టీమిండియా కెప్టెన్ మిథాలి రాజ్ రికార్డు
లండన్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డులకెక్కారు. మహిళా ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్టల్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం మిథాలి ఈ ఘనత సాధించారు. అంతేకాదు వన్డే క్రికెట్ చరిత్రలో ఆరు వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ కూడా మిథాలినే.
ఈ రికార్డును సాధించే క్రమంలో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న 5992 పరుగుల రికార్డును మిథాలి అధిగమించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మిథాలి రాజ్ ఈ ఫీట్ సాధించడానికి 33 పరుగుల దూరంలో ఉన్నారు. కాగా, అత్యధిక పరుగులు సాధించిన మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్‌కు పురుషుల క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
A great moment for Indian Cricket, @M_Raj03 becomes the highest run scorer in Women's ODI Cricket History today. Champion Stuff! 👌👏
— Virat Kohli (@imVkohli) July 12, 2017