
మహేష్‌బాబు ‘ఒక్కడు’ మూవీ గుర్తుందా? అందులో పాస్‌పోర్ట్ ఆఫీసర్ ధర్మవరపు సుబ్రమణ్యం కొత్తగా సెల్‌ఫోన్ తీసుకుని తన నంబర్‌ను గర్ల్‌ఫ్రెండ్‌కు ఇస్తాడు. మహేష్‌బాబు అండ్‌ఫ్రెండ్స్ గ్యాంగ్ కాస్తా ఆ నంబర్ నోట్ చేసుకుని రకరకాలుగా ఫోన్లు చేసి, విసుగు తెప్పించేసి, ఆ చిరాకులో తమకు కావలసిన పాస్‌పోర్ట్‌ను సంపాదించుకుంటారు. బంగ్లాదేశ్‌కు చెందినఇజాజుల్ మియా అనే ఆటో రిక్షా డ్రైవర్‌కు ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాకపోతే అది రీల్ లైఫ్‌లో కాదు. రియల్ లైఫ్‌లో.విషయం ఏమిటంటే... ఆ మధ్య అంటే మొన్న జూన్‌లో విడుదలైన ‘రాజ్‌నీతి’ సినిమాలో హీరో షాకిబ్ ఖాన్, తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఒక ఫోన్ నంబర్ ఇచ్చి, తన తో ఎప్పుడైనా కాసేపు కబుర్లుచెప్పాలనిపిస్తే ఆ నంబర్‌కు కాల్ చేయమని చెబుతాడు. షాకిబ్ ఖాన్ బంగ్లాదేశ్‌లో స్టార్ హీరో కావడంతో, స్క్రీన్ మీద డిస్‌ప్లే అయిన ఆ నంబర్‌ను ఫీమేల్ ఫ్యాన్స్ నోట్ చేసుకున్నారు.సినిమా చూసి బయటకు రాగానే ఠపీమని ఆ నంబర్‌కు కాల్ చేసేసి, ‘హాయ్ డార్లింగ్, నేను నీ ఫ్యాన్‌ని. నాతో కాసేపు కబుర్లు చెప్పేందుకు టైముందా నీకు?’ అని హస్కీగా మాట్లాడటంమొదలు పెట్టారు.
రియల్ లైఫ్‌లో ఆ నంబరు షాకిబ్‌ది అయితే గదా... ఇజాజుల్ మియా అనే ఆటోడ్రైవర్‌ది. సినిమా విడుదలయిన నాటినుంచి, రోజూ వందల్లో కాల్స్. నేను నీ ఫ్యాన్‌నిఅని కొందరూ, విసనకర్రని అని కొందరూ, ఏసీనని మరికొందరూ ఇలా వరసపెట్టి కాల్స్ వస్తున్నాయి. పోనీ ఆ నంబర్ మార్చుకుందామంటే, కొన్ని ఏళ్లుగా ఆ నంబర్ తన కష్టమర్లకుఅలవాటైపోయింది కాబట్టి మార్చుకోలేని పరిస్థితి. ఇదంతా చూసి ఇజాజుల్ మియా భార్యకు చిర్రెత్తుకొచ్చి, తన ఏడాది వయసుగల కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో ఇజాజుల్ సదరు సినిమా వల్ల తన కొంపకొల్లేరయిందనీ, ఉన్న ఆధారం కాస్తా ఊడిపోయింది కాబట్టి తనకు నష్టపరిహారం ఇప్పించమంటూ కోర్టుకెక్కాడు. దీనంతటినీ అతని స్నేహితుడొకతను వీడియో తీసి మరీ ఫేస్‌బుక్‌లోపోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరలయింది.
Comments
Please login to add a commentAdd a comment