IPL 2022 CSK Vs RCB: Robin Utappa-Shivam Dube Creates Record With Century Partnership CSK In IPL - Sakshi
Sakshi News home page

IPL 2022 CSK Vs RCB: ఐపీఎల్‌ చరిత్రలో ఊతప్ప-శివమ్‌ దూబే జోడి అరుదైన ఫీట్‌

Published Tue, Apr 12 2022 10:40 PM | Last Updated on Wed, Apr 13 2022 9:02 AM

IPL 2022: Robin Utappa-Shivam Dube 2nd Highest partnerships CSK In-IPL - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఇవన్నీ సీఎస్‌కే పేరిట నమోదు కావడం విశేషం. తొలి నాలుగు మ్యాచ్‌లు పరాజయం పాలయ్యామన్న బాధేమో తెలియదు కానీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం సీఎస్‌కే తన విశ్వరూపం ప్రదర్శించింది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇందులో తొలి 10 ఓవర్లలో సీఎస్‌కే స్కోరు 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు  మాత్రమే. ఆరంభంలో నిధానంగా సాగినప్పటికి.. రాబిన్‌ ఊతప్ప, శివమ్‌ దూబే జోడి కలిసిన తర్వాత విధ్వంసం షురూ అయింది. ఆ విధ్వంసం ఎంతలా అంటే.. తొలి 10 ఓవర్లలో 60 పరుగులు చేసిన సీఎస్‌కే ఆ తర్వాతి 10 ఓవర్లలో 155 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కే రికార్డులు పరిశీలిస్తే..

►ఊతప్ప- శివమ్‌ దూబే జంట సరికొత్త రికార్డు నెలకొల్పింది. సీఎస్‌కే తరపున ఊతప్ప- శివమ్‌ దూబే జోడి సాధించిన 165 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యుత్తమం. తొలి స్థానంలో షేన్‌ వాట్సన్‌-డుప్లెసిస్‌ జోడి ( 2020లో పంజాబ్‌ కింగ్స్‌పై, 181* పరుగులు) ఉండగా.. మురళీ విజయ్‌- మైక్‌ హస్సీ జోడి(2011లో ఆర్‌సీబీపై 159 పరుగులు) మూడో స్థానంలో ఉంది.

►ఇక 11-20 ఓవర్ల మధ్యలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సీఎస్‌కే మూడో స్థానంలో ఉంది. తాజాగా ఆర్‌సీబీతో మ్యాచ్‌లో సీఎస్‌కే 11-20 ఓవర్ల మధ్యలో 156 పరుగులు చేసింది. తొలి స్థానంలో ఆర్‌సీబీ(గుజరాత్‌ లయన్స్‌పై) 2016లో 172 పరుగులు, పంజాబ్‌ కింగ్స్‌( సీఎస్‌కేపై) 2014లో 162 పరుగులతో రెండో స్థానంలో ఉంది.

చదవండి: Shivam Dube: 11 ఏళ్ల రికార్డు సమం చేసిన శివమ్‌​ దూబే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement