వన్డేల్లో కంటే టి-20లోనే ఎక్కువ బాదారు | zimbabwe gets highest runs in t-20 than odis | Sakshi
Sakshi News home page

వన్డేల్లో కంటే టి-20లోనే ఎక్కువ బాదారు

Published Sat, Jun 18 2016 6:30 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

వన్డేల్లో కంటే టి-20లోనే ఎక్కువ బాదారు

వన్డేల్లో కంటే టి-20లోనే ఎక్కువ బాదారు

హరారే: భారత్తో మూడు వన్డేల సిరీస్లో పరుగుల వేటలో ఘోరంగా చతికిలపడ్డ జింబాబ్వే ఎట్టకేలకు గాడినపడింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో భారత్తో జరిగిన మూడు వన్డేల్లో చేసిన స్కోర్ల కంటే తొలి టి-20లో జింబాబ్వే ఎక్కువ స్కోరు చేయడం విశేషం.

భారత్తో తొలి వన్డేలో జింబాబ్వే 168 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో మ్యాచ్లో 126 పరుగులకు, మూడో వన్డేలో 123 పరుగులకు కుప్పకూలింది. శనివారం ఇదే వేదికపై టీమిండియాతో జరిగిన తొలి టి-20లో జింబాబ్వే ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. మొత్తానికి మూడు వన్డేల్లోనూ తక్కువ స్కోర్లకే ఆలౌటయిన జింబాబ్వే బ్యాట్స్మెన్.. పొట్టి ఫార్మాట్లో ఎక్కువ స్కోరు చేశారు. వన్డే సిరీస్లో జింబాబ్వే పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపడ్డ ఆ దేశాభిమానులకు తాజా మ్యాచ్ కాస్త ఊరట కలిగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement