Shakib
-
అంపైర్ ఔట్‌గా ప్రకటించినా.. నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు.. సూపర్ షకీబ్
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో.. నజిబూల్లా జద్రాన్ బౌలర్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతిని ఆపేందుకు షకీబ్ ప్రయత్నించగా.. అది నేరుగా వెళ్లి స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో షకీబ్ రనౌట్‌కు అపీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే రీప్లేలో నాన్‌స్ట్రైకర్ రహామత్ షా క్రీజులో లేనప్పుడు బంతి స్టంప్స్‌ను తాకినట్లు సృష్టంగా కనిపించింది. అయితే బంతి షకీబ్ చేతికి తగిలిందో లేదో రీప్లేలో సృష్టంగా కనిపించలేదు. దీంతో బెనిఫిట్ ఆప్ డౌట్ కింద థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే ఇక్కడే షకీబ్ అల్ హసన్ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. జద్రాన్ కొట్టిన బంతికి తన చేతికి తాకలేదని భావించి, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో చర్చించి తన అప్పీల్ వెనుక్కి షకీబ్ తీసుకున్నాడు. దీంతో థర్డ్ అంపైర్ మళ్లీ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షకీబ్ అల్ హాసన్ చూపించిన క్రీడా స్పూర్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: IPL 2022 Auction: సగం పని పూర్తైంది.. మా జట్టు భేష్.. టైటిల్ గెలవడమే లక్ష్యం! లేదంటే కనీసం ప్లే ఆఫ్స్ అయినా! -
హలో డార్లింగ్
మహేష్‌బాబు ‘ఒక్కడు’ మూవీ గుర్తుందా? అందులో పాస్‌పోర్ట్ ఆఫీసర్ ధర్మవరపు సుబ్రమణ్యం కొత్తగా సెల్‌ఫోన్ తీసుకుని తన నంబర్‌ను గర్ల్‌ఫ్రెండ్‌కు ఇస్తాడు. మహేష్‌బాబు అండ్ఫ్రెండ్స్ గ్యాంగ్ కాస్తా ఆ నంబర్ నోట్ చేసుకుని రకరకాలుగా ఫోన్లు చేసి, విసుగు తెప్పించేసి, ఆ చిరాకులో తమకు కావలసిన పాస్‌పోర్ట్‌ను సంపాదించుకుంటారు. బంగ్లాదేశ్‌కు చెందినఇజాజుల్ మియా అనే ఆటో రిక్షా డ్రైవర్‌కు ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాకపోతే అది రీల్ లైఫ్‌లో కాదు. రియల్ లైఫ్‌లో.విషయం ఏమిటంటే... ఆ మధ్య అంటే మొన్న జూన్‌లో విడుదలైన ‘రాజ్‌నీతి’ సినిమాలో హీరో షాకిబ్ ఖాన్, తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఒక ఫోన్ నంబర్ ఇచ్చి, తన తో ఎప్పుడైనా కాసేపు కబుర్లుచెప్పాలనిపిస్తే ఆ నంబర్‌కు కాల్ చేయమని చెబుతాడు. షాకిబ్ ఖాన్ బంగ్లాదేశ్‌లో స్టార్ హీరో కావడంతో, స్క్రీన్ మీద డిస్ప్లే అయిన ఆ నంబర్‌ను ఫీమేల్ ఫ్యాన్స్ నోట్ చేసుకున్నారు.సినిమా చూసి బయటకు రాగానే ఠపీమని ఆ నంబర్‌కు కాల్ చేసేసి, ‘హాయ్ డార్లింగ్, నేను నీ ఫ్యాన్‌ని. నాతో కాసేపు కబుర్లు చెప్పేందుకు టైముందా నీకు?’ అని హస్కీగా మాట్లాడటంమొదలు పెట్టారు. రియల్ లైఫ్‌లో ఆ నంబరు షాకిబ్ది అయితే గదా... ఇజాజుల్ మియా అనే ఆటోడ్రైవర్ది. సినిమా విడుదలయిన నాటినుంచి, రోజూ వందల్లో కాల్స్. నేను నీ ఫ్యాన్నిఅని కొందరూ, విసనకర్రని అని కొందరూ, ఏసీనని మరికొందరూ ఇలా వరసపెట్టి కాల్స్ వస్తున్నాయి. పోనీ ఆ నంబర్ మార్చుకుందామంటే, కొన్ని ఏళ్లుగా ఆ నంబర్ తన కష్టమర్లకుఅలవాటైపోయింది కాబట్టి మార్చుకోలేని పరిస్థితి. ఇదంతా చూసి ఇజాజుల్ మియా భార్యకు చిర్రెత్తుకొచ్చి, తన ఏడాది వయసుగల కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో ఇజాజుల్ సదరు సినిమా వల్ల తన కొంపకొల్లేరయిందనీ, ఉన్న ఆధారం కాస్తా ఊడిపోయింది కాబట్టి తనకు నష్టపరిహారం ఇప్పించమంటూ కోర్టుకెక్కాడు. దీనంతటినీ అతని స్నేహితుడొకతను వీడియో తీసి మరీ ఫేస్బుక్లోపోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరలయింది. -
ఆడుతూ పాడుతూ...
