పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో సమంగా నిలిచిన భారత జట్టు వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్‌లో విజయంతో 2–1తో సిరీస్ రాహుల్ బృందం సొంతమైంది. గురువారం జరిగిన మూడో వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.
సంజు సామ్సన్ (114 బంతుల్లో 108; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) వన్డేల్లో తొలి సెంచరీ సాధించగా, తిలక్ వర్మ (77 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 22.4 ఓవర్లలో 116 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టోనీ డి జోర్జీ (87 బంతుల్లో 81; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా వారంతా విఫలం కావడంతో సఫారీలకు ఓటమి తప్పలేదు.
తిలక్ అర్ధ సెంచరీ...
అరంగేట్ర మ్యాచ్‌లో వరుస బౌండరీలతో రజత్ పటిదార్ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా, సాయి సుదర్శన్ (10) విఫలమయ్యాడు. అయితే వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... రాహుల్ (21) కూడా ప్రభావం చూపలేకపోవడంతో భారత్ స్కోరు 101/3కి చేరింది. ఈ దశలో సామ్సన్, తిలక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయగా... సఫారీ బౌలర్లు పూర్తిగా కట్టిపడేయడంతో భారత్ ఒక్కో పరుగు కోసం శ్రమించాల్సి వచ్చింది. సామ్సన్ ఫర్వాలేదనిపించగా... హైదరాబాద్ బ్యాటర్ తిలక్ బాగా ఇబ్బంది పడ్డాడు.
తొలి 38 బంతుల్లో కేవలం 9 పరుగులే చేసిన అతను ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఆ తర్వాత మెరుగ్గా ఆడిన అతను తర్వాతి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 43 పరుగులు సాధించి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నిలకడ కొనసాగించిన సామ్సన్ 110 బంతుల్లో కెరీర్‌లో తొలి శతకాన్ని (తన 16వ వన్డేలో) అందుకున్నాడు. ఆ తర్వాత రింకూ సింగ్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో భారత్ మంచి స్కోరు సాధించగలిగింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: పటిదార్ (బి) బర్జర్ 22; సుదర్శన్ (ఎల్బీ) (బి) బ్యూరాన్ 10; సామ్సన్ (సి) రీజా (బి) విలియమ్స్ 108; రాహుల్ (సి) క్లాసెన్ (బి) ముల్దర్ 21; తిలక్ (సి) ముల్దర్ (బి) మహరాజ్ 52; రింకూ (సి) రీజా (బి) బర్జర్ 38; అక్షర్ (సి) ముల్దర్ (బి) బ్యూరాన్ 1; సుందర్ (సి) మార్క్‌రమ్ (బి) బ్యూరాన్ 14; అర్‡్షదీప్ (నాటౌట్) 7; అవేశ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 296. వికెట్ల పతనం: 1–34, 2–49, 3–101, 4–217, 5–246, 6–255, 7–277, 8–293. బౌలింగ్: బర్జర్ 9–0–64–2, విలియమ్స్ 10–0–71–1, బ్యూరాన్ హెన్‌డ్రిక్స్ 9–0–63–3, ముల్దర్ 7–0–36–1, మహరాజ్ 10–2–37–1, మార్క్‌రమ్ 5–0–19–0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రీజా హెన్‌డ్రిక్స్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 19; జోర్జి (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 81; డసెన్ (బి) అక్షర్ 2; మార్క్‌రమ్ (సి) రాహుల్ (బి) సుందర్ 36; క్లాసెన్ (సి) సుదర్శన్ (బి) అవేశ్ 21; మిల్లర్ (సి) రాహుల్ (బి) ముకేశ్ 10; ముల్దర్ (సి) రాహుల్ (బి) సుందర్ 1; మహరాజ్ (సి) రింకూ (బి) అర్‡్షదీప్ 14; బ్యూరాన్ (సి) సామ్సన్ (బి) అవేశ్ 18; విలియమ్స్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 2; బర్జర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (45.5 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–59, 2– 76, 3–141, 4–161, 5–174, 6–177, 7–192, 8–210, 9–216, 10–218. బౌలింగ్: ముకేశ్ 9–0 –56–1, అర్‡్షదీప్ 9–1–30–4, అవేశ్ 7.5–0–45– 2, సుందర్ 10–0–38–2, అక్షర్ 10–0–48–1.
Comments
Please login to add a commentAdd a comment