంటూ గట్టిగా అరిచాడు. దాంతో.. అతని వద్దకి పరుగెత్తుకుంటూ వెళ్లిన ధోని కోపంతో శ్రీశాంత్‌ను పక్కకు తోసి 'వెళ్లి బౌలింగ్ చెయ్ బ్రో' అంటూ హెచ్చరించాడు. స్వతహగా చాలా దూకుడుగా ఉండే శ్రీశాంత్‌ని కూడా ధోని చక్కగా హ్యాండిల్ చేయడం తాను ఎప్పటికీ మరిచిపోను. అందుకే కూల్ మాస్టర్ అనే పేరు ధోనీకి సరిగ్గా సరిపోతుంది'' అని ఉతప్ప వెల్లడించాడు. కాగా ఐపీఎల్ 2013లో స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ ఏడేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. అయితే.. ఈ ఏడాది ఐపీఎల్లో మళ్లీ ఆడేందుకు ఈ పేసర్ ప్రయత్నించగా.. ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఈ ఏడాది వచ్చిన రాబిన్ ఉతప్పకి కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ధోనీ కల్పించలేదు. ఇక సీఎస్కే ఐపీఎల్ 14వ సీజన్లో దుమ్మురేపింది. యూఏఈలో గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. 2 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చదవండి: వార్నర్ మళ్లీ మొదలుపెట్టాడు.. ఈసారి రౌడీ బేబీతో -
వారిద్దరి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా..
ముంబై : భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లైన జయ్‌దేవ్ ఉనాద్కట్, రాబిన్ ఊతప్పలను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. కోట్టు పెట్టి వారిద్దరిని కొన్నందుకు రాజస్తాన్‌కు ఏమైనా ఉపయోగం ఉందా అంటూ చురకలంటించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 'వీరు కీ బైతక్' పేరుతో ఒక చానెల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను తన చానెల్ ద్వారా రోజువారి ఎపిసోడ్లుగా రూపొందించి విడుదల చేస్తున్నాడు. వీరు ప్రారంభించిన ఈ న్యూ సిరీస్‌కు బాగా క్రేజ్ వచ్చింది. (చదవండి : ఎంఎస్ ధోని ఫన్నీ వాక్) తాజాగా నేడు(మంగళవారం) అబుదాబి వేదికగా రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉంటే మరోవైపు ముంబై వరుస విజయాలతో జోరుమీద ఉంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ జట్టులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వీరు విమర్శించాడు. ' రాజస్తాన్ జట్టు తమ ఆటగాళ్లలో కొందరికి అత్యధిక ధరను ఇచ్చి చాలా తప్పులు చేస్తుంది. అందులో ఉనాద్కట్ ఒకడు.. ఈ సీజన్లో ఉనాద్కట్ చెత్త ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగు మ్యాచ్‌లాడి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఉనాద్కట్‌ను మొదట 2018లో రాజస్తాన్ జట్టే రూ .11.5 కోట్లకు కొనుగోలు చేసింది.. ఆ తర్వాత అదే జట్టు మళ్లీ రూ. 8.5 కోట్లకు దక్కించుకుంది.. 2020లో వేలంలోకి వచ్చిన ఉనాద్కట్‌ను మళ్లీ అదే ఆర్ఆర్ రూ. 3 కోట్లకు దక్కించుకుంది. ఈ స్కీమ్ చూడడానికి బాగుంది కానీ.. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వచ్చేసారి వేలంలో ఉనాద్కట్‌ను కొనుగోలు చేయాలంటే రాజస్తాన్‌కే అతను తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందేమో అంటూ చురకలంటించాడు. ఇక మరొక ఆటగాడు రాబిన్ ఊతప్ప.. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 33 పరుగులే చేసిన ఊతప్ప జట్టుకు భారంగా మారాడు. రాజస్తాన్ అతన్ని రూ. 3కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక ఊతప్ప పరిస్థితి ఎలా ఉందంటే.. బులెట్ కొందామని రాజస్తాన్ రాయల్స్ మార్కెట్(ఐపీఎల్ వేలం)లోకి వెళితే బులెట్‌కు బుదులు లూనాను కొనుగోలు చేసినట్లు తయారైంది. కోట్టు పెట్టి కొంటే వీరివల్ల జట్టుకు ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి 'అంటూ విమర్శించాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరగనున్న నేటి మ్యాచ్‌లో రాజస్తాన్ కొంచెం ఆధిక్యంలో ఉంది.. అది ఎలా అంటారా.. