ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో.. నజిబూల్లా జద్రాన్ బౌలర్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతిని ఆపేందుకు షకీబ్ ప్రయత్నించగా.. అది నేరుగా వెళ్లి స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో షకీబ్ రనౌట్‌కు అపీల్ చేయగా ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే రీప్లేలో నాన్‌స్ట్రైకర్ రహామత్ షా క్రీజులో లేనప్పుడు బంతి స్టంప్స్‌ను తాకినట్లు సృష్టంగా కనిపించింది. అయితే బంతి షకీబ్ చేతికి తగిలిందో లేదో రీప్లేలో సృష్టంగా కనిపించలేదు.
దీంతో బెనిఫిట్ ఆప్ డౌట్ కింద థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే ఇక్కడే షకీబ్ అల్ హసన్ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. జద్రాన్ కొట్టిన బంతికి తన చేతికి తాకలేదని భావించి, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో చర్చించి తన అప్పీల్ వెనుక్కి షకీబ్ తీసుకున్నాడు. దీంతో థర్డ్ అంపైర్ మళ్లీ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షకీబ్ అల్ హాసన్ చూపించిన క్రీడా స్పూర్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment