highest runs
-
ఐపీఎల్ చరిత్రలో ఊతప్ప-శివమ్ దూబే జోడి అరుదైన ఫీట్
ఐపీఎల్ 2022లో ఆర్సీబీ, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఇవన్నీ సీఎస్కే పేరిట నమోదు కావడం విశేషం. తొలి నాలుగు మ్యాచ్‌లు పరాజయం పాలయ్యామన్న బాధేమో తెలియదు కానీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం సీఎస్కే తన విశ్వరూపం ప్రదర్శించింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇందులో తొలి 10 ఓవర్లలో సీఎస్కే స్కోరు 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే. ఆరంభంలో నిధానంగా సాగినప్పటికి.. రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే జోడి కలిసిన తర్వాత విధ్వంసం షురూ అయింది. ఆ విధ్వంసం ఎంతలా అంటే.. తొలి 10 ఓవర్లలో 60 పరుగులు చేసిన సీఎస్కే ఆ తర్వాతి 10 ఓవర్లలో 155 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎస్కే రికార్డులు పరిశీలిస్తే.. ►ఊతప్ప- శివమ్ దూబే జంట సరికొత్త రికార్డు నెలకొల్పింది. సీఎస్కే తరపున ఊతప్ప- శివమ్ దూబే జోడి సాధించిన 165 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యుత్తమం. తొలి స్థానంలో షేన్ వాట్సన్-డుప్లెసిస్ జోడి ( 2020లో పంజాబ్ కింగ్స్‌పై, 181* పరుగులు) ఉండగా.. మురళీ విజయ్- మైక్ హస్సీ జోడి(2011లో ఆర్సీబీపై 159 పరుగులు) మూడో స్థానంలో ఉంది. ►ఇక 11-20 ఓవర్ల మధ్యలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సీఎస్కే మూడో స్థానంలో ఉంది. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్కే 11-20 ఓవర్ల మధ్యలో 156 పరుగులు చేసింది. తొలి స్థానంలో ఆర్సీబీ(గుజరాత్ లయన్స్‌పై) 2016లో 172 పరుగులు, పంజాబ్ కింగ్స్( సీఎస్కేపై) 2014లో 162 పరుగులతో రెండో స్థానంలో ఉంది. చదవండి: Shivam Dube: 11 ఏళ్ల రికార్డు సమం చేసిన శివమ్ దూబే Innings Break! A sensational 165-run partnership between Uthappa (88) and Dube (95*) guides #CSK to a total of 216/4 on the board.#RCB chase coming up shortly. Stay tuned!#TATAIPL pic.twitter.com/uOr7P60zVa — IndianPremierLeague (@IPL) April 12, 2022 -
'సఫారీ గడ్డపై ధోనికి సాధ్యం కాలేదు.. పంత్ సాధించాడు'
సౌతాఫ్రికా గడ్డపై రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో 85 పరుగులతో ఆకట్టుకున్న పంత్.. ఆ గడ్డపై ఒక వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలిచాడు. పంత్ తర్వాతి స్థానంలో రాహుల్ ద్రవిడ్(77 పరుగులు, 2001) రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఎంఎస్ ధోని(65 పరుగులు, 2013), రాహుల్ ద్రవిడ్( 62, వర్సెస్ ఇంగ్లండ్, 2003 వన్డే ప్రపంచకప్), ఎంఎస్ ధోని(55 పరుగులు,2006), సబా కరీమ్(55 పరుగులు, 1997) ఉన్నారు. దీంతో ధోని, ద్రవిడ్‌లకు సాధ్యం కానిది పంత్ సాధించాడంటూ అభిమానులు పేర్కొన్నారు. చదవండి: Virat Kohli: డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్ ఇక గత వన్డే మ్యాచ్ ద్వారా బ్యాటింగ్‌లో నాలుగో స్థానానికి ప్రమోషన్ పొందిన పంత్ ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈసారి మాత్రం పంత్ ఎలాంటి పొరపాటు చేయలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పంత్ సౌతాఫ్రికా బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతనికి తోడూ కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా నడిచింది. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో 85 పరుగుల వద్ద పంత్ షంసీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. చదవండి: అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది -
దాదా కెప్టెన్సీ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి
హామిల్టన్ : రికార్డులను బద్దలు కొట్టడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కొత్తేం కాదు.ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన 51 పరుగుల ద్వారా టీమిండియా సారధిగా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని వెనెక్కి నెట్టాడు. కెప్టెన్‌గా గంగూలీ మొత్తం 142 ఇన్నింగ్సుల్లో 5082 పరుగులు చేయగా, విరాట్ కేవలం 83 ఇన్నింగ్స్‌ల్లోనే 5123 పరుగులు చేసి దాదాను అధిగమించాడు. కాగా టీమిండియా నుంచి మొదటి స్థానంలో ఎంఎస్ ధోని 6,641 పరుగులు(172 ఇన్నింగ్స్) ఉండగా, రెండో స్థానంలో మహ్మద్ అజారుద్దీన్ 5239 పరుగులు(162 ఇన్నింగ్స్)లతో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి ఆటతీరు చూస్తుంటే త్వరలోనే అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే మహీని అధిగమించడం ఖాయంగా కనపడుతుంది.(కోహ్లి మళ్లీ మలుపు తిప్పాడు..!) ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో విరాట్ 7వ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. తర్వాత ఎంఎస్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్, అర్జున రణతుంగ, గ్రేమి స్మిత్, మహ్మద్ అజారుద్దీన్లు ఉన్నారు. అయితే వీరిలో ధోని తప్ప మిగతావారు అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగానిగా కోహ్లి త్వరలోనే రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. టీమిండియా విధించిన 347 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 11 బంతులు ఉండగానే విజయం సాధించింది. (కోహ్లి మెరుపు ఫీల్డింగ్.. మున్రో బ్యాడ్ లక్) -
కోహ్లీ కంటే ముందుగానే మిథాలీ రికార్డు
కౌలాలంపూర్ : భారత మహిళా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం కోహ్లీ కంటే ముందుగానే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున 2వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత సాధించారు. ఇప్పటి వరకూ అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున మహిళా, పురుషుల జట్టుల్లో ఏ ఒక్కరు ఈ రికార్డును అందుకోలేదు. కౌలాలంపూర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. వీటితో కలుపుకొని అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 2015 పరుగులను పూర్తి చేశారు. సెంచరీల మీద సెంచరీలు బాదే కోహ్లీ ఈ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. 1983 పరుగులు చేసిన కోహ్లీ, మిథాలీ తరువాతి స్థానంలో ఉన్నారు. ఇప్పటికే 2వేల పరుగుల మైలురాయిని ఆరుగురు అందుకోగా మిథాలీ రాజ్ ఏడవ స్థానంలో ఉన్నారు. మహిళల తరపున ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కార్లోత్ ఎడ్వర్డ్ 2605 పరుగులతో తొలిస్థానంలో ఉన్నారు. ఇటీవలే అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రికార్డును మిథాలీ సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రీడాకారిణి ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న 55 హాఫ్ సెంచరీల రికార్డును మిథాలీ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. -
టీమిండియా కెప్టెన్ మిథాలి రాజ్ రికార్డు
లండన్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డులకెక్కారు. మహిళా ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్టల్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం మిథాలి ఈ ఘనత సాధించారు. అంతేకాదు వన్డే క్రికెట్ చరిత్రలో ఆరు వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ కూడా మిథాలినే. ఈ రికార్డును సాధించే క్రమంలో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న 5992 పరుగుల రికార్డును మిథాలి అధిగమించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మిథాలి రాజ్ ఈ ఫీట్ సాధించడానికి 33 పరుగుల దూరంలో ఉన్నారు. కాగా, అత్యధిక పరుగులు సాధించిన మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్‌కు పురుషుల క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. A great moment for Indian Cricket, @M_Raj03 becomes the highest run scorer in Women's ODI Cricket History today. Champion Stuff! 👌👏 — Virat Kohli (@imVkohli) July 12, 2017 -
వన్డేల్లో కంటే టి-20లోనే ఎక్కువ బాదారు
హరారే: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పరుగుల వేటలో ఘోరంగా చతికిలపడ్డ జింబాబ్వే ఎట్టకేలకు గాడినపడింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో భారత్‌తో జరిగిన మూడు వన్డేల్లో చేసిన స్కోర్ల కంటే తొలి టి-20లో జింబాబ్వే ఎక్కువ స్కోరు చేయడం విశేషం. భారత్‌తో తొలి వన్డేలో జింబాబ్వే 168 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో మ్యాచ్‌లో 126 పరుగులకు, మూడో వన్డేలో 123 పరుగులకు కుప్పకూలింది. శనివారం ఇదే వేదికపై టీమిండియాతో జరిగిన తొలి టి-20లో జింబాబ్వే ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. మొత్తానికి మూడు వన్డేల్లోనూ తక్కువ స్కోర్లకే ఆలౌటయిన జింబాబ్వే బ్యాట్స్‌మెన్.. పొట్టి ఫార్మాట్లో ఎక్కువ స్కోరు చేశారు. వన్డే సిరీస్‌లో జింబాబ్వే పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపడ్డ ఆ దేశాభిమానులకు తాజా మ్యాచ్ కాస్త ఊరట కలిగించింది.