భారత గడ్డపై టెస్టు మ్యాచ్ అంటే సహజంగానే స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారనేది అందరికీ తెలిసిందే. ఈ టెస్టుకు ముందు దీనిపై కూడా పెద్ద చర్చే జరిగింది. మన జట్టులో వరల్డ్ నంబర్ 1, నంబర్ 2 స్పిన్నర్లు ఉన్నా... ఈ విభాగంలో మాత్రం బంగ్లాదేశ్ కూడా పోటీనివ్వగలదని అంతా అంచనా వేశారు. సుదీర్ఘ కాలంగా బంగ్లా జట్టు మూల స్థంభంలా ఉన్న షకీబ్‌తో పాటు కొత్తగా వెలుగులోకి వచ్చిన మెహదీ హసన్ మిరాజ్ కూడా ఆకట్టుకోగలడని అనుకున్నారు. పాపం... బంగ్లా కూడా అదే ఆశించింది. కానీ బలమైన భారత బ్యాట్స్‌మెన్ ముందు వారి ఆటలు ఏమాత్రం సాగలేదు. రెండు రోజుల్లో కలిపి 24 ఓవర్లకే పరిమితమైన షకీబ్ ఒక్క వికెట్ కూడా తీయకుండా, భారీగా పరుగులిచ్చుకోగా... మెహదీ అయితే 42 ఓవర్లలో ఒక్క మెయిడిన్ కూడా వేయలేకపోయాడంటే మన బ్యాట్స్‌మెన్ ఆధిక్యం ఎలా సాగిందో అర్థమవుతోంది. రెండో రోజు స్పిన్నర్లు మొత్తం 63 ఓవర్లు వేస్తే 236 పరుగులు రాబట్టిన భారత్, పేసర్లు వేసిన 13 ఓవర్లలోనే ఏకంగా 95 పరుగులు కొల్లగొట్టింది. ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, మరో రెండు అర్ధసెంచరీలతో భారత్ ప్రత్యర్థిని పూర్తిగా తొక్కేసింది. 166 ఓవర్ల మారథాన్ ఇన్నింగ్స్‌లో ఏ దశలోనూ మన బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడలేదు. రెండో రోజైతే మరీ అలవోకగా, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. అశ్విన్ జోరు చూస్తే అతను కూడా మరో భారీ స్కోరు చేస్తాడని అనిపించింది. కోహ్లి, రహానేల 222 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీయడానికి బంగ్లాకు 50 ఓవర్లు పట్టాయి. అక్కడే ఆశలు కోల్పోయిన ఆ జట్టు తర్వాతి బ్యాట్స్‌మెన్ దెబ్బకు మరింత కుదేలైంది. ఇటీవలే ఇరానీ కప్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన వృద్ధిమాన్ సాహా ఇక్కడా తన ఫామ్‌ను కొనసాగించాడు. అయితే సాహా నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్ చేయకుండా బంగ్లాదేశ్ చేసిన పుణ్యంతో అతను సెంచరీ దాకా చేరా>డు. కాస్త వ్యంగ్యంగా చెప్పాలంటే తమకు ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి బ్యాటింగ్‌లో ఎవరో ఒక బెంగాలీ అయితే సెంచరీ చేశాడని ఆ జట్టు సంతృప్తి పడుతుందేమో!రెండో రోజు భారత్‌కు బ్యాటింగ్‌లోనే కాదు ఉన్న కాసేపట్లో బౌలింగ్ కూడా కలిసొచ్చింది. డీఆర్ఎస్ అయితే మ్యాచ్ ఆరంభం నుంచి మన పక్షానే ఉంది. ఉమేశ్ విసిరిన 142 కిలోమీటర్ల బంతిని సర్కార్ ఆడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన సమయంలో ఎవరూ పెద్ద నమ్మకంతో లేరు. దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న పుజారా మాత్రం కాస్త ఆశగా చెప్పడంతో సందేహంతో కోహ్లి రివ్యూ కోరాడు. కానీ రీప్లేలో అలా బ్యాట్‌కు తాకుతూ బంతి వెళ్లిందని తేలడంతో శుక్రవారం టీమిండియా మరింత సంతోషంగా ఆటను ముగించింది. –సాక్షి, హైదరాబాద్ 1 వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌లలో ‘డబుల్ సెంచరీ’ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. గతంలో బ్రాడ్‌మన్, ద్రవిడ్ వరుసగా మూడు సిరీస్‌లలో ‘డబుల్’ బాదారు. వెస్టిండీస్‌లో మొదలు పెట్టి న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లపై కోహ్లి ద్విశతకం సాధించాడు. కోహ్లికి ముందు భారత కెప్టెన్లందరూ కలిపి 4 డబుల్ సెంచరీలు నమోదు చేస్తే, కోహ్లి ఒక్కడే నాలుగు డబుల్ సెంచరీలు చేయడం మరో విశేషం. 1 సొంతగడ్డపై ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా కోహ్లి (1,168) సొంతం చేసుకున్నాడు. గతంలో సెహ్వాగ్ (1,105) పేరిట ఉన్న రికార్డును అతను అధిగమించాడు. 1 వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో కూడా 600కుపైగా పరుగులు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ముంబై, చెన్నైలలో ఇంగ్లండ్‌పై భారత్ 600కు పైగా స్కోరు సాధించింది. -
ఉతికి ఆరేసిన ఊతప్ప, షకీబ్
కోల్ కతా: సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి విజృంభించింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప, షకీబ్ హసన్ రాణించడంతో ప్రత్యర్థి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ముందు 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్-7లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఊతప్ప, హసన్ అర్థ సెంచరీలతో అదరగొట్టారు. షకీబ్ 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. ఊతప్ప 51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 83 పరుగులు చేశాడు. యూసఫ్ పఠాన్ 22, మనీష్ పాండే 13 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో స్టార్క్, దిండా, అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.