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఆర్ఆర్ ముంబైపై పైచేయి సాధించింది అని చెప్పుకొచ్చాడు. (చదవండి : ధోనిలో ఉన్న గ్రేట్‌నెస్ అదే!) View this post on Instagram Dilli Ki Nikal Padi. Catch the fresh episode of 'Viru Ki Baithak' every morning only on Facebook Watch #CricketTogether A post shared by Virender Sehwag (@virendersehwag) on Oct 5, 2020 at 10:46pm PDT ఇక ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్ఆర్ జట్టు ఆరంభంలో జరిగిన రెండు మ్యాచ్‌లను భారీ విజయాలుగా మలిచినా.. తర్వాతి రెండు మ్యాచ్‌లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. స్టీవ్ స్మిత్, సంజూ శామ్సన్ తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. స్మిత్, శామ్సన్ విఫలమైతే ఆ జట్టును ఆదుకునేవారు కరువయ్యారు. ముంబై విషయానికి వస్తే ఆరంభ మ్యాచ్‌లో చతికిలపడి తర్వాత మూడు విజయాలు అందుకొని టాప్2 లో నిలిచి నూతన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. -
'ఆ నిర్ణయం నా కెరీర్‌ను ముంచేసింది'
ముంబై : టెస్ట్ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవాలనే తప్పుడు నిర్ణయం తన కెరీర్‌ను ముంచేసిందని భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ఈ తప్పిదం వల్లే తన బ్యాటింగ్‌లో దూకుడు తగ్గిందని, దాంతో కెరీర్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఊతప్ప తాజాగా ఆ జట్టు సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఊతప్ప తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ('థ్యాంక్యూ.. సారా అండ్ అర్జున్') 'భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే నా అతిపెద్ద లక్ష్యం. దానికి తగ్గట్టు 20-21 ఏళ్ల వయసులోనే ప్రయత్నాలు మొదలు పెడితే బాగుండేది. కానీ 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవడం నాకు కీడు తలపెట్టింది. అప్పటివరకు స్థిరంగా ఆడుతూ వస్తున్న నా బ్యాటింగ్‌లో మునపటి పదును తగ్గింది. అయితే కెరీర్లో ఏ విషయం గురించి పశ్చాత్తాప పడవద్దనుకున్నా.. అత్యత్తుమ ప్రదర్శన కనబర్చాలనుకున్నా. అందుకే ఆ సమయంలో ప్రవీణ్ అమ్రే పర్యవేక్షణలో నా బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవాలని నిర్ణయించుకొని మరింత మెరుగైన బ్యాట్స్‌మన్‌గా తయారవ్వాలనుకున్నా. ముఖ్యంగా గంటలకొద్దీ క్రీజులో ఉండి.. స్థిరంగా రాణించాలనుకున్నా. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది.'అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. 2006లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఊతప్ప.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన తను తర్వాత కనుమరుగయ్యాడు. 13 ఏళ్ల కెరీర్లో ఊతప్ప 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. చివరిసారిగా 2015లో జింబాబ్వే పర్యటనలో ఆడాడు. కాగా రాబిన్ ఊతప్ప అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున తొలి హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. (హ్యాపీ బర్త్‌డే జూ. ఎన్టీఆర్: వార్నర్) ('కష్టపడి సంపాదించాలి.. డిమాండ్ చేయొద్దు') -
ఉతికి ఆరేసిన ఊతప్ప, షకీబ్
కోల్ కతా: సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి విజృంభించింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప, షకీబ్ హసన్ రాణించడంతో ప్రత్యర్థి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ముందు 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్-7లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఊతప్ప, హసన్ అర్థ సెంచరీలతో అదరగొట్టారు. షకీబ్ 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. ఊతప్ప 51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 83 పరుగులు చేశాడు. యూసఫ్ పఠాన్ 22, మనీష్ పాండే 13 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో స్టార్క్, దిండా, అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.