ఉతికి ఆరేసిన ఊతప్ప, షకీబ్
కోల్ కతా: సొంత మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ మరోసారి విజృంభించింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప, షకీబ్ హసన్ రాణించడంతో ప్రత్యర్థి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ముందు 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్-7లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
ఊతప్ప, హసన్ అర్థ సెంచరీలతో అదరగొట్టారు. షకీబ్ 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. ఊతప్ప 51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 83 పరుగులు చేశాడు. యూసఫ్ పఠాన్ 22, మనీష్ పాండే 13 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో స్టార్క్, దిండా, అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.